జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ | popular in jagan | Sakshi
Sakshi News home page

జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ

Published Sat, Feb 6 2016 12:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ - Sakshi

జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ

  అది చూసి ఓర్వలేకే టీడీపీ నాయకుల విమర్శలు
  వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్

 శ్రీకాకుళం అర్బన్:
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులందరూ విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువభేరి ఎంతో విజయవంతమైందన్నారు. ఇందుకుగాను ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానేతగా ఎదిగారని, ఆయనను చూసి టీడీపీ నాయకులు భయపడుతున్నారని, అందువల్లే ఆయనపై ప్రతి నిమిషమూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని పేర్కొన్నారు.


ఎన్నికలముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడిగితే అది పెడదోవ పట్టించడమా అని ప్రశ్నించారు. తప్పులన్నీ టీడీపీ నాయకులే చేసి అది ప్రతిపక్షంపై నెట్టడం ఎంత వరకూ సమంజసమని అడిగారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కాల్‌మనీ వ్యవహారం తదితర అవి నీతి పనులన్నీ చేస్తున్న టీడీపీ నాయకుల కు జగన్‌ను విమర్శించే అర్హతే లేదన్నారు. జిల్లా పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు చిన్నపిల్లాడిలా వ్యవహరించడం తగదన్నారు.


రజల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్రకార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి మండవిల్లి రవి, పార్టీ యువ జన విభాగం నగర అధ్యక్షుడు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement