
'కొన్ని తప్పులు చేయడం వల్లే ఢిల్లీలో ఓటమి'
హైదరాబాద్: కొన్ని తప్పుల చేయడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హస్తిన ఎన్నికలపై ఆయన స్పందించారు. ఆప్ ఇచ్చిన ప్రజాకర్షక హామీలవైపు ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్, బీఎస్పీలు బీజేపీని ఓడించాలని ఆప్ కు మద్దతు ఇచ్చాయన్నారు. బలాన్ని పెంచుకోలేక ఓడిపోయామన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కిషన్రెడ్డి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచాలనుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ కోతలతో పరిశ్రమలు కుంటుపడుతున్నాయని చెప్పారు. బిల్డింగ్లు కట్టి అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ భావించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.