BJP Telangana Committee
-
బండి సంజయ్‌కు ప్రమోషన్.. కీలక బాధ్యతలు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ను ఏదైనా ఒక రాష్ట్రానికి పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ కమిటీలో కీలక మార్పులు చేశారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఒక జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి, 13 మంది జాతీయ కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సహ కోశాధికారితో కూడిన జాతీయ కమిటీని జేపీ నడ్డా నియమించగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను పార్టీ జాతీయ కార్యదర్శిగా తప్పించారు. కర్ణాటకకు చెందిన సీటీ రవి, అస్సాంకు చెందిన ఎంపీ దిలీప్ సైకియాలను ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పక్కనబెట్టారు. అదేవిధంగా, కార్యదర్శులుగా ఉన్న యూపీ ఎంపీలు వినోద్ సోంకార్, హరీశ్ ద్వివేదిలు కూడా పార్టీ పదవులను పోగొట్టుకున్నారు. ఇంకా, పార్టీ ఉపాధ్యక్షులుగా మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన అబ్దుల్లా కుట్టీ, మరొకరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, యూపీ బీజేపీ ఎమ్మెల్సీ మన్సూర్. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలు, ఎజెండాకు కీలకంగా ఉన్న సీటీ రవికి ఉద్వాసన పలకడం వెనుక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయమే కారణమన్న అభిప్రాయం ఉంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీటీ రవి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన నేత లతా ఉసెండీకి పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. జాతీయ కార్యదర్శులుగా నియమితులైన 9 మందిలో ఏడుగురు పాతవారు కాగా, రాధా మోహన్ అగర్వాల్‌ను కొత్తగా తీసుకున్నారు. ►బీజేపీ జాతీయ నూతన పదాధికారుల జాబితా: జాతీయ ఉపాధ్యక్షులు: రమణ్‌సింగ్, వసుంధరా రాజే సింధియా, రఘుబర్ దాస్, సౌదాన్ సింగ్, బైజయంత్ పాండా, సరోజ్ పాండే, రేఖా వర్మ, డీకే అరుణ, ఎం.చుబా ఎఓ, అబ్దుల్లా కుట్టీ, లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్, లతా ఉసెండీ, తారిక్ మన్సూర్. ►జాతీయ ప్రధాన కార్యదర్శులు: అరుణ్ సింగ్, కైలాశ్ విజయవర్గీయ, దుష్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ ఛుగ్, వినోద్ తావడే, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్, రాధా మోహన్ అగర్వాల్. ►జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): బీఎల్ సంతోష్ ►జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): శివప్రకాశ్ ►జాతీయ కార్యదర్శులు: విజయా రాహట్కర్, సత్య కుమార్, అరవింద్ మీనన్, పంకజా ముండే, నరేంద్ర సింగ్ రైనా, అల్కా గుర్జర్, అనుపమ్ హాజ్రా, ఓం ప్రకాశ్ ధువ్రే, రుతురాజ్ సిన్హా, ఆశా లాకడా, కామాఖ్యా ప్రసాద్ తాసా, సురేంద్ర సింగ్ నాగర్, అనిల్ ఆంటోని. ►కోశాధికారి: రాజేశ్ అగర్వాల్ ►సహ కోశాధికారి: నరేశ్ బన్సల్ -
ఎన్నికల ‘రూట్’లో బీజేపీ రథయాత్రలు!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్రలకు సిద్ధమైంది. వీలైనంత ఎక్కువ మంది ముఖ్య నేతలను భాగస్వాములను చేయడంతోపాటు.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకోవడానికి రథయాత్రలే ఉత్తమమనే నిర్ణయానికి వచి్చంది. నిరీ్ణత గడువు ప్రకారం 8 నెలల్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాల వేగం పెంచాలని రాష్ట్ర నేతలను జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతలుగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామయాత్ర’ ద్వారా ఇప్పటివరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేశారు. మిగతా 63 స్థానాల్లో పాదయాత్ర నిర్వహించేంత సమ యం లేనందున.. రథయాత్రలకు బీజేపీ మొగ్గు చూపింది. ఇందుకోసం 5 ఎన్నికల రథాలను సిద్ధం చేస్తున్నారు. ఒకే దఫాలో రాష్ట్రమంతా పూర్తయ్యేలా.. రాష్ట్రం మొత్తాన్ని ఒకే దఫా పూర్తి చేసేలా ఐదు వైపుల నుంచి ఐదు రథయాత్రలను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ యాత్రల రూట్లు, షెడ్యూల్‌పై చర్చించి త్వరలోనే తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఏప్రిల్ తొలివారంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల వారీగా కూడా రథయాత్రలు నిర్వహించనున్నారు. ప్రతి లోక్‌సభ స్థానంలో ఒక్కోరోజు ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో ఈ యాత్రలు సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటికి సంబంధించిన రూట్‌మ్యాప్‌లను కూడా త్వరలోనే ఖరారు చేయనున్నట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలోని ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలోని రెండేసి అసెంబ్లీ సీట్లలో సంజయ్ రథయాత్ర నిర్వహించేలా తుది షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్టు సమాచారం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు ప్రాంతాల నుంచి ఒక్కో బృందం 11 జిల్లాల చొప్పున కవర్ చేసేలా ‘జన్‌విశ్వాస్’ రథయాత్రలను నిర్వహించారు. అదే తరహాలో తెలంగాణలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్రలలో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొనేలా పర్యటనల షెడ్యూల్‌లను తయారు చేస్తున్నారు. సీనియర్లంతా రంగంలోకి.. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీలకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇకపై వరుసగా కర్ణాటక ప్రచారంలో పాల్గొనే బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఇతర జాతీయనేతలు తెలంగాణలోనూ పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో , ఆ తర్వాత 10 ఉమ్మడి జిల్లాల్లో సభలు, ఏప్రిల్ చివర్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వెంటనే వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ.. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని రాష్ట్ర ముఖ్య నేతలకు అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను, ఎన్నికల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. రాష్ట్రంలోని ఇతర విపక్షాల తీరును ప్రజలకు వివరించి, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన మోదీ ›ప్రభుత్వం, నాయకత్వం ఉన్నందున ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించినట్టు సమాచారం. కలిసి సాగాల్సిందే.. రాష్ట్ర నాయకత్వం మొదలు గ్రామ స్థాయి వరకు ఎలాంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా సమష్టిగా, కచి్చతమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మిషన్–90లో భాగంగా 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పేర్కొన్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పారీ్టకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున.. తగిన వ్యూహాలతో, కచి్చతంగా గెలుపొందేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 90 సీట్లు: బండి సంజయ్
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 90 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ కలిసి గుంపుగా పోటీ చేయబోతున్నాయని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ‘ప్రజాగోస బీజేపీ భరోసా’సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడతాం.. రుణాలివ్వాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వమేనని తాను సవాల్ విసిరితే ఇంతవరకు సమాధానం లేదని సంజయ్ విమర్శించారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి రూ.5.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, నయీం డైరీ ఎటుపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. 24 గంటల కరెంటుపై రాజీనామాకు సిద్ధమా? ‘రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రగల్భాలు పలికే సీఎం కేసీఆర్ ఆ విషయానికి కట్టుబడి ఉంటారా? ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా? స్టేషన్ ఘన్పూర్ నుంచి సవాల్ చేస్తున్నా’అని బండి సంజయ్ పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ తదితర హామీలన్నీ అమలుకు నోచుకోలేదని, ఇక్కడినుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా ఏమీ చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు పైపుల కంపెనీలు పెట్టుకున్నారని, కోట్ల రూపాయలు దోచుకున్నారని సంజయ్ ఆరోపించారు. -
‘కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం’
రసూల్‌పుర(హైదరాబాద్): సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న జరగనున్న హైదరాబాద్ విమోచన అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నుంచి 1948లో విముక్తి కలిగిందని కానీ కొత్త నిజాం కేసీఆర్ నుంచి విముక్తి కలి్పంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ విముక్తి దినోత్సవం గురించి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని, అక్టోబర్ 2వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల్లోని గడీలపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రజాకార్ల అకృత్యాలను తెలిపేలా పరేడ్ మైదానంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 12న రంగోలి, 13న హైదరాబాద్ విమోచన చేయాలని పోరాడిన వారి విగ్రహాలకు అభిషేకం, 14న యువమోర్చా ఆ«ధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ, 15న చార్మినార్ నుంచి మహిళా మోర్చా ర్యాలీ, 16న షోయాబుల్లా ఖాన్ విగ్రహానికి నివాళులు లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 17న ప్రతి డివిజన్ నుంచి వంద మోటర్ సైకిళ్లతో పరేడ్ మైదానానికి రావాల్సిందిగా కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తగ్గేదే లేదని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం.. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలు తగ్గేదెలే అని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. సెపె్టంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్.. ఎంఐఎం నేత అసదుద్దీన్ అనుమతి అడిగారన్నారు. అత్యంత క్రూరుడైన ఖాసీం రిజ్వీ వారసుల అనుమతి అడగడం హేయమైన చర్య అని ఆరోపించారు. గతంలో అసదుద్దీన్ జాతీయ జెండా పట్టుకునే వారు కాదని.. కానీ, ఇప్పుడు నమాజ్ చేస్తున్నప్పుడు కూడా జెండా పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డా.లక్ష్మణ్, రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం -
బీజేపీలో నటి రేష్మాకు కీలక పదవి!
సాక్షి, హైదరాబాద్ : తనకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని టాలీవుడ్ నటి, ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోడ్ అన్నారు. తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని నటి ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరిన విషయం విదితమే. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలుసుకుని ఘన స్వాగతం పలికిన వారిలో రేష్మ కూడా ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హారితహారం, డబుల్ బెడ్రూమ్, ఇతర పథకాల అమలు సరిగా లేదని విమర్శించారు. 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని గుర్తుచేశారు. హరితహారం కార్యక్రమం నిర్వహించాలని గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగించారనీ, అసలు అది ఎలా సాధ్యమవుతుందని టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రశ్నించారు. హరితహారం క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించలేకపోయారని పేర్కొన్నారు. 1,121 కోట్ల రూపాయాలు పట్టణ గృహ నిర్మాణానికి, 190 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని ఈ సందర్భంగా యెండల గుర్తుచేశారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇళ్లకు 2,121 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో 800 కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. -
‘అమిత్ షాపై టీడీపీ గుండాలతో దాడి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు, యాత్రలు చేసిన ప్రజల నమ్మరని ఆయన అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మజ్లిస్‌కు కొమ్ము కాస్తూ టీఆర్ఎస్ పార్టీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవిధమైన రాజకీయాలకు పాల్పడ్డారో జనమంతా చూశారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్న తాము, ఇప్పుడు 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు. 90 శాతం క్రైస్తవులు ఉన్న నాగాలాండ్, ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లోనూ బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ పెట్టే ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామిలీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాఫ్ట్రంలో 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటి వరకు వారికి మొత్తం పరిహారం ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కమిషన్ కాసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకం మొత్తం భూస్వామి బంధు పథకంగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వరోగ నివారిణిలా రైతు బంధు పథకాన్నే కేసీఆర్ వల్లిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నిధుల్లో 40 కోట్లు మజ్లిస్ పార్టీకి కేటాయించారని ఆరోపించారు. టీఆర్ఎస్ చెల్లని రూపాయి, టీడీపీ పేలని తుపాకీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి భక్తునిగా వస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించారని ధ్వజమెత్తారు. -
టీఆర్ఎస్ది జేడీఎస్ పాత్రే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి తమ పార్టీని గెలిపించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన సమక్షంలో సామాజిక కార్యకర్త భువన రెడ్డి, జంగు ప్రహ్లాద్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ ఆదేశాలతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారని, కానీ కాంగ్రెస్-జేడీఎస్ కుట్రలు చేసి ఆయనను పది నుంచి దించేశాయని విమర్శించారు. సీఎం పదవిని తాకట్టు పెట్టి జేడీఎస్‌ను కాంగ్రెస్ లోబర్చుకుందని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఒకప్పుడు కత్తులు దూసుకున్న జేడీఎస్, కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలు బూటకమన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కలిసిపోతాయని, కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ పావుగా మారిందని ఎద్ధేవా చేశారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ కవల పిల్లలని వ్యాఖ్యానించారు. జేడీఎస్‌కు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కేసీఆర్ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఒకవైపు ఉంటే మిగిలిన పార్టీలన్నీ మరొకవైపు అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ వైరుధ్యాలున్న పార్టీలతో కలిసి ఎదుర్కోవాలని అనుకుంటోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాలు గులాబీ దండుకే పరిమితం, అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణాలో కూడా టీఆర్ఎస్ది జేడీఎస్ పాత్రేనని అన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. లక్ష్మణ్ వినతిపత్రం తీసుకోవడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు శాంతించారు. -
‘కేరళ రాజకీయం’పై హైదరాబాద్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : గడిచిన కొన్ని ఏళ్లుగా కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హత్యారాజకీయాలపై బీజేపీ, సీపీఎం తెలంగాణ శాఖలు పోటాపోటీ ప్రదర్శనలకు దిగడంతో సోమవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోయర్ ట్యాంక్‌బండ్ ఇందిరాపార్క్ వద్ద గుమ్మికూడిన బీజేపీ శ్రేణులు.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం(బసవపున్నయ్య భవన్) వైపునకు ర్యాలీగా బయలుదేరారు. అటు సీపీఎం శ్రేణులు సైతం పోటీ ర్యాలీకి సిద్ధమయ్యారు. అసలు ఈ రెండు పార్టీల ర్యాలీలకు అనుమతులే లేవంటూ పోలీసులు ఇరువర్గాలనూ అడ్డుకున్నారు. కాగా, ఇందిరాపార్క్ సమీపంలోనే బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు నాయకత్వం వహించిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ల, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతావారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఆందోళన పిలుపును ముందే ఇవ్వడంతో సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు నిరసనగా తెలంగాణ బీజేపీ శాఖ ఈ ఆందోళన చేపట్టింది. అటు సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాతీయ నాయకుడు అజీజ్ పాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విమోచనం’ నిర్వహించే వరకు ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సూర్యాపేట అర్బన్: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ అమరవీరుల త్యాగాలు వృథా అవుతున్నాయని, వాటి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని చెప్పారు. అమరుల వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేసి నేటి యువతకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. అధికారంలోకి రాగానే విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీకి భయపడి మాట మార్చారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. వారం రోజులపాటు విమోచన దినం కోసం యాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. రైతు సమన్వయ సమితుల కోసం తెచ్చిన జీఓ 39 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే లక్ష్మణ్, సంకినేని వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు రాస్తే రామాయణం, చెప్తే భారతంలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవ చేశారు. వరంగల్‌లో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశం రెండో రోజు ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 106 సంక్షేమ పథకాలపై దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం సర్జికల్ స్ర్టైక్స్, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ప్రధాని పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వాపోయారు. మంత్రులు, అధికారులపై ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హరితహారంలో నాటే మొక్కల కన్నా ఇచ్చే ఫోజులే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దళితులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, సిరిసిల్ల ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే.. భారీ జన సమీకరణతో బీజేపీ నిర్వహింస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కమలనాథుల పోటాపోటీ
అధ్యక్ష పదవులు దక్కించుకునేందుకు వ్యూహాలు 10, 11, 12 తేదీలలో జిల్లా కమిటీల ఎన్నికలు ఎవరికివారుగా ప్రయత్నాలు అవసరమైతే ఎన్నికలకు వెళ్లే యోచన సాక్షి, వరంగల్ : భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతలు ఎవరివారుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలోనే కొత్త జిల్లాకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ ఐదు జిల్లాల కమిటీల నియామకం కోసం నవంబరు 10, 11, 12 తేదీల్లో ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు ఎక్కువగానే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎక్కువ మంది నేతలు అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల పరిచయాలతో జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో పోటీ ఇంకా ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉండడంతో ఆశావహులు ఏ అవకాశాన్నీ వదుకోవడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలను, తమ బలాలను అధిష్టానానికి నివేదిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అవసరమైతే ఎన్నికలకు సిద్ధమేనని పలువురు ఆశావహులు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఏకగ్రీవంగానే అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రచిస్తోంది. కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లాలను పరిశీలిస్తే వరంగల్ అర్బ¯ŒS జిల్లాలో బీజేపీకి సంస్థాగతంగా కొంత బలం ఉంది. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో కొంత వరకైనా బలం నిరూపించుకునే అవకాశం ఈ జిల్లాలోనే ఉండనుంది. దీంతో వరంగల్ అర్బ¯ŒS జిల్లాలో అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారను. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎడ్ల అశోక్‌రెడ్డిని వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దొంతి దేవేందర్‌రెడ్డి, గుజ్జ సత్యనారాయణరావు, శ్రీరాముల మురళీమనోహర్ ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగానే ఉంది. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్ఎ¯ŒS రెడ్డి, సీనియర్ నేతలు పెదగాని సోమయ్య, నెల్లుట్ల నర్సింహారావు, కొంతం శ్రీనివాస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవిని బీజేపీ సీనియర్ నేతలు వెన్నంపల్లి పాపయ్య, నాగపురి రాజమౌళి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి ఆశిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం యాప సీతయ్య, జి.లక్ష్మణ్ నాయక్, బానోత్ దిలీప్ నాయక్, గాదె రాంబాబు, వద్దిరాజు రాంచందర్‌రావు, పూసల శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. -
తెలంగాణ బీజేపీ నేతల ధర్నా
హైదరాబాద్: రైతు సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నాయకులు గురువారం సచివాలయంలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 791 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ అన్నదాతలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు రైతులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
శాశ్వత పరిష్కారం చూపాలి
-
'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యవస్థపై టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీల నియామకం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల వీసీలను నియమించింది. అయితే నియామకాలను హైకోర్టు గురువారం కోట్టివేసింది. -
అక్టోబరులో నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ నెలలో తెలంగాణలో పర్యటిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు గంటల పాటు సాగిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తారని కూడా లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజాందోళనలను చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ఇన్ చార్జి కృష్ణదాసు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలతో సమావేశమయ్యామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించామని లక్ష్మణ్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పార్టీ అధిష్ఠానం గుర్తించిందని, తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు జాతీయ నాయకులకు వివరించామని తెలిపారు. తెలంగాణ సర్కారు కుటుంబ పాలన, పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షాలను అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. -
మూడు రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ!
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ ముగిసింది. తెలంగాణలో బీజేపీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, ఒడిషాలలో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో సెప్టెంబర్ నెలలో కొంతమంది కేంద్ర మంత్రులు, అమిత్‌షా పర్యటించను, అక్టోబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్టీ ప్రయోజనాల కోసం విచ్చేయనున్నారు. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పుపై కూడా ఆ పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బేజేపీ నేతల భేటీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మాట తడబడిన రక్షణ మంత్రి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి వచ్చిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట తడబడ్డారు. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దాంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని పారికర్ అన్నారు. టీఆర్ఎస్ యథేచ్ఛగా ఫిరాయింపులకు పాల్పడుతోందని, ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. రాష్ట్రపార్టీతో కొంత సమాచార లోపం జరిగిందని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గోవాలో 0.4 శాతం ఓటింగు ఉన్న పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో ఇప్పటికే 14 - 15 శాతం ఓటింగ్ ఉందని పారికర్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని, ఆ తర్వాతే ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని సూచించారు. -
' సచివాలయం ఫిరాయింపులకు నిలయం'
నల్గొండ: తెలంగాణ సచివాలయం పార్టీ ఫిరాయింపులకు నిలయంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అందులో భాగంగానే టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కోదండరాంపై రాజకీయ దాడి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కోదండరాంపై టీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సిగ్గు చేటన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. మోదీ రెండేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ.2లక్షల కోట్లకు పైనే నిధులు కేటాయించారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని కృష్ణాబోర్డు వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే హైకోర్టు విభజన సమస్యను కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని లక్ష్మణ్ చెప్పారు. -
'బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టింది'
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు. గురువారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్లమెంట్లో, బయట పోరాటం చేసింది బీజేపీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్న ఫలాలు కింది స్థాయికి వెళ్లే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. సెప్టెంబర్ 17ను కూడా ప్రభుత్వమే అధికారికంగా జరపాలని డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
అడుగులు నేర్చిన ఆదర్శం
సందర్భం మోదీ రెండేళ్ల పాలన మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభించాయి. బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పించారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. ‘భారత ప్రజల అంచనాలకు మించి నరేంద్రమోదీ సర్కారు విజయాలు సాధించింది’ అంటూ బీజేపీ అగ్ర నేత అభినందించడం ఎంతో వాస్తవం. చరిత్రాత్మక ప్రజా తీర్పుతో 2014 మే మాసంలో అధికారం చేపట్టిన మోదీ ఏ విధంగా చూసినా రెండేళ్ల పాటు దేశానికి విశిష్టమైన పాలన అందించారు. అయితే సాధించవలసినది ఇంకా ఎంతో ఉందన్న స్పృహతో మిగిలిన పాలనా కాలాన్ని కూడా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో మోదీ ఉన్నారు. అందుకే రెండేళ్ల పాలన సందర్భాన్ని ‘అభివృద్ధి పథంలో భారత్’ నినాదంతో నిర్వహించుకోవాలని, నేటి నుంచి (26వ తేదీ)జూన్ 15 వరకు ఎన్డీయే విజయాలను ప్రజలకు తెలియచేయాలని బీజేపీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 33 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగానే 16 మంది కేంద్ర మంత్రులతో, ఎనిమిది బృందాలు తెలం గాణలో పర్యటించనున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడానికి ప్రధాన కారణం- గ్రామీ ణాభివృద్ధికీ, పేదలూ రైతుల సంక్షేమానికీ, మహిళలు, యువత, కార్మికుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడమే. పారదర్శకతతో, అవినీతి మచ్చ లేకుండా జవాబుదారీతనంతో పనిచేస్తూ, అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగ స్వాములను చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. మోదీ నాయకత్వం స్ఫూర్తిదాయకమైనది. మునుపెన్నడూ లేని రీతిలో దేశ ప్రజలు ఆయన మీద విశ్వాసం పెంచుకున్నారు. అందుకు నిదర్శనం-వెసులుబాటు ఉన్నవారు ఎల్పీజీ రాయితీని వదులుకోవలసిందంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన. కోటి మందికి పైగా రాయితీని వదులుకున్నారు. ఇలా ఆదా అయిన సొమ్ముతో పేద, బడుగు వర్గాల మహిళలను కట్టెల పొయ్యిల నుంచి విముక్తం చేయడానికి మోదీ ప్రభుత్వం నడుం కట్టింది. ఐదు కోట్ల మందికి రూ. 1,600 రాయితీతో ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నది. ముద్ర పథకం ప్రవేశపెట్టి చిరు వ్యాపారులను, నిరుపేదలను వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల బాధ నుంచి విముక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువకులు, మహిళలు ఉద్యో గార్థులుగానే ఉండిపోకుండా, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరు కోవడానికి వీలు కల్పిస్తూ ప్రధాని స్టాండప్ ఇండియా పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దేశంలోని 1.25 లక్షల బ్యాంకుల శాఖలలో ఒక్కొక్క శాఖ రెండు రకాల రుణాలు ఇస్తున్నాయి. రెండున్నర లక్షల మంది యువతకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం వచ్చింది. స్టాండప్ ఇండియా పథకంలో 10 లక్షల నుంచి కోటి రూపాయల రుణ సదుపాయం కల్పించారు. మనిషిని మనిషి లాగడం (రిక్షాలో) అమానవీయమని రామ్మనోహర్ లోహియా ఎప్పుడో అన్నారు. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కమ్యూనిస్టులు కూడా ఈ విషయం పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే కోటిన్నర మందికి ఈ-రిక్షాలు అందచేశారు. మత్స్యకారులకు ఈ-పడవలు కూడా అందచేశారు. మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాను స్కిల్ ఇండియాతో అనుసంధానం చేసిన మోదీ ప్రభుత్వం దేశంలో పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి యువతకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తోంది. స్వచ్ఛభారత్ ప్రధాని సమున్నతా శయంతో ఆరంభించిన పథకం. దీనికి స్పందన కూడా అంతే స్థాయిలో ఉంది. ప్రపంచం కుగ్రామంగా మారిన ప్రస్తుత సాంకేతిక యుగంలో భారతీయ యువతను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం స్కిల్ ఇండియాను ప్రవేశపెట్టింది. భారత్‌లో పరిశుభ్రత అన్న ఆలోచన స్థిరపడడానికి ఇది దోహదం చేస్తోంది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి చేత ప్రకటింప చేయడంలో మోదీ విజయం సాధించారు. గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం మోదీ మొదటి నుంచి గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారు. పంచా యతీలకు, గ్రామ సభలకు ప్రాధాన్యం కల్పిస్తూ అంబేడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14 నుంచి పంచాయతీరాజ్ దివస్ పేరుతో 24వ తేదీ వరకు గ్రామాలలో కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ సభలలో ప్రధాని స్వయంగా పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. ఒక్కొక్క పంచాయతీకి రూ. 80 లక్షలు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. మున్సిపాలిటీలకు కూడా నేరుగా నిధులు మంజూరు చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి వినూత్న చర్యలు చేపట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటి వృత్తిగా మార్చాలన్న దృక్పథంతో మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. రైతులకు సేద్యం పట్ల అవగాహన కల్పించ డానికి సరైన సూచనలు, సలహాలు సమాచారం అందించడానికి కిసాన్ రేడియో, కిసాన్ చానల్‌ను ప్రారంభించారు. భూమికి సైతం పరీక్షలు నిర్వహించి కార్డులు ఇవ్వాలని తద్వారా ఏ పొలంలో ఏ పంట వేయాలి, ఏ ఎరువు వాడాలి అనే పూర్తి వివరాలతో రాబోయే 3 ఏళ్లలో 14 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను వితరణ చేయాలని తలపెట్టారు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వేపపూత యూరియాను తప్పనిసరి చేయడం, ఉపాధి హామీ పథకం (ఎమ్‌జి ఎన్ఆర్ఈజీఏ) క్రింద 5 లక్షల చెరువులు, కుంటలను నిర్మించడం రైతుకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చేవే. మహిళా సంక్షేమానికి చర్యలు మహిళలు ఆరాధనా శక్తిగానే కాదు ఆర్థికశక్తిగా కూడా ఎదగాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం ఉండాలని భావించి మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత రెండేళ్ల పాలనలో ముద్ర యోజనలో 79 శాతం రుణాలు మహిళలకే లభిం చాయి. బాలికల కోసం 2,61,400 పాఠశాలల్లో మరుగుదొడ్ల వసతి కల్పిం చారు. తద్వారా బాలికల హాజరు శాతం ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. 44 లక్షల మంది గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు (ఇప్పటికే 8 రాష్ట్రాలు అంగీకరించాయి). పొగబారిన వంటింటి యాతనల నుంచి విముక్తం చేసి ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వంటింటిని కల్పించి పేద మహిళల ఆరోగ్యం కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపు మోదీ అధికారం చేపట్టిన తరువాత బ్రిక్స్ కూటమిలో భారత్ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాను మించిన వేగంతో ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశంగా ఖ్యాతి తెచ్చుకుంది. డాలరు పతనమై, ప్రపంచం తలకిందులైన కాలంలో కూడా భారత్ నిలదొక్కుకోగలిగింది. కార్మికుల ప్రయోజనాలే ప్రధానంగా ప్రభుత్వం పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ సదుపాయం కల్పించడం ద్వారా అవకతవ కలకు చరమగీతం పాడింది. దాదాపు 1054 కాలం చెల్లిన చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. జన్‌ధన్‌యోజన, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథా రిటీ, గంగా ప్రక్షాళన, స్మార్ట్ సిటీలు, అసంఘటిత కార్మిక రంగానికి అటల్ పింఛను యోజన కూడా విశిష్టమైన సంక్షేమ పథకాలుగా పేర్గాంచాయి. బుల్లెట్ రైళ్ల యోచన కార్యరూపం దాలిస్తే భారత్‌కు కొత్త రూపు తథ్యం. విదేశాంగ విధానం మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని భారత ప్రజలతో పాటు, సార్క్ దేశాల ఉత్సవంగా నిర్వహించడం మంచి సంకేతాలను పంపింది. మాల్దీవులతో సహా సార్క్ దేశాలను ఆయన ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. చివరి క్షణం దాకా ఉత్కంఠలో ఉంచినా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. అయితే నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి వలెనే పాకిస్థాన్‌తో సత్సంబంధాలకు మోదీ ఎంత యత్నించినా ఆ దేశం ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల ప్రభావం నుంచి బయట పడలేకపోతోంది. చైనాతో సంబంధాలు యథావిధిగానే ఉన్నప్పటికీ, ఆ దేశం ప్రభావం శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల మీద తగ్గించడంలో భారత్ విజయం సాధించింది. అమెరికాతో భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. భూటాన్, మాల్దీవులు, మైన్మార్, శ్రీలంకల సంబంధాలకు కాంగ్రెస్ హయాంలో జరిగిన చేటును సరిదిద్దే ప్రయత్నంలో మోదీ ఎంతో ముందుకు వెళ్లగలిగారు. బంగ్లా-భారత్ ల్యాండ్ బౌండరీ ఒప్పందం ఇందుకు నిదర్శనం. దీనితో బంగ్లాలో చైనా సాగిస్తున్న నౌకాశ్రయాల నిర్మాణాల జోరు తగ్గింది. యెమెన్ సంక్షోభ వేళ కేరళకు చెందిన వందలాది మంది నర్సులను సురక్షితంగా సొంత గడ్డకు చేర్చడంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మ, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన కృషి శ్లాఘనీయమైనది. వాజ్‌పేయి బాటలోనే పాక్‌తో సంబంధాలను మెరుగుపరచాలని మోదీ చేస్తున్న కృషి ఫలించాలని అందరూ ఆశిస్తున్నారు. సాగని కుట్రలు ముప్పయ్ సంవత్సరాల తరువాత భారతదేశంలో స్వతంత్రంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిదంటే, అది మోదీకి ఉన్న ప్రజాదరణతో సాధ్యమైంది. దీనిని అస్థిర పరచడానికి పాత శత్రువులే కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. అవినీతి జాడ లేని మోదీ ప్రభుత్వాన్ని చూస్తుంటే సహజంగానే కాంగ్రెస్‌కు గుబులు పట్టుకుంది. ఎన్ని చిక్కులు కల్పించాలని చూసినా అన్నిటిని అధిగమించడం చూస్తే వామపక్షవాదులకు కూడా కన్నెర్రగానే ఉంది. మోదీకి గానీ, కేంద్రానికి గానీ సంబంధం లేని వివాదాలను, అల్లర్లను అంటగట్టడానికి తమ వంతు విఫలయత్నం చేశారు. ఈ వివాదాలను ప్రజలు పట్టించుకోలేదు. కొన్ని అపజయాలు తప్పకపోయినా, ఈ రెండేళ్లలో ఆరు రాష్ట్రాలలో బీజేపీ కొత్తగా అధికారంలోకి రాగలిగింది. మోదీ ప్రాచుర్యానికీ, ప్రాభవానికీ ఇదే నిదర్శనం. డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 9246537889 -
'తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తాం'
హైదరాబాద్ : బీజేపీ అన్ని వర్గాల పార్టీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... అసోం లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ హోదా రావాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాంట్రాక్టర్ల కోసమే డిజైన్ మార్చలేదా.. అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. -
'కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో కరవును నివారించేందుకు కేంద్రం నిధులను ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంలో మహారాష్ట్ర సర్కార్‌ను చూసి నేర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో కరవుపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ మాట్లాడుతూ... కరవుతో రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్రం ముందు కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
హైదరాబాద్: అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ తీవ్ర స్వరంతో అధికారపక్షాన్ని నిలదేసేందుకు విపక్షంలో కొత్త గొంతుక చేరనుంది. ఆ స్వరం మరెవరిదోకాదు తెలంగాణ బీజేపీ 'మాజీ' అధ్యక్షుడు కిషన్ రెడ్డిది. అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించేందుకు ఆ పార్టీ అన్నివిధాలా సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎల్పీ నేతగా కొనసాగుతున్న డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా నియమితులుకావటమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బీజేపీ సంస్థాగత నియమాల ప్రకారం ఒక వ్యక్తి జోడు పదవులు నిర్వహించడానికి వీలులేదు. లక్ష్మణ ఇప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తారు కాబట్టి, అసెంబ్లీలో లెజి స్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కిషన్ రెడ్డికి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలోకీ కిషన్ రెడ్డే సీనియర్ కావటం మరో సానుకూల అంశం. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. కిషన్ రెడ్డికి గతంలోనూ బీజేఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షడిగా ఎంపికైన లక్షణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు లక్షణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
బీజేపీని నడిపించే వారెవరు...?
కొత్త నాయకుడి వేటలో రూరల్ అర్బన్ లొల్లి హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి జరుగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాష్ట్రంలో విస్తరణకు, బలోపేతానికి మంచి అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తోంది. పార్టీ సంస్థాగత సంవత్సరంగా భావిస్తున్న ఈ తరుణంలో వీలైనంత త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గానికి ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో నాయకత్వం ఉంది. పార్టీలోని సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ శాసనసభాపక్షం మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ, పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనా రెడ్డి ఇప్పటిదాకా పోటీలో ఉన్నారు. జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్లు కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పార్టీకి ఇప్పటిదాకా హైదరాబాద్‌కు చెందిన నాయకులే ఎక్కువగా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారని, దీనితో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కావడం లేదని గ్రామీణ ప్రాంతాల నేతల వాదన. పార్టీకి ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. హైదరాబాద్‌లో పార్టీ బలంగా ఉందని, కొత్తగా జిల్లాల్లోనే పార్టీ విస్తరణకు కృషి చేయాల్సి ఉందని వారి అభిప్రాయం. గామీణ ప్రాంతాల్లోని అంశాలు, సమస్యలు, గ్రామాలపై ప్రభావం చూపించే విధానాలపై విసతృత పోరాటాలు చేస్తే తప్ప బీజేపీకి మనుగడ లేదన్నది మరో వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవిని జిల్లాల్లో పనిచేయగలిగే నేతలకే ఇవ్వాలని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నేతలు కొందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్లు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తూనే, హైదరాబాద్‌లో స్థిరపడిన నేతలు కూడా జిల్లాల వారే కదా అంటూ మరో వాదన లేవనెత్తారు. ఒకరు, ఇద్దరు నేతలు మినహా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసినవారంతా హైదరాబాద్‌కు మాత్రమే చెందినవారు కాదని వారంటున్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై, ప్రభావం చూపించే విధానాలపై సమగ్రమైన అవగాహనతో, పార్టీ నేతలను, శ్రేణులను సమన్వయం చేసుకుని నడిపించే నాయకుడు అయితే చాలునని వారు అభిప్రాయపడుతున్నారు. -
'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గవర్నర్ వైఖరిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించామని నేతలు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల లిస్టులో అధికారపార్టీ భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో పెట్టకుండా హైదరాబాద్‌లో లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని నేతలు ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలను కలిసిన వారిలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు. -
కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ మండిపాటు
-
కిషన్‌రెడ్డిని తొలగించండి: బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాసినట్లు రాజాసింగ్ మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే అధ్యక్ష పదవిలో మరొకర్ని నియమించాలని ఆ లేఖలో అమిత్ షాను కోరినట్లు రాజాసింగ్ వివరించారు. -
కేసీఆర్ కుటుంబమే అమెరికా వెళ్లాలా?
దేవయ్యపై విమర్శలు వెనక్కి తీసుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హన్మకొండ : ‘దళితుడు అమెరికాకు వెళ్లొద్దా.. విదేశాలకు వెళ్లి వచ్చే అర్హత వారికి లేదా?.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే అమెరికాకు వెళ్లాలా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీ బలపరిచిన అభ్యర్థి పగిడిపాటి దేవయ్య పై టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు చేసిన విమర్శలపై మండిపడ్డారు. దేవయ్య మాతృభూమి వరంగల్ జిల్లాపై ఉన్న ప్రేమతోనే అమెరికాలో ఉన్నా పౌరసత్వం తీసుకోలేదన్నారు. 2009 నుంచే జిల్లాలో సేవా కార్యక్రమా లు చేపట్టారని గుర్తుచేశారు. మంత్రులు తమ విమర్శలను వెనక్కు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబు ల్ బెడ్రూం ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం సామాజిక, సంక్షేమ పథకాల నిధులు ఇస్తోందని చెప్పారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికతో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. దేవయ్యను గెలిపించాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాయకులు మార్తినేని ధర్మారావు, పేరాల చంద్రశేఖర్‌రావు, రావు పద్మ, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, గాదె రాంబాబు, దిలీప్‌నాయక్, మల్లాడి తిరుపతిరెడ్డి, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
గవర్నర్ ను కలిసిన టీ బీజేపీ నేతలు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజనపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇష్టా రాజ్యంగా వార్డులను విభజించారని బీజేపీ నేతలు నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ కలిసిన వారిలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువులు బీజేపీ నేతలు ఉన్నారు. -
తెలంగాణ బీజీపీలో అయోమయం
-
తెలంగాణ బీజేపీలో బట్టబయలైన విభేదాలు
-
'ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్'
నిజామాబాద్: బీజేపీ నాయకులపై దాడులని సహించేదిలేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలుబొమ్మగా మారారని కిషన్ రెడ్ది మండిపడ్డారు. ఇసుక మాఫియాలో మంత్రుల హస్తం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రుల్లో సగం మంది టీడీపీ వారే ఉండగా,తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ నాయకులు తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రివర్గంలో ఎలా చోటు కల్పించారన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ...చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. -
'కొన్ని తప్పులు చేయడం వల్లే ఢిల్లీలో ఓటమి'
హైదరాబాద్: కొన్ని తప్పుల చేయడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హస్తిన ఎన్నికలపై ఆయన స్పందించారు. ఆప్ ఇచ్చిన ప్రజాకర్షక హామీలవైపు ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్, బీఎస్పీలు బీజేపీని ఓడించాలని ఆప్ కు మద్దతు ఇచ్చాయన్నారు. బలాన్ని పెంచుకోలేక ఓడిపోయామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలనుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ కోతలతో పరిశ్రమలు కుంటుపడుతున్నాయని చెప్పారు. బిల్డింగ్లు కట్టి అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ భావించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని సీఎం కేసీఆర్‌కు ఇప్పుడే తెలిసిందా. ఐదేళ్లుగా పాలమూరు ఎంపీగా పనిచేసిన కాలంలో కనిపించలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాగనూరు మండలం కృష్ణా గ్రామంలో సోమవారం పార్టీ నిర్వహించిన తెలంగాణ బీజేపీ పోరుయాత్ర దినోత్సవ సభలో ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సమగ్ర కుటుంబ స ర్వే, మన వూరు మన ప్రణాళిక వివరా లు ఏమయ్యాయి. కొత్తగా మళ్లీ సర్వే లు ఎందుక ంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిచేసే విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు నమ్మ కం లేదన్నారు. తెలంగాణ సాధన కో సం పోరాడిన రీతిలో రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ 1969 నుంచి ఉద్యమాలతో చైతన్యవంతులైన తెలంగాణవాసులు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నా రు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ జి ల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమై సమీక్షంచకపోవడాన్ని ప్రశ్నించారు. జి ల్లాలో కరువు బారిన పడిన మండలాలై పె ప్రకటన చేయాలని డిమాండు చేశా రు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పేరి ట వేల కోట్ల రూపాయలకు టీఆర్ఎస్ ఎసరు పెడుతోందన్నారు. మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఒత్తిడితోనే జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు మా ట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకు న్నా ప్రజలకు అండగా ఉంటుందన్నా రు. చింతా సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తూట్లు పొడుస్తోందని, కేసీఆర్ దళితద్రోహిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు కొండయ్య, మాజీ డీజీపీ, బీజేపీ మేధావుల విభాగం ఛైర్మన్ దినేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు అమర కుమార్ తదితరులు ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాములు, శ్రీవర్దన్‌రెడ్డి, రజనీరెడ్డి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కృష్ణాలో భారీ ర్యాలీ పోరుయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణానది ఒడ్డున నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కృష్ణా గ్రామం నుంచి సమావేశ ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి ఎడ్లబండిపై ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది వాహనాలు ర్యాలీని అనుసరించాయి. కృష్ణానదికి హారతి ఇవ్వడంతో పాటు కృష్ణమ్మ తల్లి విగ్రహానికి కిషన్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. అమరువీరుల ఆత్మశాంతి కోరుతూ నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అనంతరం మూడేళ్ల క్రితం చేపట్టిన పోరుయాత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. -
నిజాంపై బహిరంగ చర్చకు సిద్ధం
కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాలు సాక్షి, మహబూబ్‌నగర్: ‘నిజాం పాలనలో జరిగిన దౌర్జన్యాలను సమర్ధించుకునేందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. ఈ అంశంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో బహిరంగ చర్చకు సిద్ధం’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామంలో సోమవారం జరిగిన తెలంగాణ బీజేపీ పోరుయాత్ర దినోత్సవ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు నిజాంపై ప్రేమ లేదని, మజ్లిస్‌తో కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే దివాలాకోరు విధానం అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. అమరులను మరవద్దు: తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను మరిచిపోతే భవిష్యత్ నిర్మాణం సాధ్యం కాదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బీజేపీ పోరుయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణా గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'దేశాన్ని ఎలా నడపాలో చూపించారు'
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి భారతరత్న రావడం మా అందరికి గర్వకారణంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మురళీధర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మురళీధర్‌రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఎలా ముందుకు నడపాలో వాజ్‌పేయి చూపించారని చెప్పారు. అట్టడుగు వర్గాలను మొట్టమొదట వాజ్‌పేయి గుర్తించారని గుర్తు చేశారు.అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో పార్టీలు బుధవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, ఎన్హెచ్ఆర్సీ నోటీసు అంశంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఐకేపీ, అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ, సిరిపూర్ కాగజ్ నగర్, వరంగల్ బిల్డ్ పరిశ్రమ మూసివేతపై సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. -
ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఆలయ అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కె.లక్ష్మణ్ ఆలయ అర్చకుల పరిస్థితిపై మాట్లాడారు. ఆలయ అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'ఇదేనా కేసీఆర్ మార్క్ పరిపాలన'
హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ సీఎంగా మాటలు కోటలు దాటాయి తప్ప... చేతలు కాదని బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత డా.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి 100 రోజులైన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.... కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు పరిపాలన దక్షత లేదని... ఆయన ఇంకా ఉద్యమపార్టీలా ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజూకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనలో అన్నీ వివాదాస్పద నిర్ణయాలే అని అన్నారు. ఇదేనా కేసీఆర్ మార్క్ పరిపాలన అని డా. కె.లక్ష్మణ్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. -
కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ?
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1956 స్థానికతపై కేసీఆర్ అయిన... తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అంటు తెలంగాణ సీఎంను కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాల వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్పీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. పరిపక్వతతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కిషన్ రెడ్డి హితవు పలికారు. -
ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెర మీదికొచ్చిన కొన్ని సాంకేతిక అంశాలు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కమలదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సేనకు ముచ్చెమటలు పడుతున్నాయి. కేంద్రంలో ఒకే పార్టీగా బిజెపి అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణలో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోక్‌సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతోనే కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ బిల్లు ఆమోదించడం వల్ల తెలంగాణలో ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అటు అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడలేక ఇటు తెలంగాణ ప్రజలను సమాధానం చెప్పలేక వారు తిప్పలు పడుతున్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ రూపొందించిన సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేలా బీజేపీ అధిష్టానం చేసింది. తమ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కమలనాథులకు మింగుడుపడటం లేదు. మొన్నటి వరకు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపొద్దంటూ హస్తిన వెళ్లి వినతి ప్రతాలు అందజేశారు. ఇటీవల పోలవరం డిజైన్ మార్చాలంటూ ప్రధానికి లేఖ కూడా రాశారు. ఆ తర్వాత అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో తెలియదుగానీ అనూహ్యరీతిలో వారు వెనక్కితగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో లోక్‌సభలో బిల్లు ఆమోదానికి పార్టీ అధిష్టానం అంతాతానై నిలిచింది. పట్టుబట్టి మరీ బిల్లు ఆమోదం పొందేలా చేసి పంతం నెగ్గించుకుంది. ఈ కీలక పరిణామంతో ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీ నేతలకు ముఖం చెల్లట్లేదు. ప్రజల ముందుకెళితే మన ప్రాంతాలను ఏపీలో కలుపుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీస్తారని జంకుతున్నారు. అసలే విద్యుత్ విషయంలో పీపీఏల రద్దు, పోలవరం ఆర్డినెన్స్ , హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును నిలదీయడంలో విఫలమయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందడంతో వారికేమీ పాలుపోవడం లేదు. -
'రాజముద్రలో అమరవీరుల స్థూపాన్ని విస్మరించారు'
తెలంగాణ లోగో (రాజముద్ర)లో అమరవీరులస్థూపం లేకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో ఎంతో మంది అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. అమరుల త్యాగాలకు స్మారక చిహ్నంగా అమరవీరులస్థూపం నిర్మించారని... అలాంటి చిహ్నానికి రాజముద్రలో చోటు కల్పించకపోవడం దారుణమని ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూన్ 1వ తేదీ అర్థరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్బావ సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఆ మరునాడు అంటే 2వ తేదీన అన్ని గ్రామ మండల, జిల్లా కేంద్రాలలో జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందులోభాగంగా బీజేపీ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి: కిషన్‌రెడ్డి
* ‘బంగారు తెలంగాణ’ మాతోనే సాధ్యం : కిషన్‌రెడ్డి * ఏడు ‘టీ’లతో ప్రగతిపథాన రాష్ట్రం * మోడీ విధానాల మేరకు మా ప్రణాళిక * భారీ హామీలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సాక్షి, హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా నిలిచి, ప్రగతి సాధించిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విధానాల సమాహారంగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించారు. ‘గత జనవరిలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ‘బ్రాండ్ ఇండియా’ నిర్మాణానికి మా ప్రధాని అభ్యర్థి మోడీ కొన్ని సూచనలు చేశారు. అందులో ఆయన ట్రెడిషన్ (సంప్రదాయం), టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం), టూరిజం (పర్యాటకం), ట్రేడ్ (వాణిజ్యం), టాలెంట్ (ప్రతిభ) ఇలా ఐదు ‘టీ’లను ప్రతిపాదించారు. వాటికి ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), తెలంగాణ అనే మరో రెండు ‘టీ’లను జోడించి మేం ఎన్నికల మేనిఫెస్టో రూ పొందించాం’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు దీన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు దత్తాత్రేయ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాంచంద్రరావు, శేషగిరిరావు, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో వందకుపైగా అంశాలున్నాయి. ముఖ్యమైనవి.. తెలంగాణలో 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా. రైతులకు 85 శాతం రాయితీతో కమ్యూనిటీ సౌరవిద్యుత్తు పంపుసెట్ల సరఫరా. మండలానికి 2 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు. వీటితో రైతులకు పగటి వేళ ఉచితంగా విద్యుత్, ఐదేళ్లలో వాటి సామర్థ్యం 10 మెగావాట్లకు పెంపు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, తెలంగాణ వ్యవసాయ నిధి ఏర్పాటు. పంటల బీమా ఎకరానికి రూ.10 వేలు. రైతులకు ఆరోగ్య బీమా, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేల పింఛన్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా. నదులు, సరస్సులు, కుంటలు, రిజర్వాయర్ల అనుసంధానం. ఎండిపోయిన 30 వేల చెరువుల పునరుద్ధరణ. రెండు ల క్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 2 వేల చెరువుల నిర్మాణం. మూసీ ప్రక్షాళన, ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం. ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు నామకరణం. గిరిజన వర్సి టీ, గిరిజన కమిషన్ ఏర్పాటు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా 3 ఎకరాల భూమి లేదా హైదరాబాద్‌లో 200 గజాల స్థలం. దీంతోపాటు పెన్షన్. తెలంగాణ యోధుల చరిత్రను ప్రతిబింబించేలా వరంగల్‌లో ప్రత్యేక స్మారక నిర్మాణం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట. ఆరోతరగతి నుంచి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 25 వేల మందికి, మెడిసిన్, ఎంబీఏ సెట్లలో ఉత్తమ ర్యాంకులు సాధించిన 500 మందికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గర్భిణులకు తల్లిబిడ్డ పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున 21 నెలల పాటు పంపిణీ. -
బీజేపీ హటావో- టీడీపీ బచావో!
ఎన్టీఆర్ భవన్ డైరెక్షన్లో టీడీపీ నేతల కొత్త రాగం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంపార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీని దారికి తెచ్చుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సరికొత్త ఎత్తుగడకు నాంది పలికింది. పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా భవిష్యత్ విశాల ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామనే సంకేతాలు పంపించే ప్రయత్నాలకు తెరలేపింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బీజేపీకి చెందిన 10 జిల్లాల అధ్యక్షులు అల్టిమేటం ఇచ్చిన మరుక్షణమే టీడీపీ మైండ్‌గేమ్ రాజకీయాలకు అంకురార్పణ చేసింది. పొత్తు విషయంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీ ఢిల్లీ పెద్దలను మరోసారి బెదిరించడం ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖను ముఖ్యంగా పొత్తును వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులను తన దారికి తెచ్చుకునేందుకు చంద్రబాబు పన్నిన వ్యూహాన్ని ఆచరణలోకి తెస్తున్నారు. అందులో భాగంగా బీజేపీలో పొత్తుపై గొడవ జరుగుతుండగానే శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తెలుగుదేశం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, తెలంగాణ ఎన్నికల కమిటీ ప్రధాన కార్యదర్శి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశానికి రావాలని తన మాట వినే నేతలకు పిలుపునిచ్చారు. మూడు గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం. ఒంటరిగా వెళితే ఒక్కసీటు కూడా గెలుచుకునే స్థితిలో లేని బీజేపీకి 45- 50 సీట్లు ఇవ్వడం మూర్ఖత్వం. బీజేపీతో పొత్తు వద్దే వద్దు’ అని ఒప్పించారు. అంతటితో ఆగకుండా ఆదివారం ఉదయం 9 గంటలకు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని తీర్మానం చేసి ర్యాలీగా చంద్రబాబు ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాక ఓ అడుగు ముందుకేసీ ‘బీజేపీ హటావో- టీడీపీ బచావో’ అనే నినాదాన్ని అందుకున్నారు. బాబు మైండ్ గేమ్‌లో భాగమే! తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో శనివారం ఉదయం బీజేపీ జాతీయ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు పీయూష్ గోయల్ మరో నాయకుడితో కలిసి సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కూడా ఈ సమావేశానికి హాజరు కాగా బీజేపీ పొత్తు వ్యవహారాలు చూస్తున్న ఆ పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ గానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గానీ బాబుతో భేటీకి వెళ్లలేదు. ఈ సమావేశంలో కూడా చంద్రబాబు తన మనసులోని మాటనే మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. సీట్ల విషయంలో మార్పు లేదని, తెలంగాణలో 45 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్ల కన్నా ఎక్కువిచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా తన మాటే ఫైనల్ అని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో సమావేశం సీమాంధ్ర సీట్ల పంపకాలపై సాగింది. అదే సమయంలో బీజేపీకి చెందిన 10 జిల్లాల అధ్యక్షులు, పార్టీ నాయకులు సమావేశమై టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ జవదేకర్‌ను కలిసి మూకుమ్మడి రాజీనామాలకు హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి నష్టమే తప్ప లాభం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను అప్రమత్తం చేశార ని సమాచారం. బీజేపీ నేతలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ బలంగా ఉన్న సీట్లనే కోరుతున్నందున అటు నుంచే నరుక్కు రావాలన్న ఉద్దేశంతో టీడీపీ హైదరాబాద్ శాఖను అప్రమత్తం చేశారు. దీంతో తలసాని నేతృత్వంలోని పార్టీ నాయకులు సమావేశమై ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. ఆదివారం హంగామా చేయడం ద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజులు సాగదీసే ప్రక్రియ కూడా విజయవంత ంగా సాగుతుందని, చివరి నిమిషంలో బీజేపీ పోటీ చేసే సీట్ల జాబితాను ట్రస్ట్భవన్ ద్వారానే పంపించాలన్నదే వారి వ్యూహంగా చెపుతున్నారు. -
'నరేంద్రమోడీకి చంద్రగ్రహణం పట్టింది'
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్లో ఆరోపించారు. మోడీ వ్యాఖ్యలలో బీజేపీ అసలు రంగు బట్ట బయలు అయిందన్నారు. నరేంద్రమోడీకి చంద్రగ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు. మోడీ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని తెలంగాణ బీజేపీ నేతలను పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారించిన తీరుపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆ పార్టీపై ఇటీవల పలు బహిరంగ సభలలో తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించమంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను విభజించేసిందంటూ ఎద్దెవా చేశారు. అలాగే పురుడు పోసి తల్లిని చంపిన చందంగా రాష్ట్ర విభజన ప్రక్రియను అమలు చేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై మోడీ మాటల తూటాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యాలపై కారీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్ సభకు ఎన్నికైన పొన్నం ప్రభాకర్ పై విధంగా స్పంధించారు. -
