Singapore tour
-
భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్ వివరించారు. -
Chandrababu Naidu: ఆ నాలుక ఎలాగైనా మడత పడుద్దీ.!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు మాటలకు ఆయన చేసే పనులకు పొంతన ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనని, సెల్‌ఫోన్ తీసుకొచ్చింది కూడా తానే అంటూ పదే పదే గప్పాలు కొట్టుకుంటున్న బాబు.. ఏపీలో అభివృద్ధి అనే అంశాన్ని తీసుకుని ప్రతిసారీ అవే మాయావి మాటలు వల్లెవేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చేవ లేని కబుర్లు చెప్పి తనదైన శైలినే ప్రదర్శించారు బాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. రాజధానిని అలా కడతాను, ఇలా తీర్చిదిద్దుతాను, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తానంటూ అంటూ తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. సింగపూర్, జపాన్, లండన్, దావోస్ ఇలా ఒక్కటేంటి.. వెళ్లిన ప్రతి చోటా అక్కడి ప్రాంతంలాగా ఏపీని మార్చుతానని సొల్లు కబుర్లు చెబుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ప్రజాధనంతో ఫారిన్ టూర్లు చేసి.. ప్రజలను ఏమార్చడానికి కల్లబొల్లి ప్రకటనలు చేశారు. తీరా చూస్తే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేని అసమర్థతను, అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్నీ కట్టలేని తన చేతకానితనాన్ని నిరూపితం చేసుకున్నారు. చంద్రబాబు నోటి నుంచి రాలే అణిముత్యాలు కేవలం ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసే ఎత్తుగడ మాత్రమేనని.. ఆయన ఏం చెప్పినా.. వాటి వెనుక స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయనడానికి కింద తెలిపిన వివరాలే నిదర్శనం.. Nov 3 ,2014 : 3 రోజుల సింగపూర్ పర్యటన...జిల్లాకో ఎయిర్‌పనోర్టు తీసుకోస్తాం అని ప్రకటన. Nov 24,2014 : 6 రోజుల జపాన్ పర్యటన....ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలలో జపనీస్ భాషని ప్రవేశపెడతాం అని ప్రకటన. జనవరి 20,2015: 4 రోజుల దావోస్ పర్యటన...స్పెయిన్ బులెట్ ట్రైన్ మీద స్టడీ చేసి అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో తీసుకోస్తాం అని ప్రకటన. ఏప్రిల్ 15,2015 : 6 రోజుల చైనా పర్యటన...షాంఘై లాగా అమరావతిని నిర్మిస్తాం. జులై 5,2015 : 3 రోజుల జపాన్ పర్యటన...టోక్యో లాగా అమరావతిని నిర్మిస్తాం. ఆగస్ట్ 3,2015 : 6 రోజుల టర్కీ పర్యటన...ఇస్తాంబుల్ లాగా అమరావతిని కడతాం. సెప్టెంబర్ 20,2015: 3 రోజుల సింగపూర్ పర్యటన....అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం...తుళ్లూరుని సింగపూర్‌గా చేస్తాం. జనవరి 16,2016: 4 రోజుల దావోస్ పర్యటన....అమరావతికి పెట్టుబడుల వరద రాబోతుంది. మార్చ్ 11,2016 : 3 రోజుల లండన్ పర్యటన...అమరావతిలో లండన్ ఐ ని నిర్మిస్తాం. మే 8,2016 : 6 రోజుల థాయిలాండ్, స్విట్జర్లాండ్ టూర్.....ఫామిలీ టూర్ అని చెప్పాడు... బహుశా స్విస్ బ్యాంకులో ఏదో పని ఉండి ఉండొచ్చు...అది divert చేయడానికి థాయిలాండ్ మీదుగా ఫ్యామిలితో స్విట్జర్లాండ్ వెళ్ళాడు. జూన్ 27,2016 : 6 రోజుల చైనా టూర్...ఆంధ్రప్రదేశ్‌లో బులెట్ ట్రైన్ తీసుకొస్తా. జులై 9,2016 : 2 రోజుల కజాకిస్తాన్ టూర్...కేబుల్ కార్లని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తా. జులై 16,2017 : 3 రోజుల రష్యా టూర్...ఆంధ్రప్రదేశ్ లో మెరైన్ యూనివర్సిటీ స్టాపిస్తామని ప్రకటన. జనవరి 8,2017 : 2 రోజుల శ్రీలంక టూర్ ...అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అని ప్రకటన. జనవరి 16,2017: 3 రోజుల దావోస్ టూర్....మాస్టర్ కారిడార్ వైజాగ్‌కు తీసుకొస్తామని ప్రకటన. మే 4,2017 : 8 రోజుల అమెరికా టూర్... వైజాగ్‌కు ఫ్రాంక్లిన్ టెంపులెటన్ తీసుకొస్తా అని ప్రకటన. అక్టోబర్ 19,2017: 8 రోజుల చికాగో, దుబాయ్, లండన్ల పర్యటన...ఆంధ్రప్రదేశ్ లో ఏరో సిటీ కడతాం,దుబాయ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు కనెక్టివిటీ ,లండన్ తరహా ట్రాన్స్‌పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోస్తాం అని ప్రకటన. డిసెంబర్ 4 ,2017 : 4 రోజుల సౌత్ కొరియా టూర్,అమరావతిని సౌత్ కొరియా రెండో రాజధానిగా చేస్తాం అని ప్రకటన. ఇవీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనంతో చేసిన ఫారిన్ టూర్లు, ప్రజలని ఏమార్చడానికి 2014 నుంచి 2017 చేసిన ప్రకటనలు.... 2018,19 ఫారిన్ టూర్స్ గురించి మాత్రం చెప్పట్లేదు. -
చలో.. ఫారిన్ టూర్!
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సింగపూర్, మలేసియా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ అనుమతి కోరేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పనిలో పనిగా కేవలం తమ కోసమే అయితే బాగుండదని భావించి కాబోలు...తమతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, ఆరు జోన్ల కమిషనర్లు, జీహెచ్ఎంసీలోని అందరు ఐఏఎస్‌లను కూడా కలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు, సమన్వయం తదితర బాధ్యతల్ని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌కు అప్పగిస్తూ తీర్మానించారు. ప్రస్తుతం కేవలం స్టాండింగ్ కమిటీ సభ్యులకే పరిమితమైన ఈ ‘అధ్యయన’ యాత్ర ఇంతటితో ఆగుతుందా.. లేక అందరు కార్పొరేటర్లకూ ఉంటుందా అన్నది వేచి చూడాల్సిందే. గత పాలక మండళ్లలోనూ కార్పొరేటర్లు అధ్యయన యాత్రల పేరిట దేశంలోని పలు నగరాలను చుట్టివచ్చినప్పటికీ, అవి విహార యాత్రలుగా మిగిలాయి తప్ప, అక్కడి అధ్యయనంతో ఇక్కడ ఏం అమలు చేశారో వారికే తెలియాలి. లోకాయుక్త ఆక్షేపించినా.. గత పాలకమండళ్లలోని కార్పొరేటర్లు అధ్యయనయాత్రల పేరిట ఆయా నగరాలను చుట్టిరావడం.. వాటి వల్ల ప్రజాధనం దుర్వినియోగమవడం తప్ప ఎలాంటిప్రయోజనం లేదని లోకాయుక్త అభిప్రాయపడింది. దాంతోపాటు కనీసం కార్పొరేషన్ స్థాయి కూడా లేని నగరాల పర్యటనలు అనవసరమని స్పష్టం చేయడమే కాక ఒక్కో కార్పొరేటర్‌కు గరిష్టంగా రూ.80 వేలు మించి ఖర్చుచేయరాదని పరిమితి విధించడంతో తర్వాతి దశలో అధ్యయనాల పేరిట పెద్ద నగరాలను ఎంచుకున్నారు. ఖర్చుపై కట్టడితో ఏటా దాదాపు రూ.4 కోట్లయ్యే ఖర్చు రూ.1.5 కోట్లకు తగ్గింది. అధ్యయనం అనంతరం తీసుకున్న చర్యలను సైతం నివేదించాలని సూచించడంతో అధ్యయనం తర్వాత నివేదికలు ఇవ్వడం ప్రారంభించారు. అంతకుమించి ఇక్కడ అమలు చేసిందంటూ ఏమీ లేదు. ఏం నివేదించారు... ఏం చేశారు.. ??ఫుట్‌పాత్‌లను పట్టించుకోలేదు.. ♦ 2011లో స్టడీటూర్‌లో భాగంగా ఢిల్లీ, చండీగఢ్, సిమ్లా, అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్లతో సహ పలు నగరాలు పర్యటించి వచ్చిన కార్పొరేటర్లు..చండీగఢ్‌లోని ఫుట్‌పాత్‌లు బాగున్నాయని భావించారు. అక్కడ అన్ని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, లేన్లు, బై లేన్లలో కూడా పాదచారులకు తగిన ప్రాధాన్యతనివ్వడాన్ని గుర్తించారు. పాదచారులు, వాహనాల రద్దీకి అనుగుణంగా ఫుట్‌పాత్‌లు తగిన వెడల్పుతో ఉండటాన్ని నివేదికలో ప్రస్తావించారు. ఫుట్‌పాత్‌లపై ప్రజలు నడవడానికే తప్ప ఇతరత్రా ఏ ఆటంకాలూ లేకపోవడంతో ప్రమాదాలు లేకపోవడాన్ని కూడా పేర్కొటూ హైదరాబాద్‌లోనూ అలాంటి ఫుట్పాత్లవసరమని భావించారు. ఈ నివేదికనిచ్చి దాదాపు ఎనిమిదేళ్లయినా ఇంతవరకు ఈ దిశగా చేసిందంటూ ఏమీలేదు. పైపెచ్చు చండీగఢ్ ప్రణాళికబద్దంగా నిర్మించిన నగరమైనందున అక్కడి సదుపాయాలు ఇక్కడ కల్పించలేమని తేల్చిపారేశారు. ♦ జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌గా విశ్వజిత్ కంపాటి బాధ్యతలు చేపట్టాకే ఇటీవలి కాలంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తుండటం తెలిసిందే. ప్రత్యేక కమిటీలేవీ..? ప్రజా సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు చండీగఢ్‌లో కార్పొరేటర్లతో స్పెషల్ కమిటీలు నియమించారు. అలాంటి వాటిల్లో మండీ కమిటీ, పనులు– టెండర్ల కమిటీ, వాటర్‌వర్క్స్, సివరేజి కమిటీ తదితరమైనవి ఉన్నాయి. అలాంటివి ఇక్కడా ఏర్పాటు చేయాలనుకున్నా, చేసిందేమీ లేదు. దుకాణాలు.. వ్యాపారుల కమిటీ.. దుకాణాలు.. వ్యాపార సంస్థల పరిసరాల్లో పరిశుభ్రత బాధ్యత లు నిర్వహించేందుకు దుకాణాలు, వ్యాపారుల కమిటీగా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అపరిశుభ్ర, అనారోగ్యకర వాతావరణం ఉంటే.. అందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కమిటీదే. ఆయా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా చెత్త తరలింపు బాధ్యత కూడా దీనిదే. ఈ కమిటీ గురించి అసలు పట్టించుకోలేదు. ప్రస్తుతం స్వచ్ఛ కార్యక్రమాల కోసం ఎన్నో పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ ఈ కమిటీని ఏర్పాటుచేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. వ్యాపార జోన్లు.. ఢిల్లీలో మాదిరిగా ఆయా వ్యాపారాలు, ట్రాఫిక్‌రద్దీని బట్టి గ్రీన్, ఎల్లో, రెడ్ జోన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదు. వీటి ఏర్పాటు కోసం చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులైతే అందజేసినప్పటికీ, అమలు కావడం లేదు. వెస్ట్‌జోన్‌లో త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ♦ సిమ్లాలో మాదిరిగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని నిషేధించాలని సూచించగా.. అందుకు కొంతమేర ఏర్పాట్లు చేసినప్పటికీ అనంతరం విస్మరించారు. తిరిగి మళ్లీ ఇప్పుడు అడపాదడపా చర్యలు తీసుకుంటున్నారు. సైన్బోర్డులదీ అదే దారి.. ♦ ఫుట్‌పాత్‌లతో పాటు అక్కడ సైన్‌బోర్డులు స్థానికులతో పాటు పర్యాటకులకూ ఉపయుక్తంగా ఉండటాన్ని ప్రస్తావించారు. అదే తరహాలో నగరంలోని అన్ని రహదారుల నుంచి ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లే మార్గాలు తెలిసేలా .. ప్రముఖ ప్రాంతాలను గుర్తించేలా సైనేజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, ద్విచక్రవాహనదారులకు సదుపాయంగా ఉండటమే కాక, ప్రమాదాలు తగ్గగలవని అభిప్రాయపడ్డప్పటికీ చేసిందంటూ ఏమీ లేదు. ఆ తర్వాత గ్రేటర్ మొత్తం సైనేజీల ఏర్పాటుకు కన్సల్టెంట్స్తో నివేదిక రూపొందించి దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అందులో భాగంగా 2012లో కాప్ సందర్భంగా ఎంపిక చేసిన మార్గాల్లో దాదాపు రూ. 10 కోట్ల పనులు మాత్రం చేశారు. ఆ తర్వాత మరిచారు. ♦ ఇటీవల పోలీసుల సూచనల మేరకు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైనేజీల ఏర్పాటుకు దాదాపు రూ. 4.50 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కొన్ని మార్గాల్లో పనులు చేపట్టారు. ♦ గవర్నర్ నరసింహన్ సైతం నగరంలో సైనేజీలు లేకపోవడాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పటి వరకు చుట్టి వచ్చిన నగరాలు.. కార్పొరేటర్లు ఇప్పటి వరకు చుట్టివచ్చిన నగరాల్లో ఢిల్లీ, చండీగఢ్, సిమ్లా, అమృత్సర్, ఉదయ్‌పూర్, కోల్కత్తా, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, పుణె, జో«ధ్‌పూర్, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ తదితరమైనవి ఉన్నాయి. హ్యాండీకామ్‌లు అందుకున్నారు.. గత పాలకమండళ్లలో అధ్యయన యాత్రలతోపాటు లాప్‌టాప్‌లు, హ్యాండీకామ్‌లు వంటివాటిని పొందారు. ప్రస్తుత పాలకమండలిలోనూ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్లు, ఐపాడ్లు వంటివి పొందారు. అధికారులు సైతం... గతంలో అధికారులు విడిగా ఆయా అంశాల్లో అధ్యయనం కోసం ఆయా దేశాలు చుట్టివచ్చారు. ఘనవ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి సంబంధించిన అంశంపై అప్పటి కమిషనర్ కృష్ణబాబు, ఈఈ సుధాకర్‌లు చైనా వెళ్లి వచ్చారు. ‘ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ అర్బన్ మేనేజ్మెంట్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు అప్పటి అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) అశోక్‌రెడ్డి అమ్స్టర్డ్యాం, బార్సిలోనాలకు వెళ్లి వచ్చారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యం ప్రపంచంలో ఎక్కడున్నా తమ ఉన్నతాధికారులను అధ్యయనానికి పంపిస్తామని కమిషనర్ దానకిశోర్ పేర్కొనడం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ కూడా కార్పొరేటర్లను అధ్యయనయాత్రలకు పంపిస్తామని గతంలో పేర్కొన్నారు. -
ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్
సింగపూర్ సిటీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సోమవారం రాత్రి తాను బస చేసిన సెయింట్ రెజిస్ హోటల్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. ఆయన్ని అలా చూసే సరికి ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అణ్వాయుధాలతో అగ్రరాజ్యాన్ని సైతం వణికించిన కిమ్.. సరదాగా నవ్వుతూ తమ మధ్య తిరగటాన్ని ప్రజలు ఆస్వాదించారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దారి పొడవునా కిమ్ కిమ్.. అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట సోదరి కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో, ఇంకా పలువురు రిపోర్టర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌తో కూడా దౌత్య సంబంధాలు మెరుగుపడే దిశగా కిమ్ చర్చలు జరపటం విశేషం. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కిమ్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా, భారత కాల మానం ప్రకారం ఈ వేకువ ఝామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాగా.. చర్చలు ఫలవంతమైనట్లు ట్రంప్ ప్రకటించారు. మరికాసేపట్లో ఇద్దరు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్, చైనా చేయి కలిపితే..
సింగపూర్ : భారత్, చైనాలు చేయి కలిపితే ఆసియా భవితవ్యం అద్భుతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-చైనా మధ్య వాణిజ్యం పెరుగుతున్నదని, ఇరు దేశాలు పరిపక్వతతో సరిహద్దు సమస్య సహా పలు అంశాలను సమర్ధంగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సింగపూర్‌లో జరిగిన షంగ్రిలా డైలాగ్‌లో కీలకోపన్యాసం చేశారు. వైషమ్యాలతో ముందుకుసాగితే ఆసియా వెనుకబడుతుందని, సహకారంతో ముందుకెళితే శతాబ్ధం ఆసియాదే అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. చైనా, భారత్‌లు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయని, ఇరు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని అన్నారు. ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీ ఫలవంతంగా ముగిసిందని, ఇరు దేశాలు మెరుగైన, పటిష్ట సంబంధాలను కోరుకుంటున్నాయని చెప్పారు. దేశాలు వైషమ్యాలు, పోటీని విడనాడి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లే వేదికగా భారత్ ఆసియాన్‌ను పరిగణిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్క దేశం తనకు తానుగా వృద్ధి చెందే పరిస్థితి లేదని, ఒక దేశంపై మరో దేశం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. -
సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి బయలు దేరి సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఉన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం అవుతారు. సింగపూర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు మాస్టర్ ప్రణాళికను ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తారు. మాస్టర్ ప్రణాళికలలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి, ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుకుంటారు. మరి కొద్ది రోజుల్లో రాజధాని మాస్టర్ ప్రణాళికను సమర్పించనున్న నేపథ్యంలోచంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో సింగపూర్ పర్యటనకు వెళ్లినట్లు ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 30వ తేదీ ఉదయం సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం చంద్రబాబుకు అల్పాహార విందు ఇస్తారు. అనంతరం సింగపూర్ వాణిజ్య, పారిశ్రామిక మంత్రి ఎస్. ఈశ్వరన్, రాయభారి గోపీనాధ్ పిలైతో ఉన్నతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నాం ఎస్. ఈశ్వరన్ ఇచ్చే విందులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధుల బృందం సింగపూర్‌లోని పలు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతుంది. అనంతరం చంద్రబాబు సమక్షంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యుఎస్)తో వ్యర్ధపదార్ధాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోనుంది. 31వ తేదీ చంద్రబాబు సింగపూర్ సీనియర్ మంత్రి గో చోక్ టంగ్‌తో సమావేశం అవుతారు. అనంతరం బిషన్ పార్కును సందర్శించడంతో పాటు సమీకృత రవాణా కేంద్రం గల టోపయో సందర్శిస్తారు. సింగపూర్ టౌన్‌షిప్‌ను సందర్శించడంతో పాటు అక్కడ గల వాణిజ్య, పౌర సముదాయాలను పరిశీలిస్తారు. సాయంత్రం చాంగై విమానాశ్రయం నుంచి బయలు దేరి అదే రోజు రాత్రికి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. -
కేసీఆర్ సింగపూర్ పర్యటన పారిశ్రామికవేత్తల లాభానికే..
సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు సింగపూర్ పర్యటన పెట్టుబడిదారుల లాభాల కోసమే తప్ప మరొకటి కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గత చంద్రబాబు విధానాలనే నేడు కేసీఆర్ అనుసరిస్తున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరి రోజు తరగతుల్లో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో విపరీతంగా కరువు వచ్చి రైతు లు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి కష్టసుఖాలు తెలుసుకోవాల్సిన కేసీఆర్ విదేశీ పర్యటనలు చేయడంలో అర్థం లేదన్నా రు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి భూ స్వామ్య ప్రభుత్వమే అని ఆరోపించారు. భూ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పి కేవలం 1500 ఎకరాల పంపిణీ చేశారని తెలిపారు. గత కేబినేట్ సమావేశంలో 43 అంశాలను ఆమోదించిన ప్రభుత్వం ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికత, ఉద్యోగుల పంపిణీ, గోకుల్ ట్రస్టు భూములు వంటి కీలక సమస్యలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌పై గరవ్నర్ పెత్తనాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇచ్చేం దుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాం డవం చేస్తోందన్నారు. రైతులకు సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో వేసిన కొద్ది పంటలు కూడా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కనీసం మంచినీరు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 9 వేల క్యూసె నీటిని విడుదల చేసి మొదటి జోన్‌కు నీళ్లు అందించాలన్నారు. ఎక్కడికక్కడ తూములు కట్టడంతో రైతులు వాటి వద్ద ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏఎమ్మార్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని చెరువులను నింపాలన్నారు. కేసీఆర్ సింగపూర్ పర్యటనకు ఈ దఫా ఎమ్మెల్యే, మంత్రులను తీసుకెళ్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. పర్యటనలు మాని గ్రామాల్లో పర్యటించి కరెంటు, నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రాములు, వీరారెడ్డి, టి.గోపి, నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, నూకల మధుసూదన్‌రెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు, మల్లు నాగార్జునరెడ్డి, చెరుకు ఏకలక్ష్మి, మట్టిపల్లి సైదులు, కోట గోపి, శేఖర్, రణపంగ కృష్ణ, సాయికుమార్, శ్రీను, గోవింద్, సత్యం, శ్రీకాంత్, నర్సయ్య, క్రాతి, వెంకన్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం.. రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ప్రతినిధులకు పట్టణానికి చెందిన డాక్టర్ గంట దయాకర్‌రెడ్డి ఉచితంగా వైద్యపరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కరెంటు కోతల రైతాంగం అతలాకుతలం కరెంటు కోతలతో రాష్ట్ర రైతాంగం విలవిలలాడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం రాష్ట్రస్థాయి రాజకీయ తరగతులకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నప్పటికీ.. దానిని పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనకు వెళ్లడం శోచనీయమన్నారు. కేసీఆర్ సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత.. అక్కడ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని గంటలపాటు కరెంటు కోతలు కొనసాగుతున్న దృష్ట్యా ఏ పారిశ్రామిక వేత్త వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదన్నారు.