
జగన్‌కు ఘన స్వాగతం
అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు
అంబేడ్కర్ విగ్రహానికి నివాళి
తుని : శ్రీకాకుళం యువభేరి సదస్సుకు హాజరైన వైస్సార్ సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాకినాడ వెళుతూ మంగళవారం సాయంత్రం పాయకరావుపేట తాండవ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగి నాయకులు, కార్యకర్తలను కలిశారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, తుని, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పెండెం దొరబాబు, కురసాల కన్నబాబు, ముత్తా శశిధర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అత్తిలి సీతారామస్వామి తదితరులు జగన్‌మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తుని, పాయకరావుపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.