
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్‌లో ప్రియాంక సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్‌లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు.
అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటికీ.. ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment