బంగారు తెలంగాణ అంటే రైతులు ఆత్మహత్యలేనా ?
హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలేనా అన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
విద్యుత్ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోంటున్నా... సీఎం కేసీఆర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళనతో స్థానికంగా ఉద్రక్త వాతావారణం నెలకొంది. దీంతో పోలీసులు బీజేపీ నేతలు కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.