బాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా పనిచేస్తోంది | Minister Shankar Narayana Comments Over Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా పనిచేస్తోంది

Published Mon, Sep 14 2020 1:13 PM | Last Updated on Mon, Sep 14 2020 1:20 PM

Minister Shankar Narayana Comments Over Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లో ఎల్లో మీడియా పని చేస్తోందని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్‌ నారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో రహదారుల టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌  పాలన చూసి చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. సీఎం జగన్ సర్కార్‌పై గోబెల్స్ ప్రచారం చేశారు.

3000 కోట్ల రూపాయల రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ 1 కావటం టీడీపీ, ఎల్లో మీడియాకు ఇష్టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని ఏపీ సర్కార్‌పై అభాండాలు వేస్తున్నార’’ని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement