Oxygen Plant
-
ఆక్సిజన్ ప్లాంట్లలో సిలిండర్లు నింపుకొనే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రుల్లోని పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద సిలిండర్లను నింపి ఏరియా, సామాజిక, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాలని వైద్యవిధాన పరిషత్ నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద ఆక్సిజన్ భారీగా అందుబాటులో ఉందని, దాన్ని చిన్న ఆసుపత్రులకు సరఫరా చేస్తే రోగులకు ఉపయోగం ఉంటుందని పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. సిలిండర్లను నింపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, ఇతర అధికారులతో డాక్టర్ అజయ్‌కుమార్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లను ప్రోత్సహించవద్దని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను విస్త్రృత పరచాలని, అవసరం లేకపోయినా పైస్థాయి ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులు బయట కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని, డయాలసిస్ యూనిట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని వైద్య విద్యాసంచాల కుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. -
సీఎం జగన్ చొరవతో తంబళ్ళపల్లికి మహర్ధశ
-
ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన గవర్నర్
సాక్షి,సిటీబ్యూరో: కోవిడ్ సమయంలో పేదలకు సేవ చేయడంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ చేసిన కృషి ఎనలేనిదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. డి.ఇ.షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేవా భారతి భాగస్వామ్యంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సేవా భారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యక్షురాలు ఉషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సహజ ప్రసవాలు పెంచండి
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మహీంద్ర ఆధ్వర్యంలో రూ.1.05 కోట్లతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటివరకు 86 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కోసం నానాకష్టాలు పడాల్సి వచ్చిందని, ఇది గమనించిన సీఎం కేసీఆర్ 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించార న్నారు. ప్రస్తుతం 350 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నామని, మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజ న్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటుచేసేం దుకు అగ్రిమెంట్ చేసుకున్నా మన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోని 27 వేల పడక లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండబోదని చెప్పారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయని, ప్రస్తుతం 52 శాతం డెలివ రీలు జరుగుతున్నాయని, దీనిని 75 శాతానికి పెం చాలని వైద్యులకు సూచించారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంత రం హోతి(బి) గ్రామంలో మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ ఫాతిహా చాహేలుమ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు తన్వీర్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. -
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లోప్లాంట్ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు. చదవండి: CM YS Jagan: చెప్పాడంటే.. చేస్తాడంతే! దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, 24వేల ఆక్సిజన్ బెడ్లు తయారు చేశామని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్ తయారీలో ఉందని, ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందని పేర్కొన్నారు. చదవండి: పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్ కోవిడ్కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యమని నోవా ఎయిర్ ఎండీ గజనన్ నబర్ తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్లాంట్‌పెట్టామని ఇందుకు ఏపీ సరైనదని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరత లేకుండా అధికారులు చూశారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కోవిడ్ కారణంగా ఆక్సిజన్ కొరత రాకుండా ఓ ప్లాంట్‌ను తీసుకు రావాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. తద్వారా మెడికల్ ఆక్సిజన్‌కు లోటు రాకుండా రాష్ట్రం స్వయం సమృద్ధిసాధించాలంటూ అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లోటు లేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రోజుకు 220 టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్‌లో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేయనున్నారు. నోవా ఎయిర్‌తో జనవరి 24, 2020న ఏపీ ప్రభత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్ 18, 2020న పనులు ప్రారంభం కాగా, నవంబర్ 2021న పనులు పూర్తయ్యాయి. -
ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
-
నాడు-నేడుతో ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు: సీఎం జగన్
-
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
