telangana CM office
-
మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ
హైదరాబాద్, సాక్షి: ఫుడ్ స్టాల్‌తో నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఫేమస్ అయ్యి.. ఆపై సోషల్ మీడియా ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకుంది కుమారి ఆంటీ. అయితే ఆ ఫేమ్ వల్లే జనాలు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర గుమిగూడడం.. అది ట్రాఫిక్ జామ్‌కు దారి తీయడంతో ఆమె స్టాల్‌ను పోలీసులు బలవంతంగా తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తీవ్ర చర్చ నడవగా.. చివరకు తెలంగాణ సర్కార్ ఆమెకు ఊరట ఇచ్చింది. ఈ పరిణామంపై ఆమె సాక్షితో స్పందించారు. ‘‘గత 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నా. ముందు మాకు తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని మేం అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారామె. కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్‌స్టాల్ నడిపిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువ చర్చ నడిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె ఫుడ్ స్టాల్‌కు జనాల రాక మొదలైంది. ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ వస్తోంది. దీంతో మంగళవారం ఆమె షాప్‌ను సీజ్ చేసి.. మరో చోటుకి తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే మిగతా వాళ్లను వదిలేసి తననే తొలగించాలని ఆదేశించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీ అందుకే టార్గెట్ అయ్యిందా? మరోవైపు ఈ పరిణామంపై అదే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. సీఎం జగన్ తనకు మంచి చేశారని.. ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. దీంతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చక ముందే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె ఫుడ్‌కోర్టును యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్ర డీజీపీతో పాటు ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఆమె స్టాల్‌కు వెళ్లనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. -
సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు!
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి భద్ర తలో ఉన్నతాధికారులు మార్పులు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా కొనసాగుతున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతీ సమాచారం బయటకు పొక్కుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత సీఎం వద్ద పనిచేసిన వారిలో ఇదివరకు కొద్ది మందిని మాత్రమే మార్చగా, ఇంకా చాలా మంది అదే సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు సంబంధించిన కీలక సమావేశ వివరాలు బయటకు వెళ్లడం, ఆయన భద్రతకు, పరిపాలన, ప్రభుత్వానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెవెళ్లిన అనంతరం భద్రతా సిబ్బందిని మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం భద్రతను చూసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాండ్ క్రూయిజర్లతో కొత్త కాన్వాయ్.. భద్రతాధికారులు సీఎంకు కొత్త కాన్వాయ్‌ని కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నల్లరంగు కారులో వెళ్తే, ఆయన భద్రతా సిబ్బంది వాహనాలు వేరే రంగులో ఉండేవి. ఇలా సీఎం ప్రయా ణించే వాహనాన్ని సులభంగా గుర్తించడానికి వీలవడంతో.. ముప్పు ఉంటుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహన శ్రేణిని మొత్తం నల్లరంగులోకి మార్చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెల్లరంగున్న వాహన శ్రేణని వినియోగించేవారు. గత ప్రభుత్వ హయాంలోనే సీఎం కోసం తెల్లరంగు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి విజయవాడలో బుల్లెట్‌ప్రూఫ్ చేయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లరంగు వాహనాలంటే ఇష్టం కావడంతో, వాటి కలర్‌ను అధికారులు మార్చేశారని తెలిసింది. -
ఇది నిరంకుశత్వం.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
‘‘మన దేశం ఇంకా ప్రజాస్వామికమేనని మీరూ అంగీకరిస్తారని భావిస్తున్నాం. కానీ ప్రతిపక్షాల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను తీవ్రస్థాయిలో ఉసిగొల్పి దురి్వనియోగపర్చడాన్ని చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పరిణామం చెందినట్టు అనిపిస్తోంది..’’అని ప్రధాని నరేంద్ర మోదీపై దేశంలోని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. విపక్షమనేదే లేకుండా అంతం చేయడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని పేర్కొన్నాయి. ఎన్నికల క్షేత్రం వెలుపల ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యాంగబద్ధ గవర్నర్ కార్యాలయాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేయడం సరికాదని మండిపడ్డాయి. ఈ మేరకు కాంగ్రెసేతర విపక్షాలైన బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ అభినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. ఎన్నికల సమయాల్లోనే దాడులు అధికం ‘‘2014 నుంచి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తుండటంతో వాటి ప్రతిష్ట మసకబారింది. వాటి స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికతపై ప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై దేశ ప్రజలు నానాటికి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులను పరిశీలిస్తే.. అవి ఫక్తుగా రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమవుతోంది. మీ పార్టీ (బీజేపీ)తో విరుద్ధ భావజాలాన్ని కలిగిన పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చినా గౌరవించి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు దర్యాప్తు, విచారణల పేరుతో సుదీర్ఘకాలం ఉద్దేశపూర్వకంగా వేటాడి, వెంటాడి ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. రాజకీయ కుట్రతో కూడినవి. ఆయన అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. పాఠశాల విద్యలో గొప్ప సంస్కరణలను తీసుకొచ్చి ప్రపంచవ్యాప్త గుర్తింపును మనీశ్ సిసోడియా పొందారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలన్న లక్ష్యంతో చేపట్టిన దురుద్దేశపూర్వక దర్యాప్తుకు ఈ అరెస్టు తార్కాణంగా నిలిచింది. నిరంకుశ బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామిక విలువలకు ముప్పు వాటిల్లిందన్న ప్రపంచం అనుమానాలను నిజం చేసింది. బీజేపీలో చేరితే కేసుల నుంచి ఉపశమనం మీ పరిపాలనలో 2014 నుంచి దర్యాప్తు సంస్థల కేసులు, అరెస్టులు, దాడులు, విచారణలను ఎదుర్కొన్న ప్రముఖ రాజకీయ నాయకుల్లో అత్యధికులు ప్రతిపక్ష నేతలే. బీజేపీలో చేరిన ప్రతిపక్ష నాయకుల కేసులపై విచారణలను దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా చేస్తున్నాయి. 2014, 2015 సంవత్సరాల్లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరాక కేసు దర్యాప్తు నీరుగారిపోయింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ మాజీ నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌లను సీబీఐ, ఈడీ వెంటాడి వేధించాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు బీజేపీలో చేరడంతో దర్యాప్తు అటకెక్కింది. ఇవేకాదు మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే కేసు సహా మరెన్నో ఉదాహరణలు ఉన్నాయి. విపక్ష నేతలపై వేధింపులు 2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్, ఎస్పీ నేత ఆజంఖాన్, ఎన్సీపీ నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖ ప్రతిపక్ష నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో వేధింపులను ఎదుర్కొన్నారు. కేంద్రంలోని పాలక పారీ్టకి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానాలకు ఈ కేసులు బలం చేకూరుస్తున్నాయి. ఆ సంస్థపై దర్యాప్తు చేయరా? రూ.78,000 కోట్లకుపైగా ఒక నిర్దిష్ట సంస్థ (అదానీ గ్రూపు)లో పెట్టుబడిగా పెట్టడంతోనే ఎస్బీఐ, ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయినట్టు ఓ అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ నివేదిక ప్రచురించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ సంస్థల అవకతవకలపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? గవర్నర్లను ఉసిగొల్పి.. సమాఖ్య వ్యవస్థపై యుద్ధానికి కేంద్రం ఇంకో వ్యవస్థను ఉసిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గవర్నర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంతా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచుతూ సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకారులుగా తయారయ్యారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా విఫలంకాగా.. రాష్ట్రాలు రాజ్యాంగ విలువలతో సమాఖ్య స్ఫూర్తిని పాటిస్తున్నాయి. గవర్నర్ల వైఖరి పర్యవసానంగా దేశ ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు.’’ అని లేఖలో విపక్షాల నేతలు పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్‌సింగ్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్‌సింగ్‌ను బీజేపీ ప్రాతిపాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిని ఓడించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. సభలో బలాబలాలెంత ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
కేంద్రం దిశగా కేసీఆర్ మరో ముందడుగు
-
కేంద్రం దిశగా కేసీఆర్ మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రాజకీయాలపై రోజుకో ప్రకటన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. వివిధ రంగాల ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట విడత రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు వుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్రంలో కీలక పదవుల్లో పనిచేసిన అధికారులు, సైనిక రంగంలో పనిచేసిన వారితో సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఈ భేటీలు కేవలం హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగుళూరులలో నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. మరోవైపు జాతీయస్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల నుంచి కేసీఆర్‌కు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'దళితుడి సీటు లాక్కున్న కేసీఆరే సారీ చెప్పాలి'
తెలంగాణకు అమిత్ షా క్షమాపణ చెప్పడం కాదని.. దళితుడి సీటు లాక్కుని అందులో ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకు కేసీఆరే క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్లలో 2వేల ఇళ్లు కూడా పూర్తిచేయనందుకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తాము కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి చేసే తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేవాళ్లం కామని, కేంద్రంలో ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో బీజేపీ ముందుందని చెబుతూ.. ''సాగరహారంలో నువ్వెక్కడ, రైల్‌రోకోలో నువ్వెక్కడ, మిలియన్ మార్చ్‌లో నువ్వెక్కడ కేసీఆర్'' అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత రాష్ట్రం రాగానే ఆ సీట్లో తానే కూర్చుండిపోయారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. అలా దళితులను అవమానించింది, దళిత వర్గాలను మోసం చేసింది ఆయనేనని చెప్పారు. అసోం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాము గెలిచామని, అలాంటిది హైదరాబాద్‌లోను, తెలంగాణలోను ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. హిందూ ముస్లింల సమైక్యతతోనే తాము హైదరాబాద్‌లో గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019లో అధికారాన్ని సాధించుకునేందుకు కార్యర్తలంతా ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. -
'దళితుడి సీటు లాక్కున్న కేసీఆరే సారీ చెప్పాలి'
-
సీఎం క్యాంపు ఆఫీసు వద్ద కలకలం
-
సీఎం క్యాంపు ఆఫీసు వద్ద కలకలం
సికింద్రాబాద్: పంజాగుట్టలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. గద్వాల జోగులాంబ ప్రాంతానికి చెందిన మల్లేష్ అనే రైతు ఐదు సార్లు బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మల్లేష్ ముఖ్యమంత్రిని కలవాలని మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. అక్కడున్న పోలీసులు రైతును అడ్డుకున్నారు. దీంతొ ఆవేదన చెందిన రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే రైతును గాంధీ ఆస్పత్రికి తచరలించారు. ప్రస్తుతం మల్లేష్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
తెలంగాణ అగ్రస్ధానంలో ఉంది
-
సిరిసిల్లను కేటీఆర్.. యాదాద్రిని నాయిని
-
సిరిసిల్లను కేటీఆర్.. యాదాద్రిని నాయిని
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలో సరికొత్త పరిపాలనా ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా... యాదాద్రి జిల్లాను నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. మిగిలిన 19 జిల్లాలను శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, మంత్రులు ప్రారంభించారు. దీంతో 31 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లతోపాటు జిల్లా ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగామ జిల్లా : ఈ జిల్లాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. దేవసేనతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ జిల్లా : ఈ జిల్లాను తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిగిత్యాల జిల్లా : ఈ జిల్లాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కె. కవితతోపాటు జిల్లా కలెక్టర్ ఎ. శరత్, ఎస్పీ అనంత్ శర్మ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా: ఈ జిల్లాను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి, ఎస్పీ చంద్రదీప్తీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా: ఈ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్, ఎస్పీ సుధీర్‌బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా: ఈ జిల్లాను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎస్పీ యాదగిరితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా: ఈ జిల్లాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి వీఎస్, ఎస్పీ విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా: ఈ జిల్లాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎస్పీ శ్వేత పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా: ఈ జిల్లాను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, ఎస్పీ జాన్ వెస్లీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా: ఈ జిల్లాను రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి. దివ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ జిల్లాను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ విశ్వజిత్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొమురంభీం జిల్లా ఈ జిల్లాను అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎం చంపాలాల్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఈ జిల్లాను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎస్పీ పరిమళ నూతన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా: ఈ జిల్లాను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా: ఈ జిల్లాను దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలంబర్తి, ఎస్పీ విష్ణు వరియార్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా: ఈ జిల్లాను పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సింగన్వార్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా: ఈ జిల్లాను పర్యాటక శాఖ మంత్రి ఎ. చందూలాల్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా, ఎస్పీ మురళీతోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ జిల్లాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా/మల్కాజ్గిరి జిల్లా ఈ జిల్లాను తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, ఎస్పీ రోహిణితోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భద్రకాళీ మాతకు కిరీటం సమర్పించిన సీఎం కేసీఆర్
-
రాజకీయాలకు అతీతంగా పని చేయాలి: కేసీఆర్
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకువచ్చే అంశంతోపాటు రాష్ట్రానికి కేంద్ర సహాయం అందించే విషయంలో చొరవ చూపాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలో తన నివాసంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇచ్చిన విందుకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాల విషయంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించే సాయం సకాలంలో అందాలని పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ ప్లాంట్ పునరుద్దరణకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు కేసీఆర్ వెల్లడించారు. బుధవారం కేంద్రమంత్రి ఉమా భారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సెల్లో చర్చకు వచ్చిన పలు అంశాలను బండారు దత్తాత్రేయకు కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. -
21న ముఖ్యమంత్రుల భేటీ?
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు ఓకే భేటీ తేదీపైనే భిన్నాభిప్రాయాలు 19కి ఓకే చెప్పిన చంద్రబాబు.. 21న కుదురుతుందన్న కేసీఆర్ 21 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఉమాభారతి ఆలోగా జరగకుంటే.. అక్టోబర్‌లోనే సీఎంల సమావేశం కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం మేరకు నిర్వహణ నీటి లెక్కలపై ముఖ్యమంత్రితో హరీశ్‌రావు చర్చలు కృష్ణా, గోదావరి నీటి వాడకంపై అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు ఈ నెల 21న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఇరువురు సీఎంలు ఇప్పటికే సమ్మతి తెలిపారు. అయితే ఏ రోజున సమావేశమవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 19న భేటీకి చంద్రబాబు ఓకే చెప్పగా.. 21న నిర్వహించాలని కేసీఆర్ కోరనున్నారు. ఇక 21వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి ఉమాభారతి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉండనుంది. ఈ నెలలో జరిగేనా..? రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉంది. చర్చలు జరిపేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ సమ్మతి తెలియజేశారు. దాంతో భేటీ కోసం ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒక తేదీని సూచించాలని కేంద్రం కోరగా.. 19వ తేదీకి ఓకే చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాశారు. కానీ 19న తమకు వీలు కాదని.. 21వ తేదీన భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని కేసీఆర్ నిర్ణయించారు. వినాయక ఉత్సవాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు, సమీక్షల దృష్ట్యా 19వ తేదీకి ముందు భేటీ కుదరదని... 20వ తేదీ నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే ఆ లేఖలో పేర్కొననున్నారు. దాంతో 21న భేటీ నిర్వహిస్తే సహేతుకంగా ఉంటుందని సూచించనున్నారు. గురువారం ఈ లేఖ రాసే అవకాశముంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఉమాభారతి 21వ తేదీ తర్వాత అందుబాటులో ఉండటం లేదని.. ఆమె విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అంటే ఈలోగానే ఇద్దరు సీఎంలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే అపెక్స్ కమిటీ భేటీ వచ్చే నెలకు వాయిదా పడనుంది. సీఎంతో మంత్రి హరీశ్‌రావు చర్చలు అపెక్స్ భేటీ తేదీలు, అందులో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఉదయం జరిగిన సమావేశంలో అపెక్స్ భేటీ అంశంతో పాటు, కేంద్రం-నాబార్డ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం, ఏపీ జలచౌర్యంపై ఫిర్యాదు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా జలాల లభ్యత, వినియోగం, బోర్డు కేటాయింపులు, పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన నీటి వినియోగం, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, కేసీ కెనాల్ ద్వారా తరలించిన నీటి లెక్కలతో రావాలని సీఎం సూచించడంతో... హరీశ్‌రావు అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇప్పటివరకు సాగర్, శ్రీశైలం, జూరాల కింద ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. ఇటీవల ఖరీఫ్ సాగు అవసరాలకు బోర్డు చేసిన కేటాయింపులు, అందులో తెలంగాణకు తగ్గిన కేటాయింపులు, పట్టిసీమ, శ్రీశైలం కుడి కాల్వ నుంచి ఏపీ తరలించిన నీటి లెక్కలు తెలుసుకున్నారు. అనంతరం సీఎంతో మళ్లీ భేటీ అయి ఈ వివరాలను వెల్లడించారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసేది అఖిలపక్ష సమావేశం కాదని, ఏకపక్ష సమావేశమని టీఎస్వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న పార్టీని ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. అఖిలపక్ష సమావేశానికి తమను పిలిచినా, పిలవకపోయినా ప్రజలపక్షాన పోరాడుతామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
ఎంసెట్‌పై నిర్ణయం సోమవారమే!
-
మిషన్ కాకతీయకు కేంద్రమంత్రి ప్రశంస
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సోమవారం ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంపై కేంద్రమంత్రితో చర్చించారు. కేసీఆర్ వెంట ఎంపీ కవిత, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కృష్ణా వాటర్ బోర్డు అంశంపై తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉమాభారతి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని ఆమె ప్రశంసించారు. మిషన్ కాకతీయ పనులను పరిశీలించేందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఉమా భారతి చెప్పారు. ఈ రోజు కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో మోదీని కలసి తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు. -
'కేసీఆర్ సీఎం అయ్యారు..సాగర్ ఎండిపోయింది'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కోదాడ లో సోమవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక సాగర్ ఎండిపోయిందని విమర్శించారు. మిషన్ కాకతీయ అని చెరువులను కూడా ఎండబెట్టారన్నారు. ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే గతి లేదు కానీ.. డబుల్ బెడ్రూం పథకం అంటున్నారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని చెప్పి..ఇప్పటి వరకు ఆ విషయం అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. ఈ రెండెళ్లలో ఏదైనా మేలు జరిగిందంటే అది టీఆర్ఎస్ కార్యకర్తలకే అని ఆరోపించారు. -
తెలంగాణ సీఎం కార్యాలయం వద్ద కలకలం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మంగళవారం కలకలం చోటుచేసుకుంది. సచివాలయంలోని సీ బ్లాకు వద్ద రాజు అనే సందర్శకుడు బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడు సూరారం కాలనీలో నివసిస్తున్నాడు. గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించి వికలాంగుడిగా మారానని, తనకు ఫించన్ ఇప్పించాలని అధికారులను కోరేందుకు రాజు ఇక్కడికి వచ్చాడు. నిన్న కూడా అతడు సచివాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కొత్త అధికార నివాసానికి కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొత్త అధికార నివాసానికి శంకుస్థాపన చేశారు. శనివారం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి భూమి పూజ చేశారు. హైదరాబాద్‌లో సీఎం ప్రస్తుత క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్‌ను కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించనున్నారు. భూమిపూజ కార్యక్రమానికి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో అధికారులతో పాటు పలువురు నేతలు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు హాజరయ్యారు. -
విధిలేక తింటున్నాం
- ఆహార కల్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన - కల్తీ నుంచి బయటపడేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం - కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు - రాష్ట్రావసరాలకు తగ్గట్లు పూలు, పండ్లు, కూరగాయలు పండించాలి - సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇవ్వాలి - ఉద్యానశాఖలో మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలు ఏర్పాటు చేయాలి - ప్రభుత్వపరంగానే ప్రజలకు పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి అందించాలి - ఉద్యానశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘‘పండ్లు, కూరగాయలు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి... ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయింది. ఏది తినాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక పరిస్థితి నుంచి బయటపడేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్తీల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ఉద్యానశాఖ క్రియాశీలం కావాలన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఉద్యానశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలకు సరిపడా పూలు, పండ్లు, కూరగాయలు, మసాలాలు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేందుకు, రైతులు లాభదాయక వ్యవసాయం చేసేందుకు, ప్రజలు రసాయనాలు ఎక్కువగాలేని కూరగాయలు, పండ్లను తినేందుకు, కల్తీలేని మసాలాలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. ఉద్యానశాఖను కూడా విస్తరించి మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, యాంత్రీకరణ వంటి విభాగాలను ఏర్పాటు చేసి అదనపు సంచాలకులను నియమించాలని ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆదేశం... ప్రజలు ప్రతీ రోజూ ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని... నాణ్యమైనవి కాకున్నా విధిలేకే అందుబాటులో ఉన్నవి తినాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివార్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగానే పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి వంటి వస్తువులు ప్రజలకు అందించాలని చెప్పారు. దీనికోసం ఉద్యానశాఖలో అదనపు సంచాలకుడిని, కావాల్సినంత సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కరివేపాకు కూడా దిగుమతా...? కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాలకు నిత్యం లక్షల టన్నుల కూరగాయలు, పండ్లు, పూలు అవసరమవుతుంటే అందులో 90 శాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొని ఓవైపు దుబాయ్ వలస వెళ్తుంటే మరోవైపు మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు మాత్రం బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. చివరకు కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కావాల్సినన్ని కూరగాయలు, పండ్లను ఇక్కడే పండించాలని... తద్వారా దిగుమతి చేసుకునే బాధ తప్పుతుందని... మన రైతులు బాగుపడతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల పరిసరాల్లోని రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలన్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ ఇవ్వాలని... ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. రైతులంతా ఒకే రకం కూరగాయలు పండించడం వల్ల కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉండవని... కాబట్టి ఉద్యానశాఖ అధికారులే వ్యవసాయ భూములను జోన్లుగా విభజించి ఎక్కడ ఏవి సాగు చేయాలో రైతులకు నిర్దేశించాలని సూచించారు. వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చి అమ్ముతూ లాభం పొందుతున్న నేపథ్యంలో మన రైతులు ఎందుకు లాభం పొందడంలేదని ప్రశ్నించారు. ఉద్యానశాఖలో మార్కెటింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెట్ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించాలని సూచించారు. వేప, నిమ్మ, సీతాఫల, కానుగ ఆకులతో ఎరువులు తయారుచేసేలా బయో పెస్టిసైడ్స్ రూపొందించాలని చెప్పారు. పూల తోటలపై దృష్టిపెట్టండి... హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం వేల టన్నుల పూలను ప్రతీ రోజూ వాడుతున్నారని... అవి కూడా పక్క రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పూల తోటలు పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పాలీహౌజ్‌లు ఎన్ని, ఇంకా ఎన్నింటికి అవసరం ఉంది, రాష్ట్రానికి ఎంత మొత్తంలో కూరగాయలు, పండ్లు, పూలు అవసరం, ప్రస్తుతం ఎంత ఉత్పత్తి ఉంది, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం? తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. -
సంక్రాంతికి ఫాంహౌస్‌లోనే కేసీఆర్ !
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఆయన తన ఫాంహౌస్‌లోనే జరుపుకోనున్నారు. ఈ పండగ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు ఫాంహౌస్‌కి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ నెల 8వ తేదీన కేసీఆర్ ఫాంహౌస్‌కు వచ్చారు. ఆయన దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం దుబ్బాకలో ఆయన చదివిన పాఠశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. మరునాడు మళ్లీ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని అల్లం పంటలను కేసీఆర్ పరిశీలించారు. మరో మూడు రోజుల వరకు కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. అయితే ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. -
'చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
హైదరాబాద్ : రాష్ట్రానికి కరువు సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపామని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పరిస్థితులను వెంటనే న్యూఢిల్లీ వెళ్లి కేంద్రానికి వివరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. వచ్చే ఏడాది 60 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సదరు రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొదటి ఏడాది 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఆ తర్వాత ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించాలని... అలాగే మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ను నగర శివారుకు తరలించాలని ఉన్నతాధికారులకు కేసీఆర్ ఆదేశించారు. సదరు రెండు స్థలాలు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉపయోగించాలని ఉన్నతాధికారులను కేసీఆర్ కోరారు. -
మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం మూడోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం గురుప్రార్ధనతో మూడోరోజు అయుత చండీ యాగం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య పూజలు ప్రారంభమయ్యాయి. శ్వేత వర్ణ దుస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగస్థలికి చేరుకున్నారు. గురు ప్రార్థనతో ప్రారంభమైన చండీయాగం, గోపూజ, త్రిసహస్ర చండీ పారాయణములు, నవార్ణ పూజ, నవగ్రహ హోమం, తదితరాలతో పాటు మహా మంగళహారతి నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ యాగాన్ని తిలకించేందుకు వచ్చారు. ఆయనకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు ఈ చండీయాగానికి వీఐపీల నుంచి సామాన్య ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. నేటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖలు ఈ చండీయాగంలో పాల్గొంటారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్‌పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఇంత జనం వస్తే ఎలా?
భక్తుల తాకిడిపై పోలీసుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి.. ఇప్పుడో పుణ్యక్షేత్రం. పర్యాటక ప్రాంతం. అన్ని దారులే అటే. గతంలో కనీసం పేరు కూడా వినిఉండని ధార్మిక వేడుక కావటం, 1,500 మంది రుత్విజులు ఏకధాటిగా చండీ సప్తశతి పారాయణంతో నిర్వహించే మహా యాగం కావడం, స్వయంగా సీఎం నిర్వహిస్తుండటంతో భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తొలిరోజే భక్తులు పోటెత్తారు. రెండోరోజు వారి సంఖ్య రెట్టింపైంది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవు కావటంతో వారి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పుడిదే అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తితే నియంత్రించటం కష్టమవుతుందని పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే రోజుల్లో అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రానుండటంతో భక్తుల నియంత్రణ సవాల్‌గా మారుతుందని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని నియంత్రించక తప్పదని ఇతర విభాగాల అధికారులతో పోలీసులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో బస్సులు పెంచాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. కానీ పెంచి తే ఎర్రవల్లికి తాకిడి భారీగా ఉంటుందని, బస్సులు తగ్గించాలని పోలీసులు ఆర్టీసీని కోరారు. ఉదయం భారీగా తగ్గించి.. కొన్నిం టిని మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నడపాలని సూచించా రు. ఒకే సమయంలో ఎక్కువమంది రాకుండా.. సాయంత్రానికి మళ్లించాలనేది వారి ఆలోచన. దీంతో బస్సుల సంఖ్యను తగ్గించి పరిమితంగానే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
పోటెత్తిన భక్తజనం
* 1.50 లక్షల మంది రాక.. అందులో 80 వేల మంది మహిళలే * పోలీసుల ఓవరాక్షన్‌తో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు * కుంకుమార్చన మండపం వద్ద తొక్కిసలాట, సొమ్మసిల్లిన భక్తుడు * భోజనశాల వద్ద కూడా తోపులాట సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అయుత చండీయాగానికి గురువారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 40 వేల వాహనాల్లో 1.50 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రెండ్రోజులు కూడా భక్తుల తాకిడి ఉండవచ్చని భావిస్తున్నారు. యాగశాల ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు సామాన్య భక్తులను చిన్నచూపు చూస్తున్నారు. వీవీఐపీ గేటు వద్ద ఉన్న పోలీసు అధికారులు తమకు పరిచయం ఉన్న వారినే వీవీఐపీగా గుర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ సాధారణ భక్తులతో పాటే చండీయాగాన్ని వీక్షించారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అని స్థానిక నేతలు పోలీసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుండా ఆమెను సాధారణ గ్యాలరీలోకి పంపించారు. ఒక్కో వీఐపీని దగ్గరుండి మరీ మండపం వద్దకు తీసుకు వెళ్తున్న పోలీసులు.. సాధారణ భక్తులను మాత్రం గాలికి వదిలేశారు. క్యూలైన్ ద్వారా భక్తులు మండపానికి చేరుకోవడానికి గంటల తరబడి సమయం పట్టింది. కుంకుమార్చన మండపం సమీపంలో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కిందపడి సొమ్మసిల్లిపోవడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. యాగం పూర్తి కాగానే భక్తులందరూ భోజనశాల వైపు ఒకేసారి వెళ్లడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది. లక్ష మందికిపైగా భక్తులు తరలిరావడంతో భోజనం వడ్డించే వారు చేతులెత్తేశారు. మొత్తం లక్షన్నర మంది భక్తుల్లో.. 80 వేల మందికిపైగా మహిళలే ఉన్నారు. కుంకుమార్చనలో పాల్గొనడానికి 10 వేల మందికిపైగా మహిళలు రాగా కేవలం 5 వేల మందికే అవకాశం దొరికింది. -
ఆధ్యాత్మిక వల్లి
* యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన గడ్డ * ఇటీవలి తవ్వకాల్లో బయటపడిన యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి.. యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన ప్రాంతమిది! గతంలో యజ్ఞయాగాలు జరిగిన చోటు. ఇటీవలే పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో 3 వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంగల యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు ఇక్కడ బయటపడ్డాయి. జగదేవ్‌పూర్‌లో బ్రహ్మశ్రీ ఆదరాసుపల్లి యజ్ఞరామ సోమయాజులు సోమయాగం నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడికి సమీపంలోని కుకునూర్‌పల్లిలో బ్రహ్మశ్రీ కాసు నరసింహసోమయాజుల వారు అత్యంత నిష్టాగరిష్టుడైన యజ్ఞకర్తగా పేరెన్నికగన్నారు. అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామానందులు, జయానందులు వంటి సర్వసంఘ పరిత్యాగులు ఈ ప్రాంతం వారే. ఇటీవల జరిపిన తవ్వకాల్లో.. యాగస్థలికి కూతవేటు దూరంలో ఉన్న శివారు వెంకటాపూర్‌లో వందలాది ఆదిమానవుల సమాధులు, యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు బయటపడ్డాయి. నిజాం కాలంలో ప్రజల్లో ధార్మిక చింతనను రగిలించి భాగవత సప్త ప్రవాహారాలతో భక్తిభావాన్ని నింపిన భావానంద భారతీస్వామివారు మర్కుక్ శ్రీ పాండురంగాశ్రమం కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారు. 40 ఏళ్ల కిందట పాండురంగాశ్రమం వ్యవస్థాపకులైన భావానంద భారతీస్వామివారి ప్రేరణతో ఎర్రవల్లిలో కృష్ణ భజన సంఘం ఏర్పడింది. ఓపక్క అపర కాంచీపురం అనదగిన వరదరాజస్వామి మందిరం, మరోవైపు శ్రీపాండురంగ ఆశ్రమాల పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అయుత చండీయాగం చేయడం కార్యాకారణ సంబంధమేనని, దీని వెనుక దైవిక ప్రేరణ, ఆయా మహాత్ముల ఆంతరంగిక స్పందన ఉందని పండితులు అంటున్నారు. వందేళ్ల క్రితం మైసూరు మహారాజు చేసిన అద్భుత యాగం మళ్లీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు రాత్రి 10 వరకు కార్యక్రమాలు * యాగానికి రానున్న చినజీయర్ స్వామి సాక్షి, హైదరాబాద్: అయుత చండీయాగంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. శుక్రవారం నాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి శుక్రవారం చండీయాగానికి హాజరవనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖులు చండీయాగంలో పాల్గొననున్నారు. -
ఎర్రవల్లిలో వేదఘోష
* అంగరంగ వైభవంగా రెండోరోజూ అయుత చండీయాగం * గులాబీ వర్ణ వస్త్రధారణతో కార్యక్రమాలు నిర్వహించిన రుత్విక్కులు * 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు * భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన సీఎం కేసీఆర్ దంపతులు * గౌరీదేవీ కుంకుమార్చనలో భారీగా పాల్గొన్న మహిళలు * హాజరైన కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, సుప్రీం జడ్జి జస్టిస్ చలమేశ్వర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి రెండోరోజూ వేదఘోషతో మార్మోగింది. పారాయణాలు, జపాలు, వేద మంత్రోచ్ఛరణలతో యాగక్షేత్రం హోరెత్తింది. ఆసాంతం ఆధ్యాత్మిక శోభను పంచింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో చేపట్టిన అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. తొలిరోజు మాదిరే శృంగేరి శారదా పీఠం శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణశర్మ బృందం పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరము కలిపి ప్రాశనములు చేసి యాగశాల మంటపాన్ని శుద్ధి చేసి, విఘ్నేశ్వర పూజలు చేశారు. ఉదయం 9.20 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు యాగశాలకు చేరుకోవడంతో రెండో రోజు క్రతువు మొదలైంది. ‘శ్రీ సచ్చిదానంద.. చంద్రశేఖర భారతీ తీర్థ.. విద్యాతీర్థగురుంబాజే.. వందే గురు పరంపర.. సాష్టాంగ ప్రమాణ సమర్పయామి’ అంటూ యాగ నిర్వాహకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా రుత్విక్కులంతా గురు ప్రార్థన చేసి యాగం మొదలు పెట్టారు. కేసీఆర్ యాగశాల చుట్టూ రెండు ప్రదక్షిణలు చేశారు. రుత్విక్కులు హోమగుండం చుట్టూ కూర్చుని పారాయణ జపాలు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు.. గోపూజ, మహాగణపతి, శతుషష్టి యోగినీ బలి, రాజశ్యామల పురశ్ఛరణ చతుర్వేద యాగం, కుమారి, సుహాసిని, మహా సాకం, ఉక్తదేవతా జపములు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11.15కు దుర్గామాతకు మహా మంగళ హారతి సమర్పించారు. 200 మంది రుత్విక్కులతో మహా రుద్రయాగం యాగశాలలోని మరో మండపంలో 200 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి పూజ నిర్వహించారు. మరో మండపంలో ముత్తయిదువలు లలితా సహస్ర నామాలతో గౌరీదేవీకి కుంకుమార్చన చేశారు. అర్చన కోసం వినియోగిస్తున్న కుంకుమను శృంగేరి శారదా పీఠం నుంచి తీసుకువచ్చారు. ఈ పూజలో హరీశ్‌రావు, కేటీఆర్ సతీమణులు పాల్గొన్నారు. అర్చనలో రోజుకు 3 క్వింటాళ్ల కుంకుమ వాడుతున్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. యాగ కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, పట్లూరు మాణిక్య సోమయాజులు, శృంగేరీ భావి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి, ఆయన తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్యం, కుప్పగోపాల వాజ్‌పేయి తదితరులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు. ప్రముఖుల రాక.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, డీజీపీ అనురాగ్‌శర్మ, ఐజీ నవీన్‌చంద్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ తదితరులు యాగానికి తరలివచ్చారు. గులాబీ వర్ణ వస్త్రాల్లో యాగం రెండోరోజు రుత్విక్కులు గులాబీ వర్ణ వస్త్రాలను ధారణ చేసి 100 హోమ గుండాల చుట్టూ 1,100 మంది ఆశీనులయ్యారు. అనంతరం ఏకోత్తర వృద్ధి సంప్రదాయంతో ఒక్కొక్కరు రెండు సప్తశతి పారాయణాలు, 3 వేల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు. రెండోరోజు యాగంలో రుత్విక్కులంతా కలిసి 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు. 11:40 గంటలకు సర్వభాష రుత్విక్కులు ఏకకంఠంతో చండీయాగ పారాయణాలు ప్రారంభించి నిర్విరామంగా మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగించారు. మధ్యాహ్నం 12.12 గంటలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ యాగస్థలికి వచ్చారు. వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చండీయాగం.. క్షణక్షణం ఉదయం 9:26: యాగస్థలికి చేరుకున్న కేసీఆర్ దంపతులు 10:11: యాగశాల చుట్టూ ప్రదక్షిణలు 10:57: దుర్గామాతకు అఖండ మంగళ హారతి 11:20: కుంకుమార్చనలో దంపతి, సుహాసిని పూజలు 11:40: ఏక కంఠంతో పారాయణాలు ప్రారంభించిన 1,100 మంది రుత్విక్కులు మధ్యాహ్నం 12:12: యాగస్థలికి వచ్చిన కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ 1:20: 2,200 పారాయణాలు, 33 లక్షల నవార్ణ మంత్ర జపాలు పూర్తిచేసిన రుత్విక్కులు 1:40: రుత్విక్కులకు భోజన విరామం 2:10: భోజన విరామానికి వెళ్లిన కేసీఆర్ 4:55: యాగశాలలోకి పునఃప్రవేశం రాత్రి 8:30 గంటలు: సాయంత్రం నుంచి కొనసాగిన ప్రవచనాలు - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
రెండో రోజు అయుత చండీయాగం
-
రెండో రోజు ప్రారంభమైన చండీయాగం
-
రెండో రోజు ప్రారంభమైన చండీయాగం
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 8.00 గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈరోజు గురు ప్రార్థన, గోపూజ, ద్విసహస్ర చండీ పారాయణం... కోటి సహస్రనామ పూజ, మహాధన్వంతరీ యాగం, శ్రీచక్ర పూజను రుత్వికులు నిర్వహించనున్నారు. ఈ రోజు ఈ యాగానికి కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె. చలమేశ్వర్ హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగం బుధవారం ప్రారంభమైంది. -
'అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే'
మెదక్ : విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కోసం చేపట్టిన పనులను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... అయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు. ఈ యాగానికి 40 వేల మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. ప్రతిరోజు 50 వేల మందికి ప్రసాదము, భోజనం అందజేస్తామన్నారు. అయితే ఈ యాగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. చండీయాగానికి అందురూ ఆహ్వానితులే అని చెప్పారు. చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించానని... ఆయన వచ్చే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. -
త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన
-
త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలో జిల్లాలలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. కేసీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ నుంచే జిల్లాల పర్యటనను ప్రారంభిస్తానని.. ఒక్కో జిల్లాలో వారం రోజులు ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని కేసీఆర్ తెలిపారు. అన్ని మండల కేంద్రాల నుంచి ఆదిలాబాద్‌కు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మంచిర్యాల, చంద్రాపూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొమురం భీమ్ వారసులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. -
14 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు కేసీఆర్
-
14 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు కేసీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్నారు. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. అక్టోబర్ 22వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కానున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆదివారం కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అమరావతి పర్యటనలో వెళ్లే ముందు కేసీఆర్ 21వ తేదీ రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేట చేరుకుంటారు. 22వ తేదీ ఉదయం హెలికాప్టర్లో ఆయన గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అమరావతి వెళ్తారు. కాగా అయిదేళ్ల క్రితమే కేసీఆర్ ఆంధ్రాలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. 2010లో దళిత కవి కత్తి పద్మారావు విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావాలంటూ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతలో లైలా తుపాన్ రావటంతో సభ వాయిదా పడింది. దీంతో కేసీఆర్ అక్కడకు వెళ్లలేకపోయారు. అలాగే మలివిడత తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభాలను కోస్తాంధ్రలో పర్యటించి.... ఆ ప్రాంత వాసులకు వివరించాలని కేసీఆర్ భావించారు. ఆ నిర్ణయాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్‌లు స్వాగతించారు. అయితే రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ అక్కడ పర్యటిస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అందరి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటానంటూ తిరుమల శ్రీవెంకటేశ్వరుడితోపాటు విజయవాడ కనకదుర్గమ్మను కేసీఆర్ ప్రార్థించారు. దేవుళ్ల దీవెనలు కూడా తోడై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దీంతో కేసీఆర్ అప్పుడు మొక్కిన మొక్కులు మాత్రం బాకీ ఉన్నాయి. ఈ మొక్కుల కోసం కేసీఆర్ ప్రభుత్వం 5.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది కూడా. కేసీఆర్ అమరావతి పర్యటన అనంతరం మరో రెండు నెలల్లో తిరుమల,విజయవాడల్లో ఈ మొక్కులను తీర్చుకునే అవకాశం ఉందని సమాచారం. -
కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తా: బాబు
విజయవాడ: ఈ నెల 22న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తానే స్వయంగా ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. స్వయంగా తాను కేసీఆర్‌ను కలిసి ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. -
ఎర్రవెల్లి గ్రామజ్యోతిలో కేసీఆర్ ప్రసంగం!
-
'సీఎంకు అంత దమ్ము లేదు'
భువనగిరి: ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసే దమ్ము తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలవలేరని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో జాప్యం వెనుక కుట్ర దాగుందని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. విద్యా రంగ సమస్యలపై ఈ నెల 21న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా కోరారు. -
మేడిపల్లి గ్రామజ్యోతిలో కేసీఆర్ ప్రసంగం
-
సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్పొరేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగాగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
'వివాదాలు వదిలి.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి'
-
'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'
నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిలో పోటీ పడాలే కాని వివాదాల మధ్య కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలను చట్టాలకు వదిలిపెట్టాలని వారికి హితవు పలికారు. అలాగే రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఇద్దరు సీఎంలకు హితవు పలికారు. కొందరు మంత్రులు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని వెంకయ్య పరోక్షంగా ఏపీ కేబినెట్ మంత్రుల గురించి పరోక్షంగా విమర్శించారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనవసర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు వెంకయ్య సూచించారు. -
'మైనార్టీల రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి'
హైదరాబాద్: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కేసీఆర్‌పై శుక్రవారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్న కేసీఆర్... వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామన్న రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. రంజాన్ ముగిసేలోగా ఈ ప్రక్రియను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. -
'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'
కాకినాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మండిపడ్డారు. కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎస్ సర్కార్ కావాలనే రేవంత్‌ను ట్రాప్ చేసి ఇరికించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. గతేడాది జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మంగళవారం కాకినాడలో నవ నిర్మాణ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఎన్. చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అంశంలో చంద్రబాబు పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు... ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని చినరాజప్ప వెల్లడించారు. -
ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ బస
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్, మర్కూక్ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జగదేవ్‌పూర్ మండలంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. 2 గంటలకు గజ్వేల్ నుంచి ములుగు మండలం మర్కూక్‌లో నాలుగు అభివృద్ధి పనులకు శంకస్థాపనలు చేశారు. అదే దారిన సీఎం కాన్వాయ్ శివారు వెంకటాపూర్ మీదుగా ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌కు చేరుకుంది. మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, పార్టీ ముఖ్య నేతలు కూడా ఫాంహౌస్‌కు చేరుకొని ఇక్కడే సీఎంతో కలసి భోజనం చేశారు. అనంతరం మిగతా వారంతా వెళ్లిపోగా సీఎం మాత్రం ఉండిపోయారు. రాత్రి ఇక్కడే బసచేసి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
నేడు ఢిల్లీకి వెళ్ళనున్న కెసీఆర్
-
టీచర్ అవతారం ఎత్తనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ఏం చెప్పినా సంచలనమే. తనలాగే తన పార్టీలోని నాయకులంతా కూడా వైబ్రెంట్‌గా తయారు కావాలన్నది ఆయన సంకల్పం. అందుకే.. ఆయన టీచర్ అవతారం ఎత్తుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జునసాగర్ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగించిన ఉద్యమంలో అనుభవాలు, తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అనుభవాలనే పాఠాలుగా చెబుతారట. అలాగని కేసీఆర్ ఒక్కరే కారు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా అక్కడకు వెళ్లి.. రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు క్లాసులకు హాజరవుతారు. చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. దాంతో సంఖ్య మరింత పెరుగుతుంది. -
తెలంగాణ యాత్రికులపై సీఎంఓ అధికారుల ఆరా
హైదరాబాద్ : శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే సహాయం అందించాల్సిందిగా నేపాల్‌లో భారత రాయబారి రంజిత్రేకు ఓ లేఖ రాసి పంపించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. -
'33 శాతం పంట నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి'
హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా అంచనా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అకాల వర్షాలపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 33 శాతం పంట నష్టం జరిగినా పరిగణలోకి తీసుకోవాలిని కేసీఆర్ సూచించారు. హరితహారం కోసం హైదరాబాద్ ను 400 విభాగాలుగా విభజిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. -
'ప్రతి కలెక్టర్ వద్ద రూ. 10 కోట్ల నిధి'
హైదరాబాద్: ప్రతి నెలలో ఓ రోజును అర్బన్ డే, మరో రోజును రూరల్ డే గా పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణం, పరిశ్రుభ్రంగా ఉండే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్ అందజేశేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ పట్టణాల్లో వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందాలని... అలాగే అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యవసర నిధి కింద ప్రతి కలెక్టర్ వద్ద రూ. 10 కోట్ల నిధి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. -
కేసీఆర్‌ను కలిసిన రామోజీరావు!
-
'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి'
హైదరాబాద్: దళితుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క దళితుడిని చోటు కల్పించలేదని ఆరోపించారు. ఈ నెల 14 అంబేద్కర్ జయంతి... ఈ నేపథ్యంలో ఆ తేదీలోపు టీ - కేబినెట్లో దళితుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులా ?
హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన వర్గాలను కేసీఆర్ సర్కార్ రాజ్యహింసకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ... కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పోరాడిన వర్గాలను కేసీఆర్ సర్కార్ రాజ్యహింసకు గురి చేస్తుందని ఆరోపించారు. విమలక్కపై తప్పుడు కేసులను బనాయించిందని ఆయన విమర్శించారు. సాగునీరు అడిగిన ఐదుగురు ఖమ్మం జిల్లా రైతులపై కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు పెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు లొంగరన్నారు. ఇటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని భట్టి ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. -
'వారి' కోసమే మిషన్ కాకతీయ
నిజామాబాద్: రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ కాకతీయ'ను ప్రారంభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ... ఆ రైతుల కుటుంబాలను పరామర్శించే దమ్ము లేదని ఆయన ప్రభుత్వ నేతల తీరును దుయ్యబట్టారు. తెలంగాణ బడ్జెట్లో పసలేదని... రైతులను చిన్న చూపు చూశారని షబ్బీర్ అలీ విమర్శించారు. అవినీతి సహించనన్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణ కనబడటం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించినట్లు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనకి పూలమాల వేస్తానని...లేదంటే ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు దేనికైనా సిద్ధమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి...
హైదరాబాద్: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి ఎఫ్ఆర్బీఎం పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అడుగుతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన భరోసా ఈ బడ్జెట్లో లేదని ఆరోపించారు. రుణమాఫీ అంశమే ప్రస్తావించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. రూ. 3 వేల కోట్ల మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకోవడం దారుణమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
‘గుట్ట’ చైర్మన్‌గా కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఆయన చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావు వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉంటారు. సభ్యులుగా భువనగిరి ఎంపీ, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, పురపాలక, ఆర్థిక, దేవాదాయ శాఖల ముఖ్యకార్యదర్శులు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, నల్లగొండ డీఎఫ్ఓ ఉంటారు. సంస్థ పాలకవర్గంలో అదనంగా మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులుంటారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థ (టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాభివృద్ధి పనుల కోసం తక్షణమే రూ.100 కోట్లు మంజూ రు చేస్తున్నట్టు వాటిలో పేర్కొన్నారు. ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలును ఇకపై ఆయనే నేరుగా పర్యవేక్షిస్తారు. వారంలో ఒకసారి సంస్థ పాలకవర్గాన్ని సమావేశపరిచి ఆలయాభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకే ఆయన ఈ కమిటీని వేశారని అధికార వర్గాలు తెలిపాయి. కేసీఆర్ నేతృత్వంలో గుట్ట ఆలయాభివృద్ధి సంస్థ ఏర్పాటు కానుందని పేర్కొంటూ గత డిసెంబర్ 26న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇవ్వడం తెలిసిందే. గుట్ట ఆలయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్, నాలుగంచెల్లో దాని అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో ఆలయాభివృద్ధి సంస్థ ఏర్పాటుపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు జరిపి రెండు నెలల కింద ప్రతిపాదనలు పంపింది. ఆలయం చుట్టూ ఉన్న 6 గ్రామాల్లోని సుమారు 28 వేల ఎకరాల పరిధిలో ఆలయాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలంటూ అది చేసిన ప్రతిపాదనలను కేసీఆర్ శుక్రవారం ఆమోదించారు. దాంతో ఆ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, గుండ్లపల్లి, సైదాపూర్, దాతర్పల్లితో పాటు భువనగిరి మండలం రాయగిరి తదితర గ్రామాల పరిధిలోని 28 వేల ఎకరాలు ఆలయాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చాయి. ఇలా సేకరించే స్థలాల్లో నారసింహ అభయారణ్యంతో పాటు ఔషధ మొక్కల పెంపకం, భక్తులకు కాటేజీలు, కల్యాణ మండపం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. -
''సొంత సొమ్ముతో సీఎం మొక్కులు చెల్లించాలి''
-
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం చేయూత!
-
అండగా నిలుస్తాం
అమరుల కుటుంబాలకు త్వరలోనే రూ. 10 లక్షల ఆర్థిక సాయం పంపిణీ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి వ్యాపారం చేసుకునేవారికి అదనంగా ఆర్థికసాయం వ్యవసాయం చేసుకుంటే భూమి అందజేత వచ్చే నెల 1 నుంచి బీడీ కార్మికులకు భృతి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల పరీక్షకు ప్రయోగశాల సీఎం కేసీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలకు సాంత్వన కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం అధికారులను ఆదేశించారు. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం చెల్లించాలని... ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత అంశంపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని... దీనిపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగావకాశం కల్పించాలనే అంశాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని సీఎం సూచించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా... మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటామంటే కూడా అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయం చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా అమరుల కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏం కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలో ఉన్న ఒక్కో అమర వీరుల కుటుంబానికి ఏం కావాలనే అంశంపై స్వయంగా దృష్టిపెట్టాలని చెప్పారు. ఆర్థిక సహాయం చెల్లింపులో ఎటువంటి జాప్యం వద్దని స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం చెల్లింపు కోసం కావాల్సిన నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. 462 కుటుంబాలకు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన 442 మంది అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ గతేడాది అక్టోబర్ 27వ తేదీన ఉత్తర్వులు (జీవో నం.36) జారీ చేసింది. అమరవీరుల పేర్లు, చిరునామాలతో జిల్లాల వారీగా జాబితాను అందులో ప్రకటించింది. ఆ తర్వాత నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని మరో 20 మంది అమరవీరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 7న మరో ఉత్తర్వు(జీవో నం.17) జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో... తక్షణమే 462 మంది అమరుల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. జిల్లా వారీగా ఈ కుటుంబాల సంఖ్యను ఈ కింది పట్టికలో చూడవచ్చు.. తొలి విడతలో గుర్తించిన కుటుంబాలు.. జిల్లా అమరులు నల్లగొండ 53 ఖమ్మం 04 రంగారెడ్డి 29 ఆదిలాబాద్ 27 కరీంనగర్ 164 నిజామాబాద్ 31 మహబూబ్‌నగర్ 17 హైదరాబాద్ 11 మెదక్ 52 వరంగల్ 91 మొత్తం 462 బీడీ కార్మికులకు భరోసా.. బీడీ కార్మికులకు రూ. వెయ్యి పింఛన్ ఇస్తామన్న హామీని వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజు ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, మండలాల్లో స్థానిక ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బీడీ కార్మికులున్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలనిఆదేశించారు. బీడీ కార్మికుల భృతి కోసం సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ. 40 కోట్లు విడుదల చేసింది. వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రంగా రాజధాని.. వివిధ వ్యాక్సిన్ల నాణ్యతా పరీక్షలు జరిపేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాక్సిన్ల ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్ల ల్యాబ్ ఏర్పాటు అవసరాన్ని వివరించగా... దానిపై సీఎం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ల్యాబ్‌కు అవసరమైన భూమి, నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. నగరంలో ల్యాబ్ పెట్టడం వల్ల తెలంగాణకే కాక, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందకేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏడాదికి రూ. 4,500 కోట్ల విలువైన వ్యాక్సిన్లు తయారవుతుంటే.. అందులో తెలంగాణలోనే రూ. 3,000 కోట్లకు పైగా విలువైన వ్యాక్సిన్లు తయారవుతున్నాయని వరప్రసాద్‌రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో ఆరు ప్రముఖ కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో భాగస్వాములైతే అందులో తెలంగాణలోనే నాలుగు కంపెనీలున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు. అయితే వ్యాక్సిన్ల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు రాష్ట్రంలో అందుబాటులో లేవని, హిమాచల్‌ప్రదేశ్‌లో కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీకి పంపాల్సి వస్తోందని వరప్రసాద్ సీఎంకు తెలిపారు. దీంతో కేసీఆర్ నగరంలో ల్యాబ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. -
కూతురికి మంత్రి పదవి కోసమే..!
-
ఢిల్లీలో కేసీఆర్ బిజీ.. బిజీ!
