
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు.
సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు.