National security
-
టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్‌టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్‌టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్‌టాక్‌ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్‌డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్‌డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్‌ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్‌గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్‌డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్‌లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్‌టాక్‌లో పాపులర్ అవడంతో అందరూ టిక్‌టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్‌లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్‌టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ షార్ట్‌వీడియో మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కనిపించినా టిక్‌టాక్‌లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్‌కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్‌టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్‌టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్‌కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్‌కు టిక్‌టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. భారత్‌లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్‌టాక్‌ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్‌టాక్‌ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్‌లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్‌మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్‌టాక్‌లో ఎక్కువైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్‌టాక్‌పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్‌స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్‌టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్‌బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్‌ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్‌ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్‌టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్‌టాక్‌ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్‌లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్‌లో మళ్లీ టిక్‌టాక్ ఖాతా తెరచి ఈ యాప్‌కు మద్దతు పలికారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్‌నోట్ డౌన్లోడ్ టిక్‌టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్‌నోట్ యాప్‌కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్‌గా రెడ్‌నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్‌నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్‌స్టైల్ సోషల్‌మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్‌నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించడం వింతే. ఇన్‌స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్‌లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్‌వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్‌టాక్‌ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్‌ను బైట్‌డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ, అమిత్ షాపై ఆరోపణలతో కవ్వింపు చర్యలు.. వెనక్కి తగ్గిన కెనడా
ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వేర్పాటువాదీ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, విదేశాంగమంత్రి, పలువురు ప్రముఖుల హస్తం ఉందంటూ కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్' ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది.. కెనడాలో నివసిస్తున్న మరికొందరు వేర్పాటువాదులను కూడా నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు పేర్కొంది.అయితే ఆ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. కెనడా అర్థంలేని ఆరోపణలు చేస్తుందని, ఇటువంటి హాస్యాస్పదమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు ఊహజనితమైనవని, అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు జస్టిన్ ట్రూడో జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ సలహాదారు నథాలీ జి డ్రౌయిన్ ఓ ప్రకటన విడుదల చేశారు.‘ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరు 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు, అధికారులు అసాధారణ చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడా గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేర కార్యకలాపాలకు భారత ప్రధాని మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎన్నడూ పేర్కొనలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితం.. అవాస్తవమైనవే’’ అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించారు.కాగా నిజ్జర్ హత్యగురించికెనడా ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రికలో ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అవన్నీ హాస్యాస్పద వార్తలనేనని ఖండించింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. . ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
బిట్స్ పిలానీ సీనియర్ ప్రొఫెసర్‌గా డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ప్రొఫెసర్‌గా చేరారు. ముఖ్యంగా జాతీయ భద్రతా రంగానికి సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణలకు ఆయన సేవలు అందిస్తారని బిట్స్ పిలానీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నియామకంపై సతీష్ రెడ్డి స్పందించారు. ‘డీఆర్డీఓలో దాదాపు 39 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనను ఓ విద్యాసంస్థలో కొనసాగించటం చాలా సహజం. బిట్స్ పిలానీ చాలా కాలంగా పరిశోధనా కార్యక్రమాల్లో డీఆర్డీఓకు భాగస్వామిగా ఉంది. ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (CRENS)ను ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయం. నేను ఈ కేంద్రానికి సహకరించాలని, పరిశ్రమలు, భద్రతా సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి జాతీయ భద్రత కోసం ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని అందించాలని ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.పరిశోధన, విద్యాపరమైన అంశాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ పరిశోధనా విశిష్టత కోసం సీఆర్ఈఎన్ఎస్లో అధునాతన పరిశోధన కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తారు. రీసెర్చ్ అడ్వైజరీ బోర్డుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక.. ఆయన డీఆర్డీఓలో చేపట్టిన అత్యంత ప్రభావశీల ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
సరికొత్త ‘డేటా పరిరక్షణ’
వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పి ఆరేళ్లవుతుండగా మళ్లీ సరికొత్తగా ముస్తాబై డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి పదే పదే తప్పించుకునే బేతాళుడి మాదిరి ఎప్పటికప్పుడు వెనక్కిపోతున్న బిల్లు ఈసారైనా ఈనెల 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి. అంతకన్నా ముఖ్యం– ముసాయిదా బిల్లుపై నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సివుంది. డేటా పరిరక్షణ ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని రూపొందించేవారికి డిజిటల్ రంగంపైనా, అందులో వస్తున్న, రావడానికి ఆస్కారం ఉన్న మార్పులపై లోతైన అవగాహన ఉండాలి. అప్పుడే నిజమైన పరిరక్షణ సాధ్యమవుతుంది. మన దేశంలో డిజిటల్ యుగం ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పేరుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–2000 చట్టం వచ్చినా అది పౌరుల గోప్యతకు సంబంధించి కొరగాని చట్టంగా మిగిలిపోయింది. వేలిముద్రలతో సహా పౌరుల సమస్త వివరాలూ సేకరించే ఆధార్‌ను ఆదరాబాదరాగా తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ సర్కారు ఆ డేటా పరిరక్షణకు అనువైన చట్టం అవసరమన్న సంగతి మరిచింది. దానిపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాక 2012లో జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక సమగ్ర నివేదిక కూడా ఇచ్చింది. ఈలోగా యూపీఏ ఏలుబడి ముగిసిపోయింది. తగిన చట్టాలు లేకుండా ఆధార్ కోసం వ్యక్తిగత వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పుట్టస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టాక కేంద్రంలో కదలిక మొదలైంది. వ్యక్తిగత గోప్యత హక్కు పౌరుల జీవించే హక్కులో అంతర్భాగమని, అందుకు అనుగుణంగా చట్టం ఉండితీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసులో తీర్పునిచ్చాక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నాయకత్వాన కమిటీ ఏర్పాటయింది. అన్ని వర్గాల ప్రజలతోనూ, నిపుణులతోనూ మాట్లాడి మరుసటేడాది జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ముసాయిదా బిల్లు సమర్పించింది. మార్పులు, చేర్పులతో ఆ బిల్లు 2019లో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. మరో రెండేళ్లకు జేపీసీ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా 2021లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దానిపైనా అనేక అభ్యంతరాలు వ్యక్తం కావటంతో నిరుడు ఆగస్టులో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తర్వాత రూపొందిన మరో ముసాయిదా బిల్లును నిరుడు నవంబర్‌లో ప్రజల పరిశీలనకు విడుదల చేశారు. అందులో వ్యక్తమైన అభిప్రాయాలేమిటో, వేటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతున్నదో చెప్పలేదు. మొత్తానికి ఆరేళ్లుగా సాగుతున్న కసరత్తు పర్యవసానంగా కొత్త బిల్లు రాబోతోంది. ఐరాస సభ్యదేశాల్లో ఇప్పటికే 137 దేశాలు డేటా పరిరక్షణ చట్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ విషయంలో మనం వెనకబడేవున్నాం. దేశ పౌరుల డేటా బజారునపడుతున్న వైనం అప్పుడప్పుడు వెల్లడవుతూనే ఉంటోంది. ఎక్కడెక్కడో డేటా సంపాదించి పౌరుల బ్యాంకు ఖాతాలను దుండగులు ఖాళీ చేస్తున్న ఉదంతాలు పెరిగాయి. అయినా డేటా పరిరక్షణ బిల్లు తీసుకురావటంలో అలవిమాలిన జాప్యం జరిగింది. ఏమైతేనేం... బిల్లు రాబోతున్నది. సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల డేటా లీకైనపక్షంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ) ఏర్పాటు చేయాలన్న బిల్లులోని ప్రతిపాదన మెచ్చదగిందే. ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించుకోవటం, నిఘా పెట్టడం ఇక తప్పనిసరవుతుంది. ఉద్దేశిత ప్రయోజనం నెరవేరగానే సేకరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామన్న హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చట్టంలో ఉంటుందంటున్నారు. అది మంచి ప్రతిపాదనే. డేటా లీక్ అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అవసరాన్నిబట్టి కేబినెట్ ఆమోదంతో ఈ జరిమానాను రూ. 500 కోట్ల వరకూ పెంచడానికి బిల్లులో ఏర్పాటుందని చెబుతున్నారు. ప్రతిపాదన కూడా అవసరమైనదే. అయితే పౌరుల డేటా లీక్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను సమంగా చూడాలి. పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరించే ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేలా చర్యలుండాలని, వాటికి కూడా కళ్లెం వేయాలని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ వంటి సంస్థల డిమాండ్. అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రైవేటు సంస్థలకైనా, ప్రభుత్వ సంస్థలకైనా సమానంగా వర్తించేలా చట్టాలున్నాయి. దేశ భద్రత తదితర అంశాల్లో తన ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కేంద్రం మినహాయింపు ఇవ్వొచ్చని తాజా బిల్లులో ఉన్నదంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కావొచ్చు కూడా. కానీ ఆ క్రమం పారదర్శకంగా ఉండాలి. మినహాయింపులిస్తే సరిపోదు. చట్టవిరుద్ధత చోటుచేసుకున్న పక్షంలో చర్యలేమిటో ప్రతిపాదించాలి. తప్పుడు ఫిర్యాదులని తేలితే రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చన్న పాత ముసాయిదా నిబంధన కూడా మార్చలేదంటున్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేయాలంటేనే సవాలక్ష అడ్డంకులుంటాయి. ఈమాదిరి జరిమానాలు తోడైతే ఇక చెప్పేదేముంది? పౌరులను బెదరగొట్టే ఈ నిబంధనను పరిహరిస్తేనే మంచిది. డీపీఏ ఒక స్వతంత్ర సంస్థగా మనగలిగితేనే దాని పని తీరు ప్రభావవంతంగా ఉంటుందని పాలకులు గుర్తిస్తే అది దేశానికెంతో మేలు చేస్తుంది. -
సాక్షులతో మాట్లాడొద్దు
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్‌కు తోడుగా ఆయన వెంట కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్‌కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్‌పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్ టాన్ బ్లాంచ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్ గూడ్‌మ్యాన్ ట్రంప్ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు. అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్ 14 బుధవారం ట్రంప్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్‌లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్‌లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్‌ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్‌కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
భద్రతపై రాజీ లేదు: రాజ్‌నాథ్
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు. -
ఒలింపిక్ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్‌ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. -
బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు!
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడులను అత్యంత తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘‘మత స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు! ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పోకడలు నిజమే అయితే గనక అంతిమంగా ఇది దేశభద్రతకే పెను సవాలు విసరగలిగినంతటి తీవ్రమైన సమస్య! అంతేగాక పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోండి. బలవంతపు మతమార్పిళ్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోండి. ఆ వివరాలతో 22లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది. బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘డబ్బు తదితర ప్రలోభాలు చూపి, భయపెట్టి, మోసగించి మతం మార్చడాన్ని అడ్డుకునేందుకు ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ అంశం గతంలో సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ చట్టాల చెల్లుబాటును సమర్థించింది కూడా’’ అని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ బలవంతపు మతమార్పిళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయన్నారు. ‘‘తాము క్రిమినల్ నేరాల్లో భాగస్వాములుగా మారుతున్నామన్న వాస్తవం కూడా ఇలాంటి బాధితులకు చాలాసార్లు తెలియదు. పైగా మతం మారుస్తున్న వాళ్లు తమకు సాయం చేస్తున్నారని భ్రమిస్తుంటారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విచారణను నవంబర్ 28కి ధర్మాసనం వాయిదా వేసింది. -
సోషల్‌గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు
మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా... ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్‌లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్’ లైఫ్ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది. మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట. ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే. ఉద్యోగార్థులపై సోషల్ నిఘా గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘సేజ్ పబ్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే... ► ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? ► సొంతగా ఏమైనా బ్లాగులు రన్ చేస్తున్నారా? ► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు. ► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. ► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేసినట్లు చాలామంది అంగీకరించారు. ► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు. ► సోషల్ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు. భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియా పోస్టులకు కెరీర్‌తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్ హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రీతి నారాయణ్ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. :::కంచర్ల యాదగిరిరెడ్డి -
బలమైన, ఐక్య ఆసియాన్
న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు. వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏడీపీని విస్తరించాలి: మోదీ న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్‌లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు. -
సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్
National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది. అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా!
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చైనాతో ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌ను నాశనం చేసేందుకు ప్లాన్ గీసుకుంది. ఈ మేరకు చైనా నుంచే అధికారిక సంకేతాలు వెలువడడం గమనార్హం. ఇప్పటికే రష్యా స్పేస్ ఏజెన్సీ.. ఉక్రెయిన్ సాయం విషయంలో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే స్టార్‌లింక్ శాటిలైట్లను కూల్చేయాలని చైనా భావిస్తోంది. ప్రపంచంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో అత్యంత చౌకైన సర్వీస్‌లు అందిస్తోంది ఎలన్ మస్క్ స్టార్‌లింక్. ఒకవేళ తమ జాతీయ భద్రతకు గనుక హాని కలిగించేవిగా పరిణమిస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్లను ముందువెనకా ఆలోచించకుండా కూల్చేస్తామని చైనా మిలిటరీ ప్రకటించింది. ఈ మేరకు అధ్యయనంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్‌పై నిఘా ఉంచాలని, నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉందని చైనా సైంటిస్టుల అభిప్రాయాలను సైతం ప్రచురించింది. ఈ అధ్యయనానికి బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రీసెర్చర్ రెన్ యువాన్‌జెన్ నేతృత్వం వహించారు. స్టార్‌లింక్ సేవలు.. అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్ డేటా ట్రాన్స్‌మిషన్‌ను వేగాన్ని(దాదాపు వంద రెట్ల వేగం) పెంచుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు. ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నాడు. లో-ఎర్త్ ఆర్బిట్‌లో చిన్న చిన్న శాటిలైట్లను ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ భూమ్మీద బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది స్టార్‌లింక్. స్టార్‌లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలతో కూడి ఉంది. ఒకవేళ ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటన్నింటినీ నాశనం చేయాలనేది చైనా ప్రణాళిక. క్షిపణులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. కాబట్టి, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి లేజర్లు, మైక్రోవేవ్ టెక్నాలజీ లేదంటే చిన్న ఉపగ్రహాలను, స్టార్‌లింక్ శాటిలైట్ కట్టడికి కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనిపై మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!. చదవండి: మస్క్ నాతో నీచంగా ప్రవర్తించాడు! -
టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్ ఫాగ్ యాప్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. టెక్ ఫాగ్ యాప్ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు. చదవండి: గోవా బీజేపీకి షాక్ ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్ ఆనందర్ శర్మను డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్ ఫాగ్’ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
బెజవాడ అడ్రస్‌తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..
సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్‌కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. విజయవాడకు సంబంధమే లేదు... ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్‌వాసులు, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ మహిళను డీఆర్ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమీషన్ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ రాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్‌ను డీఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్‌లో కూడా అఫ్గానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్‌ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్‌ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు గుజరాత్లో హెరాయిన్ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది. స్మగ్లింగ్ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్‌లోని ముఠా సభ్యులతో ఫోన్లో మాట్లాడి హెరాయిన్‌ను గుజరాత్ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్ కేసులు విచారించే డీఆర్ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. -
భద్రతా సవాళ్లు మరింత సంక్లిష్టం
న్యూఢిల్లీ: మతచాంధస, ఉగ్రమూలాలున్న తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ ‘రాజకీయ’ స్వరూపం మారుతోందని, దీంతో దేశ భద్రతా సవాళ్లు మరింత సంక్షిష్టమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. సవాళ్లకు ధీటుగా నిలబడాలంటే సొంత రక్షణ రంగ వ్యవస్థను మరింత పటిష్టంచేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. రక్షణరంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఉద్దేశించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ 5.0’ను గురువారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా రాజ్‌నాథ్ ఉపన్యసించారు. రక్షణరంగానికి సంబంధించిన నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్(ఐడెక్స్) పేరిట ఒక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ ప్రపంచవ్యాప్తంగా దేశ భద్రతపరంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా మారడంతోపాటు, సాయుధదళాల పూర్తి అవసరాలు తీర్చే స్థాయిలో, వేరే దేశాలపై ఆధారపడకుండా, రక్షణ రంగంలో ఆయుధాలు, తదితర సైనిక ఉపకరణాల ఉత్పత్తిలో భారత్ మరింత స్వావలంభన సాధించాలి’ అని రాజ్‌నాథ్ అభిలషించారు. భారత రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింతగా పరిపుష్టంచేయడంలో ప్రైవేట్ రంగం సైతం తమ వంత భాగస్వామ్యపాత్ర తప్పక పోషించాలని ఆయన సూచించారు. ‘భారత్‌లో ప్రతిభావంతులకు కొదవ లేదు. అలాగే ప్రతిభావంతులకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఈ ప్రతిభావంతులను, ‘డిమాండ్’ను ఒకే తాటి మీదకు తెచ్చే సరైన వేదికే లేదు. ఐడెక్స్ ఇందుకు చక్కని పరిష్కారం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. మారుతున్న రక్షణ విధానం రక్షణ ఉత్పత్తుల హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టింది. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగంలో అవకాశాలు పెంచేందుకు పలు ఉత్పత్తుల దిగుమతుల విధానానికి వచ్చే మూడేళ్లలోగా స్వస్తిపలకాలని గట్టి నిర్ణయం తీసుకుంది. రవాణా విమానం, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు, సోనార్ వ్యవస్థ ఇలా 101 రకాల ఉత్పత్తులను 2024 ఏడాది తర్వాత భారత్ దిగుమతి చేసుకోబోదు. ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, చిన్న యుద్ధనౌకలు, వాయుమార్గంలో హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంక్ ఇంజన్లు, రాడార్లు తదితర 108 రకాల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధాన్ని అమల్లోకి తేనుంది. -
జాతీయ భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష
-
టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన
బీజింగ్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సోషల్‌మీడియా యాప్‌లు టిక్‌టాక్, వీ చాట్లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా శనివారం స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, (దాని) తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా అమెరికాను కోరుతోంది అని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది. అమెరికా జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ యాప్ ఆదివారం నుంచి అగ్రరాజ్యంలో తన కార్యాచరణను కోల్పోతుంది. ఇక టిక్‌టాక్‌పై ప్రసస్తుతం అప్డేట్ ఇన్స్టాల్ చేయకుండా నిషేధం విదించారు. కాకపోతే నవంబర్ 12 వరకు టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయవచ్చు. (చదవండి: అందుకే ఆ యాప్స్‌పై నిషేధం) సెప్టెంబర్ 15లోపు, టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. -
టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
టిక్‌టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి
వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని 90 రోజుల్లోగా అమ్ముకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ అమెరికాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తోందని, అది జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ టిక్‌టాక్‌ను ఇటీవల నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆస్తులను 90 రోజుల్లోగా అమ్ముకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. -
పబ్జీ, లూడో గేమ్స్‌కూ చెక్!
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో 47 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. జూన్ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్ యాప్‌ల సంఖ్య 106 కి చేరింది. ఈ 47 యాప్‌లు సైతం, యిప్పటికే నిషేధించిన యాప్‌లకు సంబంధించినవే. శుక్రవారం ఈ యాప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ మొబైల్, ఈ–కామర్స్ విభాగానికి చెందిన ఆలీఎక్స్‌ప్రెస్, మరో ప్రముఖ గేమింగ్ ‘లూడో వరల్డ్’, జిలీ, మ్యూజిక్ యాప్ రెస్సో యాప్స్‌లనూ నిషేధించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చైనాలోని షావోమీ, టెన్సెంట్, అలీబాబా, బైట్‌డాన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు చెందిన యాప్‌లు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్‌లపై కేంద్రం నిఘాపెట్టింది. చైనా నుంచి పనిచేసే అన్ని టెక్ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్‌లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. -
చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్‌పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మొత్తం 2800 మంది ఎన్పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) -
5 జీ నెట్వర్క్ : అమెరికా కీలక ముందడుగు
వాషింగ్టన్: జాతీయ భద్రత, 5 జీ నెట్వర్క్ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆ చర్యలను తామెంతమాత్రం సహించబోమని హెచ్చరించింది ఆ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. (2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు). ఇక వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అమెరికా అభివర్ణించింది. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించింది. అమెరికాలో వావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వావే నమ్మదగిన వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే సంస్థ వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. (5జీ టెక్నాలజీతో కొత్త తరం కార్లు) ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను వావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోతుందని, తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని అమెరికా పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.(ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్) కాగా, మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్వర్క్ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ వావేపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో 5 జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశ టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో గతేడాది జూన్‌లో వావే ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కశ్మీర్లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్ ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్లో, లడాఖ్‌ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు. ‘నెట్’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్‌లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. -
మాటల కోటల్లో.. రక్షణకు అరకొరే..
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది. కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా–భారత్ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి. చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్ దాడుల అనంతరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులే కేటాయించారు.అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే ఈ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ కి చెందిన డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు. గత పదేళ్లలో రక్షణ రంగ కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం 12 శాతానికి పెరిగింది. ప్రభుత్వం పెన్షన్ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. -
విభజన వ్యూహాలు ప్రమాదకరం
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్‌కు 25 ఏళ్లు పట్టింది. కానీ ఇన్నేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలన్నింటినీ దేశీయ ప్రయోజనాల పేరిట మోదీ, అమిత్ షాలు వృథా చేసేశారు. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాకిస్తాన్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఈ విభజన తత్వం మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. జాతీయ భద్రత కలిగిన దేశాన్ని మనం ఎలా నిర్వచించాలి? మన పొరుగునే ఉంటున్న పాకిస్తాన్ నుంచి దీనికి ఉదాహరణలను చూద్దాం. జాతీయ భద్రత లేక అభద్రత అనే భావం చుట్టూతానే పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రతి విషయం నిర్మాణమవుతూ వచ్చింది. అందుకే పాక్ సైన్యం దేశ అధికార చట్రంలో శాశ్వతమైన, ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి ఎవరికీ లేనంత సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. పాకిస్తాన్‌లోని 21 కోట్ల మందికి పైగా ప్రజలను ఎవరైనా ఎలా భ్రమల్లో పెట్టగలరు? అంటే ఒక ప్రమాదకరమైన దెయ్యాన్ని చూపించడం ద్వారా ఇన్ని కోట్ల మందిని భయపెడుతూ పాక్ తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. జాతీయ భద్రత కలిగిన దేశ నిర్మాణం అంటూ సమర్థించుకోవాలంటే ముందుగా మీరు ప్రజల్లో భయాన్ని పాదుకొల్పాలి. పాక్ ప్రజల పాలిట భయంకరమైన రాక్షసిగా భారత్‌ని పాక్ విజయవంతంగా చిత్రిస్తూ వచ్చింది. భారత్ బూచిని చూపించడం ద్వారానే పాక్ ప్రభుత్వాలు సైన్యంపై అంత ఖర్చు పెట్టగలిగాయి. పాక్ గురించి నేను సందర్భానుసారం రాస్తూవచ్చిన అనేక కథనాల్లో ఒక దాంట్లో ఇలా పేర్కొన్నాను. ‘వాఘా బోర్డర్ వద్ద మీ పాస్‌పోర్టులో స్టాంప్ వేస్తున్న ఇమిగ్రేషన్ అధికారి తలపై ఒక నోటీసు వేలాడుతూ ఉంటుంది. ఆ నోటీసులో ఇలా రాసి ఉంటుంది. మేం అందరినీ గౌరవిస్తాం. అందరినీ అనుమానిస్తాం’. దీనర్థం ఏమిటంటే జాతీయ భద్రతా ప్రభుత్వం అంటేనే అనుమానాస్పదమైన ప్రభుత్వం అనే. పైగా, ఈ కారణం వల్లే పాక్ అంత అస్తవ్యస్తతలో ఉంటోంది. దివాలా తీసిన, రుణాల కోసం సాగిలబడుతున్న ఆర్థిక వ్యవస్థ, విచ్ఛిన్నమైపోయిన సమాజం, పతనమవుతున్న సామాజిక సూచికలు, జాతీయ సంపదలను టోకున అమ్మిపడేయడం, పొరుగునున్న ‘అంకుల్ చైనా’కు రక్షణ ఫీజుల కింద దేశ భూభాగాన్నే అప్పగించేయడం, జిహాద్ యూనివర్సిటీ, ప్రపంచ వలస సరఫరా కేంద్రం వంటి వాటికి పేరొందడం ఇవీ పాక్ లక్షణాలు. ప్రత్యేకించి పొరుగుదేశాలు పాక్ నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ‘నాలాగా ఎవరూ ఉండవద్దు’ అనే. ప్రస్తుత భారతదేశం సరిగ్గా దీనికి సాక్ష్యాధారంగా నిలబడుతోంది. ఎందుకంటే పాక్ ఇస్తున్న పై సందేశరూపంలోని హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం. మరోవైపున, 2015 తదుపరి పాకిస్తాన్ చిక్కుకున్న స్వీయ భావావరోధంలో మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. 2014 నాటికి పాకిస్తాన్ మన బహిరంగ ప్రసంగాలు, చర్చల్లో కనిపించకుండా పోయింది. పరుగుపందెంలో భారత్, పాక్ కంటే ఎంతో ముందుకెళ్లింది. పాక్ చికాకు కలిగించే రాజ్యంగా దిగజారిపోయింది. తాజాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సందర్భంగా పాక్ గురించి గత వారం పాకిస్తాన్ పేరును పదే పదే చర్చిస్తూ వచ్చారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడి సమయంలో కాంగ్రెస్ వైఖరి సరిగ్గా పాకిస్తాన్ వైఖరితో ఎలా సరిపోలిందంటూ హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఇదే వైఖరిని ప్రతిబింబించారు. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇప్పుడు పాక్ పేరును తరచుగా ప్రస్తావిస్తూ వస్తోందన్న విషయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పుల్వామా ఘటన నేపథ్యంలో మీరు మా వైపు ఉంటారా లేక పాక్ వైపు ఉంటారా అనే అంశం చుట్టూనే 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడిచింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లో జరిపిన బహిరంగ సభల్లో మోదీ పాక్ పేరును 90 సార్లు ప్రస్తావించారు. తర్వాత హరియాణా, మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇది కొనసాగింది. చాలా కాలం తర్వాత మన బహిరంగ చర్చల్లో, మన రోజువారీ జీవి తంలో కూడా పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తున్నాము. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చ మొత్తంగా పాకిస్తాన్, దేశ విభజన ప్రాతిపదికపైనే నడిచింది. పాకిస్తాన్లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరు మనకు చర్చనీయాంశమైంది. అందుచేత పాకిస్తాన్‌లోని ముస్లిమేతర మైనారిటీల క్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రత్యేక బాధ్యత భారత్‌పై పడినట్లుగా ఉంది. పాకిస్తాన్‌ని సహజంగానే ముస్లింల నివాస స్థలంగా ఎలా పరిగణిస్తూ వస్తున్నారో భారత్ కూడా ఇప్పుడు హిందువుల నివాసస్థలంగా ఉండాలనే వాతావరణం దేశంలో బలపడుతోంది. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. రాజకీయ చర్చలను దేశ విభజన వద్దకు తీసుకుపోవడం, విభజన నాటి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇవ్వడం, అతిపెద్ద శత్రువును అప్పట్లో ఊరికే వదిలేశామని విమర్శలు చేయడం.. వంటి పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్‌ను భారత్ కొత్తగా కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అంతరం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ చివరకు చైనాతో సహా మన రెండు దేశాలను ఒకే వైఖరితో చూడడం లేదు. భారత్–పాక్ మధ్య ఉన్న హైపనేషన్ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. అంటే భారత్, పాక్‌లను కలిపి చూసే పరిస్థితి మాయమైపోయిందని అర్థం. ఒకప్పుడు పాక్ అవలంబించిన వైఖరిని ఇప్పుడు మనం తవ్వి తలకెత్తుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట అభద్రతా భావాన్ని పెంచిపోషించకుంటే మీరు జాతీయ భద్రతా రాజ్యాన్ని ఎలా నిర్మించగలరు? అందుకే ఈ అవసరం కోసం మీకు భయపెట్టే శత్రువు అవసరం. అది పాకిస్తానే మరి. ఇప్పటికి అది అంత భయపెట్టకపోవచ్చు కానీ పాన్ ఇస్లామిజం అనే పెద్ద ప్రమాదాన్ని చూసినప్పుడు అది భయంకర రాక్షసిగా మారక తప్పదు. అదే ఇప్పుడు అనుమానాన్ని కలిగిస్తుండగా, భారత్‌లోని 20 కోట్ల మంది ముస్లింలకేసి చూస్తే అతిపెద్ద ఉపద్రవంలాగే కనిపిస్తారు మరి. 1947లో రెండు దేశాలు కొత్త చరిత్ర దిశగా అడుగులేయడం ప్రారంభించిన నాటి పరిస్థితిని సమీక్షిద్దాం. మన రెండు దేశాలూ విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నాయి. ఒకటి ఉదారవాద రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా మారగా, మరొకటి మెజారిటీవాద, మతతత్వ, సైనిక రాజ్యంగా మారింది. ఒకటి అలీన రాజ్యంగా మారగా, మరొకటి ఆయా కాలాల్లో ప్రాబల్యంలోకి వచ్చిన సైనిక కూటములలో చేరింది. కేవలం 25 సంవత్సరాలలోపే, మతప్రాధాన్య రాజ్యంగా తనను తాను పేర్కొన్న పాకిస్తాన్ తన భూభాగంలో సగానికి పైగా జారవిడుచుకుంది, మరో కొత్త దేశం బంగ్లాదేశ్ రూపంలో ఉనికిలోకి వచ్చింది. చివరకు ఆ కొత్త దేశం కూడా తన మాతృదేశం నమూనాలోకే వెళ్లిపోయి, ఇస్లాంని తన మెజారిటీ వాద భావజాలంగా ఎంచుకునేసింది. దానికి తోడుగా మిలిటరీ పాలకులూ పుట్టుకొచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా అప్పులను యాచిం చడం, దారిద్య్రంలో కూరుకుపోవడం జరిగాక, అనేక మూడో ప్రపంచ దేశాల చెడు లక్షణాలకు బంగ్లాదేశ్ ఒక నమూనాగా నిలిచిపోయింది. అధిక జనాభా, దారిద్య్రం అనే సాంక్రమిక వ్యాధుల దేశంగా దానికి పేరుపడిపోయింది. ‘ఆల్ ది ట్రబుల్ ఇన్ ది వరల్డ్’ అనే తన సంకలనంలో అమెరికన్ ప్రముఖ రచయిత పీజే ఓ రూర్కే అధిక జనాభాతో వచ్చే సమస్యలకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా పేర్కొనడం భావోద్వేగాలను రెచ్చగొట్టింది. పైగా అది ఒక అసందర్భ వ్యాఖ్య కూడా. కానీ అంత దూకుడు రచనలో కూడా రూర్కే ఒక వాస్తవాన్ని పదునైన వాక్యంలో చెప్పాడు. ‘తినడానికి తగినంత ఆహారం లేని దేశం, పండకముందే పంటను వాసన చూస్తున్న దేశం ఎలా మనగలుగుతుంది?‘ కానీ, చాలా త్వరలోనే ఆ కొత్త దేశం భారత్ వంటి దేశాన్ని పోలిన లౌకిక, ఆధునిక ఆదర్శ రాజ్య నమూనావైపు నడక మార్చుకుంది. మరో రెండు దశాబ్దాలలోపే, బంగ్లాదేశ్ ప్రతి సామాజిక, ఆర్థిక సూచికలోనూ పాక్‌కంటే ఎంతో ముందుకు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 48 ఏళ్లక్రితం పాక్ పీడన నుంచి తన విముక్తిలో సహాయం చేసిన భారత్‌నే అది ఇప్పుడు వెనుకకు నెడుతోంది. ఆకలిదప్పులకు, బహిరంగ మలవిసర్జనకు నమూనాగా రూర్కే వ్యాఖ్యానించిన ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ రెండు శాపాలను భూస్థాపితం చేసిపడేసింది. బంగ్లాదేశ్ ఇప్పుడు బహిరంగ మల విసర్జన నుంచి దాదాపుగా బయటపడింది. దాని జనాభా వృద్ధి రేటు గణనీయంగా అంటే భారత వృద్ధి రేటు స్థాయికి.. ఒక్కశాతానికి పడిపోయింది. పాకిస్తాన్ నుంచి కొని తెచ్చుకున్న భావజాల వైరస్‌ను తుంగలో తొక్కి బయటపడిన దాని ఫలితమే ఇదంతా మరి. 1985లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి సారిగా సందర్శించినప్పుడు అదెంత మెరుగైన స్థితిలో ఉండేదో చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటికి దాని తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా నమోదయ్యింది. కానీ 2019లో భారత్ తలసరి ఆదాయం పాక్ కంటే 60 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదెలా జరిగింది? పాకిస్తాన్ సామాజిక–ఆర్థిక వృద్ధి సూచికలు ఎంతగా కుప్పగూలిపోయాయంటే ఐఎమ్ఎఫ్ నుంచి ఆ దేశం 13వసారి ఉద్దీపన ప్యాకేజీని అందుకోవాల్సి వచ్చింది. ఇక పాక్ జనాభా వృద్ది రేటు భారత్, బంగ్లాదేశ్‌ల కంటే రెట్టింపు పెరిగింది. కాని ఇప్పటికీ అది జాతీయ భద్రతా రాజ్యంగా సైనికాధిపత్యంతోనే ఉంటోంది. ఎంతలా అంటే పాక్ ప్రధాని తన ఆర్మీ చీఫ్‌కు సలామ్ చేసేంతగా. భారత్ కంటే ఏ రంగంలో అయినా పాక్ ముందుందంటే బహుశా అణ్వాయుధాల సంఖ్యలోనే కావచ్చు. కానీ భారతీయ వ్యూహాత్మక అధ్యయనాల నిపుణుడు దివంగత కె. సుబ్రహ్మణ్యం తరచుగా ఒక మాట చెప్పేవారు, నీ దేశ రక్షణకు తక్కువ ఆయుధాలు అవసరమైనప్పుడు ఎందుకు ఎక్కువ ఆయుధాలకోసం వెంపర్లాడతావు? కాగా, దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాక్‌ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. నిజానికి ఇది పేలవమైన ఎంపిక. ఇప్పుడు పాక్‌తో మనల్ని మనం పోల్చుకోవాలంటే భారత్ తన కాళ్లు నెప్పి పెట్టేలా ముందుకు వంగాల్సి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఇది మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కొత్త బంగారులోకం చేద్దాం!
నాసిక్: భూతల స్వర్గం కశ్మీర్‌ను మరోసారి కొత్త బంగారు లోకంగా మార్చేద్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రతి కశ్మీరీని హత్తుకుని, కశ్మీర్‌ను మళ్లీ స్వర్గసీమగా మారుద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాసిక్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కశ్మీర్లో హింసను ప్రజ్వరింపజేసేందుకు సరిహద్దులకు ఆవలి నుంచి నిర్విరామ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్ ప్రజలను దూరం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, తల్లులు, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ వివరించారు. దేశంలోని యాభై కోట్ల పాడి పశువులకు టీకాలు వేయించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇదో రాజకీయ నిర్ణయమని విమర్శిస్తున్నారని, పశువులు ఓట్లు వేయవన్న సంగతి వారు గుర్తుచేసుకోవాలని మోదీ ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహూకరించిన తలపాగాతో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సైనిక అవసరాలను వారు పట్టించుకోలేదు జాతీయ భద్రతపై గత యూపీఏ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని మోదీ విమర్శించారు. సైనిక బలగాల కోసం 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ డిమాండ్ నెరవేరింది. అప్పటివరకు సరిహద్దుల్లో మన జవాన్లు అవి లేకుండానే ప్రాణాలొడ్డి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్‌లో తయారయ్యే బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని మోదీ వివరించారు. పవార్‌పై విమర్శలు... పాకిస్తాన్ అంటే తనకిష్టమన్న ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యలపై మోదీ ధ్వజమెత్తారు. ‘శరద్ పవార్‌కు ఏమైంది? అంతటి సీనియర్ నేత పాకిస్తాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటే బాధగా ఉంది. ఆయనకు పొరుగు దేశమంటే ఇష్టం కావచ్చుగానీ.. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్సీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు సహకరించలేదని, మద్దతుగా నిలవలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ పేరు ప్రస్తావించకుండానే... కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్న దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని మోదీ చెప్పారు. రామమందిర నిర్మాణంపై.. మిత్రపక్షం శివసేనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. సేన పేరును ప్రస్తావించకుండా.. రామ మందిర నిర్మాణం విషయంలో కొందరు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారని, వారంతా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముంచాలని చేతులు జోడించి కోరుతున్నానన్నారు. మందిర నిర్మాణం కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని, అందుకు కేంద్రం ఓ కొత్త చట్టం రూపొందించాలని తాము చాన్నాళ్లుగా కోరుతున్నామని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. -
100 రోజుల్లో పెనుమార్పులు
రోహ్తక్(హరియాణా): ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టాక 100 రోజుల పాలనలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి, విశ్వాసం, భారీ మార్పులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తమ పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగం, జాతీయ భద్రత వంటి అంశాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు 130 కోట్ల మంది భారతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోహ్తక్లో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించడం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం వంటి వాటి కోసం కీలక చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ సమావేశాల్లో అత్యధిక బిల్లులు పాసయ్యాయని వెల్లడించారు. దీనికి సహకరించిన ప్రతిపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాబోయే రోజుల్లో దేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఉద్ఘాటించారు. ఏ రంగంలోనైనా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా కసరత్తు చేస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ అంశం, తాగునీటి సంక్షోభం సహా పలు సవాళ్లు తమ ముందున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని వ్యాఖ్యానించారు. ఇండియా తనకు ఎదురైన సవాళ్లను సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. చంద్రయాన్–2 దేశాన్ని ఏకం చేసింది.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2 ప్రయోగంలో చివరి 100 సెకన్లు గెలుపు, ఓటముల నిర్వచనాలను మార్చేశాయని తెలిపారు. దేశ ప్రజలు గెలుపు, ఓటముల పరిధిని దాటి ఆలోచిస్తున్నారని.. అలా చేసినప్పుడే దేశం తన లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల స్ఫూర్తిలాగా ప్రస్తుతం ఇస్రో స్ఫూర్తి కొనసాగుతోందని అన్నారు. దేశమంతా మార్పుపై విశ్వాసంతో ముందుకు సాగుతోందని అన్నారు. -
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
ఆన్లైన్లో వీలునామా
సాక్షి, పెద్దపల్లి: వీలునామా ఒక వ్యక్తి తదనంతర ఆస్తిపాస్తులను వేరొకరికి ఇవ్వడానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించిన తర్వాత ఆయన పేరిట ఉన్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. కోర్టు కేసులూ మామూలే. కాస్తముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీలునామా రాయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాస్తే సరిపోదు. దీనిని రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయాలి. అప్పుడే కోర్టుతో సహ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో తేలిగ్గా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడం వంటి బాధ్యతలు చేపడుతున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహ వీలునామాకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుండగా ఆన్లైన్లో రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు అవడం గమనార్హం. నిజప్రతిలోనూ సవరణలు మన చేతికొచ్చిన వీలునామా నిజప్రతిలో కూడా ఏమైనా సవరణలు అవసరమైతే సరి చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాలి. దీంతోపాటు అవసరమైన వారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను ఈ సంస్థలు తీసుకుంటాయి. ఇ–విల్ సౌకర్యం.. ఎస్బీఐకు చెందిన ఎస్బీఐ క్యాబ్ ట్రస్టీ కంపెనీ ఆన్లైన్ వీలునామా అందుబాటులోకి తేగా.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్టక్చర్, వార్మెండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. హెచ్ఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ సైతం లీగల్ జినీ అనే సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తుంది. 5దశల్లో పూర్తి.. – సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. – అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. – ఆ తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. – ఆపైన తదనంతరం మన ఆస్తులు, నగదును ఎవరికి ఎంతమేర బదలాయించాలో తెలుపుతూ సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. – ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరుతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామా రాస్తారు. దాని చిత్తు ప్రతిని మనకు ఈ–మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైనచో వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత నిజప్రతి వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ–మెయిల్‌కు లేదా మనం ఇచ్చిన చిరునామాకు 90రోజుల్లో పంపిస్తారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
మోదీ మంత్ర
భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. పార్టీకి మరో ఐదేళ్ల అధికారాన్ని కానుకగా ఇచ్చారు. పైకి కన్పించని, నిశ్శబ్ద తరంగంలా వీచిన మోదీ గాలి హిందీ రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలనూ కుదిపేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బలనుంచి పుంజుకుని.. 2016 నవంబర్‌లో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రూ.1,000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనం పరుగులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. వేరే నాయకులెవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కూడా దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ నిర్ణయానికి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మోదీ వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొన్నారు. తర్వాత అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు ఆదాయ కల్పన, భారీ ఆరోగ్య బీమా పథకం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు, హామీలు తిరిగి మోదీ పుంజుకునేలా చేశాయి. అవినీతిని అరికట్టే క్రమంలో దేశానికి తాను కాపలాదారు (చౌకీదార్)నని కూడా మోదీ చెప్పుకున్నారు. రాహుల్ వైఫల్యం ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని, రఫేల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పదే పదే ఇవే అంశాలను వల్లెవేశారు. రఫేల్ కేసులో సుప్రీం క్లీన్చిట్ ఇచ్చినా తీర్పును ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి తప్పుగా ఆపాదించి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. ఈ నినాదాలు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్ప మిగతావారిని ఆకర్షించలేక పోయాయి. మరోవైపు రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. ఇదే సమయంలో యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తామూ ప్రధాని రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ప్రకటించలేని కాంగ్రెస్ నిస్సహాయత బీజేపీకి కలిసొచ్చింది. మా వైపు మోదీ.. మీ వైపు ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. అలాగే పొత్తుల విషయంలో కూడా మోదీ పరిణతితో వ్యవహరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూస్తే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే బీజేపీతో ముఖాముఖి పోరు జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఆమెను ఒక అతిథి నటి మాదిరిగానే పరిగణించింది తప్ప పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధిస్తే చాలన్నట్టుగా వ్యవహరించి దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి వైఫల్యం కూడా బీజేపీకి లబ్ధి చేకూరేలా చేసింది. రెండుసార్లు ఘన విజయం.. 1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ 2 సార్వత్రిక ఎన్నిక ల్లో ఘన విజయం సాధించడం ద్వా రా భారత రాజకీయాల్లో కాంగ్రెస్ ను తప్పించి సెంటర్ స్టేజిని ఆక్రమించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పడు 13 రోజులపాటు మొద టిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1998లో 13 నెలల పాలన తర్వాత లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ వాజ్‌పేయి నాయకత్వం.. పార్టీపై ఉన్న అస్పృశ్యత ముద్ర పోయి కొత్త కూటముల ఏర్పాటుకు దోహదపడింది. అది ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పా టుకు దారితీసింది. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. అమిత్ షా బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ–షా 18 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి దేశంలోనే బలమైన రాజకీయపార్టీగా బీజేపీ అవతరించేలా కృషి చేసింది. దేశభద్రత ప్రధాన అస్త్రంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతూ ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతుంటే ఈ అంశాలతో పాటు మోదీ తన ప్రధానాస్త్రంగా చేసుకున్న దేశ భద్రత, జాతీయవాదం దేశవ్యాప్తంగా ఓటర్లను ఏవిధంగా ఆయనవైపు తిప్పాయో స్పష్టమైంది. కొన్ని కీలక రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. భారత్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని పలు సూచీలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ దాడిలో 40 మంది సైనికులు ప్రా ణాలు కోల్పోవడం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రశిక్షణ శిబిరంపై ఐఏఎఫ్ బాంబుల వర్షం (సర్జికల్ స్ట్రైక్స్) కురిపించిన తర్వాత జాతీయవాదం, దేశ భద్రతను, దేశభక్తిని మోదీ ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ ఉగ్రవాదుల శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో సమానమని చెప్పారు. రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్‌కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
అది మోదీ దిగజారుడుతనం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో భాగంగా భారత సైన్యం చేసే ప్రతి చర్యకు దేశ ప్రజలంతా మద్దతునిస్తారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కానీ ఆ సైనిక చర్యలను ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రధాని నరేంద్రమోదీ వాడుకోవడం ఆయ న దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైనిక చర్యలను ఆక్షేపిస్తున్నాయని మోదీ పేర్కొనడాన్ని ఖండించారు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మోదీ విపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. శాటిలైట్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఇస్రో లేదా డీఆర్డీఓనో విడుదల చేయాలని సురవరం చెప్పారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ఐదేళ్లలో మోదీ అన్ని వ్యవస్థల్ని ధ్వం సం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగింట్లో సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందని, ఏయే స్థానాలకు మద్దతిస్తామో త్వరలో ప్రకటిస్తామన్నారు. -
జాతి భద్రతను ఆదాయంగా మార్చారు
చెన్నై: దేశభద్రతను, రక్షణ రంగాన్ని కాంగ్రెస్ నేతలు పంచింగ్ బ్యాగ్‌గానూ, ఆదాయవనరుగానూ మార్చుకున్నారని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమ ప్రయోజనాల కోసం భద్రతాబలగాల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు ఆర్మీ చీఫ్‌లను పేర్లతో పిలుస్తూ అవమానిస్తారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను హేళన చేస్తారు. మరోవైపు 1940–50 దశకాల్లో జీపుల కుంభకోణం నుంచి 1980ల్లో బోఫోర్స్, తాజాగా అగస్టా ఇంకా చాలా కుంభకోణాలతో దేశ రక్షణరంగాన్ని దోచేశారు. కాంగ్రెస్ నేతలకు కావాల్సిందల్లా ప్రతీ ఒప్పందం నుంచి ఆదాయం పొందడమే’ అని దుయ్యబట్టారు. ‘సాయుధ బలగాలు చాలాకాలంగా కోరుతున్న ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని పూర్తిచేసిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే. ఈ డిమాండ్‌ను గత 40 సంవత్సరాలుగా మురగబెట్టారు. సాయుధబలగాలు, మాజీ సైనికులు గట్టిగా కోరడంతో యూపీఏ ప్రభుత్వం ఓఆర్ఓపీ కోసం రూ.500 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇది సైనికుల సమస్యలపై క్రూరంగా నవ్వడంలాంటిదే’ అని అన్నారు. ‘తమిళనాడులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంత గొప్పగా సేవ చేయగలమో ఒక్కసారి ఆలోచించండి’ అని మోదీ చెప్పారు. మరోవైపు, మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. -
దేశ రక్షణకు సర్పంచ్ గౌరవ వేతనం
భువనేశ్వర్ : ప్రాణాల్ని పణంగా పెట్టి కంటి మీద కునుకు లేకుండా సరిహద్దు ప్రాంతాల్లో దేశ ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రక్షణ దళంపట్ల ఓ పంచాయతీ సర్పంచ్ దృష్టి సారించారు. ఆమెకు లభిస్తున్న గౌరవ వేతనాన్ని దేశ రక్షణ వ్యవహారాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. లాంచనంగా ప్రతి నెల రూ.1 గౌరవ వేతనంగా స్వీకరించి మిగిలిన సొమ్మును దేశ రక్షణకు అంకితం చేసేందుకు నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించారు. ఈ మహత్తర నిర్ణయం తీసుకున్న సర్పంచ్ మహిళ కావడం మరో విశేషం. ఆమె పదవీకాలంలో కొనసాగినంత కాలం తనకు లభించే గౌరవ వేతనంలో రూ.1 మినహా మిగిలిన మొత్తం దేశ రక్షణ కోసం అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 72వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని భద్రక్ జిల్లా తిహిడి సమితి మహారామ్పూర్ పంచాయతీ మహిళా సర్పంచ్ అలైలాప్రభ రౌల్ దేశ రక్షణ కోసం తన గౌరవ వేతనం అంకితం చేసినట్లు ప్రకటించారు. స్థానిక సమితి కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. తన విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో సమితి అభివృద్ధి అధికారికి అందజేశారు. ఈ విధానం తాను పదవిలో కొనసాగినంత కాలం నిరవధికంగా కొనసాగుతుందని ఆమె ప్రజల సమక్షంలో ప్రకటించారు. -
మత విభేదాలు సృష్టించేందుకే!
న్యూఢిల్లీ: స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఎన్నార్సీ (జాతీయ పౌర రిజిస్టర్)పై వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. మత కల్లోలాలు సృష్టించేందుకే సోషల్ మీడియాలో విద్వేషపూరిత సందేశాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాజ్యసభలో ఎన్నార్సీ తుది ముసాయిదాపై ప్రభుత్వ ప్రకటనలో భాగంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. తుది జాబితా రూపకల్పనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంతో వివాదమవడం తెల్సిందే. పారదర్శకంగా ఎన్నార్సీ ప్రక్రియ ‘ఎన్నార్సీ ముసాయిదా రూపకల్పన ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమం. వివక్షకు చోటు లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి వివక్ష ఉండదని భరోసా ఇస్తున్నా. తన పౌరులెవరో తెలుసుకోవాలనుకోవడం ప్రతిదేశానికున్న బాధ్యత. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం’ అని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను పలు పార్టీల నేతలు స్వాగతించగా మరికొందరు ఎన్నార్సీపై సూచల విషయంలో స్పష్టత కావాలనికోరారు. కాగా, దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. జాబితాలో లేని వారికి చొరబాటుదారులని పిలవడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రభుత్వాన్ని కోరారు. ఈశాన్యంలో ‘అస్సాం’ ప్రకంపనలు అరుణాచల్‌ప్రదేశ్: స్థానికతను ధ్రువీకరించే పత్రాల్లేకుండా నివాసం ఉంటున్న స్థానికేతరులు 15రోజుల్లోగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆల్ అరుణాచల్‌ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ (ఆప్సు) హెచ్చరించింది. రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఆగస్టు 17 నుంచి ‘ఆపరేషన్ క్లీన్ డ్రైవ్’ను చేపట్టనున్నట్లు ప్రకటించింది. మణిపూర్: రాష్ట్రంలోకి ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అధికార బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసింది. నాగాలాండ్: సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని నాగాలాండ్ హోంశాఖ ఆదేశించింది. నాగాలాండ్‌లోనూ ఎన్నార్సీ చేపట్టాలని అధికార ఎన్డీపీపీ.. కేంద్రాన్ని కోరింది. మేఘాలయ: స్థానిక గిరిజనుల హక్కుల రక్షణ కోసం ఎన్నార్సీ తరహా చర్యలు చేపట్టాలని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. అస్సాం ఎన్నార్సీ విడుదల అనంతరం అక్రమ వలసదారుల గుర్తింపు, ప్రవేశాన్ని అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో కేఎస్‌యూ 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. త్రిపుర: త్రిపురలోనూ ఎన్నార్సీ చేపట్టాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) డిమాండ్ చేస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను అధికార బీజేపీ తోసిపుచ్చింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఎన్నార్సీ నిర్వహించాలని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సంఘం (ఎన్ఈఎస్ఓ) డిమాండ్ చేస్తోంది. -
‘రాఫెల్’.. భారీ కుంభకోణం: ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రంలోని పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, దేశ భద్రత విషయంలో రాజీ పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యుద్ధవిమాన పైలట్‌గా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాల కొనుగోలు ధరను రహస్యంగా ఉంచడం దేశ చరిత్రలో లేదని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా, కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీఎంపీ వీహెచ్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ధర రహస్యమ ని ప్రధాని, రక్షణమంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యుద్ధవిమానాలను ఉపయోగించే తీరు, శక్తిసామర్థ్యాలను రహస్యంగా ఉంచుతారని చెప్పారు. తాను కూడా మిగ్–21, మిగ్–23 విమానాలను నడిపానని, గతంలో ప్రభుత్వాలు జాగ్వార్, మిరాజ్ లాంటి యుద్ధవిమానాలను కొనుగోలు చేసినప్పుడు కూడా పార్లమెంటులో వాటి ధరలను చెప్పాయని గుర్తు చేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను 2,330 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు 2010 మార్చి 15న లోక్‌సభలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని చెప్పారన్నారు. ఫ్రాన్స్ కంపెనీ నివేదికలో ధర వెల్లడి రాఫెల్ యుద్ధవిమానాలను సమకూర్చిన ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌తో యూపీఏ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.526 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని, అయితే, బీజేపీ ప్రభుత్వం దాన్ని మూడింతలు చేసి ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లు పెట్టి 36 విమానాలు కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ ధరలను కేంద్రం వెల్లడించకపోయినా, డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 2016లో ఇచ్చిన తన వార్షిక నివేదికలో చెప్పిందన్నారు. ఏవియేషన్ కంపెనీ తన నివేదికలో ధరలను బహిర్గతం చేసినప్పుడు కేంద్రం ఎందుకు దాచిపెడుతుందో అర్థం కావడం లేదన్నారు. అసలు ఈ ధరను నిర్ణయించేందుకు గాను సంప్రదింపుల కమిటీని వేయలేదని, రాఫెల్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు లోక్‌సభలో ప్రధాని చెప్పే నాటికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపించారు. యుద్ధవిమానాల కొనుగోలు ధరలను అడ్డగోలుగా పెంచడంతోపాటు వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే కాంట్రాక్టును అనిల్అంబానీకి చెందిన ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారన్నా రు. రక్షణ సామగ్రిని తయారు చేసిన చరిత్ర లేని ప్రైవేటు కంపెనీకి 36 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కుంతియా మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణానికి, అమిత్‌షా కుమారుడి ఆస్తులు పెరగడానికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నివేదికలివ్వండి ఏఐసీసీ కార్యదర్శుల ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శులు ఆదేశించారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రభుత్వ పథకాల అమలు, రాజకీయ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి ఎన్.బోసురాజులు పాల్గొని మాట్లాడారు. -
ఉ.కొరియాతో ఎమర్జెన్సీ పొడిగింపు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక, విదేశీ విధానాలకు ఉత్తర కొరియా నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అందుకే ఆ దేశం పట్ల జాతీయ అత్యవసర పరిస్థితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చారిత్రక సమావేశం ముగిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ పూర్తయ్యే వరకూ ఉ.కొరియాపై ఒత్తిడి, ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాలో ఉ.కొరియా పట్ల అత్యవసర పరిస్థితిని తొలిసారి 2008లో విధించారు. -
బీఎస్ఎఫ్లో ఇంటిదొంగల కలకలం
న్యూఢిల్లీ : దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో ఇంటిదొంగల వ్యవహారం కలకలం రేపుతున్నది. శత్రుదేశాల ఏజెంట్లు, అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగుచూడటంతో అధికారులు అంతర్గత నిఘాను పటిష్టం చేశారు. విలాసవంమైన జీవనం గడుపుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈమేరకు 2017 సంవత్సరానికి గానూ అనుమానితుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవలే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదులకు సహకరిస్తోన్న బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారిని సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల సిబ్బంది కల్గిన బీఎస్ఎఫ్ ప్రతిష్టను కాపాడటం కోసమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతియడానికి కాదని స్పష్టం చేశారు. -
ఏప్రిల్‌లో ‘కొరియా’ శిఖరాగ్ర భేటీ
సియోల్: దేశ రక్షణకు పూచీ ఇస్తే అణ్వాయుధాలను త్యజించేందుకు ఉత్తరకొరియా ముందుకువచ్చింది. దీంతోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు కూడా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సంసిద్ధత తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ జాతీయ భద్రతా సలహాదారు చుంగ్–ఇయు–యాంగ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల ఉ.కొరియా వెళ్లింది. రాజధాని ప్యాంగ్యాంగ్లో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ బృందం సమావేశమైంది. మంగళవారం తిరిగి స్వదేశానికి చేరుకున్న ఈ బృందం చర్చల ఫలితాలను వెల్లడించింది. ఉ.కొరియాతో చర్చల్లో గణనీయ పురోగతి కనిపించిందని పేర్కొంది. సరిహద్దు గ్రామం పన్‌మున్‌జోంలో ఏప్రిల్‌లో రెండు దేశాల అధ్యక్షుల సమావేశానికి అంగీకారం కుదిరిందని తెలిపింది. తమపై సైనిక పరమైన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఇచ్చిన పక్షంలో అణ్వాయుధాలను, క్షిపణులను కలిగి ఉండటంలో అర్థం లేదని, వాటిని త్యజిస్తామని ఉత్తరకొరియా పాలకుడు చెప్పినట్లు యాంగ్ వెల్లడించారు. తాము ఎలాంటి అణు, మిస్సైల్ పరీక్షలు జరుపబోమని ఉత్తరకొరియా హామీ ఇచ్చిందన్నారు. -
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
-
రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
మానవహక్కులు.. జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలి రోహింగ్యాల దుస్థితిపై కేంద్రం సున్నితంగా వ్యవహరించాలి మేం నిర్ణయించే వరకు వారిని పంపించకూడదు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించింది. దేశంలోని శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో మానవ హక్కులు, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాల్సిన అవసరముందని పేర్కొంది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో మానవ హక్కుల, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలని, ఈ విషయంలో అనేక అంశాలను పరిగణించాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చునని తెలిపింది. దేశంలోని రోహింగ్యా శరణార్థుల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ వలసదారులని, వారు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారని, చట్టప్రకారం వారు దేశంలో నివసించడం కుదరదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మానవ తప్పిదాల వల్లే విపత్తులు
-
‘సర్ క్రీక్’ అత్యంత కీలకం: నిర్మలా
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశభద్రత విషయంలో గుజరాత్‌లోని పాక్ సరిహద్దున ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతం అత్యంత కీలకమైనదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గుజరాత్ భద్రతకు సైతం కీలకమైన ఈ ప్రాంతాన్ని త్వరలోనే సందర్శిస్తానన్నారు. అక్కడి సరిహద్దు భద్రతను సమీక్షించి, అక్కడి సైనికుల్లో మరింత స్పూర్తినింపేలా వారితో మాట్లాడతానని చెప్పారు. అరేబియా సముద్రతీరంలోని భారత్–పాక్ సరిహద్దు భూభాగాన్ని సముద్రజలాలు 96 కి.మీ. పొడవునా లోపలికి చొచ్చుకొచ్చి వేరుచేశాయి. ఇలా వేరుబడిన పొడవైన భూభాగాన్ని ‘సర్‌క్రీక్’ సరిహద్దుగా వ్యవహరిస్తున్నారు. రోజూ త్రివిధ దళాధిపతులతో భేటీ: రక్షణలో వ్యూహాత్మక అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఇకపై ప్రతీరోజు త్రివిధ దళాధిపతులతో నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. సైనిక వనరుల సముపార్జనకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేందుకు ప్రతీ 15రోజులకు డిఫెన్స్ అక్విజీషన్ కౌన్సిల్‌ను సమావేశపరచాలని నిర్ణయించారు. -
జాతీయ భద్రతపై రేపు సదస్సు
న్యూశాయంపేట : ‘జాతీయ భద్రత– పౌరు ల బాధ్యత’ అంశంపై హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బుధవారం సదస్సు ఏర్పాటు చేసినట్లు స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ జి.రవీందర్ తెలిపారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 6గంటలకు ప్రారం భమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంది శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, రాకేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆమె ఎలా తప్పించుకోగలిగారో?
వాషింగ్టన్: డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్ వ్యవహారంలో ఎఫ్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన విచారణ పత్రాలు ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఆయుధంగా మారాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్‌ను ఉపయోగించారన్న అభియోగంలో తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని దర్యాప్తు సంస్థ తన 58 పేజీల డాక్యుమెంటులో పేర్కొంది. దీనిపై స్పందించిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్... హిల్లరీ జాతి భద్రతను ప్రమాదంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఎఫ్‌బీఐకి ఇచ్చిన వివరణలో తనకు సదరు ఈమెయిల్స్‌కు సంబంధించిన విషయాలేమీ గుర్తుకు రావడం లేదని క్లింటన్ చెప్పారు. 2013లో తాను మంత్రిగా ఉన్నప్పుడు రికార్డుల భద్రతపై ప్రభుత్వం నుంచి తనకెలాంటి సూచనలూ అందలేదని పేర్కొన్నారు. క్లింటన్ తన రెండు నంబర్ల నుంచి మెయిల్స్ పంపించడానికి 13 మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్టు గుర్తించామని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ‘దర్యాప్తు సంస్థకు హిల్లరీ ఇచ్చిన సమాధానం దిగ్భ్రాంతికి గురిచేసింది. విచారణ నుంచి ఆమె ఎలా తప్పించుకోగలిగారో నాకు అంతుపట్టడం లేదు. ఎఫ్‌బీఐకి హిల్లరీ ఇచ్చిన వివరణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. క్లింటన్ రహస్య ఈమెయిల్ సర్వర్ వ్యవహారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. చట్టాల్లో పారదర్శకతను ప్రశ్నిస్తోంది. దౌత్యపరంగానూ ఇది ప్రభావం చూపుతుంది’ అని ట్రంప్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. -
‘నిఘా’ ను పంచుకోవాలి
-
‘నిఘా’ ను పంచుకోవాలి
- ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి - 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ప్రధాని మోదీ - కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి - పరస్పర సాయంతో ముందుకు సాగుదాం - రాష్ట్రాలకు 21 శాతం పెరిగిన కేంద్ర సాయం - యువతలో నైపుణ్యాల్ని పెంపొందించాలి సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయాల్ని పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై రాష్ట్రాలు దృష్టిపెట్టాలని, తద్వారా ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించకూడదన్నారు. అంతర్గత భద్రత సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరస్పర సహకారంతో ముందుకు సాగడమే మార్గమని మోదీ పేర్కొన్నారు. పోలీసు బలగాల ఉనికి నగరాల్లో అన్నివేళలా కొట్టొచ్చినట్లు కనిపించాలని ప్రధాని నొక్కిచెప్పారు. అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి విస్తృత సీసీటీవీ కవరేజీ ముఖ్యమన్నారు. ప్రైవేటు (వ్యక్తులు, సంస్థలు, కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకునే) సీసీటీవీలు ఈ దిశగా ఇతోధికంగా తోడ్పడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతానికి అంతరాష్ట్ర మండలి ప్రధాన వేదికని, ఒక్క తాటిపై నడిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెరిగింది: మోదీ ‘ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవతో 2006 తర్వాత మండలి సమావేశమవడం సంతోషకరం. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల్ని ఆమోదించడంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32 నుంచి 42 శాతానికి పెరిగింది. 2014-15తో పోల్చితే 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం 21 శాతం పెరిగింది. 14వ ఆర్థిక సంఘం హయాంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు రూ. 2.87 లక్షల కోట్లు అందుకోనున్నాయి. సహజ వనరులు, బొగ్గు క్షేత్రాల వేలంతో వచ్చే రెవెన్యూలో రాష్ట్రాల వాటాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఈ వాటాలతో రానున్న కాలంలో రాష్ట్రాలకు మరో. రూ. 3.35 లక్షల కోట్లు అందుతాయి. ఇతర గనుల వేలంతో మరో రూ. 18 వేల కోట్లు సమకూరుతాయి. ‘కంపా’ యాక్ట్‌కు సవరణలతో బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 40 వేల కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేస్తాం. వ్యవస్థలో పారదర్శకతతో వచ్చే ఫలితాలను రాష్ట్రాలతో పంచుకోవడానికి కేంద్రం ఆసక్తిగా ఉంది’ అని మోదీ తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై ఏకాభిప్రాయానికి ఇది సరైన వేదికని ప్రధాని పేర్కొన్నారు. సాధికారతకు చిహ్నంగా ఆధార్ నగదు ప్రత్యక్ష బదిలీకి ఆధార్ చట్టం ఉపయోగపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో 79 శాతం ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, దీంతో ఈ ఏడాది చివరి నాటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేరువవుతుందని, సాధికారతకు ఆధార్ చిహ్నంగా మారిందని ప్రధాని అన్నారు. సామాజిక సంస్కరణలు అభివృద్ధి మార్గాలని, భారతదేశంలో సంస్కరణలకు మిత్రుల కంటే విమర్శకులు ఎక్కువ అన్న అంబేడ్కర్ మాట లను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గవర్నర్ పదవి రద్దు చేయాలి: నితీశ్ కుమార్ హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని, అభివృద్ధి పథకాల్ని రూపొందించి వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాల సమాఖ్యను(ఫెడరల్)్ర పోత్సహించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగిస్తూ... గవర్నర్ పదవిని రద్దు చేయాలని సూచిం చారు. ప్రస్తుతమున్న ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ పదవి కొనసాగింపు అవసరం లేదన్నారు. పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ మాట్లాడుతూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందన్నారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను తొలుత ఉమ్మడి జాబితాలోకి, ఆపై కేంద్ర జాబితాకు మార్చడం ద్వారా రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తుండటంతో రాష్ట్రాలు యాచకుల స్థాయికి పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీ, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ సీఎంలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎప్పుడూ మోదీపై విరుచుకుపడే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం బిహార్ సీఎం నితిష్‌తో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కన్పించారు. ప్రధాన బలం యువతే ‘దేశానికి ప్రధాన బలం యువత. ప్రస్తుతం 30 కోట్ల మంది పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లకు సరిపడా నైపుణ్యం కలిగిన మానవవనరులను ప్రపంచానికి అందించే శక్తి మనకుంది. వీరందరి నైపుణ్యాల్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్టుగా విద్య అనేది పెట్టుబడి... విద్యపై పెట్టుబడి భవిష్యత్తులో తప్పకుండా ఫలాలు అందిస్తుంది. విద్య ఆవశ్యకతను వివరిస్తే... విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపడతాయి’ అని మోదీ అభిప్రాయపడ్డారు. స్వామి వివేకానంద చెప్పినట్టు విద్య వ్యక్తిత్వాన్ని పెంపొందించాలని, దేశ యువతలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సాధించడానికి అవసరమైన అవకాశాలను కల్పించాలని మోదీ అన్నారు. -
కర్ర పట్టండి కానీ.. కరుకుగా మాట్లాడకండి!!
అవలోకనం ఉగ్రవాదులపై యుద్ధంలో ఉగ్రవాదులను కూడా ఉపయోగించుకుంటామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఇటీవల సియాచిన్‌లో చేసిన ప్రకటన రాజ్యాంగబద్ధమైన అన్ని హద్దులనూ అతిక్రమించింది. వెంటనే, తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ప్రతిచోటా హింసాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపించింది. దేశ రక్షణ విషయంలో మంత్రి మృదువుగా మాట్లాడుతూనే బడిత కర్ర పట్టుకుంటే మంచిది. రక్షణమంత్రి బడిత కర్రను చేతిలో పట్టుకోవాలి కానీ మృదువుగా మాట్లాడాల్సి ఉంటుంది. కులీన ఐఐటీలో చదివిన మన మనోహర్ పారికర్‌లో దీనికి వ్యతిరేక కోణం కనబడుతోంది. చిన్న కర్ర, చాలా పెద్ద నోరు పెట్టుకున్న వ్యక్తిని భారత్ తనలో చూస్తోంది. రాజ్యవిధానంలో భాగంగా ఉగ్రవాదులను ఉపయోగించుకోవటం గురించి ఆయన మే నెల 21న మాట్లాడారు. ఆయన అన్న మాట లివి. ‘నేనిక్కడ స్పష్టంగా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి’ అని అంటూనే వాటిపై చర్చకు దిగారు. ‘ఏ దేశమైనా (పాకిస్తానే ఎందుకు) నా దేశానికి వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నట్లయితే, మనం తప్పకుండా కొన్ని చురు కైన చర్యలు చేపడతాం.’ హిందీ సామెతను ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నారు. ‘కాంటేసే కాంటా నికాల్నా. మనం ఉగ్రవాదులను ఉగ్రవాదులతోటే తటస్థం చేయాలి. మనం అలా ఎందుకు చేయకూడదు? మన సైనికుడే ఆ పని ఎందుకు చేయాలి?’ భారత్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉపయోగించే వైఖరిని అమలు చేసి విఫలమైంది. జమాత్ ఇ ఇస్లామి, ఇతర ఇస్లామిస్ట్ గ్రూపుల వ్యతిరేకులను ఉప యోగించుకోవాలని 1990లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణ యించుకుంది కానీ కశ్మీర్లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఈ ప్రయోగం త్వరలోనే ముగిసిపోయింది కూడా. భారత్ ప్రయోజనాలకోసం పనిచేసిన కుకా ప్యారీ నేతను అప్పటికి ఇంకా ప్రాబల్యంలో ఉన్న మిలిటెంట్లు కాల్చి చంపారు. మధ్యభారత్‌లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది. ఇక్కడ ప్రభుత్వం మావోయిస్టులపై సాయుధ మిలిటెంట్లను మోహరించింది. ఈ మిలిటెంట్లు అప్పటి నుంచి నిస్సహా యులైన ప్రజలపై పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునయినా పారికర్ వంటి మంత్రి తాను చెప్పబోయే మాటల గురించి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవలసి ఉంది. పారికర్ ప్రకటనతో ప్రతిపక్షం నివ్వెరపోయింది. ‘రక్షణమంత్రి ఒక ఘోరమైన ప్రకటన చేశారు. తన మాట లు ఎంత దూరం వెళ్లాయో ఆయన గుర్తిస్తారనీ, వాటిని వెనక్కు తీసుకోవడానికి తగిన మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’ అని పి. చిదంబరం ప్రకటించారు. పైగా, ‘పదేళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులను లేదా నేరస్థ శక్తులను భారత్ ఎన్నడూ మోహరించలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభు త్వం కూడా అలా చేయలేదని, ఇకపై చేయబోదని నా నమ్మ కం’ అనేశారు చిదంబరం. ‘రక్షణమంత్రి ప్రకటన అన్ని హద్దులనూ అతిక్రమించిందనీ దాన్ని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాల’ని డిమాండ్ చేశారు. అయితే, వాస్తవం చెప్పాలంటే, పారికర్ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. మే 26న చేసిన మరో ప్రకట నలో, ‘భారత్‌ను కాపాడేందుకు ఎంతవరకైనా తాను తెగిస్తా ననీ, దేశంపై దాడి చేసేవాళ్ల పని పడతాననీ’ ఆయన దుస్సాహసిక ప్రకటన చేశారు. భారత రక్షణమంత్రి ప్రకటనను పాకిస్తాన్ అంది పుచ్చుకుంది. బలూచిస్తాన్ ఘర్షణల్లో భారత్ జోక్యం చేసు కుంటోందని, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రతిచోటా హిం సాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ వెంటనే ఆరోపణకు దిగింది. పారికర్ చేసిన ఈ తరహా ప్రకటన వల్ల కాస్సేపు చప్పట్లు వినిపిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇది మన దేశానికి నష్టం కలిగిస్తుందని బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టమయ్యే ఉంటుంది. పాకిస్తానీ బోటును కూల్చి వేశామంటూ గతంలో భారతీయ నావికాధికారి ప్రకటించి ఇదే తప్పు చేశారు. ఇది సమస్యాత్మకంగా మారటం కూడా మనం కొన్ని నెలల క్రితం చూశాం. నా అభిప్రాయం ప్రకారం, మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన రెండు ప్రతిజ్ఞలను పారికర్ అతిక్రమించారు. ‘రాజ్యాంగబద్ధంగా, శాసనానికి అను గుణంగా పనిచేస్తాన’ని చేసిన ప్రమాణాన్ని, ఉగ్రవాదులను ఉపయోగించుకుంటామంటూ మంత్రి చేసిన ప్రకటన ఉల్లంఘించింది. మంత్రి చేసిన మరొక ప్రతిజ్ఞ గోప్యతకు సంబంధించింది. అంతర్జాతీయ చట్టం అస్పష్టంగా, అనిశ్చి తంగా ఉంటుంది కనుక అన్ని ప్రభుత్వాలూ గోప్యత విష యంలో జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తాయి కానీ కొంత మంది మంత్రులు దాన్ని అతిశయించి చెబుతుంటారు. ‘నా విధులను నెరవేరుస్తున్నప్పుడు అవసరమైతే తప్ప నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను’ అంటూ పారికర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైన గోప్యతకు కట్టుబడ్డారు. కానీ, ‘ఉగ్రవా దులను ఉపయోగించుకుంటాం’ అంటూ ఇప్పుడాయన చేసిన ప్రకటన ద్వారా నిజంగానే ప్రభుత్వ విధానాన్ని బహి ర్గతం చేయాలనుకున్నట్లయితే, అది తన విధులను నేర వేర్చడంలో భాగంగా ప్రకటించినట్లు కాదు. భారత్ తక్కువ వనరులు ఉన్న పేదదేశమని పారికర్ అంగీకరిస్తున్నారు. తమకు కూడా సమానంగా పింఛన్లను ఇవ్వాలని రిటైరైన సైనికులు డిమాండ్ చేసినప్పుడు అలా చేయడం ద్వారా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు తెలీవు అంటూ పారికర్ పేర్కొన్నారు. రక్షణమంత్రి పర్యవేక్షణలో భారతీయ వాయుసేన ముందుగా ప్రతిపాదించినటు,్ల 126 రాఫెల్ యుద్ధ విమా నాలను కాకుండా 36 విమానాలను మాత్రమే కొత్తగా కొన బోతోంది. ఈ తగ్గింపుకు అనేక కారణాలుండవచ్చు కానీ వాటిలో బడ్జెట్ అతి కీలకమైనది. ప్రభుత్వం ఏర్పాటు చేయ దలిచిన పర్వత యుద్ధతంత్ర విభాగాన్ని 80 వేలమందితో కాకుండా 35 వేల బలగాలకే కుదించాలని మంత్రి నిర్ణయించారు. ఇంతటి భారీ పథకాల అమలుకోసం డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అంటూ మంత్రి ప్రశ్నించారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది కూడా. ఉగ్రవా దులను ఉపయోగించుకోవడంపై బడాయి పోయినట్లుగా కాకుండా మంత్రి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడటాన్ని మర్చిపోకుండానే బడిత కర్రను పట్టుకోవడంపైనే తన సమ యాన్ని, శక్తినీ వెచ్చించడంపై దృష్టి పెడితే బాగుంటుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
దేశ రక్షణలో రాజీలేదు
జాతీయ భద్రతకు మోదీ సర్కారు ప్రాధాన్యం ఓయూ సదస్సులో రాంమాధవ్ హైదరాబాద్: జాతీయ భద్రత, సమగ్రత విషయంలో భారత్ ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, భద్రత విషయంలో ప్రధాని మోదీ గట్టి చర్యలు తీసుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. ‘జాతీయ భద్రతకు సవాళ్లు’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విమర్శలకు తావు లేకుండా కేంద్రంలో మోదీ సమర్థ పాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలకు కూడా విమర్శించేందుకు ఎటువంటి అంశాలు దొరక్క ‘సూటుబూటు సర్కారు, ఎన్ఆర్ఐ పీఎం’ అంటూ చిన్న పిల్లాడు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. జమ్మూ-కశ్మీర్లో పీడీపీతో కలసి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కారు విజయవంతమైతే అక్కడి వేర్పాటువాదుల వెన్ను విరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రం సమన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్లతో చర్చలు జరిపిన ఘనత మోదీదేనని, పాక్ ఆక్రమిత కశ్మీర్లో శరణార్థుల పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నది కూడా తమ సర్కారేనని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, సరిహద్దు వివాదంపై చైనాతోనూ మోదీ చర్చలు జరిపారని వివరించారు. ప్రజావసరాల మేరకు భూ సేకరణ చట్టాన్ని కేంద్రం సవరిస్తుందని, పదేళ్లలో దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. -
ఇక బలవంతమే!
‘రాజధాని’ కోసం భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: రైతుల అనుమతితో నిమిత్తం లేకుండా రాజధానిలో బలవంతపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారి జాతీయ స్ థాయిలో చర్చ జరుగుతున్న భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఇందుకు ఆసరాగా చేసుకుంది. నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇంతకాలం భూ సమీకరణ పాటపాడిన ప్రభుత్వం గురువారం నుంచి ‘కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు’ పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టనుంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో ‘రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు’ను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. ‘భూసేకరణ చట్టం-2013’లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది. రెండు, మూడు చాప్టర్ల నుంచి మినహాయింపునివ్వడం ద్వారా రైతుల సమ్మతి లేకుండానే భూమి లాక్కోవడానికి ప్రభుత్వానికి అవకాశం లభించడంతో పాటు, పునరావాస బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీలుంటుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 166) జారీ చేసింది. ఆర్డినెన్స్‌లోని 10(ఎ)(1) ప్రకారం.. జాతీయ భద్రత, దేశ రక్షణకు సంబంధించిన, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, చౌక గృహనిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు, భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ఉండే పీపీపీ ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. భూసేకరణ చట్టం-2013లో ‘సామాజిక ప్రభావం అంచనా’ చాలా ముఖ్యమైన అంశం. తాజా నోటిఫికేషన్ ప్రకారం సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి అవకాశమేర్పడింది. 2, 3 చాప్టర్లను మినహాయించడం వల్ల... రైతుల సమ్మతి లేకుండానే భూములు సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరమే ఉండదు. భూమి యజమానులకు చట్టంలో పేర్కొన్న మేరకు రిజిస్ట్రేషన్ విలువను బట్టి పరిహారం చెల్లించి భూములు లాక్కొనే హక్కు ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. మూడు నెలల్లో పరిహారం చెల్లించడంతో పాటు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలనే నిబంధనలు లేకపోవడంతో.. ప్రభుత్వం ఇచ్చినప్పుడే పరిహారం పుచ్చుకోవాలి.భూములపై ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతులు, కూలీల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది. పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలనే పరిమితుల నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు. భూ సేకరణ, తర్వాత చేపట్టే నిర్మాణ కార్యక్రమాల వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినా.. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజధాని కనీస అవసరాలకే భూ సేకరణ జరగాలనే నిబంధన లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చిన మేరకు భూ సేకరణ చేయవచ్చు. ఫలితంగా అవసరాలకు మించి భూములు సేకరించి, సర్కారు పెద్దలు సొమ్ము చేసుకొనే ప్రమాదం ఉంది.{పభావిత ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగుల సంక్షేమానికి, భూసేకరణతో సంబంధం ఉన్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను రూపొందించడం, సేకరణ వల్ల ఎదురయ్యే సామాజిక ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు.మూడు పంటలు పండే భూములకు సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధన లేకపోవడం వల్ల.. మూక్కారు పండే భూములను రాజధాని కోసం సేకరించేందుకు అవరోధం ఉండదు. 33,400 ఎకరాలు రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించదలచుకున్న భూ విస్తీర్ణం. 14,800 ఎకరాలు రైతులతో ఒప్పందాలు కుదిరిన భూమి 18,600 ఎకరాలు భూ సమీకరణకు దూరంగా ఉన్న కొందరు(తొలుత అంగీకార పత్రాలు ఇచ్చినప్పటికీ) రైతుల ఆధీనంలో ఉన్న భూమి. 900 ఎకరాలు సమీకరణకు రాని భూమి ఇంతేనని, దీన్ని భూ సేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. సవరణకు ముందున్న భూసేకరణ చట్టంలోని చాప్టర్ 2 ఏం చెబుతోందంటే.... ►సామాజిక ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి విస్తృత ప్రచారం కల్పించాలి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచాలి. స్థానిక సంస్థతో సంప్రదింపులు జరిపి అధ్యయనం చేయాలి. ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్) చేపట్టాలి. నిర్వాసితుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకొని నివేదికలో పొందుపరచాలి. అధ్యయనం ప్రారంభించిన మూడు నెలల్లో పునరావాస కమిషనర్‌కు నివేదిక సమర్పించాలి. ► సామాజిక ప్రభావ అధ్యయనం (ఎస్ఐఏ) కోసం పునరావాస కమిషనర్ బృందాన్ని ఎంపిక చేయాలి. భూసేకరణకు దరఖాస్తు చేసిన సంస్థ ప్రతినిధులు ఎవరూ అధ్యయన బృందంలో ఉండకూడదు. సామాజిక కార్యకర్తలు, విద్యా, సాంకేతిక నిపుణులు, స్వతంత్ర ప్రాక్టీషనర్లు ఉండాలి. ప్రాజెక్టు వల్ల ప్రతికూల ప్రభావానికి గురయ్యే ప్రాంత విస్తీర్ణం, సేకరించిన ప్రాంతం మీదే కాకుండా పరిసరాలపై పర్యావరణ, సామాజిక ప్రభావాలను బృందం పరిశీలించాలి. ప్రాజెక్టు కనీస అవసరాల మేరకే భూసేకరణ జరుగుతోందనే విషయాన్ని నిర్ధారించాలి. ► {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రొఫైల్‌ను రూపొందించాలి. సామాజిక ప్రభావ అంచనా నివేదిక తయారైన తర్వాత.. ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి అనుసరించాల్సిన ‘సామాజిక ప్రభావ నిర్వహణ ప్రణాళిక (ఎస్‌ఐఎంపీ) రూపొందించాలి. దీనికి గ్రామసభ ఆమోదం ఉండాలి. ► సామాజిక ప్రభావ అంచనా అధ్యయన నివేదికను పరిశీలించడానికి నిపుణుల కమిటీ నియమించాలి. ► {పాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 2 నెలల్లోపు ప్రభావిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలి. ఆహార భద్రతను పరిరక్షించే చాప్టర్-3 రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను సేకరించాలని భావిస్తే.. అదే ఆఖరి ప్రత్యామ్నాయం అయి ఉండాలి. భూ సేకరణలో ప్రజోపయోగం ఉండి తీరాలి. ఆహార భద్రతకు భంగం కలిగించకుండా భూసేకరణ జరగాలి. ఆహార భద్రతకు భంగం కలుగుతుందని భావిస్తే.. సేకరించిన భూమికి సమానమైన బీడు భూమిని మరోచోట ముందుగా సాగుయోగ్యంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ లెక్కలేం చెబుతున్నాయి రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో దాదాపు 33 వేల ఎకరాలను సేకరించినట్టు, అది కూడా రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని చెబుతోంది. అయితే, ఇప్పటివరకు కేవలం 14,800 ఎకరాలకు మాత్రమే ఒప్పంద పత్రాలు అందాయని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ గురువారం చెప్పారు. అంటే సర్కారు చెబుతున్న 33 వేల ఎకరాల్లో సగానికన్నా ఎక్కువ మొత్తంలో భూములపై ఒప్పందమేదీ జరగలేదని స్పష్టమవుతోంది. రాజధాని కోసం తీసుకున్న భూములకు సంబంధించి కౌలు కింద చెల్లించాల్సిన నగదునూ స్వీకరించడానికి నిరాకరిస్తున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. దాదాపు 15 వేల ఎకరాలకు సంబంధించి రైతులు కౌలు తీసుకోలేదు. ప్రయోగించే అవకాశమున్న గ్రామాలు కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం దాని ఆధారంగా భూ సేకరణ చేయనుంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల నుంచి ఇక బలవంతంగా తీసుకోవడానికి వీలుగా ఈ నోటిఫికేషన్ ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, రాయపూడి, కురగల్లు, వెంకటపాలెం, ఎర్రుపాలెం, నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి తదితర గ్రామాల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించడానికి సర్కారు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే తొలి ప్రయోగం భూ సేకరణ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి వివాదాస్పదమైన ఆర్డినెన్స్‌ను అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చట్టంలో చేసిన మార్పులను పరిశీలించడానికి ఆ అంశంపై ఈ నెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది. చట్ట సభల తుది నిర్ణయం రాకముందే దాన్ని అమలులోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. పూర్వాపరాలు ప్రజోపయోగ అవసరాలకు భూమిని సేకరించేందుకు 1894 నుంచి 2013 వరకు నాలుగు చట్టాలు వచ్చాయి. 2013లో తెచ్చిన చట్టం - భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునః ఉపాధి కల్పన చట్టం. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిలో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ 2014, డిసెంబర్ 31న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్ ముందుంచి చట్టం చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఆ ఆర్డినెన్స్ గడువు తీరడంతో అవే మార్పులతో ఏప్రిల్ 3న కేంద్రం మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీన్ని తాజా సమావేశాల్లో పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవాలన్న ప్రయత్నం కూడా ముందుకు కదలలేదు. విపక్షాల డిమాండ్ మేరకు ఆ అంశాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అది మళ్లీ పార్లమెంట్ ముందుకొస్తుంది. ఈ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆధారంగా గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అధికారంతో భూ సేకరణకు అడ్డంగా నిలుస్తున్న రెండు అధ్యాయాలకు మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. -
జాతి ప్రయోజనాలు పణం
కార్పొరేట్ గూఢచర్య నిందితులపై పోలీసుల ఆరోపణ వారి వద్ద జాతీయ భద్రత పత్రాలు లభించాయని వెల్లడి న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తాము అరెస్ట్ చేసిన ప్రముఖ పెట్రో కంపెనీల సీనియర్ ఉద్యోగుల వద్ద లభించిన రహస్య పత్రాల్లో జాతీయ భద్రతకు సంబంధించినవి కూడా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు వెల్లడించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఈ కేసులో నిందితులపై అధికార రహస్యాల చట్టాన్ని వర్తింపజేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి సంజయ్ ఖనగ్వాల్‌కు విన్నవించారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శైలేశ్ సక్సేనా(కార్పొరేట్ వ్యవహారాల మేనేజర్- రిలయన్స్ ఇండస్ట్రీస్), వినయ్‌కుమార్(డీజీఎం- ఎస్సార్), కేకే నాయక్(జీఎం- కెయిర్న్స్), సుభాష్ చంద్ర(సీనియర్ ఎగ్జిక్యూటివ్-జూబిలెంట్ ఎనర్జీ), రిషి ఆనంద్(డీజీఎం-రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్)లను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీన్ని నిందితుల న్యాయవాదులు వ్యతిరేకించారు. అనంతరం ఆ ఐదుగురిని 3 రోజుల(ఫిబ్రవరి 24వరకు) పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మరోవైపు, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శుక్రవారం అరెస్ట్ చేసిన పెట్రో కన్సల్టెంట్ ప్రయాస్ జైన్ ఆఫీసును శనివారం క్షుణ్ణంగా సోదా చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదా సందర్భంగా జూబిలెంట్ ఎనర్జీ సీనియర్ అధికారి సుభాష్ చంద్రను తమతో తీసుకెళ్లారు. అనంతరం నోయిడాలో ఉన్న జూబిలెంట్ ఎనర్జీ కార్యాలయంలోని సుభాష్ ఆఫీస్ గదిని తనిఖీ చేశారు. జూబిలెంట్ ఎనర్జీ సహా ఇంధన రంగంలోని ఐదు ప్రముఖ కంపెనీల సీనియర్ ఉద్యోగులను, ఇద్దరు స్వతంత్ర పెట్రో కన్సల్టెంట్లు ప్రయాస్ జైన్, శంతన్ సైకియాలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడం తెలిసిందే. అంతకుముందు శాస్త్రి భవన్లో పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి రహస్య పత్రాలను దొంగతనం చేసిన ఇద్దరు పెట్రోలియం శాఖ చిరుద్యోగులు, ముగ్గురు మధ్యవర్తులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఎప్పట్నుంచి ఈ గూఢచర్యం జరుగుతుందో? దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో? ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో? తెలుసుకునే దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నామ’ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేసు మూలాల్లోకి వెళ్తామని, అందుకు అవసరమైతే మరిన్ని దాడులు, సోదాలు జరుపుతామని, మరింతమందిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఆ ఐదుగురు ఉన్నతోద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లను, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు వారు ఈ పని చేసి ఉండొచ్చని, ఆ దిశగానూ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. దోషులను వదిలిపెట్టం: రాజ్‌నాథ్ ఈ గూఢచర్యానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా సాగుతోందని స్పష్టమవుతోందని, ఎన్డీఏ ప్రభుత్వం అప్రమత్తత వల్లనే ఈ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ గూఢచర్యంతో లబ్ధి పొందిన పెద్దలపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు. ‘పదివేల కోట్ల స్కామ్..’ ‘ఇది పదివేల కోట్ల రూపాయల స్కాం. దీన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నందువల్లనే నన్ను ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు’.. పోలీసులు కోర్టులోకి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న విలేకరులను చూస్తూ మాజీ జర్నలిస్ట్, స్వతంత్ర పెట్రో కన్సల్టెంట్ శంతను సైకియా గట్టిగా అరుస్తూ చేసిన వ్యాఖ్యలివి. పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి దొంగతనానికి గురైన పత్రాలు ఆయన వద్ద లభించాయి. తనను తాను సమర్ధించుకునేందుకు సైకియా అలా చెప్పి ఉండొచ్చని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ‘పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి తస్కరణకు గురైన పత్రాలకు సంబంధించిన కేసు ఇది. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఆయన పోలీసులకు చెప్పాలి’ అన్నారు. -
మిగ్ దోవలో సుఖోయ్!
దేశ రక్షణలో మన వైమానిక దళం పాత్ర కీలకమైనది. మన గగనతలంతోపాటు దక్షిణాసియా, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో అది నెరవేర్చలసిన బాధ్యతలు ఎన్నెన్నో! శక్తిసామర్థ్యాలరీత్యా చూస్తే మన వైమానిక దళానిది ప్రపంచంలోనే నాలుగో స్థానం. అయితే, దాని అమ్ములపొది ఉండాల్సిన స్థాయిలో లేదని పదే పదే వెల్లడవుతున్న వాస్తవం. గత వారం మహారాష్ట్రలోని పూణె సమీపంలో కుప్ప కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం ఉదంతం ఈ విషయంలో ఉన్న ఆందోళనను మరింతగా పెంచింది. 1971లో పాకిస్థాన్‌తో వచ్చిన యుద్ధంలో మన వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన మిగ్-21 విమానాలు తరచు కుప్పకూలుతూ ఇప్పటికే ‘ఎగిరే శవపేటికలు’గా పేరుతెచ్చుకున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా సుఖోయ్-30పైనా ఆదినుంచీ నిపుణుల్లో అనేక సందేహాలున్నాయి. గత నాలుగేళ్లలో సుఖోయ్ విమానాలు కూలిన ఘటనలు అయిదు చోటుచేసుకున్నాయి. రెండు ఇంజన్లుండే ఈ విమానాల్లో ఇటీవలి కాలంలో సాంకేతికంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గగనతలంలో ఉండగా హఠాత్తుగా ఒక ఇంజన్ మొరాయించడం, వెనువెంటనే అత్యవసరంగా విమానాన్ని దించాల్సిరావడంవంటి ఉదంతాలు పెరిగాయి. వాస్తవానికి వెయ్యి గంటలు ప్రయాణించాక సుఖోయ్‌లను సర్వీసింగ్‌కి పంపాలని వాటిని రూపొందించిన నిపుణులు సూచించినా తాజా ఉదంతాల నేపథ్యంలో 700 గంటలకే ఆ పనిచేస్తున్నారు. అంతేకాదు, పూణె ఘటన తర్వాత మనకున్న 200 సుఖోయ్ విమానాలనూ నిలిపేశారు. సుఖోయ్ ఒప్పందం కుదిరినప్పుడే పలువురు నిపుణులు పెదవి విరిచారు. ఈ విమానాల కొనుగోలుకు మొదట రూ. 22,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా అది మూడేళ్ల వ్యవధిలోనే రూ. 45,000 కోట్లకు ఎగబాకిందని 2006లో కాగ్ నివేదిక విమర్శించింది. సమకాలీన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన స్థాయిలో మన వైమానిక దళం లేదన్న అసంతృప్తి నిపుణుల్లో ఉన్నది. 2,000కు పైగా యుద్ధ విమానాలు, 34 స్క్వాడ్రన్లు ఉన్నా ఎన్నో సమస్యలు చుట్టిముట్టి ఉన్నాయి. స్క్వాడ్రన్లను 42కు విస్తరించాలని, విమాన పాటవాన్ని మరింతగా పెంచుకోవాలని సంకల్పించినా అందుకు తగిన చురుకుదనం కొరవడుతున్నది. ముఖ్యంగా అటు మిగ్-21లనూ, ఇటు సుఖోయ్-30లనూ మనకు సమకూర్చిన రష్యన్లవైపునుంచి సకాలంలో సహకారం అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం. యుద్ధ విమానాల్లో సుఖోయ్‌లు అత్యంతాధునాతనమైనవి. విమానం ప్రయాణంలో ఉండగా ఏ వ్యవస్థ అయినా వైఫల్యానికి గురైతే ఇతర వ్యవస్థలన్నీ చెక్కుచెదరకుండా చూడటం, ప్రత్యామ్నాయ వ్యవస్థల పర్యవేక్షణను లోపరహితంగా నిర్వహించడం ఇందులోని సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత. పెలైట్ స్వీయ అంచనాలతో విమాన గమనాన్ని, దిశను, వేగాన్ని నిర్దేశించే విధానానికి భిన్నంగా ఒక కమాండ్‌తోనే బహుళవిధ లక్ష్యాలను పరిపూర్తిచేయగల సంక్లిష్ట సాంకేతికతను సంతరించుకున్న ఈ విమానాలు యుద్ధరంగంలో ఎంతగానో ఉపకరిస్తాయన్న అంచనాలున్నాయి. అయితే, ఈ సాంకేతికతలో చోటుచేసుకున్న లోపమేదో సుఖోయ్‌కు సమస్యగా మారింది. పూణె ఘటన విషయమే తీసుకుంటే సుఖోయ్ సరిగ్గా నేలను తాకే సమయంలో పెలైట్లు కూర్చున్న సీట్లు వాటంతటవే విమానం నుంచి వేరుపడి బయటికొచ్చాయి. విమానం కూలిపోతున్న సందర్భాల్లో పెలైట్ కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా వేరుపడాల్సి ఉండగా ఇది ఎలా జరిగిందన్నది నిపుణులకు అర్ధంకాని విషయంగా మారింది. ఇంజన్ల వైఫల్యాలను తీర్చేందుకు వాటి డిజైన్‌కు అవసరమైన మార్పులు చేయడానికి ఇంజనీరింగ్ నిపుణులు కృషిచేస్తుండగా తాజా లోపం సుఖోయ్‌ల నాణ్యతపై, వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తున్నది. అందువల్లనే ఈ విమానాలను పూర్తిగా నిలిపివేయాలని వైమానిక దళం అధికారులు నిర్ణయించారు. యుద్ధరంగంలో విధులు నిర్వర్తించే విమానాలు వాటి సామర్థ్యాన్ని నూటికి నూరు శాతమూ ప్రదర్శించగలగాలి. అందులో ఏ కొంచెం తేడావచ్చినా ఆ వైఫల్యం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కనుక సుఖోయ్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలన్న నిర్ణయం సరైందే. 2013తో మొదలుబెట్టి 2017లోగా మిగ్-21 విమానాలను దశలవారీగా తొలగిస్తామని కేంద్రం ప్రకటించి చాన్నాళ్లయింది. అప్పటికల్లా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవాల్సిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రెడీ అవుతుందని ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. అయితే అదింకా పరీక్షల దశలోనే ఉన్నది. అవన్నీ పూర్తయి, దాని శ్రేష్టతపై తుది నిర్ణయానికి వచ్చాక తప్ప ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యంకాదు. ఈలోగానే అటు మిగ్-21 యుద్ధ విమానాలూ, ఇటు సుఖోయ్లూ ఇలా మొరాయించడం ఆందోళన కలిగించే అంశం. మిగ్-21లకు స్పేర్పార్ట్ల సమస్య ఉన్నది. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత అమెరికా విధించిన ఆంక్షలవల్ల తేజస్ ఆలస్యమైంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇప్పుడున్న 26 శాతంనుంచి 49 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందువల్ల రక్షణ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి, వాటికి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడానికి మార్గం సుగమం కాగలదన్న ఆశలూ ఉన్నాయి. అయితే, కీలకమైన రక్షణ సాంకేతికతలను అందజేయడంపై పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆంక్షలు వాటిని ఎంతవరకూ సాకారం చేస్తాయో, మన అవసరాలను ఎంతవరకూ తీరుస్తాయో చెప్పలేము. ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చే పరిస్థితులు లేకపోయినా నిత్యం సర్వసన్నద్ధతలో ఉండటం ముఖ్యం. ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చే అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ప్రధానం. సుఖోయ్ విషయంలో ఎదురైన సమస్యలకు సత్వర పరిష్కారం సాధ్యపడాలని కోరుకుందాం. -
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్‌లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
దేశ రక్షణలో ఎన్సీసీ పాత్ర కీలకం
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : దేశ రక్షణలో ఎన్సీసీ కేడెట్ల పాత్ర కీలకమని, దేశ రక్షణలో అత్యధికంగా ఎన్సీసీ కేడెట్లే ఉన్నారని 32వ ఆంధ్ర బెటాలియన్ నిజామాబాద్ గ్రూప్ కమాండర్ బీఎస్ గోకుల అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సీసీఐ టౌన్షిప్లో ఎన్సీసీ కేడెట్లకు ఇస్తున్న శిక్షణ తరగతులు శనివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేడెట్లు తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ఇందులో కేడెట్లు తలసేన క్యాంపు కఠిన శిక్షణ తీసుకున్నారు. వీటితోపాటే నేలపై పాకడం.. మ్యాప్ రీడింగ్.. తాడుతో సాహసాలు, ఫీల్డ్ సిగ్నల్స్, ఫైర్ ఆర్డర్స్, రిటన్ టెస్ట్‌లో మెళకువలు నేర్చుకున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య జరిగే తలసేన క్యాంపులో నిజామాబాద్ గ్రూప్ నుంచి ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించాలని కోరారు. అనంతరం పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్సీసీ 32 ఆంధ్ర బెటాలియన్ ఆదిలాబాద్ కమాండెంట్ రవిచందర్, ఎన్సీసీ అధికారులు శివప్రసాద్, జగ్రాం, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, నరేందర్, విజయ్‌కుమార్, రాజమౌళి, రాజేశ్వరి, స్వరూపరాణి, టీకే ప్రసన్న, సబేధర్ మేజర్ ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నక్సల్స్హ్రిత జిల్లాగా మారుస్తాం
సుబ్లేడు (తిరుమలాయపాలెం): దేశ భద్రత కోసం అంకితభావంతో సేవలందిస్తున్న పోలీసులను పొట్టనపెట్టుకుంటున్న నక్సలైట్ల(మావోయిస్టుల)ను పూర్తిగా ఏరివేస్తామని, నక్సల్స్హ్రిత జిల్లాగా మారుస్తామని ఎస్పీ ఎవి.ర ంగనాథ్ చెప్పారు. ఒడిశా సరిహద్దులోని బలిమెలలో 2008 జూన్ 29న జరిగిన నక్సల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహం డ్స్ జూనియర్ కమాండర్ దుస్సా ఉదయ్‌నాగు జ్ఞాపకార్థం సుబ్లేడు గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్‌ను సోమవారం ఎస్పీ ప్రారంభించారు. ఉదయ్‌నాగు చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... ఒడిశా సరిహద్దులో గ్రేహండ్స్ పార్టీ కూంబింగ్ నిర్వహించి స్టీమర్లో వెళుతున్న సమయంలో నక్సల్స్ దొంగచాటుగా దాడులు చేశారని చెప్పారు. ఈ దుర్ఘటనలో 34 మంది గ్రేహండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నక్సల్స్‌తో పోరాడుతూ ఉదయ్‌నాగు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ‘‘ఆ దుర్ఘటన తరువాత నన్ను గ్రేహండ్స్ ఎస్పీగా పంపించారు. గ్రేహం డ్స్ పోలీసులను చంపిన నక్సల్స్‌ను సాధ్యమైనంత వరకు అణచివేశాం. ఆ తరువాత నక్సల్స్ వెనుకంజ వేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో న క్సల్స్ ఏరివేతకు పోలీసులు దృఢ సంక ల్పంతో ముందుకు సాగుతున్నారు. బలిమెల పోలీసు అమరవీరుల స్ఫూర్తితో జిల్లాను నక్సల్స్హ్రితంగా మారుస్తాం’’ అని అన్నారు. ఉదయ్‌నాగు పేరిట బస్ షెల్టర్ నిర్మించిన ఆయన కుటుంబీకులు అభినందనీయులని అన్నారు. శాంతి భద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకుగాను పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్టు చెప్పారు. సమస్యలు తెలుసుకున్న ఎస్పీ ఉదయ్‌నాగు తల్లి భాగ్యమ్మ, ఇతర కుటుంబీకులతో ఎస్పీ రంగనాథ్ మాట్లాడారు. తమకు ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రయోజనాలు, పరిహారం అందినట్టు భాగ్యమ్మ చెప్పారు. రైల్వే పాస్ ఇవ్వడం లేదని చెప్పారు. ఎస్పీ స్పందిస్తూ.. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ‘‘మీకు ఏవైనా సమస్యలుంటే నన్ను ఎప్పుడైనా కలవవచ్చు’’ అని చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు ఎస్సైలు ఓంకార్ యాదవ్, జాన్‌రెడ్డి, ఉదయ్‌నాగు తల్లి భాగ్యమ్మ, అన్న క్రిష్ణ, చెల్లెలు అరుణ, గ్రామ సర్పంచ్ రామసహాయం సునితారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వనవాసం సురేష్‌రెడ్డి, గ్రామ పెద్దలు వసంతరెడ్డి, శ్రీరామ్, రాంచంద్రు, మాజీ ఎంపీపీ గంధసిరి రామయ్య, వార్డు సభ్యు లు పోలెపొంగు సంజీవులు, మాజీ సర్పంచ్ గంధసిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నెత్తురోడుతున్న ఇరాక్
* బాగ్దాద్ చేరువలో రెబల్స్ ఇరాక్ సార్వభౌమత్వం * తీవ్ర ప్రమాదంలో ఉందన్న ఐరాస * సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు * తిక్రిత్, మోసుల్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులు బాగ్దాద్: ఇరాక్ నెత్తురోడుతోంది. భద్రత బలగాలను, ప్రభుత్వ మద్దతుదారులను ఊచకోత కోస్తూ జీహాదీ తిరుగుబాటుదారులు బాగ్దాద్ దిశగా దూసుకెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో జీహాదీలు, ప్రభుత్వ భద్రతాబలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇందులో తమదే పైచేయంటూ ఇరు వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ‘ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత తీవ్ర ప్రమాదంలో ఉన్నాయ’న్న ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నికోలాయ్ మ్లదెనోవ్ మంగళవారం చేసిన ప్రకటన సున్నీ తిరుగుబాటుదారులైన ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాల ఆధిక్యతను చెప్పకనే చెబుతోంది. రాజధాని బాగ్దాద్‌కు 60 కి.మీ.ల చేరువకు చేరుకున్నామని, బాగ్దాద్‌తో పాటు, షియాల పవిత్రనగరం కర్బలాను త్వరలో స్వాధీనం చేసుకుంటామని తిరుగుబాటుదారులు చెబుతుండగా.. వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని, గతంలో జీహాదీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నామని ప్రభుత్వ దళాలు ప్రకటిస్తున్నాయి. అయితే, ఇప్పటికే తిక్రిత్, మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎల్ జీహాదీలు.. బాగ్దాద్‌కు ఉత్తరంగా అనేక ప్రాంతాలపై పట్టు బిగించాయి. షియాలు మెజారిటీగా ఉన్న కిర్కుక్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి. బాగ్దాద్‌కు దగ్గర్లో ఉన్న బాకుబాను, షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న తల్ అఫార్ పట్టణంలో అత్యధిక భాగాన్ని జీహాదీలు అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల బాగ్దాద్ ముట్టడిని ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు నిలువరించలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బఖుబా నుంచి తిరుగుబాటుదారులను తరిమేశామని భద్రతాదళాలు తెలిపాయి. ఇరువర్గాల పోరులో తిరుగుబాటుదారులు, భద్రతాదళాలతో పాటు 50 మందివరకు పౌరులు మరణించారని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. తిరుగుబాటు కారణంగా వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా, సున్నీ తిరుగుబాటుదారులకు సౌదీ అరేబియా మద్దతిస్తోందంటూ ఇరాక్ మంగళవారం ఆరోపించింది. ఇరాక్‌లోని షియాల ప్రభుత్వం సున్నీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిందని, అందుకే ఈ తిరుగుబాటని సున్నీల రాజ్యమైన సౌదీ అరేబియా ప్రకటించిన మర్నాడే ఇరాక్ ఈ ఆరోపణలు చేసింది. ఒబామా సమాలోచనలు ఇరాక్ పరిస్థితిపై జాతీయ భద్రతకు సంబంధించిన ఉన్నతస్థాయి సలహాదారులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం చర్చలు జరిపారు. తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలనే విషయంపై అమెరికా తర్జనభర్జనలు పడుతోంది. బాగ్దాద్‌లోని తమ ఎంబసీ, అక్కడి అమెరికన్ల భద్రత కోసం 275 మంది సైనిక సిబ్బందిని ఇరాక్‌కు పంపించింది. ఇరాక్‌కు మద్దతుగా ఇరాన్‌తో కలసి సైనిక చర్య చేపట్టే విషయాన్ని యూఎస్ తోసిపుచ్చింది. కానీ ఇరాన్‌తో ఇరాక్ పరిస్థితిపై వియెన్నాలో చర్చలు జరిపింది. మరోవైపు, పలు దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నాయి. కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్ న్యూఢిల్లీ: ఇరాక్‌లోని భారతీయుల భద్రత కోసం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడివారి సమాచారం కోసం +91 11 23012113, +91 11 23014104 నంబర్లలో సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాక్‌లో దాదాపు 10 వేలమంది భారతీయులున్నారు. తిక్రిత్‌లో కేరళకు చెందిన 46 మంది నర్సులు, మోసుల్‌లో మరో 40 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఈ రెండు నగరాలు తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థనపై అంతర్జాతీయ రెడ్ క్రెసెంట్ సంస్థ సభ్యులు తిక్రిత్‌లోని భారతీయ నర్సులతో మాట్లాడారు. వారు క్షేమంగానే ఉన్నారని నిర్ధారించారు. ఆ నగరాల నుంచి వారిని తరలించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. అలాగే, ఇరాక్‌లోని హింసాయుత ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన భారతీయులను రక్షించేందుకు ఇరాకీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసే విషయంలో సాధ్యాసాధ్యాలను భారత్ ఆలోచిస్తోంది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసరంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇరాక్ పరిస్థితిని సుష్మాస్వరాజ్ స్వయంగా సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. బాగ్దాద్‌లోని భారత దౌత్యకార్యాలయం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉందన్నారు. ఎందుకీ సంక్షోభం.. ఇరాక్‌లో 97% ముస్లింలున్నారు. వారిలో 60% - 65% అరబ్ షియాలుంటారు. 15 నుంచి 20 శాతం అరబ్ సున్నీలుంటారు. దాదాపు 17% కుర్దులుంటారు. ఇరాక్‌లోని కుర్దుల్లోనూ సున్నీలే అత్యధికులు. ఇరాక్‌లో షియాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండగా, సున్నీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశ ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమైన కుర్దులు ప్రస్తుత తిరుగుబాటులో పాలుపంచుకుంటున్నారు. సద్దాంహుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో నూరి అల్ మాలికి ప్రధానమంత్రిగా బలహీనమైన షియా అనుకూల ప్రభుత్వం ఇరాక్‌లో ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా, వివక్షాపూరితంగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. వారితో సద్దాంహుస్సేన్ ప్రభుత్వంలోని ఆర్మీ అధికారులు, పక్కదేశం సిరియాలోని తిరుగుబాటుదారులు జతకలిశారు. దాంతో ఇరాక్ మున్నెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. -
‘నోబెల్’కు నామినేట్ అయిన స్నోడెన్
అమెరికా నిఘా వ్యవహారాలను ప్రపంచానికి చాటిన ధీరుడు ఓస్లో (నార్వే): దేశ భద్రత ముసుగులో దేశాలు, సంస్థలు, వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాలపై విస్తృత స్థాయిలో నిఘా పెట్టిన అమెరికా దుశ్చర్యను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. స్నోడెన్ సహకారంతో వికీలీక్స్ వెబ్సైట్ వెల్లడించిన అమెరికా నిఘా వ్యవహారం గత సంవత్సరం సంచలనం సృష్టించింది. అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమయ్యాయి. నార్వేలో ఇంతకుముందు అధికారంలో ఉన్న వామపక్ష సోషలిస్ట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బార్డ్ వెగర్ సోజెల్, సొంత పార్టీకి చెందిన మరో నేత స్నోరీ వాలెన్తో కలిసి స్నోడెన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. స్నోడెన్ చర్య ప్రభుత్వాల విశ్వసనీయతపై చర్చను లేవనెత్తిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
యువ సైనికులపైనే దేశరక్షణ
వాయుసేనాధిపతి బ్రౌన్ ఉద్ఘాటన దుండిగల్ వాయుసేన అకాడమీలో ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్ దేశరక్షణ వ్యవస్థ యువ సైనికులపైనే ఆధారపడి ఉందని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌన్ అన్నారు. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఉదయం జరిగింది. ఇదే అకాడమీలో శిక్షణ పొంది 1972, జూన్14న బయటకు వచ్చిన బ్రౌన్ తాజా పాసింగ్ అవుట్ పరేడ్‌కు వాయుసేన చీఫ్‌గా హాజరు కావడం విశేషం. కింది ఉద్యోగుల పట్ల, వాయుసేన పతాకం పట్ల, దేశం పట్ల నిజాయతీగా ఉండాలని యువ అధికారులకు బ్రౌన్ సూచించారు. దేశరక్షణలో భాగస్వాములై.. తమ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయిం చారు. మొత్తం 202 మంది శిక్షణ పూర్తి చేసుకోగా ఇందులో 37 మంది మహిళలున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా.. బ్రౌన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి ఫ్లాగ్‌లను బహూకరించారు. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవీణ్‌కుమార్‌ను ‘స్వార్డ్ ఆఫ్ హానర్’గా గుర్తించి అతనికి ఖడ్గధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీలో ప్రతిభ చూపిన విపిన్‌కుమార్ , నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబరిచిన ఫిర్దోస్ అహ్మద్‌దార్‌లకుజ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వాయుసేనలో శిక్షణ పొందిన అధికారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో చేసిన సాహసోపేత ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ పరమ్‌జిత్ సింగ్ గిల్, ఎయిర్ మార్షల్ ఆర్జీ బుర్లీతోపాటు వాయుసేన అకాడమీ అధికారులు, కేడెట్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటు దేశభద్రతకి ముప్పు?
రాష్ట్ర విభజన ప్రక్రియపై ఈ రోజు (మంగళవారం) నివేదిక అందించనున్న కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే దేశ భద్రతకి కూడా ముప్పు వాటిల్లవచ్చనే హెచ్చరిక చేయనుందని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ సందర్భంగా తలెత్తే పలు అంశాల మీద కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ఇటీవల హైదరాబాదులో మూడ్రోజుల పాటు పలు సమీక్షా సమావేశాలు జరిపిన విషయం తెలిసిందే.. హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, రిటర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ సారథిగా ఉన్న 9 మంది సభ్యుల బృందంలో ఒక్క ఐఏఎస్ తప్ప అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే కావడం వల్ల ఆ బృందం ప్రత్యేక తెలంగాణా వల్ల తలెత్తే సమస్యల్లో భద్రతా అంశాలమీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది (ఆ ఒక్క ఐ ఎ ఎస్, రాజీవ్ శర్మ కూడా నక్సలైట్ మేనేజ్మెంట్ - అదనపు కార్యదర్శిగా రక్షణ బాధ్యతలే నిర్వహిస్త్తున్నారు.). రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందు వల్ల, ఈ టాస్క్ ఫోర్స్ కి బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపేతంపై రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదికలు, వాటిపై విజయ్ కుమార్ బృందం చేస్తున్న కసరత్తూ కేవలం లాంఛనప్రాయమే. అయితే, విభజనకి అనుకూలంగా తమ అడుగులు వేయక తప్పని టాస్క్ఫోర్సు బృందం తమ బాధ్యతగా దేశ భత్రతకి సంబంధించిన కీలకాంశంపై కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని భావించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, టాస్క్ఫోర్సు నివేదికలో దేశభద్రతపై పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు రక్షణ శాఖకి చెందిన ఎన్నో పరిశోధనా సంస్థలకి ముఖ్య కేంద్రం. డిఆర్డిఓతో పాటు, ఇన్స్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఆటమిక్ మినరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సెంటర్ ఆఫ్ సెల్లులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సెంటర్ ఆఫ్ ప్లాంట్ మాలెక్యూలర్ బయోలజీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ ఇండియాస్ సేటలైట్ మానిటరింగ్ సిస్టమ్స్, ది అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి ఎన్నో ముఖ్యమైన సమ్షలకి హైదరాబాదు కేంద్రం. భారీగా పెరిగిన రక్షణవ్యయంలో ఒక్క డిఆర్డిఓకే రూ 10,635.56 కోట్లు కేటాయించడం ద్వారా దేశ రక్షణ విషయంలో డిఆర్డిఓ పోషిస్తున్న పాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, డిఆర్డిఓకి అనుబంధంగా ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్(ఐ.ఎం.ఎ.ఆర్.ఎ.టి.). లాంగ్ రేంజ్ అగ్ని 5 క్షిపణ రూపకల్పనలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. అగ్ని 5 క్షిపణకి సంబంధించిన చాలా విడిభాగాల రూపకల్పన, తయారీ హైదరాబాదులోనే జరిగింది. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన పలు లాబొరేటరీలు ఇందులో పాలు పంచుకున్నాయి. ఈ కార్యక్రమాలకి రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ కేంద్రం. భారత దేశ అధునాతన క్షిపణి పరిశోధనలకి రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. షంషాబాదు మండలం, విజ్ఞాన కంచ లో 2000 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ ప్రఖ్యాత న్యూక్లియర్ శాస్త్రవేత్తలు హోమీబాబా, అయ్య గారి సాంబశివ రావు (ఎ ఎస్ రావు - ఇ సి ఐ ఎల్ సృష్టికర్త)ల పరిశోధనల ఫలంగా అబ్దుల్ కలాం స్థాపించారు. నక్సల్స్ గుప్పెట్లోకి రక్షణ సంస్థలు? ప్రత్యేక తెలంగాణాలో మళ్లీ బలపడవచ్చునంటూ నిషేధిత సిపిఎం (మావోయిస్టు) తన నాల్గవ సెంట్రల్ కమిటీ సమావేశంలో చేసుకున్న తీర్మానాల కాపీలు ఇటీవల పోలీసు బలగాలకి దొరికాయి. కాబట్టి , తెలంగాణాలోని 10 జిల్లాలలో 8 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడం వల్ల, నక్సల్స్ తెలంగాణా రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించడమే కాకుండా, హైదరాబాదుని కూడా తమ ప్రాబల్యంలోకి తీసుకునే అవకాశం ఎంతైనా ఉందని టాస్క్ఫోర్సు తన నివేదికలో హెచ్చరించినట్టు తెలిసింది. అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ నక్సల్స్ గుప్పెట్లోకి వెళ్లిపోతే, నేపాల్‌లో ‘నక్సల్ ప్రచండ ఫార్ములా’ ఇక్కడా రిపీటై, చైనా ప్రాబల్యం పెచ్చరిల్లి, దేశ భద్రతకే పెను ముప్పు దాపరిస్తుందని ఆ నివేదికలో విజయ్ కుమార్ బృందం కరాఖండిగా తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే, కేవలం ఓట్ల రాజకీయంతో తెలంగాణ ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్స్ ఈ హెచ్చరికల్ని పెడచెవిన ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'కిష్ట్వార్'పై కేంద్రం ఉదాసీనత: రాజనాథ్
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కిష్ట్వార్ పట్టణంలో చోటుచేసుకున్న మతఘర్షణల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహారించిందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్ష్యుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... ముస్లిం, హిందు మతల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశాలున్నాయన్నారు. కొంత మంది వ్యక్తులు భారత గడ్డపై ఉంటూ, పాకిస్థాన్ జిందాబాద్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారి వల్లే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివారి ఆటలు కట్టించవచ్చని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
‘ఉచితం’పై ఏకాభిప్రాయం!
సంపాదకీయం: చాలాకాలం తర్వాత సిద్ధాంతాలకూ, దృక్పథాలకూ అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ఒకే స్వరాన్ని వినిపించాయి. దేశ భద్రతకు ముప్పువాటిల్లే సందర్భాలు ఏర్పడినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో దాదాపు మృగ్యమైపోయిన ఏకీభావం ఈ పార్టీలన్నిటిమధ్యా వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లకు చేసే ‘ఉచిత’ వాగ్దానాల విషయమై ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఒకటి, రెండు పార్టీలు మినహా అన్నీ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఏ పార్టీకైనా అలాంటి వాగ్దానాలు చేసే హక్కుంటుందని, అందులో ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మరే ఇతర సంస్థ జోక్యం అంగీకరించబోమని స్పష్టంచేశాయి. ఆరు జాతీయ పార్టీలూ, 24 ప్రాంతీయపార్టీలూ పాల్గొన్న ఈ సమావేశంలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఒక్కటే భిన్నంగా స్పందించగా, నాగా పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ దానితో గొంతు కలిపాయి. కొన్ని పార్టీలు చేసే వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టడం వాస్తవమేనని, ఈ పరిస్థితి ఎన్నికల క్షేత్రంలో పార్టీలకు ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని ఈ మూడు పార్టీలూ ఆరోపిస్తున్నాయి. ‘ఉచిత’ హామీలను నియంత్రించేలా మార్గదర్శకాలను రూపొందించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇలాంటి హామీలవల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తి దెబ్బతింటున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీఎస్పీ ఒక్కటే భిన్న స్వరం వినిపించడానికి కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఇచ్చిన ఇలాంటి హామీల కారణంగానే తాను ఓడిపోయానని బీఎస్పీ భావిస్తోంది. మరి సమాజ్‌వాదీ చేసిన వాగ్దానాలు అలాంటివి! వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మద్దతు ధర వచ్చేలా చేయడం దగ్గరనుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌లు, మెట్రిక్ ఉత్తీర్ణులైనవారికి ట్యాబ్‌లు, అర్హులైన నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భత్యం, రైతుల రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ వంటివెన్నో అందులో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ అమలుచేస్తే ఒక్కోదానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిరీత్యా ఇది మంచిదికాదని కొందరు ఆర్ధికవేత్తలు గుండెలు బాదుకున్నారు. మాయావతి కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయితే, ఆమె మరో దోవను ఎంచుకున్నారు. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని కోరుతూ అసెంబ్లీ చివరి సమావేశంలో తీర్మానం ఆమోదింపజేశారు. ప్రజల్లో ప్రాంతీయ ఆకాంక్షలను పెంచితే అది తనకు ఉపయోగపడుతుందని ఆమె విశ్వసించారు. కానీ, ఆమె కోరుకున్న స్పందన కరువైంది. ఓటర్లు సమాజ్వాదీవైపే మొగ్గుచూపారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించడం ఉత్తరప్రదేశ్కో, తమిళనాడుకో పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. అలాగే, వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ గెలుస్తాయనిగానీ, గెలిచినవారంతా గద్దెనెక్కాక ఆ హామీలను నిలుపుకుంటారనిగానీ చెప్పడానికి లేదు. మద్యపాన నిషేధం, కిలో రెండు రూపాయల పథకంవంటి వాగ్దానాలతో 1995 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధినేత ఎన్టీఆర్ వాటి అమలు ప్రారంభించిన కొన్నాళ్లకే చంద్రబాబువల్ల పదవి కోల్పోయారు. తాను గద్దెనెక్కాక చంద్రబాబు ఆ రెండు వాగ్దానాలకూ తిలోదకాలిచ్చారు. ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలే అన్నిటినీ శాసిస్తున్న తరుణంలో సామాన్య ప్రజల తక్షణ ప్రయోజనాలకూ, దీర్ఘకాలిక అభివృద్ధికీ మధ్య సమతూకాన్ని పాటిస్తూ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసినవారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినప్పుడు అది ఆచరణ సాధ్యంకాదని కాంగ్రెస్‌లోనే ఎందరో వాదించారు. స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్సింగ్ ఈ పథకం అమలుపై ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ, వైఎస్ దాన్ని అయిదేళ్లూ సమర్ధవంతంగా అమలుచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో విద్యుదుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు వేశారు. విద్యుత్ చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన అదేవిధంగా నిలుపుకున్నారు. ఎన్నికల వాగ్దానాల్లో లేని ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్వంటి పథకాలనెన్నిటినో ఆయన అమలు చేశారు. అందువల్లే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకంనుంచి నిరుద్యోగ భృతివరకూ...ఉచిత బియ్యం పథకంనుంచి కలర్ టీవీల వరకూ ఎన్నో వాగ్దానాలు చేశారు. అయితే, ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, కొత్తగా ఒక్క వాగ్దానమూ చేయని వైఎస్వైపే మొగ్గుచూపారు. రాజకీయ పార్టీలు విధానాలు, కార్యక్రమాలు రూపొందించుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆ విధానాలైనా, కార్యక్రమాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే, వారిని మెప్పించలేకపోతే ఆ పార్టీలు తమ లక్ష్యసాధనలో విజయం సాధించలేవు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం, వాటి పరిష్కారానికి పథకాలు రూపకల్పన చేయడం, ప్రజల ఆదరణను పొందడం ఒక సృజనాత్మక ప్రక్రియ. హామీలివ్వడంలో పార్టీలు అప్పుడప్పుడు హద్దు మీరుతున్నాయనడంలో నిజం లేకపోలేదుగానీ...దానికి విరుగుడు ఈ సృజనాత్మక ప్రక్రియపై ఆంక్షలు విధించడం కాదు. ఎన్నికల ప్రచారంలో పార్టీల వాగ్దానాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాగ్దానాలకంటే ముందు అవి చేసిన వారెవరన్న అంశాన్ని ప్రజలు ప్రధానంగా చూస్తారు. వారి విశ్వసనీయత, సమర్ధత ఏపాటివో అంచనా వేసుకుంటారు. అనర్హులనుకున్నవారిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అంతేతప్ప ఆ వ్యామోహంలోపడి కొట్టుకుపోరు. పార్టీల వాగ్దానాలు కట్టుదాటుతున్నాయని ఆదుర్దా పడేవారు మన ఓటర్ల రాజకీయ పరిణతిని తక్కువ అంచనా వేస్తున్నామని మరిచిపోతున్నారు.