DHARMANA kishnadas
-
వికేంద్రీకరణపై మంత్రి ధర్మాన
-
స్ట్రెయిట్ టాక్ విత్ ధర్మాన కృష్ణదాస్
-
‘దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్ కీలక పాత్ర’
సాక్షి, అమరావతి : వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధర్మాన మండిపడ్డారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. తండ్రి అడుగుజాడల్లో వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఎప్పటికీ పదిలం: మంత్రి బొత్స రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన గొప్ప నాయకుడు రాజశేఖరరెడ్డి.. అందుకే ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. 'ఆంధ్రప్రదేశ్ పరిపాలన చరిత్రలో రాజశేఖర రెడ్డి ఒక మైలు రాయి. ఎల్లప్పుడూ పేదలకు ఎలా సహాయం చేయాలని ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం' అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. -
అమరావతి ఉద్యమమనేది టీడీపీ సృష్టే
-
జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ
అది చూసి ఓర్వలేకే టీడీపీ నాయకుల విమర్శలు వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులందరూ విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువభేరి ఎంతో విజయవంతమైందన్నారు. ఇందుకుగాను ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రజానేతగా ఎదిగారని, ఆయనను చూసి టీడీపీ నాయకులు భయపడుతున్నారని, అందువల్లే ఆయనపై ప్రతి నిమిషమూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడిగితే అది పెడదోవ పట్టించడమా అని ప్రశ్నించారు. తప్పులన్నీ టీడీపీ నాయకులే చేసి అది ప్రతిపక్షంపై నెట్టడం ఎంత వరకూ సమంజసమని అడిగారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కాల్‌మనీ వ్యవహారం తదితర అవి నీతి పనులన్నీ చేస్తున్న టీడీపీ నాయకుల కు జగన్‌ను విమర్శించే అర్హతే లేదన్నారు. జిల్లా పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్నాయుడు చిన్నపిల్లాడిలా వ్యవహరించడం తగదన్నారు. రజల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్రకార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి మండవిల్లి రవి, పార్టీ యువ జన విభాగం నగర అధ్యక్షుడు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.