తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం.
ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం.
త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment