
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ నిధుల నుంచి దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ చీఫ్ సీ సతీశ్ రెడ్డి సోమవారం వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. కోవిడ్ సెకెండ్‌వేవ్ సమయంలో తాము పలు తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించినట్లు తెలిపారు.
వాటిని తాము ఫ్లైయింగ్ హాస్పిటల్స్ అని పిలుస్తున్నట్లు తెలిపారు. ఆయా ఆస్పత్రుల నుంచి వైరస్ ఏ మాత్రం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒకవేళ మూడో వేవ్ వస్తే ఏం చేయాలో ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చిస్తోందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా నాన్యమైన టెక్నాలజీలను తాము తయారు చేస్తునట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ కూడా కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చదవండి: ఏపీ, తెలంగాణ వారికి నెగెటివ్ రిపోర్టు అక్కర్లేదు