Neighboring countries
-
తంపులమారి చైనా..15 దేశాలతో కయ్యం
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి: చైనా పీపుల్స్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడిన నాటి నుంచి సరిహద్దుల విషయంలో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి అనేక చోట్ల వివాదాలు సృష్టిస్తోంది. మన దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అనేక భూభాగాలు తమవేనంటూ చైనా వాదిస్తోంది. 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అటుపిమ్మట భారత్‌లోని అనే భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. 1962లో భారత్‌తో జరిపిన యుద్ధం ఫలితంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని భాగమైన 37,244 చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అంతేకాదు జమ్మూకశీ్మర్ లోయలోని మరో 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తమదేనంటూ ఘర్షణలకు దిగుతూనే ఉంది. 2020 మే నెలాఖరులో చైనా సైన్యం గల్వాన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు మరణించారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం సరిహద్దుల వెంబడి అనేక చోట్ల భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తరువాత కూడా చైనా ఘర్షణలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశ అంతర్భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోంది. మొదట్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు.. అంటే మొత్తం అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని అని వాదించిన చైనా ఇప్పుడు తొలుత 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదాన్ని పరిష్కరించుకుందామని భారత్‌తో బేరాలాడుతోంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా భాష మాండరిన్‌లోకి మార్చేసింది. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్నన్గా సంబోధిస్తోంది. అర్థం లేని ఆధారాలు పొరుగు దేశాలతో నెలకొన్న వివాదాలకు చైనా ప్రత్యక్ష ఆధారాలు చూపడం లేదు. తన విస్తరణవాదానికి పూర్వకాలం నాటి రాజవంశçస్తుల పాలనా క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలంటూ ఇతర దేశాలతో సరిహద్దుల విషయంలో జగడానికి దిగుతోంది. అందుకోసం ఆయా ప్రాంతాల పేర్లను పూర్వకాలంలో పేర్కొన్న పేర్లుగా మార్చేస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. దక్షిణ చైనా సముద్ర జలాలపై, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం తమదేనంటూ తాను సృష్టించిన గీతల మ్యాప్‌లను చారిత్రక ఆధారాలుగా చూపుతోంది. ఆరు మహాయుద్ధాలు! 2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో గతంలో పేర్కొన్నట్లు యురేíÙన్ టైమ్స్ అనే ఆన్లైన్ పత్రిక వెల్లడించింది. దాని ప్రకారం 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వా«దీనం చేసుకోవడానికి యుద్ధా్దలు జరుగుతాయని పోర్టల్ చెబుతోంది. తంపులమారి చైనా మాదిరిగానే భారతదేశం కూడా మౌర్య, చోళ వంశçస్తుల పరిపాలనా క్షేత్రాన్ని ఆధారంగా చూపితే అనేక దేశాలను అఖండ్ భారత్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. మౌర్య, చోళ వంశస్థుల పరిపాలనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందరితోనూ తగువే భారత్ మాత్రమే కాకుండా 15 దేశాలతో చైనాకు సరిహద్దు తగాదాలు కొనసాగుతున్నాయి. వీటిలో తైవాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేíసియా, వియత్నాం, జపాన్, ద.కొరియా, కొరియా, సింగపూర్, బ్రూనై, నేపాల్, భూటాన్, లావోస్, మంగోలియా, మయన్మార్ తదితర దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఏలుబడిలోనే ఉండాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్ సవాలు చేస్తోంది. ► తైవాన్ విషయంలో ఆ దేశమంతా తమకు చెందినదేనన్నది చైనా వాదన. అయితే, ప్రస్తుతానికి మెకలిస్ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ► ఫిలిప్పైన్స్ విషయంలో కూడా స్కార్బరో కొండలు, మరికొన్ని దీవులపై చైనా వివాదం సృష్టించింది. వీటివిషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది. ► ఇండోనేసియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్ చైనా సముద్రంలో కొంతభాగం తమదేనంటూ చైనా తగువులు సృష్టిస్తోంది. ► వియత్నాం విషయానికి వస్తే అనేక భాగాలను తమకు అప్పగించాలని చైనా ఒత్తిడి పెంచుతోంది. పలు ద్వీపాలతోపాటు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం కాలుదువ్వుతోంది. చైనా నౌకాదళం ఇటీవల వియత్నాంకు చెందిన చేపల వేట పడవను సముద్రంలో ముంచేసింది. ► మలేíసియాతోనూ కొన్ని దీవులు, సముద్ర జల్లాల విషయంలో చైనా జగడం ఆడుతోంది. మలేíÙయా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవల అమెరికా, ఆ్రస్టేలియా యుద్దనౌకలు మలేíÙయాకు అండగా రావడంతో చైనా నౌకాదళం తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది. ► జపాన్‌కు చెందిన రెండు ద్వీప సముదాయాలపై చైనా కన్నుపడింది. అవి సెన్కాకు దీవులు, ర్యూక్యు దీవులు. ఈ దీవుల్లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి చైనా వీటి విషయంలో జపాన్‌తో తగువు పడుతోంది. ► దక్షిణ చైనా సముద్రంలో కొంతమేరకు మునిగిపోయిన సొకొట్రా రాక్‌పై దక్షిణ కొరియాతో వివాదానికి దిగింది చైనా. ఈ రాక్ కొరియాకు 149 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు 287 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► దాదాపు 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఉత్తర కొరియాతో సీ ఆఫ్ జపాన్ సముద్ర జలాల్లో హద్దుల అంశంపై చైనా వివాదం సృష్టించింది. ► దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా తగువులాడుతోంది. ► అతిచిన్న ఇస్లామిక్ దేశమైన బ్రూనైతో కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది. ► తమ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. పశి్చమ నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణలకు పాల్పడింది. ► దాదాపు 290 మైళ్లకుపైగా సరిహద్దు ఉన్న భూటాన్‌తో అనేక చోట్ల హద్దుల విషయంలో చైనా వివాదాలు సృష్టించింది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ► లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది. ► సరిహద్దు వివాదం కారణంగా తమ దేశంలోని ఓ చెక్‌పాయింట్‌పై దాడి జరిగిందని చైనా చెబుతోంది. ఈ ప్రాంతం విషయంలో మంగోలియాకు, చైనాలోని గాన్సు ప్రాంత ప్రజలకు మధ్య వివాదం ఉంది. -
భద్రతపై రాజీ లేదు: రాజ్‌నాథ్
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు. -
ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు?
అవలోకనం దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వారసత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయడంలోనూ, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలోనూ మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రి అయినాక శ్రీలంక అధ్యక్షుడు రణసింగె ప్రేమదాసను కలుసుకున్నారు. సౌమ్యుడైన ప్రేమ దాస ‘‘మీరు మీ సైన్యాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారు?’’ అని కలిసిన వెంటనే ప్రశ్నించారు. దీంతో సింగ్ ఆశ్చర్యపోయారు. ప్రేమదాస ప్రస్తావించినది తమిళ టైగర్లతో పోరాడటం కోసం భారత సైన్యం శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) గురించి. భారత్ అప్పట్లో వేల కొలది జవాన్లను శ్రీలంకలో మోహరించింది. ఆ పోరాటాన్ని మనం లంక ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా పరిగణించాం (ఆ పోరాటంలో మన వాళ్లు వెయ్యి మందికి పైగా మరణించారు). అయితే, ఒక దశ తర్వాత లంక ప్రజలు, దాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా భావించారని, భారతీయులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని కోరుకున్నారని సింగ్ అభిప్రాయం. ఆ అంతర్యుద్ధం సింహళ జాతీయవాదుల విజయంతో ముగిసింది. అయినా శ్రీలంకపై భారత్ ప్రభావం 30 ఏళ్ల క్రితం ఉన్నంతగా నేడు లేదు. శ్రీలంక ప్రజలలో ఎక్కువ మంది జోక్యందారుగా చూసే దేశం మరేదైనా ఉందంటే అది చైనా. కొలంబో, హంబన్తోటలలో చైనీయులు నిర్మిస్తున్న బ్రహ్మాండమైన ఓడ రేవులు భారత్ పోటీపడలేన ంతటి భారీ ప్రాజెక్టులు. అయితే, వాటితోపాటూ చైనా అభివృద్ధి నమూనా కూడా అక్కడికి దిగుమతి అవుతుంది. ఇంచుమించుగా అది మీ భూభాగంపై చైనా వలసలను అనుమతించడమని అర్థం. మీ తాహతుకు తగ్గ లేదా మించిన భారీ రుణాన్ని చైనా నుంచి తీసుకోవడం అని కూడా అర్థం. చైనీయులు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. దాని పేరు ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్’ (ఒకటే ఆర్థిక ప్రాంతం ఒకటే దారి). ‘బెల్ట్’ పలు ప్రధాన రహదారుల శ్రేణితో కూడినది కాగా, ‘రోడ్డు’ పలు ఓడ రేవులు, సముద్ర మార్గాలతో కూడినది. చైనా దీనిపై తన దృక్పథాన్ని వివరించడానికి మే నెలలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. అయితే, భూటాన్ తప్ప మన పొరుగు దేశాలన్నీ... శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ అన్నీ హాజర య్యాయి. ఇది, మనల్ని చుట్టుముట్టడం కావచ్చునేమోనని భారత వ్యూహాత్మక వ్యవహారాల గురించి యోచించే బృందంలో భయాలు సైతం తలెత్తాయి. చైనాతో భాగస్వామ్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆ సమావేశానికి హాజ రయ్యేవారందరినీ భారత్ హెచ్చరించింది. అయినా ఎవరూ మన మాట పట్టిం చుకోలేదు. ఎందుకు? అనేదే ప్రశ్న. దానికి జవాబు, ఈ వ్యాసంలోని అసలు విష యానికి, అంటే దాదాపు ఇరుగుపొరుగు దేశాలన్నీ భారత్ పట్ల విముఖంగా లేదా అనుమానాన్పద దృష్టితోఉన్నాయి అనే సమస్య వద్దకు తిరిగి వచ్చేట్టు చేస్తుంది. హిందూ నేపాల్‌లో సైతం భారతీయుల పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఏమీ లేదు. కెనడాతో అమెరికాకు ఉన్న అనుబంధం లాంటి సంబంధం ఉన్న పొరుగు దేశం మనకు ఒకటి కూడా లేదు. మన సరిహద్దులన్నీ అమెరికా, మెక్సికో సరి హద్దులలాగా లేదా అంతకంటే అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తాయి. బహుశా తప్పంతా పూర్తిగా పొరుగు దేశాలదే కావచ్చుననీ, మనం ఇతర దేశాల దుర్మా ర్గానికి గురవుతున్న బాధితులమనీ సగటు భారతీయుల అభిప్రాయం. పైగా పొరుగు దేశాల పట్ల మనకున్న పక్షపాత పూరితమైన దృక్పథం దీనికి తోడవు తుంది. బంగ్లాదేశీయులంటే అక్రమంగా వలస వచ్చినవారని, నేపాలీలంటే కావలిదార్లనీ, పాకిస్తానీలంటే ఉగ్రవాదులనీ మనం విశ్వసిస్తాం. కొన్నేళ్ల క్రితం నేపాల్‌లో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగి, పలువురు మర ణించారు, ఆస్తి నష్టమూ సంభవించింది. నటుడు హృతిక్ రోషన్ నేపాలీలను ద్వేషిస్తానని అన్నాడనే వార్త అందుకు కారణం. రోషన్ అలాంటి మాటేమీ అన లేదు, ఆ వార్తే ఒక బూటకం. అసలు నేపాలీలు అలా వెంటనే దాన్ని నమ్మేయడం ఏమిటి? అనేదే మనం ప్రశ్నించుకోవాల్సింది. భారత్ నేడు తమ దేశాన్ని కొండ ప్రాంతాల ప్రజలు, మైదాన ప్రజలుగా విభజించడానికి ఎత్తులు వేస్తోందని, కొండ ప్రాంతాలవారికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన, బాధాకరమైన దిగ్బంధనాన్ని ప్రేరేపిస్తోందని నేపాల్ ఉత్తర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. తమ రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుంటోందని సైతం అనుకుంటున్నారు. నేపాల్ విషయంలో భారత్‌కు సమంజసమైన బెంగలు, ప్రయోజనాలు ఉండటమూ సాధ్యమే. అయితే, ఒక హిందూ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా మనతో నిలుపుకోలేనంతగా నేపాల్‌తో మన సంబంధాలు ముక్క చెక్కలు ఎందుకు అయ్యాయి? చైనాకు వ్యతిరేకంగా మనతో ఉన్న మిత్రుడు ‘భూటాన్’ మాత్రమే. అయితే మన మధ్య సంబంధాలు ఇద్దరు సమానుల మధ్య ఉండేవి కావు. నెహ్రూ హయాంలోని భారత్, భూటాన్‌పై ‘మైత్రీ ఒప్పందాన్ని’ రుద్దింది. అది నిజానికి, భూటాన్ విదేశాంగ విధానాన్ని వీటో చేసే అధికారాన్ని భారత్‌కు కట్టబెట్టేది. సరిగ్గా చెప్పాలంటే ‘‘విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశపు సలహాల మార్గదర్శకత్వాన్ని భూటాన్ అంగీకరిస్తుంది’’ అని అది పేర్కొంది. కొన్నేళ్ల క్రితం, బహుశా వాజ్‌పేయి హయాంలో గామోసు దాన్ని తొలగించారు. దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వార సత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్ రాజ్ కాలం నాటి భారత్ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయ డంలో, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలో మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్ అండ్ రోడ్ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. మన పొరుగు దేశాలపై ఆర్థిక ప్రభావాన్ని నెరపగలగడంలో మన దేశం ఇంకా చాలా కాలంపాటూ చైనాకు సమ ఉజ్జీగా నిలవలేదు. అయితే అది, మనం ఆ దేశాలకు మంచి మిత్రులుగా కావడాన్ని నిలవరించలేదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
‘పొరుగు’ బంధాలు కీలకం
న్యూఢిల్లీ: భారత్ అభివృద్ధిలో పొరుగు దేశాలతో సంబంధాలు కూడా ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టును బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. పశ్చిమ బెంగా ల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ అనుసంధానత మరింత బలపడి, సంబంధాలు మెరుగవుతాయన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల ఆర్థికాభివృద్ధి, అనుసంధానతలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఈ ల్యాండ్ పోర్టు ప్రారంభోత్సవం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టమన్నారు. ఏటా 15 లక్షల మంది ప్రజలు, లక్షన్నర ట్రక్కులు ఈ సరిహద్దు నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా, కిషోర్‌గంజ్‌ల్లో జరిగిన ఉగ్రవాద దాడులపై మోదీ సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేం దుకు బంగ్లాకు భారత్ అండగా ఉంటుందని హసీనాకు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాభివృద్ధికి ఐసీపీ కీలక అడుగని హసీనా వెల్లడించారు. భారత్‌తో సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ప్రధాన సరిహద్దు మార్గం. యాభై శాతానికి పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఈమార్గం ద్వారానే జరుగుతుంది. భద్రత, ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి ముఖ్య సేవలను సమర్థవంతంగా పెట్రాపోల్ ఐసీపీ అందిస్తుంది. సరిహద్దుల్లో గందరగోళం లేకుండా ప్రజా, సరుకు రవాణాకు దోహడపడుతుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ల్యాండ్ పోర్టు ద్వారా 68 వేల కోట్ల వాణిజ్యం జరుగుతుందని మమత చెప్పారు. -
పొరుగు దేశాలకు భారత్ పెద్దన్న కాదు..
బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఢాకా: ‘భారత్ పెద్ద దేశమే కావచ్చు. అయితే పొరుగు దేశాలకు పెద్దన్న మాత్రం కాదు. భాగస్వామి మాత్రమే’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. పురోగతి, శాంతి, సమృద్ధిలో భారత్, బంగ్లాదేశ్‌లు భాగస్వాములని, రెండు దేశాలు కలసి పనిచేసి, కలసి అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఢాకాలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గ్రౌండ్ రూల్స్ ఆఫ్ న్యూ పారడైమ్’ అనే కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ, ‘భారత్, బంగ్లాదేశ్‌లకు గొప్ప రాజ్యాంగాలు ఉన్నాయి. మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన అభివృద్ధి అభినందనపూర్వకంగా ఉండాలి. కలసి పనిచేద్దాం, కలసి అభివృద్ధి చెందుదాం’ అని పేర్కొన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లా ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.