
4న నెల్లూరులో వైఎస్ జగన్ యువభేరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 4న నెల్లూరులో యువభేరి జరగనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. గురువారం ఉద యం 10 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్‌లో యువభేరి ప్రారంభమవుతుందన్నారు. యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.