-
'మానవత్వం లేని మనిషి కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి టి.రాజయ్య వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులు శుక్రవారం నిప్పులు చెరిగారు. కేసీఆర్ మానవత్వం లేని మనిషి అని ఆయన ఆరోపించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి దుర్మార్గంగా తొలగించారని విమర్శించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి అవమాన పరిచే విధంగా తొలగించారని ఆరోపించారు. రాజయ్యకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. -
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
-
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
తెలంగాణ సీఎం సహాయనిధిలో అక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీరియస్ అయ్యారు. కొన్ని ఆస్పత్రులు నకిలీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్న వ్యవహారం ఆయన దృష్టికి రావడంతో దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. నకిలీ బిల్లులతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండులో చేతివాటం చూపించినట్లు వెలుగుచూసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నిజమైన పేదలు వైద్యం చేయించుకోడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సాయం చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ గత కొన్ని రోజులుగా కొన్ని ఆస్పత్రుల్లో దుర్వినియోగం అవుతోంది. ఉదారంగా సాయం చేస్తుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్న వ్యవహారం సీఎం దృష్టికి వచ్చింది. గత ఏడు నెలల్లో జరిగిన విషయాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరిపి నిజనిర్ధారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. -
... అందుకే రాజయ్యపై వేటు వేశారు
హైదరాబాద్: టి.రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా మాదిగల ఆత్మగౌరవాన్ని తెలంగణ సీఎం కేసీఆర్ దెబ్బతీశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాల చేసుకుంది దళితులు కాదా ?.... మాదిక కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదని ఆయన కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీపై ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు వేశారిని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి తీరు కనబరిచారంటూ రాజయ్యకు మోత్కుపల్లి కితాబు ఇచ్చారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో వెల్లడించాలని సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి సవాల్ ఇచ్చారు. -
స్వైన్‌ఫ్లూపై అందరం కలిసి పోరాడదాం!
-
'పాలమూరును కేసీఆర్ విస్మరించారు'
మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించిన పాలమూరు జిల్లాను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయించడమే లక్ష్యంగా నాగం శనివారం నాగర్‌కర్నూలు మండలం గుడిపల్లి గట్టు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నాగం మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి అబద్దాలు మాట్లడటం మానుకోవాలని ఆయన మంత్రులకు హితవు పలికారు. -
'కేసీఆర్ మనవడి తరంలో కూడా అమలు కాదు'
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలుకు హామీలు ఇచ్చి... ఆపై ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పీఠం అధిష్టించిన కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్ సర్కార్ విస్మరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలా మొక్కుబడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే... కేసీఆర్ కాదు గదా ఆయన మనువడి తరంలో కూడా కేజీ టూ పీజీ హామీ అమలు కాదని ఎద్దేవా చేశారు. విద్య హక్కు చట్టాన్ని కూడా కేసీఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. -
'నిజాం చాలా గొప్పరాజు'
హైదరాబాద్: నిజాం చాలా గొప్పరాజు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు అన్నీ ఆయన నిర్మించినవేనని కేసీఆర్ గుర్తు చేశారు. గురువారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 75వ నుమాయిష్‌ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే గొప్పగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ స్థలం వారంలోగా సొసైటీకి అప్పగిస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఎవరైనా బతకవచ్చని... అందరిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై త్వరలో జంట నగరాల ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తామని చెప్పారు. -
గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ!
-
నిర్దేశిత గడువులోగా పూర్తవ్వాలి
విద్యుత్ ప్రాజెక్టులపై అధికారులతో కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ జెన్కో, భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ(భెల్)పై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భెల్ సీఎండీ ప్రసాదరావుకు మొదటి విడతగా రూ. 350 కోట్ల చెక్‌ను ముఖ్యమంత్రి అందజేశారు. విద్యుత్ ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు అందచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తన అభిమతమని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెంలో రూ. 3,810 కోట్ల వ్యయంతో చేపట్టిన 800 మెగావాట్ల యూనిట్, మణుగూరులో రూ. 4,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న 1,080 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణ బాధ్యతలను భెల్‌కు అప్పగించిన విషయం విదితమే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వరంగ సంస్థలకే అప్పగించడం ద్వారా పారదర్శకత ఉంటుందని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణను మూడేళ్లకాలంలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తామని తాము ప్రజలకు హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మీదే అని ఈ సందర్భంగా భెల్ సీఎండీ ప్రసాదరావు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావులకు సీఎం సూచించారు. కాగా కొత్తగూడెం, మణుగూరు విద్యుత్ ప్లాంట్ల డిజైన్లు, బాయిలర్లు, టర్బయిన్ల నిర్మాణ ప్రతిపాదనలు పూర్తయ్యాయని, సివిల్ పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భెల్ సీఎండీ వివరించారు. మణుగూరులో రెండేళ్లలో, కొత్తగూడెంలో మూడేళ్లలో ప్లాంట్లు సిద్ధం అవుతాయని వెల్లడించారు. వీటితోపాటు ఆదిలాబాద్‌లోని జైపూర్‌లో కూడా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో 7,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే పర్యావరణ అనుమతులను కూడా త్వరలో సాధించగలమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు తారక రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్‌సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. 2009లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. -
మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
వరంగల్: వరంగల్ జిల్లా చెర్యాల మండలం కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కొమరవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరుపున ఆయన పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కొమరవెల్లి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం హెలికాప్టర్ లో కొమరవెల్లి చేరుకున్నారు. కేసీఆర్ కు పార్టీ నేతలు, నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. -
'కేసీఆర్ ఎజెండానే నా ఎజెండా'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అన్ని జిల్లాలు సమానమేనని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు అన్న తారతమ్యాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పదవులు పొందిన నేతలంతా కలసి పని చేస్తామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఎజెండానే తన ఎజెండా అని తెలిపారు. తెలంగాణ, మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి చెప్పారు. -
రేపు ఢిల్లీ వెళ్ళనున్న కేసీఆర్
-
రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నట్టు తెలిసింది. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేసీఆర్ విభజన ఇబ్బందులను ఢిల్లీలోని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకవెళ్లనున్నట్టు తెలిసింది. -
సీఎంను తీసుకొచ్చి ఆలయ రూపురేఖలు మారుస్తా
⇒రెండేళ్లలో అన్ని గ్రామాలకు వాటర్ ప్లాంట్లు ⇒అర్హులందరికీ ఫించన్లు వస్తాయ్ ⇒ఎంపీ కడియం శ్రీహరి జీడికల్(లింగాలఘణపురం) : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి వచ్చే నవంబర్‌లోగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆలయ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జీడికల్ ఆలయ అభివృద్ధికి తనతో పాటు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్యతో కలిసి చర్యలు తీసుకుంటానన్నారు. రెండేళ్లలో మండలంలోని 17 గ్రామాలతోపాటు శివారు గ్రామాల్లో కూడా ఢీఫ్లోరైడ్ వాటర్ప్లాంట్లు ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మిస్తానని చెప్పారు. మొదటి విడతగా ప్రస్తుతం వాటర్‌ప్లాంట్‌లేని గ్రామాలకు మంజూరీ చేస్తానన్నారు. సమావేశంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్‌లు మదార్, సోమయ్య, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మధు, కృష్ణ, అంజయ్య, నాయకులు నాగరాజు, శ్రీనివాసు, పురుషోత్తంరెడ్డి, వీరస్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశం, రవి పాల్గొన్నారు. విచారణ పూర్తి చేసి రెన్యూవల్ చేయండి లింగాలఘణపురం : కళ్లెం సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించి త్వరగా రైతులకు రుణాలు రెన్యూవల్ చేయాలని ఎంపీ కడియం శ్రీహరి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్(డీసీఓ) సంజీవరెడ్డిని ఆదేశించారు. శనివారం ఆయన జీడికల్ వీరాచల రామచంద్రుడిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ దర్శన్‌రెడ్డి సొసైటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే డీసీఓతో ఫోన్లో మాట్లాడారు. సొసైటీలో విచారణ పూర్తి చేసి త్వరగా రుణాలు రెన్యూవల్స్ చేయాలని ఆదేశించారు. సోమవారం విచారణ అధికారిని పంపిస్తానని డీసీఓ చెప్పినట్లు ఎంపీ శ్రీహరి వైస్‌చైర్మన్‌కు తెలిపారు.