Satish Reddy
-
బాబుకు ‘ఈడీ’ క్లీన్ చిట్ ఇవ్వలేదు: సతీష్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తేల్చిందని వైఎస్సార్సీపీ నేత సతీష్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం(అక్టోబర్ 16) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్కిల్ కేసులో ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈడీ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా క్లీన్ చిట్ ఇస్తున్నామని వెల్లడించలేదు. ఈడీ ప్రెస్‌నోట్‌ను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎల్లో మీడియాలో గోబెల్స్ కన్నా ఘోరంగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్ కేసులో ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. సీమెన్స్ స్కాంలో ఉన్న వారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రానున్న రోజుల్లో గోబెల్స్‌ని మరచిపోయి, తప్పుడు ప్రచారం అనగానే చంద్రబాబే గుర్తొస్తారు. సాక్షాత్తూ ఈడీయే ఆస్తులను అటాచ్ చేస్తే చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎల్లోమీడియాలో ఎలా రాస్తారు? చంద్రబాబు మెడకు ఈడీ ఉరితాడు బిగుసుకుంది. అయినా తమకు తామే బాబు ముఠా క్లీన్ ఇచ్చుకోవటం వెనుక మతలబు ఏంటి? అసలు క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులు కదా? కేసు విచారణలో ఉండగానే క్లీన్చిట్ అని చంద్రబాబు ముఠా ఎలా అంటుంది’ అని సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: అరాచకానికి హద్దు లేదా: సజ్జల -
హామీలు అమలు చేయలేకే కుంటిసాకులు: వైఎస్సార్సీపీ నేత సతీష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింగారెడ్డి సతీష్‌కుమార్‌రెడ్డిని నియమించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 2024లో వైఎస్సార్సీపీ పార్టీది ఓటమి కాదు.. కేవలం చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలకు ప్రజలు మరో మారు మోసపోయారన్నారు. మూడు నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.‘‘అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కుంటిసాకులు చెప్పడం విడ్డూరం. ఎకానమిక్స్‌లో పీజీ చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదా?. పదవిపై వ్యామోహంతో అబద్ధపు వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల తరపున పోరాడతాం’’ అని సతీష్‌రెడ్డ పేర్కొన్నారు.‘‘పులివెందులలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలి. పులివెందుల నియోజకవర్గంలో కాలేటి వాగు ప్రాజెక్ట్, వేంపల్లి సుందరీకరణ,100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలి. ఎటువంటి పనులు ప్రారంభించకుండా ఇసుకను దొంగ రవాణా చేస్తున్నారు. దోచుకోవడానికేనా ప్రజలు అధికారం ఇచ్చింది’’ అంటూ సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. -
బిట్స్ పిలానీ సీనియర్ ప్రొఫెసర్‌గా డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ప్రొఫెసర్‌గా చేరారు. ముఖ్యంగా జాతీయ భద్రతా రంగానికి సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణలకు ఆయన సేవలు అందిస్తారని బిట్స్ పిలానీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నియామకంపై సతీష్ రెడ్డి స్పందించారు. ‘డీఆర్డీఓలో దాదాపు 39 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనను ఓ విద్యాసంస్థలో కొనసాగించటం చాలా సహజం. బిట్స్ పిలానీ చాలా కాలంగా పరిశోధనా కార్యక్రమాల్లో డీఆర్డీఓకు భాగస్వామిగా ఉంది. ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (CRENS)ను ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయం. నేను ఈ కేంద్రానికి సహకరించాలని, పరిశ్రమలు, భద్రతా సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి జాతీయ భద్రత కోసం ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని అందించాలని ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.పరిశోధన, విద్యాపరమైన అంశాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ పరిశోధనా విశిష్టత కోసం సీఆర్ఈఎన్ఎస్లో అధునాతన పరిశోధన కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తారు. రీసెర్చ్ అడ్వైజరీ బోర్డుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక.. ఆయన డీఆర్డీఓలో చేపట్టిన అత్యంత ప్రభావశీల ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. -
బిట్స్ పిలానీలో ప్రారంభమైన సీఆర్‌ఈఎన్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (సీఆర్‌ఈఎన్‌ఎస్)ని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఆవిష్కరించింది. సీఆర్‌ఈఎన్‌ఎస్ చేపట్టే పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాలు దేశీయ సాంకేతికత, భద్రత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. డీఆర్డీఓ, ఇస్రో, పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ, పరిశ్రమల సహకారంతో జాతీయ భద్రతా విషయంలో దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇది దేశ వ్యూహాత్మక, ఆర్థిక వృద్ధికి దోహదపటమే కాకుండా సురక్షితమైన వృద్ధికి సహకారం అందించనుంది. సీఆర్‌ఈఎన్‌ఎస్, అధికారిక లోగోను బిట్స్ పలానీ క్యాంపస్‌లో మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్. జి.సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశ సరిహద్దుల నుంచి హెల్త్, సైబర్ స్పేస్ వంటి కీలక అంశాల్లో సీఆర్‌ఈఎన్‌ఎస్ దూరదృష్టిని అభినందించారు. ప్రస్తుతం ప్రపంచంలో భద్రత అంశాలను సవాలు చేసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయాల్పిన అవసరం ఎంతగానో ఉంది. ముఖ్యంగా బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో సీఆర్‌ఈఎన్‌ఎస్ ఏర్పాటు కావటం ఎంతో ఉపయోగకరం. హైదరాబాద్‌లోని పలు జాతీయ సంస్థలతో కలిసి పని చేయడానికి దానికి వీలు కలుగుతుంది’’ అని అన్నారు. అనంతరం సీఆర్‌ఈఎన్‌ఎస్ వెబ్‌సైట్‌ను డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీసీ డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి, నేవీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఏవీఎస్ఎం, వీఎస్ఎం సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టి సారిన్‌లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ పలానీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ. రాంగోపాల్ రావు మాట్లాడారు. సీఆర్‌ఈఎన్‌ఎస్ మూడు రకాలు లక్ష్యాలను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. మొదటిది.. జాతీయ భద్రతా విభాగంలో నిపుణుల నైపుణ్యం మెరుగుపర్చటం, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో హైబ్రిడ్ కోర్సులను అందింటం. రెండోది.. సరిహద్దులో సేవలు అందించే సైనికులకు పలు అంశాల్లో కీలకమైన పరిష్కారాలను అందించడానికి పరిశోధన చేయటం. మూడో లక్ష్యం.. దేశ అవసరాలకు అవసరమైన రక్షణ, అంతరిక్ష వ్యూహాత్మక రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ నూతన ఆష్కరణలకు కృషి చేయటం’ అని అన్నారు. -
‘రక్షణ’ ఎగుమతుల్లో నంబర్ వన్ కానున్న భారత్..
అవనిగడ్డ: రక్షణరంగ ఎగుమతుల్లో భారత్ నంబర్ వన్ స్థానానికి ఎదిగేరోజు దగ్గరలోనే ఉందని భారత రక్షణరంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఆదివారం దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు 99వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ప్రతీదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని చెప్పారు. గత ఏడాది రూ.21 వేలకోట్ల విలువైన రక్షణరంగ పరికరాలను మనం విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మన దేశం రూ.50 వేలకోట్ల నుంచి రూ.80 వేలకోట్ల పరికరాలు ఎగుమతి చేసేస్థాయికి చేరుతుందన్నారు. మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చాయని చెప్పారు. నిమ్మకూరులో ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేస్థాయికి చేరుకుంటామన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలను తొలగించి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేస్తామని చెప్పారు. తెలుగువారిని ఒక్కటి చేసిన మండలి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సరసన చేర్చదగిన గొప్ప వ్యక్తి సతీష్‌రెడ్డి అని కొనియాడారు. తెలుగు భాషాభివృద్దికి తోడ్పడిన మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెంకటకృష్ణారావు ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు ద్వారా తెలుగువారందరినీ ఒక్కటి చేశారని పేర్కొన్నారు. సతీష్‌రెడ్డి జీవితచరిత్రపై మండలి ఫౌండేషన్ ప్రచురించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
అభివృద్ధి అంటే ఏంటో చూపించిన నాయకుడు సీఎం జగన్
-
బాబు, పవన్ కు ఊహించని షాక్..
-
సీఎం జగన్ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోను: సతీష్‌రెడ్డి
-
వైఎస్సార్సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ‘‘నాతో వైఎస్సార్సీపీ నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
615 ‘ఎలక్ట్రిక్ ’ చార్జింగ్ కేంద్రాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై 615 ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన సంస్థ(రెడ్కో) దరఖాస్తులను ఆహ్వానించింది. రెడ్కో చూపించిన స్థలాల్లోనే ఫాస్ట్, స్లో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్‌లోని తమ కేంద్ర కార్యాలయం/స్థానిక జిల్లా కార్యాలయాలను సందర్శించాలని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ వెబ్సైట్ https:// tsredco.telangana.gov.in/ లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీపీపీ విధానంలో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే యాదాద్రిలో ఏర్పాటు చేసిన తొలి చార్జింగ్ కేంద్రం విజయవంతంగా నడుస్తోందని సతీష్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్కో స్వయంగా 150 ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని వివరించారు. -
రక్షణ రంగానికి వెన్నెముక విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణశాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే రక్షణరంగ ఎగుమతులు గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానం, ఆవిష్కరణలు’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన అవకాశాలున్న విశాఖ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉందని చెప్పారు. తూర్పు నౌకాదళం, డాక్‌యార్డ్, షిప్‌యార్డు, ఎన్ఎస్టీఎల్ తదితర రక్షణ రంగం, అనుబంధ సంస్థలు ఉన్న విశాఖ భవిష్యత్తులో రక్షణ రంగం, ఏరోసిస్టమ్కు కేంద్రంగా మారనుందని చెప్పారు. రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే విశాఖలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతికత బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా.. డిఫెన్స్ మెటీరియల్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. దేశీయ తయారీరంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ గతేడాది రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని, భవిష్యత్తులో రూ.25 వేల కోట్ల మార్క్‌ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. టార్పెడోలు, క్షిపణులు, పరికరాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో అగ్రభాగంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఎగుమతుల్లో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఒకప్పుడు సప్లై చైన్‌గా ఉన్న ప్రైవేటు కంపెనీలు డెవలప్మెంట్ ప్రొడక్షన్ సెక్టార్‌గా మారాయని, క్రమంగా డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్స్ (డీసీపీపీ)గా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పటికే ప్రైవేట్ తయారీ సంస్థలు ఏడు మిసైళ్లను తయారు చేశాయన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోందన్నారు. రక్షణ రంగం వైపుగా ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నా యని చెప్పారు. దేశంలో 2016 నాటికి 400 స్టార్టప్లుండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో సీఐఐ ఎస్ఐడీఎం చైర్మన్ జె.శ్రీనివాసరాజు, సీఐఐ ఏపీ చైర్మన్ డాక్టర్ ఎం.లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బొమ్మనహళ్లిలో భారీ మెజారిటీతో గెలుస్తా : సతీష్ రెడ్డి
-
68 ప్రమాదాలు.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్‌రెడ్డి అన్నారు. నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్‌గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి -
సైన్యానికి దన్నుగా స్వయ
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా నాలుగు కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎక్సోస్కెలిటన్ నమూనాలు సిద్ధమయ్యాయి. డీఆర్డీవో అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ బయో–ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయ రొబోటిక్స్ వీటిని రూపొందించింది. ఈ నమూనాలను రక్షణశాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి సోమవారం ఆయన పరిశీలించారు. రక్షణ, డీఆర్డీవో వర్గాలతో కలసి రోబో తయారీ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో రానున్న కాలంలో రోబోలదే కీలకపాత్రని స్పష్టం చేశారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించి నిఘా పనులు చేసేందుకు, సైనికుల మోతబరువును తగ్గించడంలోనూ రోబోల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ‘‘అతితక్కువ కాలంలో స్వయ రోబోటిక్స్ వీటిని (రోబో, ఎక్సోస్కెలిటన్లను) రూపొందించడం హర్షణీయం. దేశ రొబోటిక్స్ రంగం పురోగతికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో ఉపయోగపడతాయి. క్షేత్ర పరీక్షలు వేగంగా పూర్తి చేసి అటు రక్షణ, ఇటు పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే ఈ రకమైన రోబోలను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’అని సతీశ్‌రెడ్డి చెప్పారు. డీఆర్డీవో ‘మేకిన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా స్వయ రోబోటిక్స్ వంటి ప్రైవేటు సంస్థలతో రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇలాంటి సైనిక రోబోలను అమెరికా, స్విట్జర్లాండ్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో అవి పనిచేయలేవు. ఎందుకంటే వాటిని నిర్దిష్ట పరిసరాల్లోనే పనిచేసేలా రూపొందించారు. పైగా వాటిల్లో ఫీచర్లు కూడా తక్కువ. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయ రోబోలు ఉపయోగపడతాయని అంచనా. రెండేళ్లలో మిలటరీకి: విజయ్ శీలం రక్షణ శాఖ అవసరాలకోసం సిద్ధం చేసిన రోబో నమూనా తొలి తరానిదని.. మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయ రోబోటిక్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆర్.శీలం తెలిపారు. అమెరికాలో బోస్టన్ డైనమిక్స్‌తో పాటు ఇతర దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి రోబోలు తయారు చేస్తున్నా... మిలటరీ అవసరాల కోసం తామే తొలిసారి తయారు చేశామని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సైనికులు వాడే ఆయుధాలు, సమాచార పరికరాలను ఈ రోబో సునాయాసంగా మోసుకెళ్లగలదని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ శత్రు స్థావరాలను పరిశీలించి రాగలదని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులపై నిఘా ఉంచే రోబోలను ఇతర ప్రాంతాల నుంచి కూడా నియంత్రించొచ్చని వివరించారు. తొలితరం నమూనాలో నడక మాత్రమే సాధ్యమవుతుందని, సమీప భవిష్యత్తులోనే వాటికి చూపును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ రోబో సైన్యానికి సేవలందించే అవకాశం ఉందన్నారు. పాదాల్లో ఏర్పాటు చేసిన సెన్స ర్లు, ఇతర పరికరాల ద్వారా ఈ రోబో నేల, కాంక్రీట్, రాయిల మధ్య తేడాలను గుర్తించి నడకను నియంత్రించుకోగలదని వివరించారు. -
రాజధానిగా విశాఖ..! చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి
-
ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది : సతీష్ రెడ్డి
-
ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది: రెడ్డీస్ ల్యాబ్ సతీష్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సమ్మిట్ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా.. రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం అని అన్నారు. అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. నెంబర్ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. -
నచ్చిన రంగాల్లో యువత రాణించాలి
వెంగళరావునగర్ (హైదరాబాద్): స్వయంశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. యువత నేటి కాలానికి అనుగుణంగా అన్నిరకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకుని యువతీ యువకులు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని, తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్‌మే) శిక్షణ సంస్థలో స్వయంశక్తితో ఎదగాలనుకునే యువతకు శిక్షణలో భాగంగా గురువారం జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్టైతే.. ప్రభుత్వం బ్యాంకుల తరఫున రుణాలను మంజూరు చేస్తుందని, తద్వారా చిన్న, మధ్యతరహా, భారీ వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకర్లు కూడా యువతలోని నైపుణ్యాన్ని గ్రహించి వారిని నిరుత్సాహ పరచకుండా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక చేయూతను అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ వివేక్, నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాగా నిమ్స్‌మేలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను సతీష్‌రెడ్డి ప్రారంభించారు. -
TS: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ కేంద్రాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్ ఎనర్జీ డెవల‹³మెంట్ కార్పొరేషన్) చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషీన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలతో వాహనాలను చార్జింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసుమును నిర్ణయించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిదన్నారు. చార్జింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. -
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించడం, వారిని శక్తివంతం చేయడం ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాల కుగాను వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులను రాష్ట్రపతి అందించారు. దివ్యాంగులను సశక్తులుగా తయారు చేసే ప్రక్రియలో భాగమైన సంస్థకు ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి తెలంగాణకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు అందించారు. రెడ్డీస్ ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ కె.సతీశ్‌రెడ్డి రాష్ట్రపతి చేతు ల మీదుగా అవార్డును అందుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నాట్యకారిణి ఏపీ విజయనగరానికి చెందిన దివ్యాంగ బాలిక శ్రేయామిశ్రా(16)కు 2022 సంవత్సరానికి శ్రేష్ఠ్ దివ్యాంగ బాలిక విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందించారు. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!
రూపాయి అంతకంతకూ దిగజారు తోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 14న డాలర్‌తో రూపాయి మారకం విలువ గరిష్టంగా 80 రూపాయలు దాటింది. ప్రస్తుతం కాస్త తగ్గి 79.96 రూపాయలకు చేరింది. ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులను ఉపసంహరిం చుకోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు అంచనాలతో పొంతన లేకుండా ద్రవ్యో ల్బణం పెరుగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలే దీనికి కారణమని రిజర్వ్ బ్యాంక్ అంటోంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చి 17న 6.95 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి పెరిగింది. దీనితో 2022–23 ఆర్థిక సంవ త్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న క్రితం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒక శాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల వేగాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు ఎక్కువ. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్పదకొండు వరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పీపీఏసీ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ 10న మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. 2012లో అప్పటి ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 6,201.05 కాగా... ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేకపోవడం వల్ల ఈ రోజు మనం ప్రతీ ముడిచమురు పీపాకు పదేళ్ల నాటి కంటే అదనంగా రూ.3,233.24 చెల్లి స్తున్నాం. పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 51.13 ఉండగా మోదీ పాలనలో అది రూ. 80 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ రూపాయి పతనం కారణంగా మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారుతోంది. దీంతో అప్పులు కూడా కట్టలేని స్థితికి చేరుకుంటోంది. రాబోయే 9 నెలల్లో దాదాపు 621 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 40 శాతం... అంటే 267 బిలియన్ల అప్పు ఇంకా పెండింగ్ లోనే ఉందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలే చెబుతున్నాయి. ఇది మన దగ్గరున్న విదేశీమారక నిల్వల్లో 44 శాతానికి సమానం. మరోవైపు రూపాయి పతనాన్ని అరి కట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతోంది. గత డిసెంబరు 31 నాటికి 633.6 బిలియన్ డాలర్లుండగా, జూన్ 24న 593.3 బిలియన్ డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77–81 మధ్య ఉండొచ్చని అంచనా (ఇప్పుడున్న ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటేనే). రూపాయి పడితే ఇబ్బందేంటి అన్న అనుమానం సామాన్య మానవునికి రావచ్చు. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. రూపాయి పడితే బడా వ్యాపారవేత్తలకంటే కూడా సాధారణ పౌరులే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇతర దేశాల నుండి కొన్న వస్తువులకు వాళ్లు డాలర్ల లెక్కలోనే బిల్లు ఇస్తారు. అప్పుడు మనం రూపాయిలను డాలర్లుగా మార్చి చెల్లించాలి. అంటే రూపాయి విలువ తరిగే కొద్దీ మనం ఎక్కువ ధనాన్ని దిగు మతులకు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఈ లెక్కన దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. గ్యాస్, పెట్రోల్ వంటివాటి ధరలు పెరగడం వల్ల అన్ని వినియోగ వస్తువుల ధరలూ పెరుగుతాయి. రూపాయి పతనానికి ముకుతాడు వేయకుంటే... ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు అతి త్వరలోనే భారత్‌లో కనిపించే ప్రమాదముందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. - వై. సతీష్ రెడ్డి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ -
రీసెర్చ్ కారిడార్‌గా తిరుపతి
తిరుపతి రూరల్: కేంద్ర పరిశోధన సంస్థలతో పాటు దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా తొమ్మిది యూనివర్సిటీలున్న తిరుపతిని రీసెర్చ్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్, కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి డాక్టర్ సతీష్‌రెడ్డి తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యా సంస్థలు నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్(ఐఎస్టీఎఫ్)ను శనివారం ఆయన ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. పలు కాలేజీలు, యూనివర్సిటీలను నాలెడ్జ్ పాట్నర్స్‌గా చేసుకుని వారికి సర్టిఫికెట్లు అందించారు. యువకులు, అ«ధ్యాపకులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పరిశోధనల పరంగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. వాతావరణ పరిశోధన కేంద్రంతో పాటు.. వేలాది మంది యువత ఈ నగరానికి అదనపు బలమని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశంలో గత పదేళ్లలో ఊహించని పురోగతి సాధించినట్లు తెలిపారు. ఐఐటీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఉపాధి కోసం గతంలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు వారంతా దేశంలోనే ఉంటున్నారని తెలిపారు. 70 వేలకు పైగా నూతన ఆవిష్కరణలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యాయని, ఇది మన పురోగతికి నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇండెక్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ విభాగాల ద్వారా డీఆర్డీవో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల వరకూ ఫండింగ్ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 60 నూతన ఆవిష్కరణలకు ఫండింగ్ చేశామని, ఈ ఏడాది కనీసం 5 వేల వరకూ పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, పరిశోధనలపై ఆసక్తి కలిగిన వారు రక్షణ రంగం అందిస్తున్న ఈ ఫండింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో దేశం సంపదను సృష్టిస్తోందని, రానున్న రోజుల్లో 39,475 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యమన్నారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే అన్ని రంగాల్లోనూ అధునాతన పరిశోధనలు అవసరమని, వీటిని ప్రోత్సహించే ఇంక్యూబేషన్ సెంటర్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలకు అన్ని విధాలా ప్రోత్సాహకాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు సరికొత్త వేదికగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఈ సందర్భంగా దాని రూపకర్త డాక్టర్ నారాయణరావును డాక్టర్ సతీష్‌రెడ్డి అభినందించారు. నూతన ఆవిష్కరణలకు వేదిక.. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు వేదికగా ఐఎస్టీఎఫ్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్టు దాని అధ్యక్షుడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్సలర్ ఆచార్య నారాయణరావు చెప్పారు. తిరుపతిలో డీఆర్డీవో ల్యాబ్, ఐఐటీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ కోరారు. ఐఎస్టీఎఫ్ మూడు దశల్లో సేవలందించాలని సూచించారు. స్కూల్ స్థాయి విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరిశీలన, కళాశాల స్థాయి విద్యార్థులకు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న ఉపాధిపై, రీసెర్చ్ స్థాయి విద్యార్థులకు నూతన ఆవిష్కరణల రంగంపై శిక్షణ, వారికి తోడ్పాటు వంటి అంశాలపై ఫౌండేషన్ దృష్టి పెట్టాలని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ గణేష్ సూచించారు. కార్యక్రమంలో గాదంకి ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ ఏకే పాత్రో, ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, మోహనబాబు వర్సిటీల వీసీ ఆచార్య రాజారెడ్డి, జమున, నాగరాజన్, ఫౌండేషన్ కోశాధికారి వాసు, విజయభాస్కరరావుసభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత అమ్మవారిని, తిరుమల శ్రీవారిని డాక్టర్ సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. -
పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లె: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని రూ.20 కోట్లకు అమ్ముకోవాలని చూశారని.. అలాంటి వ్యక్తి వెంట ఎలా నడవాలని పలువురు ముఖ్య నేతలు సతీష్‌రెడ్డి ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. తమను బీటెక్ రవి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ రవిని నమ్మితే నట్టేట మునుగుతామని తేల్చి చెప్పారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్‌రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ శంకించారు: సతీష్‌రెడ్డి 30 ఏళ్లపాటు తాను నిజాయితీగా పనిచేసినా చంద్రబాబు, లోకేశ్ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడారని సతీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇందుకు చంద్రబాబును ఒప్పిస్తామని, త్వరలోనే కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, పార్టీని వదిలి వెళ్లిపోయిన సతీష్‌రెడ్డిని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవడంపై బీటెక్ రవి, ఆయన వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్‌రెడ్డి సమావేశ వివరాలను బీటెక్ రవి చంద్రబాబు, లోకేశ్‌తోపాటు పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాను కూడా చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటానని బీటెక్ రవి తేల్చి చెప్పినట్టు సమాచారం. పులివెందులలో అరకొరగా ఉన్న టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి రచ్చకు దిగడంపై ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో పులివెందులలో టీడీపీ వర్గపోరు మరింత రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం సతీష్‌రెడ్డితో సమావేశమైన వారిలో తొండూరు మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు తూగుట్ల సిద్ధారెడ్డి, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, చక్రాయపేట టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఓబుళరెడ్డి, హరినాథరెడ్డిలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు.