హైదరాబాద్, సాక్షి: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ప్రొఫెసర్‌గా చేరారు. ముఖ్యంగా జాతీయ భద్రతా రంగానికి సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణలకు ఆయన సేవలు అందిస్తారని బిట్స్ పిలానీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఈ నియామకంపై సతీష్ రెడ్డి స్పందించారు. ‘డీఆర్‌డీఓలో దాదాపు 39 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనను ఓ విద్యాసంస్థలో కొనసాగించటం చాలా సహజం. బిట్స్ పిలానీ చాలా కాలంగా పరిశోధనా కార్యక్రమాల్లో డీఆర్‌డీఓకు భాగస్వామిగా ఉంది. ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (CRENS)ను ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయం. నేను ఈ కేంద్రానికి సహకరించాలని, పరిశ్రమలు, భద్రతా సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి జాతీయ భద్రత కోసం ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని అందించాలని ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.
పరిశోధన, విద్యాపరమైన అంశాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ పరిశోధనా విశిష్టత కోసం సీఆర్‌ఈఎన్‌ఎస్‌లో అధునాతన పరిశోధన కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తారు. రీసెర్చ్ అడ్వైజరీ బోర్డుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక.. ఆయన డీఆర్‌డీఓలో చేపట్టిన అత్యంత ప్రభావశీల ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment