G. Kishan Reddy
-
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్‌కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్‌గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్‌గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్‌కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
Union Minister G Kishan Reddy: కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు
ఆర్‌ఎస్‌పురా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగుతా యని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే బీజేపీకే అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లయిన సందర్భంగా సోమవారం జమ్మూ శివారులోని బానా సింగ్ స్టేడియంలో మహోత్సవ్’ ర్యాలీనుద్దేశించిమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్‌లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు. రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు ‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్‌లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్‌కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్‌ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
ఇప్పుడైనా సర్దుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురితో విడిగా భేటీ రాష్ట్ర కోర్‌కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను వేచి ఉండాలని అమిత్ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్ ఆధారంగానే అమిత్ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వారికి గట్టిగానే క్లాస్ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్‌కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్ షా క్లాసుతోనైనా లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
‘షా’ రొస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా సన్నాహాలకు బీజేపీ తెరలేపింది. ఈ నెల 28న నగర శివారు కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న లోక్‌సభ సన్నాహక సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా హాజరవుతున్నారు. పార్టీ మండల అధ్యక్షులు మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాయకుల వరకు హాజరయ్యే ఈ భేటీలో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని ఆహ్వనిస్తున్నారు. మొత్తంగా రెండున్నరవేల మంది వరకు నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులంతా హాజరుకావడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో స్పష్టత ప్రధానంగా ఏయే అంశాల ప్రాతిపదికన ప్రజల వద్దకు వెళ్లాలి, లోక్‌సభ ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏయే అంశాలు ప్రస్తావించాలి, మోదీ సర్కార్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాలపై ఏ విధంగా ప్రచారం నిర్వహించాలన్న దానిపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరగగా, ఈసారి అంతకంటే ముందుగా మార్చి చివరిలోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం ద్వారా మంచి ఫలితాలు (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్లకు బదులు 10 వరకు గెలిచి.. సీట్లు పెంచుకోవాలనే లక్ష్యంతో జాతీయ నాయకత్వం ఉంది) సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ భేటీ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలపైనా విశ్లేషించవచ్చని చెబుతున్నారు. లోక్‌సభ ఇన్చార్జిల నియామకంపై కసరత్తు రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పార్టీపరంగా లోక్‌సభ ఇన్చార్జిల నియామకం (17 మంది సంస్థాగతంగా ఫుల్‌టైమర్స్‌కు అదనం)తో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వర్కింగ్ టీమ్ నియామకంపై కూడా ఈ భేటీలో కసరత్తు జరుగనుందని పార్టీ నేతల సమాచారం. ఇటీవల కొత్తగా గెలిచిన 8మంది ఎమ్మెల్యేలతో అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు... భారతీయ జనతా శాసనసభాపక్షం (బీజేఎల్పి)నేత ఎన్నిక కూడా అదే రోజు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచిన టి.రాజాసింగ్, రెండుసార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిల్లో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో... పార్టీపరంగా లోక్‌సభకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, సన్నాహకాలపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమీక్షించారు. -
బీఆర్ఎస్ అవినీతికి పాతరేద్దాం
గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. గజ్వేల్ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
కొడుకును సీఎం చేయడంపైనే ధ్యాస
సాక్షి, హైదరాబాద్: తన కొడుకును సీఎం చేయడం తప్ప తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా సీఎం కేసీఆర్ తీరుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన రైతుసదస్సులో కిషన్‌రెడ్డి మాట్లా డారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్ పేరుతో రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డా రు. అయినా ఆ ప్రాజెక్టుకు ఫీజబిలిటి లేదని, కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.57 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారు: బండి నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో సీఎంవో రూ. 500 కోట్లు దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేసీఆర్ నిర్వాకంవల్ల రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల సంస్థను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. థ్యాంక్స్ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలతాయా?’అని అన్నారు. వారికి స్థానం లేదు: కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి ‘భారత్ మాతా కీ జై.. వందే మాతరం అనని వారికి ఈ దేశంలో స్థానం లేదు. పాకిస్తాన్ జిందాబాద్ అనే వారు అక్కడికి వెళ్లొచ్చు’అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వచ్చే కొద్దిపాటి కరెంటు కూడా ట్రిప్ అయి వస్తోందని చెప్పారు. ‘గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో దోచుకోవాలని చూస్తోంది. ఇది ఘమండి, ఘట్ బంధన్ కూటమి’అని మండిపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ, దుర్మార్గపు ప్రభుత్వం పోవాలని మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభి ప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్ని కల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామన్నారు. తాము ఎన్నికలకు పూర్తిస్థా యిలో సిద్ధంగా ఉన్నామని, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని, తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్ని కల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ల సమక్షంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత డి.వసంతకుమార్ (ఢిల్లీ వసంత్), జైపాల్‌రెడ్డి, పాపయ్య, స్లీవెన్సన్, జహంగీర్, విఠల్, కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్ నేత లక్కి రెడ్డి సురేందర్, లక్కి రెడ్డి సాయి, చీమల లక్ష్మీనారా యణ, బాలాజీ నాయక్, బానోత్ పంతూనాయక్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ హనుమ ఫలాన్ని అందించగా ఈ ‘హనుమఫలమే.. బీజేపీ విజయఫల’మని అన్నారు. మీడియాతో మాట్లా డుతూ ’’మోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలు న్నాయి.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50 రోజులు మేమంతా ఐకమత్యంతో కష్టపడి పనిచేస్తాం. పార్టీని అధికారా నికి తీసుకొస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. 2, 3 స్థానాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ ఇటీవల ప్రధాని రెండు బహిరంగసభల తర్వాత రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని, 2,3 స్థానాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఆదిలాబాద్ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారని, సాయంత్రం నగరంలోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో.. మేధావులు, విద్యా వంతులనుద్దేశించి ఆయన మాట్లాడతారని తెలిపారు. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్‌కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్‌గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్‌సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
అమరవీరుల స్తూపం నుంచి బీజేపీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల యం వరకు ర్యాలీ జరిపారు. మొదటగా అమరవీరులకు నివాళులర్పించి, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, సినీనటి జయసుధ, ఆకుల విజయ, బండా కార్తీకరెడ్డి, రాణీరుద్రమ ఇతర నాయకులు, కార్యకర్తలు వెంటనడిచారు. ఈ సందర్భంగా ఎటు చూసినా కాషాయ జెండా పట్టుకుని జయహో మోదీ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మక సందర్భమని కిషన్‌రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పార్లమెంటులో అనేకమార్లు చర్చ జరిగినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. ‘సుమారు 50 శాతం మంది మహిళలున్న తెలంగాణలో.. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎంతో అంటకాగుతున్న కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగానే: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉంటాయనే భ్రమల్లో ఎవరూ ఉండొద్దని.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగానే జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నాయకులు, కార్య కర్తల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య స్నేహం లేదని, ఉండబోదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో మార్పు కనిపిస్తోంది.. గతంలో తాను ఉమ్మడి ఏపీ బీజేపీ ఇన్చార్జిగా ఉన్నప్పటికి, ఇప్పుడున్న పార్టీకి ఎంతో మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఆర్ఎస్పై పోరాడి కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదల బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని.. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వివిధ అంశాలపై ఆందోళనలు, నిరసనలు పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేర కు.. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి 14న ఉదయం వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపడతారు. 15వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. అదే రోజున కిషన్‌రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీ చేపట్టి.. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 17న ఉదయం హైదరాబాద్ విమోచన దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌బూ త్ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం, బహిరంగ సభ నిర్వహి స్తారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ భేటీలో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎం.రవీంద్రనాయక్, బూర నర్సయ్యగౌడ్, జి. విజయరామారావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. మూడు రథయాత్రలు.. మోదీ సభ.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మూడు వైపుల నుంచి మూడు జోన్లుగా రథయాత్ర (బస్సుయాత్ర)లను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కొమురంభీం పేరిట బాసర నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో) ఒక యాత్ర.. కృష్ణా యాత్ర పేరిట సోమశిల నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు) మరో యాత్ర.. గోదావరి పేరిట భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు) మరోయాత్రను ప్రారంభించనున్నారు. ఈ మూడు యాత్రలు కూడా చివరిలో రంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటాయి. మొత్తం 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్రలు సాగనున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలైన కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లేదా బండి సంజయ్‌ల ఆధ్వర్యంలో ఇవి సాగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభతో ఈ యాత్రలను ముగించాలని పదాధికారుల భేటీలో నిర్ణయించారు. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్‌పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు. గతంలోనే కిషన్‌రెడ్డి రిపోర్ట్ కార్డ్ హైదరాబాద్‌లో గత జూన్ 17న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్‌పాయింట్, డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్ నేత డా.ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 17లోగా అవగాహన కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్‌షాపులో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్‌మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవలేదు.. భవిష్యత్‌లో కలవబోదు.’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
దూద్‌బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్ నగరంలో నేషనల్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్‌లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైటెక్ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్ హైదరాబాద్‌లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్‌ను ప్రారంభించనున్నామన్నారు. తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జాన్వీ శర్మతో పాటు వినయ్ కుమార్ మిశ్రా, చంద్రకాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
25న డబుల్ ఇళ్ల కోసం ధర్నా
కాచిగూడ/సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ కేసీఆర్‌ను గద్దె దించడం, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించడం కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, శ్యామ్‌సుందర్ గౌడ్, నాగూరావు నామాజీ, కేశబోయిన శ్రీధర్, కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారమేశ్ యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇళ్ల అంశంపైనే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ఒక్కో జిల్లానుంచి ఐదువేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లబి్ధదారులకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను ఇవ్వాలనుకోడం సరికాదని, ముందుగా అక్కడి స్థానికులకే ఇళ్లు కేటాయించాలని, తర్వాతే ఇతర ప్రాంతవాసులకు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇళ్ల సమస్యపై ఆందోళన తర్వాత రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలపై కూడా వరుస ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
కిషన్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’ వరించింది. భారత్–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్–టు–పీపుల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను అందిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు. -
అల్లూరి పోరాటం దేశానికి స్ఫూర్తిదాయకం
బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, ఆయన దేశభక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి అతి చిన్న వయస్సులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే మనమంతా ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి తొలుత అల్లూరి ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి అర్పించారు. మన్యంలోని గిరిజనులకు ఇళ్లు కట్టించిన పద్మశ్రీ ఏవీఎస్ రాజు, అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని ఇచ్చిన దాత అల్లూరి సీతారామరాజులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. భీమవరంలోని అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన త్రీడీ చిత్రాన్ని ప్రదర్శించారు. కాగా తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి దేశభక్తిని యువతకు తెలియజేయాలి ‘దేశ ప్రజలందరి తరఫున అల్లూరి సీతారామ రాజుకు నివాళులర్పించడం గౌరవంగా భావిస్తున్నా. అల్లూరి గొప్ప దేశభక్తిని యువతకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సర్దార్ భగత్‌సింగ్ ఏవిధంగా ఆత్మగౌరవానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారో..అదే రీతిలో దేశ ప్రజలకు అల్లూరి సైతం ఎప్పటికీ గుర్తుంటారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా అల్లూరి చేసిన పోరాటాలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తిగా నిలిచేలా ఉన్నాయి. పర్వతాల్లో, అడవుల్లో ఉండే గిరిజనుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగల్చడంతోపాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై తెలుగులో రూపొందించిన ఓ సినిమా కోసం ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..’ గీతం తెలుగు ప్రాంతంలోని చిన్నారులకు సైతం సుపరిచితం. బ్రిటిష్ సైన్యాన్ని పలుమార్లు ఓటమిపాలు చేయడంతోపాటు స్థానికులపై బ్రిటిష్ అధికారుల అరాచకాలపై అల్లూరి యుద్ధభేరి మోగించారు. సామాజిక అసమానతలపై అల్లూరి చేసిన పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. ప్రజల కష్టనష్టాలను తన కష్టాలుగా భావించిన గొప్ప నాయకుడు అల్లూరి. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారు. బ్రిటిష్ అధికారులు ఎంత హింసించినా మన్యం ప్రజలెవరూ ఆయన జాడ చెప్పలేదు. అంతలా ఆయన జననాయకుడయ్యారు. అలాంటి గొప్ప నాయకుడిని ఎప్పటికీ గుర్తుంచుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత..’ అని రాష్ట్రపతి చెప్పారు. ‘జై అల్లూరి సీతారామరాజు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు: సీఎం కేసీఆర్ ‘అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ సైతం.. ‘అల్లూరి సీతారామరాజును నేను ప్రశంసించకుండా ఉండలేను’ అని చెప్పినట్టు పలు రికార్డుల్లో ఉంది. ఎక్కడైతే పీడన, దోపిడీ జరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహానుభావులు జన్మిస్తారన్న భగవద్గీత సందేశాన్ని నిరూపించేలా అల్లూరి సీతారామరాజు జీవితం ఉంటుంది. బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకుని భరతజాతి నలుగుతున్న వేళలో విప్లవ జ్యోతిలా అవతరించిన వీర యోధుడు అల్లూరి. గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడు. 26 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు జాతి వీరుడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి గొప్ప పోరాట యోధుల సరసన మన తెలుగు జాతిని నిలబెట్టిన గొప్పవీరుడు. చివరకు చనిపోతూ కూడా ఒక్క అల్లూరి మరణిస్తే..వేలాది మంది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారంటూ స్ఫూర్తిని చాటారు. హీరో కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా..మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా..’ అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కారులో ప్రయాణించేటప్పుడు ఎక్కువసార్లు ఈ పాట వినేవాడిని. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి కిషన్‌రెడ్డికి తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలుగు వీరుడి గురించి చెప్పేందుకు తెలుగులో ప్రసంగం: గవర్నర్ తెలుగు వీరుడు అల్లూరి కీర్తిని చెప్పేందుకు తాను పూర్తిగా తెలుగులోనే ప్రసంగిస్తున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ‘అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి. ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. సీతారామరాజు వంటి గొప్పవారి చరిత్రలు చెప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యం విలువ మరింత తెలుస్తుంది. స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో మన్యం ప్రజల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగల్చడంతో పాటు వారిని యుద్ధవీరులుగా తీర్చిదిద్దిన నాయకుడు అల్లూరి. గిరిజనుల అభివృద్ధికి వివిధ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాలను అభినందిస్తున్నా..’ అని తమిళిసై పేర్కొన్నారు. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఉండే వీరుడు: కిషన్‌రెడ్డి ‘చరిత్రను ఆవిష్కరించే మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని తెలుగు వీరుడు. యావత్ ప్రపంచానికి తెలుగు కీర్తిని చాటిన శూరుడు. గత ప్రభుత్వాలు విస్మరించినా..అల్లూరి సీతారామరాజును దేశం గుర్తు చేసుకునేలా ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా ఏడాదిపాటు నిర్వహించేలా చర్యలు తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు తెలుగువారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి 125వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, కార్యదర్శి నానిరాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతికి విల్లు, బాణాన్ని బహూకరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేటలో గవర్నర్ డా.తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.