defence minister
-
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్‌నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్‌సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్‌నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. భారత్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకానీ, ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని పాక్‌ను హెచ్చరించారు. ఈ మేరకు జరాజ్నాథ్ సింగ్ గురువారం జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పాకిస్తాన్ అసమర్ధంగా ఉందని భావిస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్‌లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చటంలో భారత్ వెనకడుగు వేయబోదు. ఉగ్రవాదులు భారత దేశంలోని శాంతికి భంగం కలిగిస్తే.. మేము పాకిస్తాన్లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుపెడతాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని అక్రమించుకోదు. కానీ, ఎవరైనా భారత్‌లోని శాంతికి భంగం కలిగిస్తే.. ఏమాత్రం ఊరుకోం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక.. ఇటీవల పాక్‌లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనక భారత్ హస్తం ఉన్నట్లు యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్‌లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని.. ఈ విషయాన్ని ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. గార్డియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ.. ‘పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్ హత్యలు చేయటం భారత విధానం కాదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్తాన్ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్‌నాథ్
తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.. రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారతదేశం 2047 సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన బలమైన సాయుధ బలగాల అవసరముందని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన ఆయన త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను వినియోగించుకుంటూ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) డిజిటల్ సేవలను ప్రారంభించారు. రక్షణ శాఖ అకౌంట్స్ విభాగం 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణశాఖ అకౌంట్స్ విభాగం మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని అన్నారు. అంతర్గత నిఘా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎక్కడైనా అనుమానాస్పద వ్యవహారాలు చోటు చేసుకుంటే వెంటనే గుర్తించే వీలుంటుందన్నారు. దీనిద్వారా సమస్యను తొందరగా పరిష్కరించుకోవడమే కాదు, ప్రజల్లో రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చన్నారు. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడాలంటే భార్య సాయుధ బలగాలకు అత్యంత ఆధునిక ఆయుధాలను, సామాగ్రిని అందించాల్సిన అవసరముందని అందుకు మనవద్ద ఉన్న ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దీనికోసం అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్న వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాలని అన్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేయడానికి అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైన ఆర్దిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని, ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా కీలకమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధమైన రీతిలో అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. వీలయితే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ వంటి సంస్థలతో చేతులు కలపాలని తద్వారా డీఏడీ ఆర్ధిక మేధస్సు పెరుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
భారత్‌తో సంబంధాలు కీలకమే.. కానీ: కెనడా మంత్రి
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. నిజ్జార్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉండొచ్చుంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా కెనడా రక్షణశాఖ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు తమకు ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో బ్లెయిర్ మాట్లాడుతూ.. నిజ్జార్ హత్య ఆరోపణల వ్యవహారం భారత్‌తో తమ బంధానికి సంబంధించి సవాలుతో కూడుకున్న సమస్యగా మారుతోందన్నారు. అదే సమయంలో చట్టాన్ని, తమ పౌరులను రక్షించడం ముఖ్యమని అన్నారు. అందుకు ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజనిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆరోపణలే నిజమని తేలితే.. కెనడా గడ్డపై, కెనడియన్ పౌరుడి హత్య విషయంలో తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినందుకు తీవ్ర ఆందోళన నెలకొంటుందని అన్నారు. చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన కెనడాకు ఉప్పందించింది అమెరికానే నిజ్జర్ హత్య అనంతరం ఆ నిఘా సమాచారాన్ని అగ్రరాజ్యం అమెరికానే ఆ దేశానికి అందజేసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సదరు సమాచారాన్ని ఆధారంగా చేసుకునే కెనడా భారత్‌పై నేరుగా ఆరోపణలకు దిగినట్లు తెలుస్తోందని ఆ కథనం పేర్కొంది. తమ దేశంలోని భారత దౌత్యాధికారుల సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా కెనడా నిఘా విభాగాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు కూడా భావిస్తున్నారు. -
కిమ్‌తో రష్యా మంత్రి భేటీ
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఉ. కొరియా అధికారిక మీడియా తర్వాత వెల్లడించింది. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్‌తో రష్యా రక్షణ మంత్రి సమావేశంకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్యాంగ్లో సమావేశమైన సెర్గీ, కిమ్‌లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్ ఆయుధాల ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు. -
యూసీసీకి మతం రంగు పులమొద్దు: రాజ్‌నాథ్ సింగ్
జోద్పూర్: దేశంలో ఉమ్మడిపౌర స్మృతి(యూసీసీ) అమలు గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ప్రతిపక్షాలు మతం కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. యూసీసీకి మతం రంగు పులమొద్దని సూచించారు. రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తోందన్నారు. -
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. దివాళా తీసిన పాకిస్తాన్..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దివాళా అంచుల్లోకి పాకిస్తాన్ వెళ్లిందని అంతా అనుకుంటున్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి, పీఎంఎల్-ఎన్ నేత ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని కుండబద్దలుకొట్టారు. పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదన్నారు. ఇక పాక్ ప్రజలు తమకాళ్లపై తామే నిలబడాలని పిలుపునిచ్చారు. సియాల్కోట్లో ఓ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రజలు అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఇప్పుడు దివాళా తీసిన దేశంలో నివసిస్తున్నాం. ఇక సొంతంగా మనకాళ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆసిఫ్ అన్నారు. Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state - Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK — Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023 దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత పీటీఐ ప్రభుత్వమే కారణమని ఖవాజా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్‌కు తిరిగితీసుకొచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మార్చారని కూడా ఖవాజా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖవాజా ఆరోపణలను ప్రతిపక్ష పీటీఐ పార్టీ తిప్పికొట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశాన్ని దివాళా తీయించిందని ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో పాకిస్తాన్‌కు 6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 2022లో వరదల తర్వాత మరో 1.1 బిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. కానీ దేశంలో రాజకీయ గందరగోళం మధ్య ఆర్థిక ఏకీకరణపై పాకిస్తాన్ మరింత పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబర్‌లో చెల్లింపులను నిలిపివేసింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్ -
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర
మాస్కో: ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఒకటే గగ్గోలు పెడుతోంది రష్యా. ఉక్రెయిన్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కానీ రష్యా మాత్రం డర్టీ బాండు ఉపయోగిస్తోదంటూ ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వీడియో కాల్లో చైనీస్ రక్షణ మంత్రి వీ ఫెంఘేతో ఈ విషయమై సంభాషించారు. ఆ తర్వాత బుధవారం భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా ఫోన్లో మాట్లాడుతూ. ...ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఈ డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబు. ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి. రష్యా మాత్రం పదేపదే నాటో ప్రత్యర్థులతో కలిసి ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు అవన్నీ అబద్ధాలు అని ఉక్రెయిన్ కొట్టిపారేస్తోంది. ఈ మేరకు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ....ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న పక్కా సమాచారం మా వద్ద ఉంది. అటువంటి విధ్వంసకర చర్యలను నియంత్రించేలా ప్రంపంచ దృష్టికి తీసుకు రావడమే గాక అందుకు తగు చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. (చదవండి: వీడియో: ఉక్రెయిన్‌పై అణుదాడికి అంతా రెడీ?.. పుతిన్ పర్యవేక్షణలోనే!) -
ఆర్మీ పరికరాలు , అస్త్రాలకు ఆయుధ పూజ చేసిన రాజ్ నాథ్ సింగ్
-
‘పీవోకే’ అంశంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు!
సిమ్లా: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్. ‘1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్‌నాథ్. అనంతరం హమిర్పుర్ జిల్లాలోని నదౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు. గతంలో భారత్ రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు. 8 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.13,000 కోట్లు చేరిందని గుర్తు చేశారు రాజ్‌నాథ్. 2047 నాటికి రూ.2.7లక్షల కోట్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేషించుకున్నట్లు చెప్పారు. మానవత్వం కోణంలో భారత్ ఏదేశంపై దాడులు చేయాలేదని, ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోలేదన్నారు. కానీ, భారతలో శాంతికి విఘాతం కలిగంచాలని చూస్తే ధీటైన సమాధానం ఇస్తామని శత్రుదేశాలకు హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అదే వైఖరికి తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవలే రాజ్‌నాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే శారదా శక్తి పీఠం అక్కడే ఉందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని తెలిపారు. భారత్ పై దుష్ట పన్నాగాలు పన్నేవారికి తగిన సమాధానం ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇదీ చదవండి: ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
తగ్గేదేలే.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ మేరకు డ్రాగన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల వీరోచిత సేవలను ప్రశంసించారు. లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని.. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. -
ఎన్నికల్లో ఓడినా.. సీఎంగా ఆయనే!
సాక్షి డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎం ఎవరంటూ...గత 11 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మళ్లీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజెపీ శాసనసభా పక్షం సమావేశం తదనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజెపీ నాయకులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి తదితరలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ప్రకటిస్తున్నాం. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. 2012, 2017లో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్కర్ సింగ్ ధామి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి ధామీని చేసిని కృషి బీజెపీ నాయకులు అభిమానాన్ని చూరగొంది. అదే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించేలా చేసింది. అయితే ఈ అత్యున్నత పదవీ కోసం దాదాపు అరడజను మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారందరీలో పుష్కర్ సింగ్ ధామి పేరే అధికంగా వినిపించడంతో ఓడిపోయినప్పటికీ.. మళ్లీ సీఎంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే ఛాన్స్ కొట్టేశారు. (చదవండి: ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం) -
కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం...దేశ నిర్మాణ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డిఆర్డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు. (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
ఆ వివరణ సరిపోదన్న పాక్! ఉమ్మడి విచారణకు డిమాండ్
It is not enough to satisfy Pakistan: క్షిపణి ఘటనపై భారత రణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మార్చి 9 నాటి సంఘటనలా 'బాధ్యతా రహితమైన వివరణగా పేర్కొన్నాడు. పైగా ఇది 'అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని అన్నారు. భారత్ ఆదేశించిన దర్యాప్తును కూడా ఏకపక్షమైన విచారణగా ఆరోపించింది. పాకిస్తాన్‌ని సంతృప్తి పరచడానికి రాజ్‌నాథ్ సింగ్ వివరణ సరిపోదని, పైగా తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. తాము ఉమ్మడి దర్యాప్తును కోరుతున్నాం అని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఈ ఆయుధం వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నందున ఈ సంఘటన ప్రభావం ఒక ప్రాంతానికి పరిమితం కాదన్నారు. ఇది కేవలం ప్రమాదం అని చెబితే సరిపోదు అని తేల్చి చెప్పారు. అయితే భారత్ తన తప్పును అంగీకరించడమే కాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తానని కూడా తెలిపింది. పైగా తప్పులుంటే చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఈ విషయమై స్పందించింది. పైగా ఈ ఘటన అనుకోని ప్రమాదమని మరేం ఉద్దేశాలు లేవని భావిస్తున్నాం అని చెప్పింది కూడా. కానీ పాక్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడటమే కాక తన అక్కసును వెళ్లగక్కుతోంది. (చదవండి: పాక్‌లో భారత మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన) -
క్షిపణి మిస్‌ఫైర్‌పై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
-
మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటన రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వంకతో పాక్, భారత్‌పై రెచ్చిపోయి ఆరోపణలు చేయగా.. భారత్ మాత్రం పొరపాటున జరిగిందంటూ కూల్‌గా తప్పు ఒప్పేసుకుంది. ఈ తరుణంలో Missile Mishap మిస్సైల్ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం. పాక్ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందోత తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్‌లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు. We give highest priority to safety&security of our weapon system. If any shortcoming found in this context, it'll immediately be rectified. I'd like to assure the House that our missile system is highly reliable & safe. Our safety procedure & protocols are high level: Defence Min pic.twitter.com/4miUumF5Na — ANI (@ANI) March 15, 2022 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ, గత బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలింది. మియా చన్ను సమీపంలో అది పడిపోయిందని, ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని భారత్‌పై ఆగ్రహం వెల్లగక్కింది పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని పాక్ ఆరోపణల తర్వాత భారత్ వివరణ ఇచ్చుకుంది. భారత్ చెప్పింది కదా పాక్ భూభాగంలోకి మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై అమెరికా స్పందించింది. అది ప్రమాదం అని భారత్ చెప్పింది కదా.. పైగా దర్యాప్తునకు ఆదేశించింది. మరేం ఉద్దేశాలు ఉండకపోవచ్చనేం భావిస్తున్నాం. ఇంతకు మించి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అని భద్రతా కార్యదర్శి నెడ్ ప్రైస్ మీడియాకు తెలిపారు. -
మహిళ కాళ్లు మొక్కిన రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పరమవీర చక్ర పొందిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నోదేవి పాదాలను తాకారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకాగా అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిరస్మరణీయ విజయానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి 1971 యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ ముక్తిజోద్ధులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో స్నేహపూర్వకంగా కలిసి వారితో సంభాషించారు. ‘భారత సాయుధ దళాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన ముక్తిజోద్ధులతో కలిసి పనిచేశాయి. యుద్ధ అనుభవజ్ఞుడైన కల్నల్ హోషియార్ సింగ్‌ను 1971 యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్రతో సత్కరించారు, ఇది బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిందని’ తెలుపూతూ ట్వీట్ చేశారు. Had a warm interaction with the Bangladeshi Muktijoddhas and the Indian war veterans who fought against injustice in 1971 war. The Indian Armed Forces worked together with the courageous Muktijoddhas in their valiant struggle.#SwarnimVijayParv pic.twitter.com/R6LnbUzeZC — Rajnath Singh (@rajnathsingh) December 14, 2021 -
‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..
ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైఎస్ అడ్మిరల్ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది. చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్ రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది. ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చైనాను దీటుగా ఎదుర్కొంటాం
టోక్యో: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లో తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మోతెగి, రక్షణ మంత్రి నోబూ కిషిలతో మంగళవారం ముఖాముఖి చర్చలు జరిపారు. ఆసియాలో చైనా బలప్రయోగం, దూకుడు చర్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆ సమావేశంలో ఇరు దేశాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛయుత వాతావరణం నెలకొనడానికి అమెరికా తానే ముందుండి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. చైనా, దాని మిత్రపక్షమైన ఉత్తర కొరియాల నుంచి ఎవరైనా సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటే ఆ దేశాలకు బైడెన్ ప్రభుత్వం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చెప్పారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై తీవ్రంగా విమర్శించిన మంత్రులిద్దరూ బుధవారం దక్షిణ కొరియా నేతలతో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాలకు చెందిన మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యల్ని తీవ్రంగా ఖండించారు.