Randhir
-
మసూద్ అజార్‌పై పాక్ ద్వంద వైఖరి : భారత్
ఢిల్లీ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆచూకీ దొరికింది. ఇటీవల పాకిస్థాన్‌లో బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ మాట్లాడుతూ.. మసూద్ అజార్ పాకిస్తాన్లో ఉన్నట్లు వచ్చిన సమాచారం నిజమైతే ఉగ్రవాద కార్యకలాపాలను పరిష్కరించడంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందనేగా అర్ధం. అజార్ తమ దేశంలో లేడని పాక్ చెప్పుకుంటుంది. ఒకవేళ ఉంటే అజార్‌పై పాక్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని జైస్వాల్ వ్యాఖ్యానించారు. -
అమెరికా అభ్యర్థన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. అదానీకి నోటీసు/ అరెస్ట్ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. -
నిరాధార ఆరోపణలు... అనవసర ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.దొంగ ఏడ్పులు...నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం. వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు. ‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. -
కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే తాము భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు అంగీకరించారు. దీంతో కెనడా ప్రధాని తీరును భారత్ తీవ్రంగా ఖండిచింది. ‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. విదేశీ జోక్యంపై పార్లమెంటరీ విచారణలో కెనడాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో విమర్శలను భారత ప్రతినిధులు ధీటుగా తిప్పికొట్టారని అన్నారు.Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024చదవండి: Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు -
3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్ వివరించారు. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది.‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే’ అని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్‌లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది. ‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే’ అని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్‌లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
సీఏఏ అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు. ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. -
ఈ దారుణానికి బాధ్యులెవరు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడ్రోజుల క్రితం టీడీపీ నేతల మారణహోమ పథకం బెడిసికొట్టినా.. వాళ్లు చేసిన గాయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో సహా 27 మంది గాయపడ్డ ఈ ఘటనలో.. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రణధీర్ అనే స్పెషల్ పార్టీ పోలీస్ (ఎస్టీఎఫ్) కానిస్టేబుల్ మాత్రం తన కంటిచూపును కోల్పోయారు. మరో కన్ను కనిపిస్తున్నా చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడం కంటనీరు తెప్పిస్తోంది. ప్రస్తుతం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రణ్‌ధీర్ గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. అనంతపురానికి చెందిన రణధీర్ ఖాకీ యూనిఫామ్‌పై ఉన్న ఆసక్తితో 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఈనెల 3 నుంచి చంద్రబాబు పర్యటనలో తన సహచరులతో కలిసి పుంగనూరులో బందోబస్తు డ్యూటీకి వచ్చారు. నాలుగో తేదీ శుక్రవారం టీడీపీ కిరాయి సేనలు మద్యం మత్తులో పోలీసులపై చెప్పులు, బాటిళ్లు విసురుతున్నారు. విధుల్లో ఉన్న రణధీర్, ఇతర పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలను సర్దిచెప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఒక్కసారిగా అల్లరిమూకలు రాళ్లతో దాడిచేయడంతో రణధీర్ బృందం వెనక్కు వచ్చేసింది. ఉన్నతాధికారులకు దెబ్బలు తగలకుండా అడ్డుగా నిలిచారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు విసురుతున్నారు. దీంతో ఓ డీఎస్పీకి అడ్డుగా నిలబడి తీసుకెళ్తున్న రణధీర్‌కు ఓ రాయి వచ్చి నేరుగా కంటిని తాకింది. కంటి నుంచి రక్తం ధారలుగా కారిపోతూ, భరించలేని నొప్పిని అనుభవించాడు. రెండు కళ్లు కనిపించలేదు. హుటాహుటిన పోలీసులు రణధీర్‌ను పుంగనూరు ఆసుపత్రికి తీసుకెళ్తే పరిస్థితి బాలేదని, తిరుపతికి వెళ్లాలని సూచించారు. తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో రణధీర్‌కు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. రాయి కంటిని తీవ్రంగా తాకడంతో ఎడమకంటి నల్లగుడ్డు, తెల్లగుడ్డు దెబ్బతిన్నాయి. లోపలున్న సున్నితమైన నరాలు తెగిపోయాయి. ఫలితంగా ఓ కన్ను కనిపించదని వైద్యులు తేల్చిచెప్పేశారు. నరాలు తెగిపోవడంవల్ల కుడి కన్ను సైతం చూపు కోల్పోయే అవకాశముందని.. దీనికి మందులిచ్చి, ఆ ప్రమాదం రాకుండా ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. రణధీర్ తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘‘సార్, మా అమ్మ, నాన్న ఇద్దరూ పేషెంట్లు. నేను ఉద్యోగం చేసి, కుటుంబాన్ని పోషించాలి. పోలీసు ఉద్యోగమంటే గౌరవం పెంచాలని ఖాకీ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు చూపుపోయింది. ఇప్పుడు నా బాధంతా నాకు కంటిచూపు పోయిందని నా ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు సర్..’’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులపై దాడిలో పైశాచిక ఆనందం పొందిన టీడీపీ నేతలు.. రణధీర్ జీవితాంతం అనుభవించే బాధకు ఏం బదులిస్తారు? కళ్లెదుటే పోలీసు వాహనాలను పచ్చమూకలు తగులబెడితే ప్రమాదవశాత్తు కాలిపోయాయని పిచ్చి రాతలు రాసిన ‘ఈనాడు’కు రణధీర్ లాంటి పోలీసుల కన్నీళ్లు కనిపించకపోవడం ఆ కంటికి పచ్చ కామెర్లు వచ్చినట్లే అవుతుంది. -
‘నీ తండ్రి ఏం ఉద్యోగం ఇచ్చాడు’
పట్నా: బిహార్ షెయిక్‌పూర్ నియోజకవర్గ జేడీయూ ఎమ్మెల్యే రంధీర్ కుమార్ సోనికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 22న తీసిన ఈ వీడియోలో రంధీర్ కుమార్ షెయిక్‌పూర్‌లోని చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడ్డాయి అంటూ వలస కూలీలు రంధీర్ కుమార్‌ను ప్రశ్నించారు. (‘ఆ బస్సులను ఆపకండి’) దానికి సదరు ఎమ్మెల్యే ‘మీ తండ్రి నీకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా’ అంటూ వలస కూలీని ప్రశ్నించారు. దాంతో వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసస్థితి చేయి దాటడంతో రంధీర్ అక్కడి నుంచి మరో క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని..) -
లక్కీ హ్యాండ్
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ– ‘‘క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారు ‘కథనం’ సినిమాతో హ్యాట్రిక్ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్. ఆయనది లక్కీ హ్యాండ్’’ అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్: ఎమ్. విజయ చౌదరి. -
అన్నయ్య భయపడితే చాలు... ఆనందమే!
– రాజమౌళి ‘‘అన్నయ్య (కాంచీ)లో వెటకారం ఎక్కువ. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఎత్తి చూపిస్తూ వెక్కిరిస్తాడు. తన సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ, అందరూ కలసి నన్నెక్కడ విమర్శిస్తారోనని అన్నయ్య నిలబడిన తీరు చూస్తే ఆనందంగా ఉంది. తను భయపడితే చాలు... నాకు ఆనందంగా ఉంటుంది’’ అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన కజిన్, సంగీత దర్శకుడు కీరవాణి సోదరుడు ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించిన సినిమా ‘షో టైమ్’. రణధీర్, రుక్సార్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటల సీడీలను అనుష్క విడుదల చేసి, తొలి సీడీని రచయిత శివశక్తి దత్తాకి అందజేశారు. రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు. ‘‘ఓ థియేటర్లో జరిగే కథే ఈ సినిమా. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఆసక్తి కలుగుతోంది’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘ప్రత్యేక గీతాలు, ఫైట్లు లేకుండా ప్రేక్షకులు ఆస్వాదించేలా కాంచీ సినిమా తీశాడు’’ అన్నారు కీరవాణి. కాంచీ మాట్లాడుతూ –‘‘నన్నెవరైనా విమర్శిస్తే సంతోషమే. నా తప్పులు తెలుసుకుంటాను. కానీ, నన్నెవరూ విమర్శించకుండా, నా తప్పులు వెతికే అవకాశం వాళ్లకి రాకూడదనే తపనతో ఈ సినిమా తీశా. సినిమాలో తప్పులేవైనా ఉంటే అవి నావి, ఒప్పులు మా టీమ్‌కి చెందుతాయి’’ అన్నారు. ‘‘మా అబ్బాయి కార్తికేయ బాగా పాడతాడని ఈ సినిమాలో పాట వినేవరకూ తెలియదు’’ అన్నారు రాజమౌళి. రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత పీవీపీ, దర్శకుడు వైవీయస్ చౌదరి, సంగీత దర్శకుడు కల్యాణ రమణ తదితరులు పాల్గొన్నారు. -
షోలో సస్పెన్స్!
రణధీర్, రుక్సార్ జంటగా రామ రీల్స్ సంస్థ నిర్మించిన మొదటి సినిమా ‘షో టైమ్’. ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాల రచయిత ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించారు. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లిన ఓ జంటకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు. సుప్రీత్, కార్తీక్, రవి ప్రకాశ్, సత్య, సంజిత్, ఆదిత్య నటించిన ఈ చిత్రానికి కళ: బాబ్జి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్ తనమల. -
రాజమౌళి సోదరుడి దర్శకత్వంలో కాట్చినేరం
బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్ఎస్.రాజమౌళి అన్నయ్య ఎస్ఎస్.కాంచి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాట్చినేరం. ఆయన తెలుగులో ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ అన్నది గమనార్హం. రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు ఈయన భాగం ఉంటుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్.కాంచి కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రామారీల్స్ పతాకంపై సుధీర్ పూతోట నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ హీరోగానూ రుక్షర్ మీరా హీరోయిన్‌గానూ నటిస్తున్నారు. మరగదమణి(కీరవాణి) సంగీతాన్ని, కే.భూపతి చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చక్కటి సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం అయిన సమాజం ప్రస్తుతం ఎలా భ్రష్టు పట్టి పోతుందన్నది విజువల్ రూపంలో తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం కాట్జినేరం అన్నారు. ఒక నాగరిక దంపతుల ఇతి వృత్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చదువుకున్న నలుగురు అనాగరిక వ్యక్తులకు, నాగరిక దంపతులకు మధ్య ఏర్పడే అనూహ్య సమస్య ఎలాంటి విపరీతాలకు దారి తీసిందన్నదే కాట్చినేరం చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం తరువాత ఇదే చిత్ర నిర్మాణ సంస్థ భరత్ కథానాయకుడిగా కడసీ బెంచ్ కార్తీ అనే చిత్రాన్ని తెరకెక్కించనుందన్నది గమనార్హం. -
ఈ బాలుడు రాముడేనా..?
రణధీర్, గౌతమి జంటగా త్రిపుర సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. సంపత్‌రాజ్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ప్రముఖ సింగర్ బాబా సెహగల్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అతిథుల్లో ఒకరైన వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రణ ధీర్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనికి మంచి పేరు తీసుకువస్తుంది’’ అన్నారు . ఈ వేడుకలో కృష్ణుడు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ , ఆదర్శ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
రణధీర్ అజేయ సెంచరీ
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: రణధీర్ (124 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో హెచ్‌జీసీ జట్టు 13 పరుగుల తేడాతో ఎల్‌బీసీసీపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఎల్‌బీసీసీ బౌలర్లు దినేశ్, పరమేశ్వర్, విశాల్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌బీసీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులే చేయగలిగింది. దినేశ్ (65) అర్ధసెంచరీ చేయగా, గిరీశ్ (37) ఫర్వాలేదనిపించాడు. హెచ్‌జీసీ బౌలర్లు మోహన్, వినయ్, అవినాశ్, చరణ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో యాదవ్ డెయిరీ 145 పరుగుల తేడాతో సెయింట్ సాయిపై ఘనవిజయం సాధించింది. మొదట యాదవ్ డెయిరీ జట్టు 256 పరుగులు చేసింది. ఫైజల్ అలీ (110, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా, శ్రీనివాస్ (50) రాణించాడు. సెయింట్ సాయి బౌలర్లు రాజేశ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ సాయి జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. రాజా 38, రాజు 30 పరుగులు చేశారు. యాదవ్ డెయిరీ బౌలర్లలో సాయిచరణ్ (5/37) విజృంభించాడు. రిషబ్‌కు 4 వికెట్లు దక్కాయి. -
రాముడిలా మారే కృష్ణుడు
కృష్ణుడిలాంటి కుర్రాడు రాముడిలా మారడానికి కారణం ఏంటి? మారిన తర్వాత అతను రాముడిలానే ఉన్నాడా? మళ్లీ మారాడా? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. ‘హ్యపీడేస్’ ఫేం రణధీర్, గౌతమి చౌదరి జంటగా టి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ రాజ్ దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఆశయంతో ఈ సినిమా చేస్తున్నాం. ఇందులో షకీలా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కథాబలం ఉన్న చిత్రం ఇదని, అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. టైటిల్ రోల్‌ను రణధీర్ అద్భుతంగా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇందులో తనది రెండు కోణాలున్న పాత్ర అని, ‘హ్యాపీడేస్’, ‘బ్రేకప్’ తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇదని రణధీర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరా: సంతోష్ శానినేని, సంగీతం: నవనీత్ చారి. -
ప్రేమలో మలుపులు...
రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా అమర్ కామేపల్లి దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బ్రేక్అప్’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథను కొంతమంది నిర్మాతలకు చెబితే, నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో యూఎస్‌లో ఉన్న నా మిత్రులతో కలిసి, నిర్మించాను. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం. స్క్రీన్‌ప్లే చాలా ఫ్రెష్‌గా ఉంటుం ది. మంచి పాటలు కుదిరాయి. ఆడియో విజయం సాధించింది. అలాగే టీజర్‌ను యూట్యూబ్‌లో లక్షమందికి పైగా వీక్షించారు. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. రణధీర్, స్వాతీదీక్షిత్, ప్రశాంత్ సాగర్, సుమలత తదితర యూనిట్ సభ్యులు సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.