assets sale
-
వాటాదారులకు మరింత విలువ
న్యూఢిల్లీ: వాటాదారులకు విలువ చేకూర్చడంపై దృష్టిపెట్టిన మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ ఇందుకు మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయం, వ్యయ నియంత్రణలు పాటించడం, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను అమలు చేయనున్నట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏంఎ నాయక్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పలు విభాగాలలోగల వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాంతాలవారీ విస్తరణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్, వృద్ధిలో ఉన్న ఆర్డర్‌బుక్ తదితరాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులనుద్దేశించి నాయక్ ప్రసంగించారు. తద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లో కంపెనీ పనితీరుపై అప్రమత్తతతోకూడిన ఆశాభావంతో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2020–21)కిగాను వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 18 మధ్యంతర డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,624 వద్ద ముగిసింది. -
ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మిని స్ట్రేటర్ ఆర్ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్ ప్రతిపాదించారు. 2018 సెప్టెంబర్ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా డీహెచ్ఎఫ్ఎల్తో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్మాల్ వంటి ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్ఎఫ్ఎల్ని వేలానికి ఉంచగా ఓక్ట్రీ, ఎస్సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. -
టిక్‌టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి
వాషింగ్టన్: అమెరికాలో టిక్‌టాక్‌కు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని 90 రోజుల్లోగా అమ్ముకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ అమెరికాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తోందని, అది జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ టిక్‌టాక్‌ను ఇటీవల నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆస్తులను 90 రోజుల్లోగా అమ్ముకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. -
అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన మరో టెల్కో ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనితో బీఎస్ఎన్ఎల్ జీతాల బిల్లు 50శాతం, ఎంటీఎన్ఎల్ బిల్లు 75 శాతం మేర తగ్గుతుందని అధికారి వివరించారు. బాండ్ల ద్వారా సుమారు రూ. 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తునివ్వనుందని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో సమీకరణ జరిపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు వివరించారు. -
ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు
న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్ గ్రేడ్ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్ నెగెటివ్ రేటింగ్ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్ ఫ్లాగ్షిప్ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్, సికాల్ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్ లాజిస్టిక్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్ లాజిస్టిక్స్ పోర్ట్ టెర్మినళ్లు, ఫ్రైట్ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. -
అన్నకు 2వేల కోట్ల ఆస్తులు అమ్మేసిన తమ్ముడు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా తానే దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ.. ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్‌నోడ్స్(ఎంసీఎన్)ను, సంబంధిత మౌలిక సదుపాయాలను తన అన్న కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మేసినట్టు ప్రకటించారు. వీటి విలువ 2000 వేల కోట్ల రూపాయలు. మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తయినట్లు అనిల్ అంబానీ గురువారం వెల్లడించారు. 248 నోడ్స్ దాదాపు 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిన్నీ ప్రస్తుతం జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల మొదట్లో కూడా తన రూ.250 బిలియన్(రూ.25000 కోట్ల) ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఆర్‌కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మా ఎంసీఎన్, సంబంధిత మౌలిక సదుపాయల ఆస్తులను రూ.20 బిలియన్లకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మే ప్రక్రియ పూర్తయిందని రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ నేడు ప్రకటిస్తుంద’ని ఆర్‌కామ్ పేర్కొంది. గత ఏడాది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. రిలయన్స్ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. భారీగా తనకున్న అప్పులను తగ్గించుకునేందుకు ఆర్‌కామ్ వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000కు పైగా టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ ఈ అమ్మకపు డీల్‌లో ఉన్నాయి. అతిపెద్ద ఈ డీల్‌లో ప్రణాళిక ప్రకారం నేడు నోడ్స్ అమ్మకం పూర్తయినట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. -
అంబానీ బ్రదర్స్ డీల్‌కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. ఆర్‌కాం టవర్ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్ఎస్బీసీ డైసీ ఇన్వెస్ట్మెgట్స్ (మారిషియస్) లిమిటెడ్ సవాల్‌ను కోర్టు స్వీకరించింది. దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం కౌంటర్ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది. ఆస్తుల విక్రయానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది. కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్‌ఎస్)విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
అంబానీకి సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు విక్రయించకుండా బొంబై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో స్వీడిష్ గేర్ మేకర్ ఎరిక్సన్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చట్ట ప్రకారం ఆర్‌కామ్ ఆస్తులను విక్రయించుకోవచ్చని క్రెడిటార్లకు టాప్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్‌కామ్ స్పెక్ట్రమ్, ఫైబర్, రియల్ ఎస్టేట్, స్విచ్చింగ్ నోడ్స్ వంటి వాటిని విక్రయించుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్‌కామ్ షేర్లు లాభాల జోరు కొనసాగిస్తోంది. ఆర్‌కామ్ షేర్లు దాదాపు 2.5 శాతం లాభపడ్డాయి. మార్చి మొదట్లో తమ ఆస్తులు విక్రయించకుండా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విధించిన ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బొంబై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. కానీ ఫిర్యాదును హైకోర్టు కొట్టిపారేసి, ఆర్బిట్రేషన్ అనుమతి లేకుండా ఎలాంటి ఆస్తులు విక్రయించకూడదని, ఆస్తుల విక్రయంపై స్టే విధించింది. ఎరిక్సన్ ఏబీకి చెందిన ఇండియన్ విభాగానికి రిలయన్స్ కమ్యూనికేషన్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విషయమే ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విక్రయిద్దామన్న ఆస్తులు విక్రయించకుండా.. డీల్స్ బదలాయింపులు చేయడానికి వీలులేకుండా కోర్టు మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆస్తులు విక్రయించుకునే విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మేసి, ఆ అప్పులను కొంతమేర తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌కు దాదాపు రూ.45వేల కోట్ల అప్పులున్నాయి. -
అంబానీ బ్రదర్స్ మెగా డీల్‌కు బ్రేక్: షేర్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిలయన్స్ జియోకు ఆస్తుల అమ్మకంపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ విక్రయం తన తుది ఆదేశానికి లోబడి ఉంటుందని కోర్టు తెలిపింది, తుది ఆదేశాలవరకు యథాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. తద్వారా తన అనుమతిలేనిదే ఈ డీల్‌ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్‌కాం ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్‌కు భిన్నంగా ముందస్తు అనుమతి లేకుండా దాని ఆస్తుల విక్రయం లేదా బదిలీకి కుదరదంటూ ఈ నెల 8న ముంబై హైకోర్టు ఈ డీల్‌ను తిరస్కరించింది. ఆర్‌కాంనుంచి వెయ్యికోట్లకుపైగా బకాయి రావాల్సిన దేశీయ చిప్ మేకర్ ఎరిక్సన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అయితే ఆర్‌కాంకు మద్దతుగా నిలిచిన ఎస్బీఐ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తాజా ఆదేశాలిచ్చింది. కాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ( జియో) కు కంపెనీ ఆస్తులను విక్రయించాలని ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీ నిర్ణయించారు. అప్పుల ఊబినుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఆదేశాల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 5శాతానికి పైగా నష్టపోయింది. -
సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ విచారణ తీరుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తేల్చలేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టుకు వెళ్లడం వల్లే బాధితులకు న్యాయం ఆలస్యమవుతుందని సీఐడీ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. గతంలో కోర్టుకు అందజేసి 26 ఆస్తుల్లో రెండింటిని ఈ నెల 30లోపు అమ్మకానికి సిద్ధం చేయాలని జ్యుడిషియరీ కమిటీని ఆదేశించింది. సీఆర్ డీఏ పరిధిలోని ఉత్తర విహార్ లో 85538 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఎకో స్వయంప్రభలో 1,307 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాలని సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.