సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లలో మరణించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ కోటి పరిహారంగా అందచేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ ఈశాన్య ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు ఆయనను అమానుషంగా హత్య చేసి మృతదేహాన్ని చాంద్‌బాగ్‌లోని డ్రైనేజ్‌లో పడేసి వెళ్లిన సంగతి తెలిసిందే. శర్మను గంటల తరబడి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ అల్లర్లలో 40 మందికి పైగా మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment