
మాట తడబడిన రక్షణ మంత్రి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట తడబడ్డారు. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దాంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు.
తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని పారికర్ అన్నారు. టీఆర్ఎస్ యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతోందని, ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. రాష్ట్రపార్టీతో కొంత సమాచార లోపం జరిగిందని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గోవాలో 0.4 శాతం ఓటింగు ఉన్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో ఇప్పటికే 14 - 15 శాతం ఓటింగ్ ఉందని పారికర్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని, ఆ తర్వాతే ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని సూచించారు.