
'కేటాయింపులకు, ఆదాయానికి పొంతన లేదు'
ఆర్థిక బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి విమర్శించారు.
నల్లగొండ: ఆర్థిక బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ సర్కారు తీరు బంగారు తెలంగాణకు అనుకూలంగా లేదని అన్నారు.
బడ్జెట్ కేటాయింపులకు, ఆదాయానికి పొంతన లేదని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని అన్నారు.