టీడీపీతో పొత్తు వద్దు: రాజ్‌నాథ్‌తో బీజేపీ తెలంగాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో భారీగా నష్టపోతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ విన్నవించింది. పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ నేతలు ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు గురువారమిక్కడ రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. 2004లో పొత్తులో భాగంగా పార్టీ 9 పార్లమెంటు, 27 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే, రెండు అసెంబ్లీ సీట్లే వచ్చాయని పేర్కొన్నారు. అదే 2009లో ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేసినా అవే రెండు అసెంబ్లీ సీట్లు గెలిచామని, అందువల్ల టీడీపీతో పొత్తు కన్నా లేకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలని తెలిపారు. తెలంగాణ సాధన కోసం పార్టీ చేసిన ఉద్యమాల వల్ల ఆ ప్రాంతంలో పార్టీ బలం పెరిగిందని వివరించారు. ఈనేపథ్యంలో ఒంటరి పోరుకే అనుమతించాలని కోరారు. అదే సమయంలో రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలవలేకపోయిన పార్టీ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వొద్దని కూడా సూచించారు. వీరి వాదనను విన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సూచనలు, సలహాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ భేటీకి రాజ్‌నాథ్, గడ్కరీ: రెండు రోజులుగా కీసరలోని ఓ రిసార్టులో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సమావేశానికి రాజ్‌నాథ్‌తో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయడు, ప్రధాన కార్యదర్శులు సౌధాన్ సింగ్, మురళీధర్‌రావు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, గత ఆరు నెలల్లో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలను సమక్షించారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (అధినేత) మోహ న్భగవత్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొందరు ముఖ్యనేతలు మాత్రమే సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, అస్వస్థతతో ఉన్న పార్టీ నేత బంగారు లక్ష్మణ్‌ను రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పలు బీసీ సంఘాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాయి. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని ప్రతినిధి బృందం రాజ్‌నాథ్‌ను కలసి చర్చలు జరిపింది. -
తెలంగాణ బిల్లును 100 శాతం గెలిపిస్తాం: రాజ్‌నాథ్ సింగ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో భారతీయ జనతాపార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వంద శాతం గెలిపిస్తామని తెలంగాణ బీజేపీ నేతలకు రాజనాథ్ సింగ్ తెలిపారు.తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు శనివారం ఉదయం న్యూఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌కు కలిశారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేతలకు పైవిధంగా భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే తమ ప్రాంతం నుంచి 10 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తామని వారు రాజ్‌నాథ్‌కు హామీ ఇచ్చారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ను బరిలో దింపేందుకు ఆమెను ఒప్పించాలని తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు రాజనాథ్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగదని ఇటీవల ప్రచారం జరగుతున్న విషయాన్ని రాజ్‌నాథ్ ఎదుట ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఎవరో మాట్లాడిని దాని గురించి పట్టించుకోవద్దని ఆయన తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలకు హితవు పలికారు. -
జనాన్ని చంపినందుకా జైత్రయాత్రలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రజలను తొమ్మిదేళ్లుగా వంచించి, వురణాలకు కారణమైనందుకా ఇపుడు మంత్రుల జైత్రయాత్రలు?’ అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. జైత్రయూత్ర తెలంగాణ ప్రజలపై దండయాత్రగా అభివర్ణించారు. బీజేపీ నేతలు నారాయణస్వామి నాయుడు, ఉమా, కృష్ణమనాయుడుతో కలిసి కిషన్‌రెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు, వేధిం పులు, బలిదానాలకు కాంగ్రెసే కారణమని తెలిసినా, సిగ్గులేకుండా జైత్రయాత్రలు చేస్తున్నారన్నారు. కాగా, ఉత్తరఖాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చిత్తూరు జిల్లా సైనికుడు కె.వినాయకన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5లక్షల చెక్కును కిషన్‌రెడ్డి అందించారు. -
అమ్మో చంద్రబాబుతో పొత్తా?!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టిమరల్చడంతో రాష్ట్ర బిజెపిలో కలకలం మొదలైంది. ఆయన వ్యవహార శైలి ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. రాష్ట్రంలో పనైపోయిందని తెలుసుకున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న యోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నికల్లో పొత్తుల అంశంపై కూడా ఆయన దృష్టి సారించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులతో మంతనాలు జరిపారు. గతంలో బిజెపియేతర, కాంగ్రేసేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మూడవ కూటమి మాటెత్తడం లేదు. బిజెపితో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారు కొద్దిసేపు రహస్యంగా మాట్లాడుకున్నారు. చంద్రబాబు బిజెపితో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి తెంగాణలోని బిజెపి నేతలు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. టిడిపితో పొత్తుకు వారు ససేమిరా అంటున్నారు. తెలంగాణను అడ్డుకుంది తానేనని చంద్రబాబు నాయుడు స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటి వ్యక్తితో పొత్తేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇన్నాళ్లు పడ్డ కష్టం ఆయనతో పొత్తు పెట్టుకుంటే గంగలో కలిసిపోతుందని వారు అంటున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకున్నందు వల్ల బిజెపి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అలా చేస్తే టిడిపి లాభపడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పొత్తు విషయంలో వెంకయ్యనాయుడు సహకరిస్తున్నారని తెలిసి ఆయనపై కూడా వారు మండిపడుతున్నారు. అయితే సీమాంధ్రలోని బిజెపి నేతలు మాత్రం టిడిపితో పొత్తుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీమాంధ్రలో బిజెపికి పెద్దగా బలంలేదు. ఈ పరిస్థితులలో టిడిపితో పొత్తుపెట్టుకుంటే అటు నరేంద్ర మోడీ పేరుతో కొంత, టిడిపికి స్థానికంగా ఉన్న బలంతో కొంత పుంచుకోవచ్చన ఆలోచనతో ఉన్నారు. బిజెపికి తెలంగాణలో ఇప్పటికే కొంత బలం ఉంది. తెలంగాణ ఉద్యమంతో ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణకు అడ్డుపడినటువంటి చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే నష్టం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పొత్తుకోసం సీమాంధ్ర నేతలు ఆసక్తి చూపుతున్న నేపధ్యంలో తెలంగాణ బిజెపి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్ధన రెడ్డి వారిలో కదలిక వచ్చింది. వారు పొత్తును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు సీమాంధ్రకు చెందిన 50 మంది బిజెపి ప్రతినిధి బృందం ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాధ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్‌జెట్లీ తదితరులను కలిశారు. రాష్ట్రం విభజిస్తే హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజలకు భాగం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో ఎంతో అభివృద్ధి జరిగిందని, అటువంటి నగరంలో వచ్చే అవకాశాలు దక్కకుండా పోతాయన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజలలో నెలకొన్నట్లు వారు తెలిపారు. నదీ జలాల పంపకంలో తలెత్తే ఇబ్బందులను వివరించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, రాష్ట్ర విభజన అంశాన్ని అంతర్గత వ్యవహారంగా భావిస్తోందని చెప్పారు. చంద్రబాబు మాటలనే సీమాంధ్ర బిజెపి నేతలు వల్లెవేస్తున్నట్లుగా తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నేతలు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో చంద్రబాబుకు స్పష్టతలేకపోవడంతో టిడిపితో పొత్తుకు కార్యకర్తలు ఎవరూ ఉత్సాహంగా లేరని తెలిపారు. టిడిపి మునిగిపోయే పడవని చెప్పారు. తెలంగాణలో చాలా కాలంగా బిజెపి బలపడుతోందన్నారు. ఈ పరిస్థితులలో టిడిపితో పొత్తుపెట్టుకుంటే బిజెపికే నష్టం అని ఆ పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు.