keynote address
-
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్‌ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్‌తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్‌లో జరగనుంది. నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా? -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్‌కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్‌కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
భారత్, చైనా చేయి కలిపితే..
సింగపూర్ : భారత్, చైనాలు చేయి కలిపితే ఆసియా భవితవ్యం అద్భుతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-చైనా మధ్య వాణిజ్యం పెరుగుతున్నదని, ఇరు దేశాలు పరిపక్వతతో సరిహద్దు సమస్య సహా పలు అంశాలను సమర్ధంగా ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సింగపూర్‌లో జరిగిన షంగ్రిలా డైలాగ్‌లో కీలకోపన్యాసం చేశారు. వైషమ్యాలతో ముందుకుసాగితే ఆసియా వెనుకబడుతుందని, సహకారంతో ముందుకెళితే శతాబ్ధం ఆసియాదే అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. చైనా, భారత్‌లు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయని, ఇరు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని అన్నారు. ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీ ఫలవంతంగా ముగిసిందని, ఇరు దేశాలు మెరుగైన, పటిష్ట సంబంధాలను కోరుకుంటున్నాయని చెప్పారు. దేశాలు వైషమ్యాలు, పోటీని విడనాడి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లే వేదికగా భారత్ ఆసియాన్‌ను పరిగణిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ ఒక్క దేశం తనకు తానుగా వృద్ధి చెందే పరిస్థితి లేదని, ఒక దేశంపై మరో దేశం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. -
వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం!
ఈ బుడతడి వయసు నిండా చూస్తే 8 ఏళ్లు. కానీ ఏకంగా ఓ కంపెనీకి సీఈవో, సైబర్ భద్రత మీద నిర్వహించే సదస్సులో కీలక ప్రసంగం చేయబోతున్నాడు. ఇతడితో పాటు కీలక ప్రసంగాలు చేయబోయేవాళ్లలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కూడా ఉన్నారు!! రూబెన్ పాల్ అనే ఈ బుడతడు భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు. కొత్త తరానికి సైబర్ భద్రతా నైపుణ్యాలు ఎందుకు అవసరమో అతడు వివరించనున్నాడు. సెక్యూరిటీ సదస్సులో ఎనిమిదేళ్ల రూబెన్ పాల్ కీలక ప్రసంగం చేస్తాడని సదస్సు నిర్వాహకులు తెలిపారు. తాను ఏడాదిన్నర క్రితం నుంచే కంప్యూటర్ లాంగ్వేజిలు నేర్చుకోవడం మొదలుపెట్టానని, ఇప్పుడు తన సొంత ప్రాజెక్టులు తానే డిజైన్ చేసుకుంటున్నానని రూబెన్ తెలిపాడు. రూబెన్‌కు అతడి తండ్రి మనో పాల్ కంప్యూటర్ పాఠాలు చెప్పారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజి గురించి మొదట్లో వివరించారు. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌ఫాం మీద స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్పుతున్నారు. ఒడిషాలో పుట్టిన మనో పాల్.. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లిపోయారు. ఆగస్టు నెలలో రూబెన్ తన సొంత గేమింగ్ సంస్థ ప్రూడెంట్ గేమ్స్‌ను ప్రారంభించాడు. దానికి రూబెన్ సీఈవో కాగా, అతడి తండ్రి కూడా ఆ సంస్థలో భాగస్వామి. రూబెన్ సైబర్ భద్రత మీద సదస్సులలో ప్రసంగాలు చేయడం ఇది నాలుగోసారి. పిల్లల్లో సైబర్ భద్రతా నైపుణ్యాల గురించి చెప్పడంతో పాటు.. వైట్పేజి హ్యాకింగ్ మీద కూడా డెమో ఇస్తాడట.