
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమం మంగళవారం అనంతపురంలో అశేష జనసందోహం నడుమ ప్రారంభమైంది. నగర శివారు బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో సభా ప్రాంగణం హోరెత్తింది. జై జగన్ అంటూ యువకులు నినదించారు. యువభేరికి యువత, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా వచ్చిన జనంతో సభాప్రాంగణం కిక్కిరిసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రొఫెసర్లు, మేధావులు ప్రత్యేక హోదా నొక్కి చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు హోదాతోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు యువతకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగం మొదలు పెట్టారు. జననేత ప్రసంగం మొదలు పెట్టగానే యువత ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment