![Ankit Gupta Recalls Casting Couch Experience, Calls it Worst Experience of Life - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/30/Ankit-Gupta.jpg.webp?itok=zGx_NoNk)
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో 16వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ఈ షో నుంచి అంకిత్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. అలా షో నుంచి బయటకు వచ్చాడో లేదో మరో కొత్త షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఉదారియన్ సీరియల్‌తో పాపులర్ అయిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకున్నాడు.
'ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకతను నన్ను కాంప్రమైజ్ అవుతావా? అని అడిగాడు. ఇండస్ట్రీకి వెళ్లాలంటే కొన్ని పద్ధతులుంటాయని, అవి పూర్తి చేస్తేనే ఛాన్సులొస్తాయన్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్పి వారి ద్వారా లాంచ్ చేస్తానన్నాడు. ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్నవారు ఎన్నో త్యాగాలు చేశాకే ఆ స్థాయికి వెళ్లారని చెప్పాడు. అతడలా మాట్లాడుతుంటే షాక్‌గా అనిపించింది. ఇదంతా నా వల్ల కాదు, నేనలాంటివాడిని కాదని చెప్పాను. కానీ అతడు వినిపించుకోలేదు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రవర్తించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా జీవితంలోనే అత్యంత చెత్త అనుభవమిది' అని చెప్పుకొచ్చాడు అంకిత్.
చదవండి: పెళ్లైన 10 ఏళ్లకు తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు నటి
Comments
Please login to add a commentAdd a comment