రిలయన్స్‌ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్‌తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్‌లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్‌లో జరగనుంది.
నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్‌నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.
ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment