3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్‌ పర్యటన | PM Narendra Modi to visit Brunei and Singapore in September | Sakshi
Sakshi News home page

3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్‌ పర్యటన

Published Sat, Aug 31 2024 6:03 AM | Last Updated on Sat, Aug 31 2024 7:00 AM

PM Narendra Modi to visit Brunei and Singapore in September

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్‌ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు.

 రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్‌ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement