సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ విచారణ తీరుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తేల్చలేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టుకు వెళ్లడం వల్లే బాధితులకు న్యాయం ఆలస్యమవుతుందని సీఐడీ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు.
గతంలో కోర్టుకు అందజేసి 26 ఆస్తుల్లో రెండింటిని ఈ నెల 30లోపు అమ్మకానికి సిద్ధం చేయాలని జ్యుడిషియరీ కమిటీని ఆదేశించింది. సీఆర్ డీఏ పరిధిలోని ఉత్తర విహార్ లో 85538 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఎకో స్వయంప్రభలో 1,307 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాలని సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.