సింగపూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
సింగపూర్ : భారత్, చైనాలు చేయి కలిపితే ఆసియా భవితవ్యం అద్భుతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-చైనా మధ్య వాణిజ్యం పెరుగుతున్నదని, ఇరు దేశాలు పరిపక్వతతో సరిహద్దు సమస్య సహా పలు అంశాలను సమర్ధంగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సింగపూర్‌లో జరిగిన షంగ్రిలా డైలాగ్‌లో కీలకోపన్యాసం చేశారు. వైషమ్యాలతో ముందుకుసాగితే ఆసియా వెనుకబడుతుందని, సహకారంతో ముందుకెళితే శతాబ్ధం ఆసియాదే అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు.
చైనా, భారత్‌లు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయని, ఇరు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని అన్నారు. ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీ ఫలవంతంగా ముగిసిందని, ఇరు దేశాలు మెరుగైన, పటిష్ట సంబంధాలను కోరుకుంటున్నాయని చెప్పారు. దేశాలు వైషమ్యాలు, పోటీని విడనాడి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లే వేదికగా భారత్ ఆసియాన్‌ను పరిగణిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్క దేశం తనకు తానుగా వృద్ధి చెందే పరిస్థితి లేదని, ఒక దేశంపై మరో దేశం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment