సాక్షి, అనంతపురం: ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీవో, ఎన్‌హెచ్‌ఏఐ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్‌ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామని మంత్రి తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం జగన్ అన్నిచర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదని హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటిదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
చదవండి: పంటనష్టంపై చంద్రబాబు దుష్ప్రచారం: కన్నబాబు
ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ
Comments
Please login to add a commentAdd a comment