Opposition leader YS Jagan Mohan Reddy
-
అంతా అభూత కల్పనలే
బడ్జెట్‌పై పెదవి విరిచిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ * రుణాలు ఎక్కువ తీసుకోవచ్చనే ఆశతోనే జీఎస్డీపీని ఎక్కువ చేసి చూపారు * వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ.177 కోట్లా? * రైతుల రుణమాఫీకి కేటాయించేది రూ. 3,500 కోట్లేనా? * వడ్డీలో మూడో వంతు మొత్తం కూడా కాదు * గత ఏడాది, ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో మార్పులేదు * కేంద్ర పన్నుల నుంచి వచ్చే రాష్ట్ర వాటా మాత్రమే మారింది సాక్షి, హైదరాబాద్ : 2016-17 రాష్ట్ర బడ్జెట్ మొత్తం అభూత కల్పనలేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌పై తన చాంబర్లో విలేకరులడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. బడ్జెట్ అంత ఆశాజనకంగా ఏమీ లేదని పెదవి విరిచారు. ఇది ప్రజా బడ్జెట్ అని అధికారపక్షం పేర్కొనడం సరికాదన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రుణం తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు (జీఎస్డీపీ)ని 10.99గా చూపించారని ఆక్షేపించారు. జీడీపీ రూ.6 లక్షల కోట్లు చూపించారని, దానివల్ల రూ. 20 వేల కోట్ల మేరకు రుణం తెచ్చుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. అందుకే రాబడులకు సంబంధించిన వివరాలను కూడా లేనివి ఉన్నట్లుగా చూపించారని విమర్శించారు. జీఎస్డీపీ ఎక్కువ చూపిస్తే రుణాలు ఎక్కువ తెచ్చుకోవచ్చని ఆశపడ్డారని తెలిపారు. వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ.177 కోట్లా? రైతులకు ఇచ్చే వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకు రూ. 177 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని జగన్ దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పథకానికి ఈ ఏడాది కూడా రూ.3,500 కోట్లు మాత్రమే కేటాయించడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబునాయుడు సీఎం అయ్యేనాటికి ఉండిన రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఈ రెండేళ్లకే ఆ మొత్తం మీద వడ్డీయే రూ.25,000 కోట్లు అయ్యింది. ఈ ఏడాది కూడా కలుపుకుంటే మొత్తం 36 నెలలకు గాను సుమారు రూ 40,000 కోట్లకు అటూ ఇటూగా వడ్డీ పెరుగుతుంది. వడ్డీయే ఇంత మొత్తం ఉంటే ైరె తుల రుణమాఫీకి గాను ఇప్పటివరకూ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం రూ.7,400 కోట్లే. ఈ ఏడాది రూ. 3,500 కోట్లు ఇస్తామంటున్నారు’’ అని చెప్పారు. ఇదంతా కలిపినా రుణాలపై వడ్డీలో మూడో వంతు మొత్తం కూడా కాదని ఆయన విమర్శించారు. అంచనాలు.. సవరించిన అంచనాలు రెండూ మారలేదు కోర్ డాష్ బోర్డులో పెట్టిన దాంట్లోనే సగటున నెలకు రూ.3,500 కోట్లు రాబడులుంటాయని పేర్కొన్నారని, ఆ ప్రకారం పన్నుల ద్వారా వచ్చే రాబడి, పన్నేతర మార్గాల నుంచి వచ్చే రాష్ట్ర రాబడి మొత్తం రూ.42వేల కోట్లుగా ఉంటుందని జగన్ తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో మార్పే లేదన్నారు. కేంద్ర పన్నుల నుంచి వచ్చే రాష్ట్ర వాటా మాత్రమే మారిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రూ.22,637 కోట్లు చూపిస్తే... రాష్ట్రంలో రూ.21,893 కోట్లు చూపించారని, మిగిలిన వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి మార్చలేదని విమర్శించారు. కోర్ డాష్‌బోర్డులో ఏ మేరకు రాబడులు (రెవెన్యూ) వచ్చాయనేది కనిపిస్తూ ఉన్నా, సవరించిన అంచనాల్లో సుమారు రూ.50 వేల కోట్లు చూపించారని చెప్పారు. ఈ మొత్తం రూ.44,423 కోట్లు (ట్యాక్స్), రూ.5,341 కోట్లు (నాన్‌ట్యాక్స్) రెవెన్యూగా ఉందన్నారు. బడ్జెట్ పుస్తకాన్ని విలేకరులకు చూపిస్తూ... ఇందులో 2014-15 సంబంధించిన కార్యాచరణను కూడా చూపించలేదన్నారు. ఎంతయితే రాబడులు వచ్చాయో అవే చూపించాల్సి ఉంటుంది కనుక ఆ కాలమే ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తప్ప బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయని ఆయన తెలిపారు. బీసీలకు కేటాయింపులు తక్కువే... వెనుకబడిన తరగతుల వారికి రూ.30 వేల కోట్లు ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. ‘‘అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తొలి ఏడాది బీసీల సంక్షేమానికి రూ 2,200 కోట్లు కేటాయించామన్నారు. రెండో సంవత్సరం రూ 2,700 కోట్లు కేటాయించామన్నారు. ఈ రెండూ కలిపితే రూ 5,000 కోట్లు అవుతుంది. ఈ ఏడాదిలో రూ 4,800 కోట్లు పెట్టామని చెప్పారు. దీన్ని బట్టి బీసీల సంక్షేమంపై వారికెంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది’’ అని ఆయన చెప్పారు. -
బాబు వచ్చాడు... జాబు ఊడింది
* 1.75 కోట్ల ఇళ్లలో ఉద్యోగం, భృతి కోసం ఎదురుచూస్తున్నారు * మీరేమో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదంటున్నారు * ఎన్నికల వేళ ఇల్లిల్లూ తిరిగి ఉద్యోగాలిస్తామని అబద్ధాలాడి ఇప్పుడు మోసం చేస్తారా? * ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా సభనుంచి వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా. ఇంటికొక ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం లేక పోతే ఉపాధి కల్పిస్తా. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2వేలు చెల్లిస్తా... 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సంతకంతో కూడిన పత్రాలు పంచి గద్దెనెక్కిన మీరు... లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లపై బికారుల్లా తిరుగుతూంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా?’’ అంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతిపై సభలో రగడ మొదలైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాకంపై మండిపడ్డారు. ‘‘రాష్ర్టంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల నుంచి చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలొస్తాయని ఎదురు చూశారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉపాధి కల్పిస్తామని, అదీ ఇవ్వలేదు. ఎలాంటి చదువు లేకపోయినా నిరుద్యోగ భృతి నెలకు రూ.2వేలు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వలేదు. డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష రాసి 18 నెలలు దాటినా మెరిట్ లిస్టు ఇవ్వలేదు. ఉద్యోగాలు లేకపోగా క్లస్టర్లు పెట్టి హాస్టళ్లనూ మూసేస్తున్నారు. మరోవైపు ఏడువేల మందిని సర్ప్లస్ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. ఇదేనా మీ నిర్వాకం?’’ అంటూ దుయ్యబట్టారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘‘నేడు రెండు లక్షల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలో ఉద్యోగం ఊడగొడతారో అని భయపడుతున్నారు. క్రమబద్ధీకరణ గురించి ఎప్పుడు ప్రశ్నించినా పరిశీలిస్తున్నామంటున్నారు. ఆరోగ్యమిత్రలను తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. గోపాలమిత్రలను తొలగించారు. ఆశావర్కర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు. అంగన్వాడీలు ధర్నా చేస్తే నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కొట్టించి అరెస్టులు చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చాక విస్మరించడం మీ మోసకారితనానికి నిదర్శనం’’ అని నిప్పులు చెరిగారు. అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పడం ఈ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి తమ సభ్యులతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఒక్క ఉద్యోగమూ లేదు: చింతల ప్రభుత్వంలోకొచ్చే వరకూ ఎన్ని అబద్ధాలు కావాలో అన్నీ ఆడారు. ఇప్పుడేమో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్-2 లేదు, చివరకు గ్రూప్-4 నోటిఫికేషన్లు లేవు. బీఈడీ, డీఎడ్ చదివిన లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరేమో ఉద్యోగమూ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతీ లేదంటున్నారు. నిరుద్యోగ భృతి అనే పథకమే లేదు: మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రి సమాధానమిస్తూ ‘అలాంటి పథకం ఏదీ లేదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. భృతి అనేది కాకుండా అందరికీ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బాబొస్తే జాబొస్తున్నందన్న నినాదంతో ముందుకెళ్లామని, కానీ దాన్ని వమ్ము చేయమని తెలిపారు. పథకమే లేదని హేయంగా మాట్లాడారు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల వేళ హామీలిచ్చి ఇప్పుడు అసలా పథకమే లేదని మంత్రి అచ్చెన్నా యుడు హేయంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. -
జగన్‌కు ఘన స్వాగతం
అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి తుని : శ్రీకాకుళం యువభేరి సదస్సుకు హాజరైన వైస్సార్ సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ వెళుతూ మంగళవారం సాయంత్రం పాయకరావుపేట తాండవ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగి నాయకులు, కార్యకర్తలను కలిశారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, తుని, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పెండెం దొరబాబు, కురసాల కన్నబాబు, ముత్తా శశిధర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అత్తిలి సీతారామస్వామి తదితరులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తుని, పాయకరావుపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.