కేసీఆర్ సింగపూర్ పర్యటన పారిశ్రామికవేత్తల లాభానికే..
సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు సింగపూర్ పర్యటన పెట్టుబడిదారుల లాభాల కోసమే తప్ప మరొకటి కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గత చంద్రబాబు విధానాలనే నేడు కేసీఆర్ అనుసరిస్తున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరి రోజు తరగతుల్లో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో విపరీతంగా కరువు వచ్చి రైతు లు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి కష్టసుఖాలు తెలుసుకోవాల్సిన కేసీఆర్ విదేశీ పర్యటనలు చేయడంలో అర్థం లేదన్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి భూ స్వామ్య ప్రభుత్వమే అని ఆరోపించారు. భూ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పి కేవలం 1500 ఎకరాల పంపిణీ చేశారని తెలిపారు. గత కేబినేట్ సమావేశంలో 43 అంశాలను ఆమోదించిన ప్రభుత్వం ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికత, ఉద్యోగుల పంపిణీ, గోకుల్ ట్రస్టు భూములు వంటి కీలక సమస్యలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌పై గరవ్నర్ పెత్తనాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇచ్చేం దుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాం డవం చేస్తోందన్నారు. రైతులకు సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో వేసిన కొద్ది పంటలు కూడా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కనీసం మంచినీరు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 9 వేల క్యూసె నీటిని విడుదల చేసి మొదటి జోన్‌కు నీళ్లు అందించాలన్నారు.
ఎక్కడికక్కడ తూములు కట్టడంతో రైతులు వాటి వద్ద ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏఎమ్మార్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని చెరువులను నింపాలన్నారు. కేసీఆర్ సింగపూర్ పర్యటనకు ఈ దఫా ఎమ్మెల్యే, మంత్రులను తీసుకెళ్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. పర్యటనలు మాని గ్రామాల్లో పర్యటించి కరెంటు, నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రాములు, వీరారెడ్డి, టి.గోపి, నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, నూకల మధుసూదన్‌రెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు, మల్లు నాగార్జునరెడ్డి, చెరుకు ఏకలక్ష్మి, మట్టిపల్లి సైదులు, కోట గోపి, శేఖర్, రణపంగ కృష్ణ, సాయికుమార్, శ్రీను, గోవింద్, సత్యం, శ్రీకాంత్, నర్సయ్య, క్రాతి, వెంకన్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరం..
రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ప్రతినిధులకు పట్టణానికి చెందిన డాక్టర్ గంట దయాకర్‌రెడ్డి ఉచితంగా వైద్యపరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు.
కరెంటు కోతల రైతాంగం అతలాకుతలం
కరెంటు కోతలతో రాష్ట్ర రైతాంగం విలవిలలాడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం రాష్ట్రస్థాయి రాజకీయ తరగతులకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నప్పటికీ.. దానిని పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనకు వెళ్లడం శోచనీయమన్నారు. కేసీఆర్ సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత.. అక్కడ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని గంటలపాటు కరెంటు కోతలు కొనసాగుతున్న దృష్ట్యా ఏ పారిశ్రామిక వేత్త వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదన్నారు.