వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని 90 రోజుల్లోగా అమ్ముకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ అమెరికాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తోందని, అది జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ టిక్‌టాక్‌ను ఇటీవల నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆస్తులను 90 రోజుల్లోగా అమ్ముకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment