రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ రాక | jagan will come tomarrow to kurnool | Sakshi
Sakshi News home page

రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ రాక

Published Mon, Oct 24 2016 7:50 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

jagan will come tomarrow to kurnool

– యువభేరికి ముమ్మర ఏర్పాట్లు
 
కర్నూలు: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలు రానున్నారు. కర్నూలు నగర శివార్లలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే యువభేరి కార్యక్రమానికి హాజరుకానున్నారు. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహించి హోదా ఆవక్యతను తెలియజెప్పనున్నారు.
 
ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యువభేరి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కన్వెక‌్షన్‌ హాల్‌లో వేదిక నిర్మాణం సాగుతోంది. హాజరయ్యే ప్రజలు, అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు.
 
ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మైకుల ద్వారా కార్యక్రమ వివరాలను ప్రకటిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో యువభేరికి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లా నలుమూలల నుంచి యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చి..కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement