Tek Fog App News: Derek OBrien Says Tek Fog App Threat To National Security - Sakshi
Sakshi News home page

టెక్‌ ఫాగ్‌ యాప్‌ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!

Published Tue, Jan 11 2022 1:07 PM | Last Updated on Tue, Jan 11 2022 3:02 PM

Derek OBrien says Tek Fog App Threat To National Security - Sakshi

డెరెక్ ఓబ్రెయిన్

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్‌ ఫాగ్‌ యాప్‌ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్‌ ఫాగ్‌ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. టెక్‌ ఫాగ్‌ యాప్‌ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు.

చదవండి: గోవా బీజేపీకి షాక్‌

ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్‌ ఆనందర్‌ శర్మను డిమాండ్‌ చేశారు. బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్‌ ఖాతాల నియంత్రణ, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రెడింగ్‌లో ఉ‍న్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్‌ ఫాగ్’ యాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement