
యువభేరి పోస్టర్ ఆవిష్కరణ
విజయనగరం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలో యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. పూల్‌బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ యువభేరికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆవిష్కరించారు. యువభేరి ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలు రాజన్నదొర, పెన్మత్స సాంబశివరాజు, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితరులు పరిశీలించారు.