సాక్షి, అమరావతి: సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా మొదటి, రెండవ వేవ్‌లో ఆక్సిజన్ లేకపోవడం వలన సుదూర ప్రాంతాలకు పంపేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం సీఎం అందించిన సదుపాయాలతో.. దేశంలో అత్యధికంగా కోవిడ్ నిర్ధారణ చేయగలిగామని తెలిపారు. అదే విధంగా.. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్లు అత్యధికంగా వేయగలిగామన్నారు. సీఎం జగన్ మంచి ఆలోచనల వల్ల కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని డాక్టర్ కిరణ్ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో వ్యాక్సిన్ వేయడంలోనూ దూసుకుపోతున్నామని తెలిపారు. అదేవిధంగా గుంటూరు జిల్లా జీజీహెచ్ నుంచి శైలజ అనే మహిళ మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపింది. గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్నానని తెలిపింది. డాక్డర్లు, ఆసుపత్రి సిబ్బంది చేసిన వైద్యంతోనే ఈ రోజు బ్రతికానని కన్నీటి పర్యంతమయ్యింది. అదే విధంగా మందులతో పాటు మధ్యాహ్నం పెట్టే పోషకాహరం తనప్రాణాలు నిలవడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమకు నిత్యవాసర సరుకులు ఇంటికి తీసుకొచ్చి అందించారని తెలిపింది. మూడోవేవ్‌లో ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా.. విశాఖపట్నం అనస్థిషియా టెక్నిషియన్ రవికుమార్ మాట్లాడారు. కోవిడ్ సెకండె వేవ్‌లో ఆక్సిజన్ కొరత వేధించిందని, విశాఖలో 15 ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్ల వలన బాధితులకు 90 శాతం వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించబడుతుందని తెలిపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల వల్ల కొండ ప్రాంతాలైన అరకు, పాడేరు ప్రాంతాలలో ఆక్సిజన్ సరఫరా సులభమవుతుందని తెలిపారు. పీహెచ్సీ ప్లాంట్ల వల్ల అగ్నిప్రమాదాలు కూడా తక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వెయ్యి ఎల్పీఎం సామర్థ్యం ఉన్న పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్‌తో ఒక రోజులో 25 ఐసీయూ బెడ్లకు, 100 నాన్ ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంటుందని రవికుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సదుపాయాలతో కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు రవికుమార్ తెలిపారు. -
144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ రూ.20కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు కొనుగోలు చేశామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్లైన్ల సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ వైరల్(వీఆర్డీఎల్) ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని సీఎం జగన్ చెప్పారు. 80 శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు 82 శాతం టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. 82 శాతం వ్యాక్సినేషన్‌తో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 సార్లు డోర్ టూ డోర్ సర్వే చేశామని తెలిపారు. కోవిడ్ మేనేజ్మెంట్లో వైద్యశాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎ జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
థర్డ్ వేవ్ ను ఎదురుకోవడం పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి
-
TS: కేంద్రం తోడ్పాటు.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైద్య వ్యవస్థలు ఆగమాగమయ్యాయి. రెండో వేవ్ అయితే జనం జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా డెల్టా వేరియంట్ పంజా విసరడంతో లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఆక్సిజన్ దొరక్క, శ్వాస ఆడక నానాయాతన పడ్డారు. ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయినవారూ ఎందరో! ఇలాంటి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేదిశగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. లిక్విడ్ ఆక్సిజన్‌ను తెప్పించి రోగులకు అందించడం కంటే.. అక్కడికక్కడే ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’ ఆక్సిజన్ ప్లాంట్లను.. రాష్ట్రవ్యాప్తంగా ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో నెలకొల్పుతోంది. తొలిదశ కింద ఇప్పటికే ఐదు ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. రెండో ఫేజ్‌లో 45 ప్లాంట్ల నిర్మాణం చేపట్టగా.. 39 ప్లాంట్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతావాటి పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అన్నింటి నిర్మాణం పూర్తయ్యాక.. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,670 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని.. త్వరలో ఈ సంఖ్య భారీగా పెరగనుందని పేర్కొన్నాయి. వేల సంఖ్యలో బెడ్లకు.. నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు కలిపి 50 ఆస్పత్రుల్లో 27,792 పడకలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. వీటిన్నింటిలో కలిపి మొత్తం గా నిమిషానికి 67,100 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇవేగాకుండా మరో 33 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. సాధారణ వైద్య సేవలతోపాటు అత్యవసర చికిత్సలకు ఆ క్సిజన్ కొరత ఉండబోదని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో ఇది కీలకమైన అడుగు అని అన్నారు. ఇప్పటిదాకా బయటి నుంచి తెచ్చి.. ►ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ రెండు పద్ధతుల ద్వారా సరఫరా అవుతోంది. ►ఒక పద్ధతి ప్రకారం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా రోగులకు అందజేస్తున్నారు. వివిధ కంపెనీల నుంచి ఈ సిలిండర్లను కొనుగోలు చేస్తారు. ఖాళీ అయినకొద్దీ రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా సమయం నుంచి డిమాండ్ పెరగడంతో ఈ సిలిండర్ల కొరత ఏర్పడింది. అడ్డగోలు రేట్లకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ►లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా సరఫరా చేయడం రెండోది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి నేరుగా టన్నుల కొద్దీ లిక్విడ్ ఆక్సిజన్‌ను కొనుగోలు చేస్తారు. ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకునే భారీ ట్యాంకుల్లో దానిని నింపి.. పైపులైన్ల ద్వారా వార్డుల్లో పేషెంట్లకు అందిస్తారు. అయితే ఈ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ►ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రులు సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా.. నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ‘పీఎస్ఏ’ప్లాంట్లను ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్లు గాలిని ప్రాసెస్ చేసి 94 శాతం నుంచి 96 శాతం వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని పైపుల ద్వారా వార్డులకు, బెడ్స్‌కు అనుసంధానం చేసి.. రోగులకు అందజేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి పక్కనే పీఎస్ఏ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. రెండింటినీ అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే.. దానిని వాడుకునే వీలు కలుగనుంది. ఈ ఏర్పాటుతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడబోదని అధికారులు అంటున్నారు. గతంలో లాగా ఆక్సిజన్‌ను కొనాల్సిన అవసరం ఉండదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్తున్నారు. -
వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.1600 కోట్లతో శిథిలావస్థలోఉన్న ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవీ చదవండి: వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల బిగ్‌బాస్-13 విన్నర్, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
రూ.250 కోట్లతో ప్లాంట్: రోజుకు 600 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న పారిశ్రామిక ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కర్నూలులో మరో ఆక్సిజన్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్టు ఎలెన్ బర్రీ గ్యాసెస్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.250 కోట్లతో రోజుకు 600 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎలెన్ బర్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ అగర్వాల్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేయనున్నారు. ఫార్మా కంపెనీల నుంచి నైట్రోజన్ డిమాండ్ పెరుగుతుండటం, వెల్డింగ్, కాస్టింగ్‌లో ఆర్గాన్ గ్యాస్ వినియోగం కూడా పెరుగుతుండటంతో వీటి ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. కర్నూలు జిల్లాకు జిందాల్ ఇస్పాత్ స్టీల్ యూనిట్‌తో పాటు రాంకో సిమెంట్ ప్లాంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లు వస్తుండటంతో వీటి అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. 2022 మధ్య నాటికి దీనిని అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ సంస్థకు విశాఖలో యూనిట్ ఉంది. -
Hyderabad: థర్డ్‌వేవ్ నేపథ్యంలో అప్రమత్తం.. ఆసుపత్రులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రభుత్వాలు మేల్కొన్నాయి. వందకు పైగా పడకలున్న ఆస్పత్రుల్లో ఇక ఆక్సిజన్ ప్లాంట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. అన్ని ఆస్పత్రుల్లో ఇకపై ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పటికీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లోనే కాదు అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు లేవు. రోగుల అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కంపెనీల నుంచి సిలిండర్లు తెప్పించి అందిస్తుండటం, అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన కొరత ఏర్పడుతుండటం ఈ అంశం ఇటు ప్రైవేటు ఆస్పత్రులనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇరుకునపెడు తోంది. థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆ మేరకు నూరు పడకలు దాటిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి చేసి ఆ మేరకు ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. భవిష్యత్తు అవసరాల మేరకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో 19,697 సాధారణ పడకలు ఉండగా, 16405 ఆక్సిజన్, 8,486 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. నిజానికి ఆయా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యసేవలు అందాలంటే రోజుకు కనీసం 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఆ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇదే అంశాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే కేంద్రం మాత్రం రోజుకు 160 నుంచి 200 టన్నులకు మించి సరఫరా చేయలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ప్రత్యేక రైళ్లు, విమానాలు పంపి ప్రాణవాయువు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఆ విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగా వందపడకల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ పరిధిలోని ఆస్పత్రులకు తాఖీదులు జారీ చేస్తున్నారు. పడకల సామర్థ్యాన్ని బట్టి ప్లాంట్ తెలంగాణ వ్యాప్తంగా వంద పడకలకుపైగా ఉన్న ఆస్పత్రులు 500 వరకు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 300 వరకు ఉన్నాయి. ఇక 200 పడకలు దాటిన ఆస్పత్రులు వంద వరకు ఉండగా...500 పడకలు దాటినఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. వీటిలో వంద నుంచి 200 పడకల సామర్థ్యం ఉన్న ఒక్కో ఆస్పత్రిలో నిమిషానికి 500 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ట్యాంకులను, 200 నుంచి 500 పడకలు ఉన్న ఆస్పత్రిలో నిమిషానికి 1000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంటును, 500పైగా పడకలున్న ఆస్పత్రిలో నిమిషానికి 2వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో నిమిషానికి రెండు వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఉత్పత్తి ప్లాంటును ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సామాజిక బాధ్యతగా మరో ఆరు కార్పొరేట్ సంస్థలు ఇదే ఆస్పత్రిలో ఐదు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా రోజుకు నాలుగు టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన ఆక్సిజన్ ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తారు. ఆక్సిజన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం (నిమిషానికి) ఇలా... పడకల సామర్థ్యం ఉత్పత్తి సామర్థ్యం 100 నుంచి 200 500 ఎల్పీ 200 నుంచి 500 1000 ఎల్పీ 500పైగా.. 2000 ఎల్పీ -
TS: ఆక్సిజన్ ప్లాంటు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వంద పడకలకు మించి ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైద్య చికిత్సలో ఆక్సిజన్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రస్తుతం అనేక ప్రైవేట్ ఆసుపత్రులు సిలిండర్లను కొనుగోలు చేస్తూ రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నాయి. అయితే నిరాటంకంగా ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతున్న అంశం వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. అందువల్ల వంద పడకలకు మించిన ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంటు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 27 వేల పడకలకు ఆక్సిజన్ అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతోంది. దీనివల్ల ఎక్కడికక్కడ ఆసుపత్రిలోనే ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల ప్రకారం 100 నుంచి 200 పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటును ఏర్పాటు చేయాలి. 200–500 మధ్య పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును, 500 పడకలు దాటితే నిమిషానికి 2 వేల లీటర్లను ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పాలని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా వంద పడకలున్న ప్రైవేట్ ఆసుపత్రులు 500కుపైగా ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 300 ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో మరో 200 ఉంటాయని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 200 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు 100 వరకు ఉంటాయని, 500 పడకలు దాటినవి 30 వరకు ఉంటాయని చెప్పాయి. వీటిన్నింటిలోనూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పకుంటే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రుల గుర్తింపును, అనుమతులను కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. -
‘థర్డ్’ను దీటుగా ఎదుర్కొందాం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏర్పాటుకానున్న 1,500 లకు పైగా పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సోర్ప్సన్) ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కూడా సూచిం చారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు పీఎం కేర్స్ ఫండ్, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నిర్మితమవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పీఎం కేర్స్ ఫండ్ సహకారం అందించే పీఎఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తు న్నాయని, ఇవి పనిచేయడం ప్రారంభించాక 4 లక్షలకు పైగా ఆక్సిజన్ లభ్యత ఉన్న పడకలు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలోనూ.. ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. నిపుణులు తయారుచేసిన శిక్షణా మాడ్యూల్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మందికి శిక్షణ ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రధానికి అధికారులు తెలియజేశారు. స్థానిక, జాతీయ స్థాయిలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, పనితీరు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)æ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రధానమంత్రి సూచించారు. పలు దేశాల్లో ల్యామ్డా ప్రభావం ల్యా్డమ్డా పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిం చడం ప్రారంభమైందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. అయితే ఇలాంటి వేరియంట్లతో మనం జాగ్రత్తగా ఉండాలని వీకే పాల్ సూచించారు. గర్భిణీ స్త్రీలలో కోవిడ్ తీవ్రత పెరుగుతుందని, అందువల్ల గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్లు వేయడం అవసరం అని వీకే పాల్ అన్నారు. గర్భిణీలకు కరోనా ఉంటే, అకాల డెలివరీ ప్రమాదం పెరుగుతుందని సూచించారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌కు తూట్లు.. మరోవైపు సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్‌లాక్ ప్రక్రియలను మొదలుపెట్టాయి. దీంతో కరోనా విషయంలో ప్రజల్లో ఒకరకమైన అలసత్వం ఆవహించింది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు మార్కెట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒకరికొకరు కనీస దూరం పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందేనన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అదే సమయంలో మాస్క్ ధరించడంతో పాటు, సామాజిక దూరాన్ని పాటించడం అనేది కేవలం నియమం మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని నిపుణులు సైతం స్పష్టంచేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ పర్యాటక ప్రదేశాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరోసారి హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ‘ల్యామ్డా’ జాడల్లేవు దేశంలో కోవిడ్ వేరియంట్ ల్యామ్డాకు సంబంధించిన కేసులు ఇప్పటి వరకు బయటపడలేదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సార్స్‌కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఈ వేరియంట్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో జూన్ 14వ తేదీన పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించిన 7వ వేరియంట్ ల్యామ్డా అని ఆయన చెప్పారు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. దీని జాడలు దాదాపు 25 దేశాల్లో బయటపడ్డాయి. పెరూలో 80% కేసులు ఈ వేరియంట్‌వే. ల్యామ్డా వేరియంట్‌కు సంబంధించి 27 కేసులను గుర్తించినట్లు కెనడా అధికారులు తెలిపారు. థర్డ్ వేవ్‌ని మనమే ఆహ్వానిస్తున్నామా...? దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవ దృశ్యాలు ఇంకా చెరిగిపోక ముందే థర్డ్ వేవ్ రూపంలో మరో ఉపద్రవాన్ని ఆహ్వానించేందుకు దేశవాసులు సిద్ధమౌతున్నారు. గతేడాది కరోనా సంక్రమణ ప్రారంభమైన తర్వాత రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయిన మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను మరోసారి తుంగలో తొక్కడం ప్రారంభమైంది. దేశంలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు, సంక్రమణ వ్యాప్తికి కళ్ళెం వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారిలో కరోనా విషయంలో భయం తగ్గడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్స్ విషయంలో నిర్లక్ష్య జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కప్పా వేరియంట్ కనిపిస్తోంది... కోవిడ్–19 కప్పా వేరియంట్ జాడలు దేశంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వెలుగులోకి వచ్చినట్లు వీకే పాల్ తెలిపారు. తక్కువ తీవ్రత ఉండే ఈ వేరియంట్ దాదాపు డెల్టా వేరియంట్ లక్షణాలనే కలిగి ఉంటుందన్నారు. దేశంలో సెకం డ్ వేవ్‌కు కారణమైన డెల్టా వ్యాప్తి త్వరితంగా జరగడంతో కప్పా ఉనికి కనుమరుగైందన్నారు. ఈ వేరియంట్ కూడా డబ్ల్యూహెచ్‌వో పరిశీలనలో ఉందన్నారు. యూపీలో కప్పావేరియంట్ సంబంధిత 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. -
కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం
సాక్షి,న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది. రూ.113 కోట్లు (15.5మిలియన్ల డాలర్లు ) అందిస్తామని గూగుల్ సంస్థ గూగుల్.ఆర్గ్ గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!) గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. సంబంధిత టార్గెట్ ఏరియాలను గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో పని చేస్తుంది. అలాగే అపోలో మెడీ స్కిల్స్ ఇనీషియేటివ్‌తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కోసం పెట్టుబడులు పెడుతుంది. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య వ్యవస్థలకు సహాయం చేయడమే లక్ష్యమని గూగుల్ ఆర్గ్ వెల్లడించింది. దీంతోపాటు ఆశా, ఎఎన్ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. తద్వారా 15 రాష్ట్రాలలో లక్షా 80వేల ఆశా వర్కర్లకు, 40వేల ఎఎన్ఎంలకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయనుంది. (Edible oil: వినియోగదారులకు భారీ ఊరట) కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్ చేశారు. అలాగే కరోనా విలయం సమయంలో ప్రభుత్వాలతో వ్యక్తులుగా, సమూహాలుగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా దేశంలో అనేకంది స్పందించారనీ, ఈ క్రమంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించిదనీ కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెట్ సంజయ్ గుప్తా వ్యాఖ్యానించారు. కాగా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్‌లో రూ .135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే. Our hearts go out to those in India impacted by the ongoing COVID-19 crisis, and we continue to look for ways to help. Today @Googleorg will provide an additional $15.5 million to build oxygen generation plants and train healthcare workers in rural India. https://t.co/OzoKFe1n1c — Sundar Pichai (@sundarpichai) June 17, 2021 -
ఆక్సిజన్ ప్లాంట్లపై అలసత్వమెందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు 50 ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేసి.. ఇప్పటి వరకు వాటిని ఏర్పాటు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జూన్ మొదటి వారానికల్లా 18 ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధమవుతాయంటూ ఎలా చెప్పారని ప్రశ్నించింది. ప్లాంట్ల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదని హితవు పలికింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు చూపిన తర్వాత కూడా ప్లాంట్ల ఏ ర్పాటులో జాప్యం సరికాదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని చెప్పారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరి నాథ్ స్పందిస్తూ.. ఏపీకి 8,460 బ్లాక్ ఫంగస్ వ యల్స్ అందజేశామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కేటాయింపులు పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ స్పందిస్తూ.. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటులో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. మాటలొద్దు.. స్పష్టమైన హామీ కావాలి దీనిపై ధర్మాసనం ఏఎస్జీ హరినాథ్ వివరణ కోరింది. స్థలం సమస్య వల్ల పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాలేదన్నారు. సుమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ప్లాంట్ల ఏర్పాటునకు అవసరమైన స్థలాల కేటాయింపు ఎప్పుడో పూర్తయ్యిందని, ఆ వివరాలను కేంద్రానికి పంపామన్నారు. దీనిపై ధర్మాసనం హరినాథ్ వివరణ కోరింది. మాటలు చెబితే సరిపోదని.. తదుపరి విచారణ జరిగే 24వ తేదీ నాటికి ప్లాంట్ల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించింది. -
మన సన్నద్ధత ఎంత?
కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలతో భేష్ అనిపించుకున్నాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి చతికిలపడిపోయి చిన్నాచితకా దేశాల సాయం కూడా తీసుకున్నాం. మరి ఒకవేళ మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోగలం? పులి మీద పుట్రలా కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ మరింత దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నా సెప్టెంబర్–అక్టోబర్‌లో థర్డ్ వేవ్ కాటేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్‌తో పాటు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగ నిపుణులు చెప్పిన సలహాలు, సూచనలు, ప్రభుత్వాల సన్నద్ధత ఏమిటో చూద్దాం... కరోనా పరీక్షలు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా పరీక్ష కేంద్రాలు, శాంపిల్ సేకరణ కేంద్రాలు లేవు. దేశం మొత్తం మీద 735 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ప్రజలకి కరోనా సోకిందన్న అనుమానం వస్తే పరీక్ష చేయించుకోవాలంటే మరో జిల్లాకు వెళ్లాలి. కరోనాని అరికట్టాలంటే త్వరగా పరీక్షలు నిర్వహించడం అంత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరికీ కిలోమీటర్ దూరంలోనే శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు పెడితేనే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది. నిరుపేదలకు వైద్యం మన దేశంలో నిరుపేదలకు వైద్యం అందుబాటులో లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం మన దేశ జనాభాలో 30% మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వైద్యుల్ని సంప్రదించే అలవాటు లేదు. సెకండ్ వేవ్‌లో కోవిడ్ గ్రామాలకూ విస్తరించింది. అందువల్ల గ్రామీణుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. లక్షణాలను తేలికగా తీసుకోవద్దనేది ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే కరోనా వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది. ఆస్పత్రులు– ఆర్థిక భారం కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లాలంటే దడ పుట్టే రోజులున్నాయి. లక్షలకి లక్షలు బిల్లు చెల్లించలేక జనం కుదేలైపోతున్నారు. దేశ ప్రజల్లో 81% మంది నెలకి వచ్చే ఆదాయంలోనే ఆస్పత్రి ఖర్చులు కూడా భరించాలి. కరోనా వంటివి వస్తే అప్పో సొప్పో చేయాల్సిన దుస్థితి. మిగిలిన వారు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలి. హెల్త్ ఇన్సూరెన్స్‌లు మొదటి రెండు కరోనా వేవ్‌లలో ఆస్పత్రి పాలైన కోవిడ్–19 రోగుల్లో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కరోనా చికిత్స మొత్తం కవర్ కావడం లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) అంచనాల ప్రకారం రోగులకయ్యే మొత్తం ఖర్చులో 10 శాతం కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి రావడం లేదు. దీంతో లక్షల్లో బిల్లులు కట్టుకోలేక జనం కరోనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తే కరోనా రోగులు ధీమాగా ఆస్పత్రికి వెళ్లే రోజులొస్తాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లేక మనుషులు పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీఎం కేర్ ఫండ్స్ నిధులను వినియోగించి వివిధ జిల్లాల్లో 850 వరకు ఆక్సిజన్ ప్లాంట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి... పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పలు చర్యలు చేపట్టాయి. స్వయం సమృద్ధంగా ఉండటానికే మొగ్గుచూపుతున్నాయి. మాడ్యులర్ ఆస్పత్రులు కరోనా సెకండ్‌వేవ్‌లో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక, వైద్యం అందక సంభవించిన మరణాలు చూశాం. దానిని అధిగమించాలంటే మరిన్ని ఆస్పత్రులు ఉండాలి.. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి ఆస్పత్రుల నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్య రంగ నిపుణులు మాడ్యులర్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ప్రధాన ఆస్పత్రికి అనుబంధంగా కట్టే ఈ ఆస్పత్రుల్ని రూ.3 కోట్ల ఖర్చుతో మూడు వారాల్లో నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆరు నుంచి ఏడు వారాల్లో ఈ ఆస్పత్రుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. వారం రోజుల వ్యవధిలో అవసరమైన చోటుకి తరలించే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆస్పత్రుల్ని 20, 50, 100 పడకలతో 50 వరకు నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, దీనిపై ఎక్కువగా ప్రచారం జరగడంతో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, గోవా, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశాయి. కొత్త వైద్యులకు శిక్షణ కోవిడ్ రోగుల సంఖ్య పెరిగపోవడం, కళ్ల ముందే రోగులు ప్రాణాలు వదిలేయడం, పీపీఈ కిట్లలో వాష్‌రూమ్‌కి వెళ్లే అవకాశం కూడా లేక గంటల తరబడి పని చేయడం వల్ల వైద్య సిబ్బంది నిస్సహాయులైపోతున్నారు. కోవిడ్ తర్వాత దేశంలో దాదాపు 13 లక్షల మంది డాక్టర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో ప్రతీ 1,456 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే వైద్య రంగంలోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది కి శిక్షణ ఇస్తే వైద్యుల కొరత సమస్యని అధిగమించవచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులు వైద్యలకు శిక్షణనిచ్చే అంశంపై దృష్టి సారించాయి. హోం క్వారంటైన్ వ్యవస్థ మన దేశంలో అధికశాతం కరోనా రోగులు ఇళ్లల్లోనే ఉండి కోలుకుంటున్నారు. ఇలాంటి రోగులకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలి. ఫోన్లలోనే వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని చూసే సదుపాయాలు కల్పించాలి. –సాక్షి, నేషనల్ డెస్క్ పర్యవేక్షణే కీలకం భారత్ కరోనా మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో నిరంతరం అధ్యయనాలు చేస్తూ గ్రామాల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలి. సెరో సర్వేలు చేస్తూ కరోనా ప్రబలే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. విస్తృతంగా పరిశోధనలు చేసి వివిధ కరోనా వేరియంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. దీనికి ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. – డాక్టర్ సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ -
పీఎం కేర్స్ నిధులతో 850 ఆక్సిజన్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ నిధుల నుంచి దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్డీఓ చీఫ్ సీ సతీశ్ రెడ్డి సోమవారం వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. కోవిడ్ సెకెండ్‌వేవ్ సమయంలో తాము పలు తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించినట్లు తెలిపారు. వాటిని తాము ఫ్లైయింగ్ హాస్పిటల్స్ అని పిలుస్తున్నట్లు తెలిపారు. ఆయా ఆస్పత్రుల నుంచి వైరస్ ఏ మాత్రం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒకవేళ మూడో వేవ్ వస్తే ఏం చేయాలో ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చిస్తోందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా నాన్యమైన టెక్నాలజీలను తాము తయారు చేస్తునట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ కూడా కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చదవండి: ఏపీ, తెలంగాణ వారికి నెగెటివ్ రిపోర్టు అక్కర్లేదు -
ఆక్సిజన్ ప్లాంట్.. ‘మేడిన్ తెలంగాణ’!
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మిత్రులు వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించారు. స్థానికంగా లభించే విడిభాగాలతోనే సమర్థమైన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ను రూపొందించారు. తిరుపతి ఐఐటీ సహకారంతో చౌటుప్పల్‌లో పూర్తి స్వదేశీ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం చేసినట్లు ఆ మిత్రులు స్థాపించిన కంపెనీ ఆక్సిఫ్లో శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో యంత్రం నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలదని, ఇది 93 నుంచి 95 శాతం స్వచ్ఛతతో కూడి ఉం టుందని వివరించారు. ఈ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాం ట్ను ఆక్సి ఫ్లో అని పిలుస్తున్నారు. ఆ ముడిపదార్థంతోనే సమర్థంగా ఆక్సిజన్.. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థులైన డిస్కవరీ ల్యాబ్స్ సీఈవో మన్నే ప్రశాంత్, ద యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా సీనియర్ డైరెక్టర్ యడ్లపల్లి శిరీష, ఎకో వెంచర్స్ అండ్ ఎకోటెక్ ఇండస్ట్రీస్ ఎండీ నరేడి ఆశి ష్లు తక్కువ సమయంలో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ తయారీ దిశగా అడుగులు చేశారు. ఈ అంశంపైనే పరిశోధనలు చేస్తున్న తిరుపతి ఐఐటీ శాస్త్రవేత్త డాక్టర్ గుమ్మా శశిధర్ సహకారం తీసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ తయారీలో కీలకమైన జియోలైట్ పదార్థం దేశంలోనే అందుబాటులో లేని నేపథ్యంలో తక్కువ సామర్థ్యం ఉందన్న కారణంగా సోడియం ఆధారిత జియోలైట్‌ను దేశంలో వాడట్లేదన్న విషయాన్ని గుర్తించి దాంతోనే సమర్థంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేలా కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఫలితంగా ఆక్సిజన్ ప్లాంట్ ధర గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం తాము నెలకు 20 ఆక్సీ ఫ్లో యంత్రాలను తయారు చేయగలమని కంపెనీ వివరించింది. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
ఎమ్మెల్యే శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్
మహబూబాబాద్: ‘హలో.. శంకర్ ఎలా ఉన్నారు, కుటుంబసభ్యులు బాగున్నా రా.. ప్రజల్లో బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’’ అని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘మానుకోట నా అభిమాన కోట శంకర్, మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చాను’ అని చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆక్సిజన్ బ్యాంకు మంజూరు చేయడంపై ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం ‘లూసిఫర్’ రీమేక్‌లో కీలక పాత్రలో వరుణ్ తేజ్!? -
Sri City: శ్రీ సిటీలో క్రయోజనిక్ ఆక్సిజన్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే శ్రీ సిటీని క్రయోజనిక్ ఆక్సిజన్ తయారీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. నెల్లూరు జీజీహెచ్‌లో పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంటుకు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, ఇందుకోసం రాష్ట్రంలో భారీగా ఆక్సిజన్ ఉత్పత్తి, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇరవై రోజుల ముందు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన రాష్ట్రం ఇవాళ సర్‌ప్లస్‌లో ఉండటం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు. -
50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 808 బ్లాక్‌ఫంగస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.