
21న కాకినాడలో వైఎస్ జగన్ యువభేరీ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న కాకినాడలో యువభేరీ నిర్వహించనున్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న కాకినాడలో యువభేరీ నిర్వహించనున్నారు. కాకినాడలో మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో యువభేరీ ఏర్పాట్లపై సమావేశం జరిపారు. వైఎస్ జగన్ యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన నాయకులను కోరారు.