బీజింగ్: టిక్‌టాక్ చైనా మూలాలపై అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ టిక్‌టాక్ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్‌టాక్ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్‌కి చైనాలో తప్ప విడిగా ప్రధాన కార్యాలయం లేదు.
అంతర్జాతీయ కార్యాలయం కోసం టిక్‌టాక్ అనేక ప్రదేశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే లాస్ ఏంజెలిస్, న్యూయార్క్, లండన్, డబ్లిన్, సింగపూర్‌లలో టిక్‌టాక్ ఐదు అతిపెద్ద కార్యాలయాలు ఉన్నాయి. తమ దేశంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఈ యాప్‌ని నిషేధించిన విషయం తెలిసిందే. చైనా కఠిన ఆంక్షలు విధించడంతో, టిక్‌టాక్ హాంకాంగ్‌లో కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్ మాజీ చీఫ్ అలెక్స్ జూ, లాస్‌ఏంజెల్స్ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment