ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ బీజేపీ: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అని జి. కిషన్రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు ఏకపక్షంగా ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీదేనని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడంలో బీజేపీ కీలకపాత్ర పోషించిందన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి తమ పార్టీ చురుగ్గా వెళుతుందని దీమా వ్యక్తం చేశారు. ఎల్లుండి హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ నేతలందరూ సమావేశమవుతున్నారని తెలిపారు.