'విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు పరీక్ష'
హైదరాబాద్: సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. వెంకయ్య నాయుడు ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు ఒక పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణకు వెంకయ్య నాయుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దంటూ వెంకయ్యను విమర్శించారు.