
ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషీన్‌ను పరిశీలిస్తున్న రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్ ఎనర్జీ డెవల‹³మెంట్ కార్పొరేషన్) చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషీన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలతో వాహనాలను చార్జింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసుమును నిర్ణయించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిదన్నారు. చార్జింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment