ప్రేమలో మలుపులు... | break up telugu movie release on September fist week | Sakshi
Sakshi News home page

ప్రేమలో మలుపులు...

Published Sun, Aug 25 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

ప్రేమలో మలుపులు...

ప్రేమలో మలుపులు...

రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా అమర్ కామేపల్లి దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బ్రేక్‌అప్’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథను కొంతమంది నిర్మాతలకు చెబితే, నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో యూఎస్‌లో ఉన్న నా మిత్రులతో కలిసి, నిర్మించాను. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం.
 
  స్క్రీన్‌ప్లే చాలా ఫ్రెష్‌గా ఉంటుం ది. మంచి పాటలు కుదిరాయి. ఆడియో విజయం సాధించింది. అలాగే టీజర్‌ను యూట్యూబ్‌లో లక్షమందికి పైగా వీక్షించారు. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. రణధీర్, స్వాతీదీక్షిత్, ప్రశాంత్ సాగర్, సుమలత తదితర యూనిట్ సభ్యులు సినిమా విజయం
  సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement