Ankit
-
అల్లు అర్జున్‌తో కలిసి పని చేశా: అంకిత్ కొయ్య
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు.సినిమాల్లోకి వద్దన్నారుమాది విశాఖ. మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా అని చెప్తే సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా. అల్లు అర్జున్ మా అన్నయ్యఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. అల్లు ఫ్యామిలీకి, నాకు కనెక్షన్ ఉందేమోఈ మూవీ ట్రైలర్ చూసి అల్లు అరవింద్.. 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. -
Hyderabad: సెకండ్ హ్యాండ్ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ
పట్టణానికి చెందిన అంకిత్ అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాల్సి రావడంతో మోటార్ సైకిల్ అవసరం పడింది. దీంతో సెకండ్ హ్యాండ్ బైక్‌లు విక్రయించేవారి వద్ద రూ.60 వేలకు బైక్ మాట్లాడుకున్నాడు. మొదట రూ.20 వేలు చెల్లించి బైక్ తీసుకున్నాడు. మిగితా డబ్బులు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తానని నిర్వాహకుల వద్దే అధిక వడ్డీకి ఫైనాన్స్ చేసుకున్నాడు. రెండు నెలలు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలోనే కుటుంబ ఆరి్థక పరిస్థితుల కారణంగా ఫైనాన్స్ కట్టలేదు. వెంటనే ఫైనాన్స్ వారు వచ్చి బైక్ తీసుకెళ్లారు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇది కేవలం అంకిత్ పరిస్థితే కాదు. విద్యార్థులు, కారి్మకులు, చిరు వ్యాపారులందరిదీ ఇదే పరిస్థితి. తూప్రాన్: ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆరి్థక నేరం.. బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పుట్టగొడుగుల్లా షోరూమ్లుప్రతీ మండల కేంద్రంలోనూ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి వారికి యువకులు, కాలేజీ స్టూడెంట్లకు ఎటువంటి షరతులు లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్న తర్వాత అసలు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. బైక్ సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్షియర్లు చెప్పిన చోటల్లా సంతకాలు చేస్తున్నారు. నెల వాయిదా ఆలస్యం అయితే ఈ మొత్తం రోజువారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదాల వసూలుకు ఎన్ని దఫాలు వస్తే చార్జీలు అదనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తెలియదు. వాయిదాలు అన్నీ తీరాక బైక్ ఆర్సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖరులో చెబుతారు. కొనుగోలు దారులకు బైక్‌పై ఎలాంటి హక్కులు లేకపోవడంతో నోరెత్తకుండా నగదు చెల్లించి బయటపడుతున్నారు. దారి తప్పుతున్న విద్యార్థులు చాలా మంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరిస్థితి లేకున్నా ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌లో బైక్ ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలలపాటు ఫైనాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్తుల ఇళ్ల వద్ద ఫైనాన్సి యర్లు గొడవ చేస్తే పరువుపోతుండటంతో పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీరుస్తున్నారు. అంతే కాకుండా దొంగ బైక్‌లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసుల్లో పట్టుబడినప్పడు ఈ విషయం బహిర్గతమవుతున్న ఘటనలు ఉన్నాయి. సులువుగా అప్పు దొరికేసరికి ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు.పట్టించుకోని అధికారులు ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం.. తీసుకునే వాడి అవసరం అన్నట్లుగా సాగిపోతుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ తక్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులను అప్పుల ఊబిలో దించే ఈ వ్యాపారంలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వెనక్కిరాని డబ్బులు ఇదిలా ఉంటే మరికొన్ని కేసుల్లో ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నారు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్షియర్ మనుషులు స్వా«దీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బులూ వెనక్కి ఇవ్వరు. ఇలా వీరు దోపిడీకి పాల్పడినా అడ్డుకునేందుకు వీలుగా నిబంధనలు లేవు. దొంగిలించిన వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు వ్యాపారు లు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా ఎంపిక చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవలె తూప్రాన్‌లో బైక్ జోన్లపై పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.చర్యలు తీసుకుంటాం సెకండ్ హ్యాండ్ బైక్‌ల విక్రయాలు పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. సులభ వాయిదాల్లో బైక్ కొనాలనుకున్నవారు సెంకడ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. బైక్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగా చూసుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అలాగే, వ్యాపారులు ఫైనాన్స్ పేరులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రంగాకృష్ణ, సీఐ తూప్రాన్ -
అంకిత భావమే అమోఘ విజయం
నలుగురు నడిచే దారిలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దారి మార్చి వెళ్లే వారికి మాత్రం సవాలక్ష ప్రశ్నలు ఎదురొస్తుంటాయి. వాటికి అదేపనిగా సమాధానాలు చెప్పడం కంటే ఎంచుకున్న దారిలో వేగంగా నడవడానికే కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు. అంకిత్ అగర్వాల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ద్వారా ఇన్సూరెన్స్ సెక్టార్లో గెలుపు జెండా ఎగరేశాడు... ‘మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌తో పనిలేదు’ అనే అంకిత్ అగర్వాల్ హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగాడు. మూడు వేలమందికి పైగా ఇన్సూరెన్స్ ఏజెంట్లను కలిశాడు. ‘ఇన్సూరెన్స్ దేఖో’ ప్రారంభించడానికి ముందు ఊరూవాడా అనే తేడా లేకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ దేఖో’కు సంబంధించిన ఆలోచనలను ఇతరులతో, మిత్రులతో పంచుకునేప్పుడు ‘పిచ్చి ముదిరింది’ అన్నట్లుగా చూసేవాళ్లు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఏమిటీ కర్మ’ అని మందలించేవాళ్లు కొందరు. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో ఎంబీఏ(ఫైనాన్స్) చేశాడు అంకిత్. అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి అంకిత్ రాజీనామా చేసి, ఇన్సూర్టెక్ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘తెలివి తక్కువ పనిచేశావు’ అన్నవాళ్లే ఎక్కువ. ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి అడుగు పెట్టిన తరువాత ఆఫ్‌లైన్(ఇన్సూరెన్స్ ఏజెంట్స్) సామర్థ్యాన్ని, ఆన్లైన్లో తనకు పనికివచ్చే సాంకేతికతను బాగా ఉపయోగించుకున్నాడు అంకిత్. ‘ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగులు ఖాళీగా ఉండాలని మొదటి లక్ష్యంగా నిర్ణయించుకున్నాను’ నవ్వుతూ అంటాడు అంకిత్. ఎందుకంటే, సంప్రదాయ ఇన్సూరెన్స్ ఏజెంట్ల బ్యాగ్‌లు నోటుబుక్స్, బోలెడు డాక్యుమెంట్స్‌తో నిండిపోయి భారంగా ఉంటాయి! అందుకే స్మార్ట్‌ఫోన్ ప్లస్ యాప్ ద్వారా ఆ బ్యాగులు తేలికయ్యేలా చేయడంలో అంకిత్ విజయం సాధించాలనుకున్నాడు. అయితే అంకిత్ వేసే ప్రతి అడుగులో ప్రతికూల మాటలు వినిపించేవి. అవేమీ పట్టించుకోకుండా ‘మొదటి దశలో ఏజెంట్. ఆ తరువాత టెక్’ అంటూ తన దారిలో తాను వెళ్లాడు అంకిత్. ‘ఆర్మీ ఆఫ్ ఏజెంట్స్’ పేరుతో యువబృందానికి తయారుచేసుకొని గట్టి శిక్షణ ఇచ్చాడు. ఈ బృందంలో ఎక్కుమందికి ఇన్సూరెన్స్‌కు సంబంధించిన విషయాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ప్రసిద్ధ నినాదం ‘రోటీ కప్డా మకాన్’లో ‘బీమా’ చేర్చి తన బృందంతో ఊరూవాడా తీసుకెళ్లాడు అంకిత్. గురుగ్రామ్(హరియాణా) కేంద్రంగా చిన్నగా మొదలైన ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ప్రయాణం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించింది. తమ అవసరాలకు సరిపోయే పాలసీలను ఎంచుకోవడంతో పాటు ఎన్నో విధాలుగా వియోగదారులకు దారి చూపే నేస్తంగా మారింది ఈ ఇన్సూర్టెక్ స్టార్టప్. ‘పిచ్చి అగర్వాల్’ అని చాటుమాటుగా వెక్కిరించినవాళ్లే ఈ విజయం చూసి ‘అగార్వల్ మెథడ్’ అని గొప్పగా పిలుచుకునేవారు! ‘ఇన్సూరెన్స్‌దేఖో అనేది ఇన్సూరెన్స్ సెక్టార్లో భారీ మార్పు తీసుకురావడమే కాదు సామాజిక ప్రభావాన్ని కలిగించింది’ అంటాడు కార్దేఖో గ్రూప్ కో–ఫౌండర్ అమిత్ జైన్. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ఇటీవల ముంబైకి చెందిన ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ‘వెరాక్’ను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఎంతోమంది యంగ్‌స్టర్స్ అంకిత్‌ను ‘వన్–పాయింట్ అడ్వైజ్’ అడుగుతుంటారు. అతడి నోటి నుంచి వచ్చే ‘అంకితభావం’ అనే జవాబును ఊహించడం కష్టం కాదేమో! నా కంపెనీ లాభాలతో దూసుకుపోతుంది అని చెప్పడం నా లక్ష్యం కాదు. నా అసలు సిసలు విజయం ఆరులక్షల గ్రామాల్లోకి ఇన్సూరెన్స్‌ను తీసుకెళ్లడం. – అంకిత్ అగర్వాల్ -
అసభ్యంగా తాకబోయాడు: క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన నటుడు
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో 16వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ఈ షో నుంచి అంకిత్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. అలా షో నుంచి బయటకు వచ్చాడో లేదో మరో కొత్త షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఉదారియన్ సీరియల్‌తో పాపులర్ అయిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకతను నన్ను కాంప్రమైజ్ అవుతావా? అని అడిగాడు. ఇండస్ట్రీకి వెళ్లాలంటే కొన్ని పద్ధతులుంటాయని, అవి పూర్తి చేస్తేనే ఛాన్సులొస్తాయన్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్పి వారి ద్వారా లాంచ్ చేస్తానన్నాడు. ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్నవారు ఎన్నో త్యాగాలు చేశాకే ఆ స్థాయికి వెళ్లారని చెప్పాడు. అతడలా మాట్లాడుతుంటే షాక్‌గా అనిపించింది. ఇదంతా నా వల్ల కాదు, నేనలాంటివాడిని కాదని చెప్పాను. కానీ అతడు వినిపించుకోలేదు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రవర్తించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా జీవితంలోనే అత్యంత చెత్త అనుభవమిది' అని చెప్పుకొచ్చాడు అంకిత్. చదవండి: పెళ్లైన 10 ఏళ్లకు తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు నటి -
Jaan Say: లవర్ బాయ్ ప్రణయ్‌గా అంకిత్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్
అంకిత్, తన్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాన్సే...’. క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్. కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. 'జాన్ సే...' టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన టీం పరిచయం చేశారు. హీరో అంకిత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రణయ్ పాత్రలో కనిపించే అంకిత్ ఈ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తారు. ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ అంశాలతో జాన్ సే... ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా సాగుతుంది. ఈ చిత్రం తప్పకుండా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కిరణ్ కుమార్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా అయిదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. -
ఒంటిపై బట్టలేకుండా ఫొటోలు పంపమనేవారు: బుల్లితెర నటుడు
తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్. మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే కెరీర్ ఆరంభించిన ఈ నటుడు 2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్. అయితే ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోవాలనుకున్నానంటూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నాడు. 'అందరూ మంచివాళ్లు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్నెస్ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. మోడలింగ్ చేసేటప్పుడు నేను అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలనేవారు. నన్ను వేధింపులకు గురి చేశారు. చాలాసార్లు మోడలింగ్ మానేద్దామా అనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోదాం అనిపించేది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యా. కుమిలిపోయాను. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని నన్ను నేను సంభాలించుకున్నాను. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే. అలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా? అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్‌పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్‌లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్‌ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
ఆ కుటుంబానికి రూ కోటి పరిహారం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో మరణించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ కోటి పరిహారంగా అందచేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ ఈశాన్య ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు ఆయనను అమానుషంగా హత్య చేసి మృతదేహాన్ని చాంద్‌బాగ్‌లోని డ్రైనేజ్‌లో పడేసి వెళ్లిన సంగతి తెలిసిందే. శర్మను గంటల తరబడి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ అల్లర్లలో 40 మందికి పైగా మరణించారు. చదవండి : ‘కేజ్రీవాల్‌కు డబుల్ పనిష్మెంట్’ -
అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు
-
కొండపై సెల్ఫీకి యత్నం.. భారతీయ విద్యార్థి మృతి
మెల్బోర్న్: సెల్ఫీ సరదాకి మరో ప్రాణం బలైపోయింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బెనీ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల అంకిత్ పెర్త్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. తన ఫ్రెండ్స్‌తో సరదాగా షికారుకు వెళ్లాడు. ఈ ప్రయత్నంలో 40 మీటర్ల ఎత్తైన కొండ రాయిపై సెల్ఫీకి యత్నించి.. జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత అతని మృతదేహాన్ని బయటకు తీశారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం మూసివేసినప్పటికీ తరచూ కొందరు అక్కడికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓటమితో మొదలు
న్యూఢిల్లీ: అంకిత రైనా సంచలన విజయం సాధించినప్పటికీ... ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భారత్‌కు శుభారంభం లభించలేదు. చైనాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ థండి 2–6, 2–6తో ప్రపంచ 125వ ర్యాంకర్ యఫాన్ వాంగ్ చేతిలో ఓటమి పాలైంది. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకర్ అంకిత రైనా 6–3, 6–2తో 120వ ర్యాంకర్ లిన్ జును బోల్తా కొట్టించడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 2–6, 6–7 (1/7)తో వాంగ్–జావోజువాన్ యాంగ్ జంట చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. -
ప్రమాదంలో ఉన్నానంటూ ఫోన్.. అంతలోనే
-
ప్రమాదంలో ఉన్నానంటూ ఫోన్.. అంతలోనే
న్యూ ఢిల్లీ : ఆ ప్రేమికులు ఇద్దరూ ఒకరికొరకు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాని వారి మతాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మతాంతర వివాహాలు నచ్చని యువతి తండ్రి యువకుడి గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. మరణించడానికి ఏడు నిమిషాల ముందు యువకుడు అతడి స్నేహితులతో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. వివరాలు.. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఫోటోగ్రాఫర్ అంకిత్ సక్సేనా మరో మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి అతన్నే వివాహం చేసుకుంటానని తేల్చిచెప్పింది. అనంతరం మతాలు వేరు అని తెలియడంతో యువతికి, తల్లిదండ్రులకు మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. ఫిబ్రవరి 1న రాత్రి 7.50 గంటల ప్రాంతంలో యువతి, కుటుంబసభ్యులను ఇంట్లోనే పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయింది. అయితే తమ కూతురును అంకిత్ కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ అతడిపై కర్రతో దాడికి దిగాడు యువతి తండ్రి, బంధువులు. దీంతో భయాందోళనకు గురైన అంకిత్ తన స్నేహితులకు ఫోన్ చేసి, తన తల్లి దగ్గరికి వెళ్లమని, తన ప్రియురాలు వస్తే తనకు చెప్పమని చెప్పాడు. అంతేకాకుండా తాను ప్రమాదంలో ఉన్నట్టు స్నేహితులకు వివరించాడు. ఓ వీధిలో నిల్చొని స్నేహితులకు ఫోన్ చేస్తున్న దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఫిబ్రవరి 1న రాత్రి అంకిత్ మరణించడానికి కొద్ది సమయం ముందు భయంతో అటూ ఇటూ నడుస్తూ.. అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఇది జరిగిన ఏడు నిమిషాల తర్వాత యువతి తండ్రి అంకిత్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. 23 ఏళ్ల యువకుడి దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. సీనియర్ లాయర్లను పెట్టించి ఈ కేసులో యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసులో యువతి తల్లి, తండ్రి, మైనర్ సోదరుడు, ఓ బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు కూడా ప్రాణహాని ఉందని యువతి ఫిర్యాదు చేయడంతో నారీనికేతన్కు పంపించారు. బాధిత కుటుంబానికి కూడా పోలీసులు రక్షణ కల్పించారు. -
సెమీస్‌లో నవీన్, అంకిత్
బ్యాంకాక్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నవీన్ బూర (69 కేజీలు), అంకిత్ (60 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో హరియాణా బాక్సర్ నవీన్... చైనాకు చెందిన హువాంగ్ రూయిపై, అంకిత్... కిర్గిస్తాన్ బాక్సర్ అడిలెట్ ఎగెన్బెర్ది వులుపై విజయం సాధించారు. సెమీస్‌లో అంకిత్... సక్దా రుమ్తామ్ (మంగోలియా)తో, నవీన్... యిసుంగ్నొయెన్ (ఇరాన్)తో తలపడతారు. అయితే సుదీప్ (52 కేజీలు), ఆశిష్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడారు. సుదీప్... టిముర్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, ఆశిష్... నగగకి (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగి హైదరాబాద్‌లో..
అమ్మకాల్లో టాప్-3లో భాగ్యనగరి 13 నుంచి బిగ్ బిలియన్ డేస్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగిని హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి ఇది 16వ గిడ్డంగి కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటిది. 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది రానుంది. నిర్మాణం పూర్తి అయితే రోజుకు 1.2 లక్షల వస్తువులను గిడ్డంగి నుంచి సరఫరా చేసే వీలుంది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ గిడ్డంగిని అక్టోబర్‌లోనే ప్రారంభించే అవకాశం ఉంది. 16 గిడ్డంగులకుగాను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రూ.400 కోట్లు వెచ్చించింది. 2020 నాటికి మరో 50 నుంచి 100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందుకు రూ.3 వేల కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. కొత్త గిడ్డంగి ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు. మూడో స్థానంలో హైదరాబాద్.. ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుందని అంకిత్ వెల్లడించారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లిప్‌కార్ట్‌తో 3,000 మంది విక్రయదారులు చేతులు కలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సంస్థకు 5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల సంఖ్య ప్రతి నెల 8 శాతం పెరుగుతోంది. కొనుగోళ్ల పరంగా భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, తూర్పు గోదావరి ముందంజలో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే అపారెల్స్, హోం, మొబైల్, స్పోర్ట్స్, ఫిట్నెస్, పర్సనల్ కేర్ వరుసగా నిలిచాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులైన యువత అధికంగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఇ-కామర్స్ పుంజుకోవడానికి గల కారణాల్లో సౌకర్యం, ఎంచుకోవడానికి విభిన్న రకాలు, విక్రయానంతర సేవ, ఆ తర్వాతే ధర నిలిచింది’ అని అన్నారు. బిగ్ బిలియన్ డేస్.. అక్టోబర్ 13 నుంచి 17 వరకు బిగ్ బిలియన్ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోంది. 70 విభాగాల్లో 3 కోట్లకుపైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 40 వేల మంది విక్రయదారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 19 వేల మంది డెలివరీ బాయ్స్ సిద్ధంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇందులో తమ కస్టమర్లు 4.5 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 4జీ విస్తృతి పెరిగితే ఇ-కామర్స్‌కు జోష్ వస్తుందని వివరించింది. -
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
నరసాపురం అర్బన్ : అరుదైన వ్యాధి కబళిస్తోంది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉంది. బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఇప్పుడా తల్లిదండ్రులకు అంతులేని మనోవేదన మొదలైంది. మోకావారిపాలేనికి చెందిన 11 ఏళ్ల వాతాడి అంకిత్ (దుర్గారావు) అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని వైద్యం నిమిత్తం ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించిన తల్లిదండ్రులు ఇక ఏమీ చేయలేని స్థితిలో దాతల సాయం అర్ధిస్తున్నారు. వాతాడి వెంకట నారాయణ, కనకదుర్గ దంపతుల కుమారుడు దుర్గారావు పుట్టినప్పటి నుంచి కాన్జంషియల్ హైడ్రినల్ హైప్లైసిస్ (సీఏహెచ్) అనే అరుదైన వ్యాధికి గురయ్యాడు. ఈ వ్యాధికి సంబంధించి శరీరంలో సోడియం, పొటాషియం, కాల్షియం నిల్వల సమతుల్యత దెబ్బతింటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా శరీరంలో సోడియం శాతం దారుణంగా పడిపోతుంది. దీంతో దుర్గారావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. పదకొండేళ్లుగా తల్లిదండ్రులు ఇతని వైద్యానికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. దుర్గారావుది పేద కుంటుంబం. తండ్రి చిన్న కిళ్లీ కొట్టు నడుపుకొని జీవిస్తున్నాడు. దుర్గారావుకు ముందు వెంకట నారాయణకు ముగ్గురు సంతానం కలిగి ఇదే వ్యాధితో చనిపోయారు. ఉన్న ఏకైక కొడుకునైనా రక్షించుకుందామంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని వారు వాపోతున్నారు. ఈ వ్యాధికి ప్రస్తుతం శాశ్వత చికిత్స లేదు. జీవితాంతం ఇదే రకంగా వైద్యం చేయించాల్సిందే. దీంతో దుర్గారావు తండ్రి నారాయణ దాతల సహాయం కోసం అర్థిస్తున్నారు. సహృదయంతో ముందుకు వచ్చేవారు సెల్ నంబర్ 99635 86997ను సంప్రదించాలని కోరుతున్నారు.