తెలంగాణ అసెంబ్లీ: బీఆర్‌ఎస్‌ Vs మంత్రులు.. | Telangana Assembly Session Mar 22nd Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ: హరీష్‌రావు Vs మంత్రి సీతక్క

Published Sat, Mar 22 2025 10:37 AM | Last Updated on Sat, Mar 22 2025 11:57 AM

Telangana Assembly Session Mar 22nd Live Updates

Telangana Assembly Session Updates

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

బీఆర్‌ఎస్‌ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

  • తెలంగాణవ్యాప్తంగా 29వేల కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి.
  • మాజీ ఆర్ అండ్ బీ మంత్రి చేసిన ఘనకార్యం మాకు తెలుసు
  • పదేళ్లలో 6వేల కిలో మీటర్లు రోడ్లు వేశారు.
  • పదేళ్లలో 3900 కోట్లు ఆర్‌ అండ్‌ బీకి కేటాయించిగా 4వేల కోట్లు లోన్స్ తీసుకున్నారు
  • హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వస్తారా చూపిస్తాం.
  • హరీష్ రావు మాట్లాడితే బాధ వేస్తోంది.
  • మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుంది.
  • వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అవుతాయి.
  • రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది.
  • మేము పనిచేస్తాం.. బీఆర్‌ఎస్‌ నేతల్లాగా మాట్లాడలేం.
  • పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీనే.
  • ఉద్యోగాలు ఇచ్చాం అంటే మేము రెడీ చేసాం అంటున్నారు..
  • మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదు.
  • బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారు.

మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి

  • రోడ్లు వేయలేదని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.
  • మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే 200 కోట్లకు పైచిలుకు నిధులతో రోడ్లు వేశాను.
  • ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం పరిధిలో ఉంది. పనులు అప్పుడు కాలేదు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటింది ఏమైనా పనులు జరిగాయా?
  • నా క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండి.


మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌..

  • నా నియోజకవర్గంలో 200 కోట్లతో రోడ్లు వేసామని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.
  • ఆ రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్ రెడ్డికి సన్మానం చేపిస్తా.
  • బీఆర్ఎస్ నాయకుల అబద్దాలకు లెక్కలేదు.
     
  • బీఆర్‌ఎస్‌ ప్రశ్నకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా వాకౌట్.
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
     

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్‌..

  • పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో డబల్ రోడ్లు 8000 కిలోమీటర్లు.
  • నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశాం.
  • 17వేల కిలో మీటర్లకు 23వేల కోట్లు ఖర్చు అవుతాయి.
  • మొత్తం ఖర్చులో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
  • ప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుంది.
  • ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారు.
  • ఇప్పటికీ ఏడాదిన్నర కాలం  పూర్తయింది.
  • మూడున్నర సంవత్సరాలలో 17వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు?

మాజీ మంత్రి హరీష్‌ కామెంట్స్‌..

  • ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది.
  • సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి.
  • కొత్త ప్రతిపాదనలు లేవని మంత్రి అంటున్నారు.
  • బడ్జెట్ పుస్తకంలో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది.
  • 60 శాతం ప్రభుత్వమని భట్టి విక్రమార్క అంటే.. ప్రైవేట్ అని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.
  • బీఆర్ఎస్ పాలనలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబల్ రోడ్డులు వేశాం. 

 

  • శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న..
  • సరూర్‌నగర్‌ చెరువు, మూసీ అభివృద్ధిపై ప్రశ్న వాయిదా
  • ఫీజు రియింబర్స్‌మెంట్‌పై చర్చ ప్రారంభం

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..

  • ట్రిలియన్ డాలర్ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు.
  • మేము టార్గెట్, ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాం.. సాధిస్తాం
  • కొత్త వ్యాపారం చేసే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.
  • మినీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం
  • 119 సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేస్తాం.
  • భేషజాలకు పోను.. నా శాఖలో అసలే ఉండవు.
  • సిద్దిపేట, సిరిసిల్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్

  • అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయమై ముఖ్యమంత్రిని  కలిశాం
  • 72ఏళ్ల వయసులో నేను ఎందుకు పార్టీ మారతాను?
  • కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్ లో ఉన్నారు
  • ఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
  • బీఆర్ఎస్ లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్దంగా ఉన్నాం
  • జమిలి ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్ బిల్లులు దాదాపు 7000 కోట్లు ఉన్నాయి.
  • పెండింగ్ వల్ల కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.
  • కాలేజీలు మూతపడితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.


మంత్రి సీతక్క కామెంట్స్‌.. 

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వైఎస్సార్‌ తీసుకొచ్చిన గొప్ప పథకం
  • ఫీజు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తాం
  • గత ప్రభుత్వంలోనే 4వేల కోట్లకు పైగా బకాయిలు ఉండేవి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11 వందల కోట్లకు పైగా బకాయిలు అయ్యాయి.
  • 12 వందల టోకెన్లు ఇప్పటికే రైజ్‌ అయ్యాయి.

హరీష్ రావు కామెంట్స్‌..

  • సీతక్క గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
  • బీఆర్‌ఎస్‌ పాలనకు ముందు కాంగ్రెస్ రెండు వేల కోట్లు బకాయిలు ఉండేవి.
  • బీఆర్‌ఎస్‌ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదు అనేది సత్యదూరం
  • 20వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాం.
  • 800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామని సీతక్క అన్నారు.
  • కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.
  • వెంటనే 2వేల కోట్లు విడుదల చేస్తే కాలేజీలు బతుకుతాయి
     

సచివాలయంలో ఎర్త్‌ అవర్‌..

  • తెలంగాణ సచివాలయంలో శనివారం ఎర్త్ అవర్ పాటింపు.
  • శనివారం 23/03/2025 రోజున ఎర్త్ అవర్లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్
  • ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు సచివాలయంలో ఎర్త్ అవర్ పాటింపు.
  • సచివాలయంలో గంటసేపు లైట్లు ఆఫ్ చేయాలని నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement