
కలాంను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు కలాం ఈ సలహా ఇచ్చారని సతీశ్ రెడ్డి తెలిపారు.
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతిచెందడానికి నెల రోజుల ముందు, పునర్వినియోగ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిందిగా తనకు సూచించారని డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి తాజాగా చెప్పారు. కలాం చనిపోయే నాటికి సతీశ్ రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. తాను ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కలాంను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు కలాం ఈ సలహా ఇచ్చారని సతీశ్ రెడ్డి తెలిపారు. ‘క్షిపణులు వాటి పే లోడ్‌ను ప్రయోగించిన అనంతరం మళ్లీ వెనక్కు వచ్చి, ఇంకో పే లోడ్‌ను తీసుకెళ్లేలా ఉండాలి. అలాంటి సాంకేతికత అభివృద్ధి చేయండి’ అని కలాం తనకు సూచించారని సతీశ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.