
'ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థులతో నిర్వహించిన యువభేరి సదస్సు విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సదస్సు నిర్వహించడానికి అధికారులు అనుమతి నిరాకరించినా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు.
ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ప్రత్యేక హోదా అంశం ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవివేకంగా వ్యవహరించడం మానుకుని ఈ సదస్సు నుంచైనా గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. తిరుపతిలో జరిగిన యువభేరి సదస్సుకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు విద్యావేత్తలతో పాటు వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చారు.